జకర్తా: ఇండోనేషియాలో భారీ విస్ఫోటనం జరిగింది. సెమెరు పర్వతం తూర్పు జావాలోని లుమాజాంగ్, మలాంగ్ జిల్లాల సరిహద్దులో ఉన్న అగ్ని పర్వతం విస్పోటనం చెందింది. దీంతో, పెద్ద ఎత్తున లావా ఎగిసిపడుతోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. మంగళవారం ఇండోనేషియా స్థానిక సమయం ప్రకారం ఉదయం 6:11 గంటలకు అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో, ఆకాశంలోని బూడిద, ధూళి కణాలు ఎగిసిపడ్డాయి. ఈ కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నివారణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి మాట్లాడుతూ.. అగ్ని పర్వతానికి దగ్గరగా ఉన్న మూడు గ్రామాల నుండి 300 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. మరోవైపు.. విస్పోటనం కారణంగా జావా ద్వీపం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
#Internacionales | Una masiva explosión volcánica se produjo en Indonesia.
El fenómeno afectó la zona de Java Oriental, teniendo como epicentro el Monte Semeru. pic.twitter.com/3cT53TgncD— Política Stereo (@politicaestereo) November 19, 2025
ఇదిలాఉండగా.. 2021లో సెమెరు విస్ఫోటనం కారణంగా 50 మందికిపైగా స్థానికులు మరణించారు. 5,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆ విపత్తు దాదాపు 10,000 మంది నివాసితులపై ప్రభావం చూపించింది.


