
ప్రతీకాత్మక చిత్రం
హిందూ ఆచారాల ప్రకారం వివాహం
అన్నానగర్: తమిళనాడలోని తిరువారూర్ జిల్లాలోని ముత్తు పెట్టి సమీపంలోని కరయంగడు గ్రామానికి చెందిన సోమసుందరం. ఇతని భార్య వాసుకి, వీరి కుమారుడు యోగాదాస్ (30), ఇతను గత పదేళ్లుగా సింగపూర్లోని ఒక ప్రైవేట్ కంపె నీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు.
ఇండోనేషియాలోని అమానుషన్ బరాతకు చెందిన డేని యల్ టీపు-మాతా నియోసన్ థామ్పటి కుమార్తె డయానా టీపు(26) ఒకే కంపెనీలో పనిచేస్తోంది. ఈమె యోగాదాను గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలని ఈ జంట. నిర్ణయించుకున్నారు. తమిళనాడు ఆలయంలో వివాహ వేడుకను నిర్వహించాలని యోగాదాస్ నిర్ణయించుకుని, వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించి, బంధువులు, స్నేహితులు, గ్రామ స్తులందరికీ పంచిపెట్టారు.
అనుకున్న ప్రకారం ఆదివారం అక్కడి కరై ముత్తు మారియమ్మన్ ఆలయంలో చాలా సరళంగా వివాహం జరిగింది. పట్టు చీర ధరించిన తమిళ మహిళలా కనిపించే డయానా టీషునకు యోగాదాస్ తాళి కట్టాడు. ఈ వేడుకలో బంధువులు, గ్రామ స్తులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!