ఆదిలాబాద్ జిల్లా: ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నా గోబా ఆలయంలో ఆదివారంరాత్రి మెస్రం వంశీ యుల మహాపూజతో జాతర ప్రారంభమైంది. తొలి రోజు ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ, మహా రాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. సోమవారం ఉ దయం నుంచే క్యూలో ఉండి నాగోబాను దర్శించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా లీగల్ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజ్యలక్ష్మి ప్రత్యేక పూజలు చే శారు. ఈ నెల 22న దర్బార్ సమావేశం ఉంటుంద ని, 25 వరకు జాతర అధికారికంగా కొనసాగుతుందని దేవదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు.
ఉపవాస దీక్షలు విరమణ
నాగోబా మహాపూజను పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచి కఠోరమైన ఉపవాస దీక్ష చేపట్టిన కొత్తకోడళ్లు సోమవారం మర్రిచెట్టు వద్ద గల కోనేరు వద్దకు వెళ్లి పవిత్రమైన నీటిని సేకరించి గోవడ్‌కు తీసుకొచ్చారు. ఆ నీటితో దేవతలను శుద్ధిచేసి ప్రత్యేక పూజలు చేశారు. నవధాన్యాలతో తయారు చేసిన నైవేద్యం సమర్పించారు. అనంతరం సహపంక్తి భోజనలతో ఉపవాస దీక్షలు విరమించారు.
పాము ప్రత్యక్షం
నాగోబా ఆలయం పక్కనే మెస్రం వంశీయులు బస చేసిన స్థలంలో పాము దర్శనమివ్వడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు.
భక్తుల సందడి
నాగోబాకు మొక్కుకున్న భక్తులు జాతరలో ఏర్పాటు చేసిన రంగులరాట్నాలు, దుకాణ సముదాయాల వద్ద సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ టీవీలతో పాటు హెల్ప్ క్యాంప్ ఏర్పాటు చేసి జాతర పరిసర ప్రాంతాన్ని పర్యవేక్షించారు.
260 మంది కొత్త కోడళ్లతో భేటింగ్ (పరిచయం)
గోవడ్ వద్ద బస చేసిన మెస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. తెల్లని దుస్తులు ధరించిన 260 మంది కొత్త కోడళ్లకు మెస్రం వంశ మహిళా పెద్దల సహాయంతో సతీ దేవత ఆలయంలో భేటింగ్ పూజలు చేయించారు. అనంతరం మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భేటింగ్ పూజతో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లు భావించారు.
దర్శించుకున్న ఇన్‌చార్జి మంత్రి ‘జూపల్లి’
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాత్రి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్ డీసీసీ అ« ద్యక్షుడు నరేశ్ జాదవ్, కుమురంభీం ఆసిఫాబాద్ డీ సీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లికి ఆది లాబాద్ కలెక్టర్ రాజరి్షషా, ఎస్పీ అఖిల్ మహాజన్, మెస్రం వంశీయులు నాగోబా చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావు, సర్పంచ్ తుకారాం, అధికారులు, మెస్రం వంశీయులు పాల్గొన్నారు.


