ఫ్యామిలీ కోసం కార్పొరేట్‌ జీతాన్ని వదులుకుని రిస్క్‌ చేస్తే..! | Varun Agarwal shares Bengaluru man now earns more as Uber driver quits corporate job | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ కోసం కార్పొరేట్‌ జీతాన్ని వదులుకుని రిస్క్‌ చేస్తే..!

Oct 14 2025 1:10 PM | Updated on Oct 14 2025 2:41 PM

Varun Agarwal shares Bengaluru man now earns more as Uber driver quits corporate job

సాధారణంగా  కనీస ఆదాయం కోసం, లేదా ఉన్న ఉద్యోగానికి తోడుగా,  కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు డెలివరీ బాయ్‌గానో, క్యాబ్‌ డ్రైవర్లగానో పార్ట్‌ టైం పనిచేసే వాళ్లను చూసి ఉంటాం. కానీ కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఉబెర్ డ్రైవర్‌గా పని చేస్తూ సక్సెస్‌ సాధించిన వైనం నెట్టింట స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అసలు కార్పొరేట్‌ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడు, అతని ఆదాయం ప్రస్తుతం ఎంత? పదండి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.

బెంగళూరుకు చెందిన  వ్యాపారవేత్త వరుణ్ అగర్వాల్ తన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీని ప్రకారం  దీపేష్‌ కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేశాడు.  కార్పొరేట్ జీవితం, జీతం కంటే తన ఫ్యామిలీ లైఫే ముఖ్యమని భావించిన  ఈ నిర్ణయం తీసుకున్నాడు. గతంలో రిలయన్స్ రిటైల్ లో పని చేసిన  దీపేష్‌ అతను తన పని-జీవిత సమతుల్యతను మెరుగు పరుచు కోవడానికి ఉబెర్ డ్రైవర్ అయ్యాడు. 

రిలయన్స్ రిటైల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి ఎనిమిదేళ్లు  పనిచేశాడు. నెలకు రూ. 40వేల జీతం. కానీ స్థిరమైన ఉద్యోగం ,  మంచి జీతం, కానీ ఏదో మిస్‌ అవుతున్న ఫీలింగ్‌, వర్క్‌ లైఫ్‌ బాలెన్స్‌ లేకపోవడం ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా తన భార్యా పిల్లలతో సమయం గడపలేకపోతున్నానని గ్రహించాడు. అంతేకాదు ఉద్యోగాన్ని వదిలి వేసి  ఫుల్‌ టైం  డ్రైవర్‌గా మారాలన్ని సాహసం చేశాడు.

కట్‌ చేస్తే అతని నెల ఆదాయం ఇపుడు రూ. 50 వేలు. పైగా నెలకు 21 రోజులు మాత్రమే పని. మొత్తానికి ధైర్యం చేసి  తాను కోరుకున్న జీవితాన్ని సాధించాడు అంటూ వరుణ్‌ అగర్వాల్  ఈ స్టోరీని షేర్‌ చేశారు..

అంతేకాకుండా, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా, దీపేష్ మరో కారు కొన్నాడు. మరో డ్రైవర్‌ను నియమించుకున్నాడు. అంటే తన కాళ్ల మీద తానే నిలబడటమే కాదు మరొకరికి ఉపాధిని కల్పించడం విశేషం.  జీవితంలో ముందుగా సాగాలంటే కొన్నిసార్లు రిస్క్‌ తీసుకోక తప్పదు అంటూ దీపేష్‌ సక్సెస్‌ సాధించిన తీరును ప్రశంసించారు వరుణ్‌.

 చదవండి: Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!

నెటిజన్ల రియాక్షన్స్‌
దీపేష్‌ నిర్ణయంపై నెటిజన్లు  ప్రశంసలు కురిపించారు. ప్రాధాన్యతలను గుర్తించడం,, రిస్క్ తీసుకోవడం  చాలా అవసరం. ఒక్క మెట్టు దిగినా పరవాలేదు.. దిల్‌ ఉంటే..కష్టపడితే అదే పెద్ద ప్రమోషన్‌ అని వ్యాఖ్యానించారు. మరిన్ని విజయాలు సాధించాలి అంటూ దీపేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

 ఇదీ చదవండి: Down's syndrome పుట్టకముందే నిర్ధారణఎలా...?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement