దీపావళి పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే! | Diwali 2025 Lakshmi Pooja At Home For Wealth And Happiness | Sakshi
Sakshi News home page

Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!

Oct 14 2025 10:40 AM | Updated on Oct 14 2025 11:07 AM

Diwali 2025 Lakshmi Pooja At Home For Wealth And Happiness

దీపావళి అంటే  దివ్యమైన పండుగ.  వెలుగుల పండుగ. చీకట్లను పారద్రోలి  జ్ఞానాన్ని ప్రసాదించే జ్యోతికి మొక్కే పండగ.  దీపావళి రోజు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం  ప్రధానంగా ఆచారంగా పాటిస్తారు.  ఇలా చేయడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోయి, నిత్యం తమ ఇంట లక్ష్మీదేవి  కళకళలాడుతూ ఉంటుందని  విశ్వసిస్తారు.మరి  అంత విశిష్టమైన లక్ష్మీపూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.

విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి, భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు.

ఋగ్వేదకాలంలో అదితి,రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు. లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదనిm, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీదేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు.

లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్. 

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి , భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. ఇక ఈ దీపావళి పర్వదినాన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేలా ఆచరించాల్సిన పూజా విధానం ఏంటంటే..

లక్ష్మీ దేవిని వినాయకుడిని..
దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి. ప్రాణ ప్రతిష్ఠ ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే బెల్లం ముక్కను నివేదన చేస్తూ ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్ బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి.

 

కలశ స్థాపన వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.

‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’ లక్ష్మీదేవి

అధాంగ పూజ
చంచలాయై నమః పాదౌ పూజయామి
చపలాయై నమః జానునీ పూజయామి
పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి
కమలవాసిన్యై నమః కటిం పూజయామి
పద్మాలయాయై నమః నాభిం పూజయామి
మదనమాత్రే నమః స్తనౌ పుజయామి
లలితాయై నమః -భుజద్వయం పూజయామి
కంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామి
సుముఖాయై నమః- ముఖం పూజయామి
శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి
సునాసికాయై నమః నాసికం పూజయామి
సునేత్రాయై నమః ణెత్రే పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాలయాయై నమః శిరః పూజయామి
ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలి
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం
దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ

శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం మీ శక్తి కొద్ది స్తోత్రాలను చదివి,  దీపం , దూపంలను సమర్పించిన అనంతరమే నైవైద్యం సమర్పించాలి. ఈ క్రింది మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి.

యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

చివరిగా సాష్టాంగ నమస్కారం
నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనె/కొబ్బరి నూనెతో దీపాలను ఇంటిముందర ఓ వరస క్రమంలో వెలిగించాలి.

 (Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement