Adilabad District
-
అంగరంగ వైభవంగా నాగోబా జాతర..ఆకట్టుకున్న ఆదివాసీల సాంస్కృతి (ఫొటోలు)
-
నాగోబా వైభవం: ఆడపడుచులు... కొత్తకోడళ్లు
నాగోబా అంటే మహిళామణుల మహా జాతర దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర ‘నాగోబా’ మహిళలకు పెద్ద పీట వేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో జాతర మొదలైంది. ‘ఈరోజు కోసమే’ అన్నట్లుగా సంవత్సరమంతా ఎదురు చూసిన ఇంద్రవెల్లి కొండలు, కెస్లాపూర్ పరిసరాలు పండగ కళతో వెలిగిపోతున్నాయి. ఈ జాతరలో మహిళలది ప్రేక్షక పాత్ర కాదు. అడుగడుగునా ప్రధాన పాత్ర...నాగోబా జాతర సందడి మొదలైంది. గిరిజనుల్లోని ఆదివాసీ మెస్రం వంశీయులకు సర్ప దేవుడు ఆరాధ్య దైవం. భక్తిశ్రద్ధలతో ప్రతియేడు పుష్య అమావాస్యలో ఆ దేవుడికి మహాపూజలు అందించడం ద్వారా ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ మహాపూజకు ముందు, వెనకాల జరిగే తంతులలో మెస్రం వంశంలోని మహిళల పాత్రే కీలకం. ఇంటి ఆడపడుచులను అందలం ఎక్కిస్తూనే, ఆ ఇంటికి వచ్చిన కోడళ్లకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రతువులో వీరిద్దరి భాగస్వామ్యం మనకు కనిపిస్తుంది.ఆడపడుచులకు ప్రాధాన్యతమెస్రం వంశీయులు తమ ఇంటి ఆడపడుచుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. మహాపూజకు ముందు కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులే ముందు ఉంటారు. ముందుగా పురుషులు అందరూ కలిసి నాగోబా ప్రతిమను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. మహిళలు బిందెల్లో నీళ్లు, గుళ్లల్లో ఆవుపేడను తీసుకొస్తారు. ఆలయ ప్రవేశం తర్వాత అందరు కలిసి నాగోబా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో ఆడపడుచుకు ఎంత విలువ ఇస్తారనేది మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కొత్త కుండలను ఆడపడుచులకు అందజేస్తారు. ఈ కుండలను అందుకున్న ఆడపడుచులు, తమ భర్తతో కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ ఆలయ ఆవరణలోని మర్రిచెట్టు దగ్గర ఉన్న కోనేరు దగ్గరకు వెళ్తారు. అక్కడ కుండల్లో నీళ్లు తీసుకొని అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మెస్రం అల్లుళ్లు పాత పుట్టలను తొలగిస్తారు. ఆపై ఆడపడుచులు పుట్టమట్టి, ఆవుపేడ, కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కలిపి కొత్త పుట్టలను తయారు చేస్తారు.కొత్త కోడళ్లు వస్తారునాగోబా మహాపూజ ముగిసిన తర్వాత అర్ధరాత్రి మరో ముఖ్యమైన ఘట్టం ఈ కత్రువులో ఆవిష్కృతం అవుతుంది. ఇంటి ఆడపడుచును ఏవిధంగా ఆరాధిస్తారో ఆ ఇంటి గడపకు వచ్చిన కోడళ్లకు కూడా అంతే విలువ ఇస్తారు అనడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా నిలుస్తుంది. నాగోబా సన్నిధికి వచ్చే కొత్త కోడళ్లు మొదట సతీ దేవతకు పూజలు చేస్తారు. తరువాత మెస్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆపై నాగోబా దేవుడిని దర్శించుకుంటారు. దీన్ని మెస్రం వంశీయులు ‘భేటింగ్’గా సంబోధిస్తారు. అర్ధరాత్రి మొదలయ్యే ఈ తంతు తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ భేటింగ్ తర్వాతనే ఆ కొత్త కోడళ్లు నాగోబా దర్శనానికి ఎప్పుడైనా వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.ఎప్పుడు వచ్చినా కొత్తగానే..‘కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులను, అల్లుళ్లను భాగస్వాములను చేస్తాం. వ్యవస్థలో మహిళలు, పురుషులకు సమ్రపాధాన్యత అనేది ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది. కొత్త కోడళ్లు దేవుడి దర్శనం ద్వారా మా సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకుంటారనేదే ఈ కార్యంప్రాధాన్యత’ అంటున్నాడు ఉట్నూర్‌కు చెందిన మెస్రం మనోహర్.‘నాగోబా జాతరకు ఎన్నోసార్లు వచ్చాను. విశేషం ఏమిటంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విశేషం తెలుసుకుంటూనే ఉంటాను. నాగోబా జాతర అంటే మహిళలకుప్రాధాన్యత ఇచ్చే మహా జాతర’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన గిరిజ.‘నాగోబా’ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. తరగని మౌఖిక కథలు ఉన్నాయి. అన్నింట్లో మహిళ మహారాణిగా, మíßమాన్వితంగా వెలిగిపోతూనే ఉంటుంది. అదే ఈ మహ జాతర ప్రత్యేకత. పవిత్రత. – గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి. -
ఆదిలాదాబాద్ : వైభవంగా నాగోబా జాతర..గంటల తరబడి క్యూలో భక్తులు (ఫొటోలు)
-
కెస్లాపూర్ లో అత్యంత వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర
-
అంగరంగ వైభవంగా ఆదివాసీ ‘నాగోబా జాతర’ ప్రారంభం (ఫొటోలు)
-
రేపే నాగోబా మహాజాతర
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 28న మహాపూజతో సంబరం మొదలు కానుంది. ఇప్పటికే పవిత్ర గంగాజలంతో వచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్ గ్రామ పొలిమేరలో పడియోర్ జన్మ స్థలమైన మర్రిచెట్టు వద్ద గుడారాలు వేసుకుని బస చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చారు. రెండు రోజులుగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. రాత్రి వేళలో ప్రదాన్ కితకు చెందిన వారు కిక్రి వాయిస్తూ నాగోబా, 22 కితల వంశీయుల చరిత్ర చెబుతున్నారు. ఆదివారం ఉదయం మహిళలు కితల వారీగా జొన్న గట్కా, సంప్రదాయ పిండి వంటలు చేసి ఆచారం ప్రకారం నైవేద్యాలు సమర్పింపంచారు. 22 కితల్లో మరణించిన పెద్దల పేరుతో రాత్రి తూమ్ (కర్మకాండ) పూజలు చేపట్టినట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ తెలిపారు. మరణించిన వారు ఈ పూజలతో నాగోబా సన్నిధికి చేరినట్లు భావిస్తామని పేర్కొన్నారు. పూజల్లో జొన్నగట్కా ప్రత్యేకం పూజల్లో భాగంగా సమర్పించే నైవేద్యంలో జొన్న గట్కాకు ప్రత్యేక స్థానం ఉంది. పూజల ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇంటి నుంచి తీసుకువచ్చిన జొన్న పిండితో గట్కా, ఇతర పిండి పదార్థాలు తయారు చేస్తారు. నైవేద్యంగా సమర్పించిన తర్వాత కితల వారీగా పంపిణీ చేసి భోజనం చేస్తారు. ఆలయానికి చేరిన కుండలు నాగోబా మహాపూజ, సంప్రదాయ పూజలకు అవసరమయ్యే సిరికొండలోని గుగ్గిల స్వామి తయారుచేసిన ఏడు రకాల కుండలు ఆదివారం సాయంత్రం ఆలయానికి చేరాయి. మొత్తం 350 మట్టి పాత్రల్లో పెద్ద బాణాలు, సాధారణ కుండలు, మూతలు, కడుముంతలు, దీపాంతలు ఉన్నాయి. వీటిని ఆలయంలో భద్రపరిచారు. తూమ్ పూజలతో దేవుడి సన్నిధికి..ఆదివాసీల్లో మరణించిన పెద్దలకు కుటుంబ సభ్యులు తమ కుల దేవతల వద్దకు వెళ్లి తూమ్ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో మరణించిన వారు దేవుడి సన్నిధికి చేరినట్లుగా భావిస్తారు. ఈ పూజల అనంతరమే వంశంలోని తమ కితకు చెందిన కోడళ్ల బేటింగ్ (దేవుడి పరిచయం)తో పాటు ఇతర పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.నాగోబా జాతరకు దృశ్య రూపంఎనిమిదేళ్ల పాటు పరిశోధన చేసిన యంగ్ డైరెక్టర్ జెన్నిఫర్ ఆల్ఫాన్స్సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రాచీనమైన నాగోబా జాతర గురించి మనకు తెలిసింది ఎంత? అంటూ వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో ఆదిలాబాద్ బాట పట్టారు యంగ్ డైరెక్టర్ జెన్నిఫర్ ఆల్ఫాన్స్. ఎనిమిదేళ్ల పరిశోధన తర్వాత ‘నాగోబా జాతర’పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు. తాను తెలుసుకున్న విషయాలు, చిత్రీకరించిన ఫొటోలతో అందమైన పుస్తకాన్ని కూడా ప్రచురించారామె. నాగోబా జాతరలోని ప్రతి ఘట్టాన్ని అందంగా చిత్రించారు. ఇందుకు తన పరిశోధనే కారణమంటారామె. ‘సినిమా చిత్రీకరణ ఒక్క టే నాకు తెలిసిన కళ. నా దృష్టికొచ్చిన గొప్ప విషయాన్ని నాకు చేతనైన మాధ్యమంలో ఒక రూపం కల్పించానని చెప్పడానికి గర్వంగా ఉంది’అన్నారు జెన్నిఫర్. ‘గుస్సాడీ’పుస్తకం ఆమెజాన్లో ఉంది. ఈ పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బును ఆమె తీసుకోలేదు. నేరుగా ఆదివాసీల అభ్యు న్నతి కోసం ఏర్పాటు చేసిన నిధికి చేరుతోంది. ‘నాగోబా జాతర’రచన మార్కెట్లో విడుదల కావాల్సి ఉంది. ఆదిలా బాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల పరిధిలోని కేస్లాపూర్లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు నాగోబా జాతర జరగనుంది. జెన్నిఫర్ హైదరాబాదీ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన జెన్నిఫర్ ఆల్ఫాన్స్ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఆమె తీసిన ‘కచరా’ఫిల్్మకు మూడు నంది అవార్డులు వచ్చాయి. ‘స్ట్రేంజర్’సినిమా కేన్స్‌లో స్క్రీన్ అయ్యింది. దానికి 20కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. ఆ డబ్బుతో ఆదివాసీల జీవనం, కళలపై రీసెర్చ్ చేస్తున్నారు.ఇవి మన సంస్కృతి మూలాలుహైదరాబాద్లోని శిల్పారామంలో గుస్సాడీ నృత్యం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. మూలాలను వెతుక్కుంటూ ఆదిలాబాద్ అడవులకెళ్లాను. గుస్సాడీ మీద ఒక డాక్యుమెంటరీ, పుస్తకం తెచ్చాను. 2014 నుంచి ఇప్పటివరకు రెండు డాక్యుమెంటరీలు, రచనలు వచ్చాయి. మూడవది ఆదివాసీ దేవత జంగుబాయి డాక్యుమెంటరీ చిత్రీకరణ దశలో ఉంది. నా పుస్తకాలను చూసిన మన తెలుగువారు చాలామంది ఆఫ్రికాలో షూట్ చేశారా అని అడిగారు. మన మూల సంస్కృతి అడవి దాటి బయటకు రాకపోతే ఇక ప్రపంచానికి ఏమి చెబుతాం? ప్రపంచదేశాలకు తెలియచేయడానికి ఇంగ్లిష్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. డాక్యుమెంటరీ మన తెలుగుదనాన్ని కోల్పోకూడదని ఆదివాసీల మాటలను అలాగే ఉంచాను. – జెన్నిఫర్ ఆల్ఫాన్స్, ఫిల్మ్ డైరెక్టర్ -
ఆదిలాబాద్‌లో రైతు ఆత్మహత్య.. హరీశ్‌రావు కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రైతు మామిళ్ల నర్సయ్య ఆత్మహత్యపై హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం(జనవరి25)ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నడు. అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నది. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదాం. అధైర్య పడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’అని హరీశ్‌రావు తెలిపారు. -
ఆదిలాబాద్ : నాగోబా జాతర..ఇంద్రాదేవికి ‘మెస్రం’ పూజలు (ఫొటోలు)
-
కల్యాణలక్ష్మి డబ్బునుంచి పంట రుణం కోత
సిరికొండ: నిరుపేద ఆడపిల్లల పెళ్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు త్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుండగా, ఈ పథకం కింద వచ్చిన డబ్బు నుంచి బ్యాంకు అధికారులు పంట రుణాన్ని జమచేసుకున్నారు. దీంతో ఓ తల్లి తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని లచ్చింపూర్(బీ) గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందురు సోమ్బాయికి ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురుకు గత వేసవిలో వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా గతవారం ప్రభుత్వం ద్వారా రూ.1,00,116 చెక్కు అందుకుంది.తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ నెల 17న వోచర్ రాసి ఇచ్చింది. ఈ డబ్బులు డ్రా చేసుకోవడానికి శుక్రవారం బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంకు ఖాతాలో రూ.40 వేలు మాత్రమే జమ అయ్యాయి. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను అడిగితే.. ఆమె పంట రుణం రూ.1.60 లక్షలు ఉండగా, వడ్డీ రూ.60 వేలు అయిందని, దీంతో కల్యాణలక్ష్మి డబ్బుల నుంచి వడ్డీ కింద రూ.60 వేలు జమ చేసుకున్నామని చెప్పగా, ఆమె అవాక్కయింది. తనకు వచ్చిన పూర్తి డబ్బులను ఇవ్వాలని ఎంత వేడుకు న్నా బ్యాంకు సిబ్బంది కనికరించలేదని ఆమె ఆవే దన వ్యక్తం చేసింది. పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చాలని అనుకుంటే, పంట రుణం కింద జమ చేసుకోవడం అన్యాయమని బోరుమంది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నరేశ్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. -
రోడ్డుపై వెల్కమ్ చెప్తున్న పులి
-
ఆదిలాబాద్ లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
-
ఆదివాసీల వింత సంప్రదాయం.. 2 కిలోల నూనె తాగిన మహిళ
-
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
లక్నో/హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయలుదేరింది. కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. ఇక, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. దీంతో, అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అటవీశాఖ అధికారులపై కేశవపట్నం గ్రామస్తుల దాడి..!
-
ఆదిలాబాద్: అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల రాళ్ల దాడి
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఘటన జరిగింది. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చలో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికాయి. కలప దుంగలు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.ఈ ఘటనలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీ శాఖ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్ స్వల్పంగా గాయపడ్డారు. అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనంంపై దాడి చేసిన స్థానికులు అద్దాలు పగలగొట్టారు. కేశవపట్నం చేరుకున్న పోలీసు బలగాలు.. గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.ఇదీ చదవండి: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు -
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
-
మైనర్ బాలికపై దారుణం..
-
ఆదిలాబాద్ @ 4.7 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే సగటున 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.7డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఇక్కడ ఈ సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కంటే 8.1 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.పటాన్చెరు, హకీంపేట్, హనుమకొండ, మెదక్, నిజామాబాద్, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సాధారణం కంటే 4డిగ్రీ సెల్సియస్‌కు పైబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా నెలకొన్న వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు పతనమైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఈశాన్య దిశనుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. రానున్న రెండ్రోజులు ఉదయం పూట పొగమంచు ఏర్పడుతుందని, దీంతో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.రానున్న మూడురోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 4డిగ్రీల వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ప్రాంతాలు ఆదిలాబాద్ : 4.7 డిగ్రీలు, అర్లి : 6.3డిగ్రీలు, తండ్ర: 6.6 డిగ్రీలు, తిర్యాణి: 6.7 డిగ్రీలు, కొహిర్: 6.8డిగ్రీలు, జుక్కల్: 7.6డిగ్రీలు, కొట్గిరి: 7.7 డిగ్రీలు, శివంపేట్: 8 డిగ్రీలు, మల్లాపూర్: 8 డిగ్రీలు, మోమీన్‌పేట్: 8.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
TG: చిరుత దాడితో మహిళకు గాయాలు.. టెన్షన్లో ప్రజలు
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్య మృగాల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురిపై పులి దాడి చేయగా.. తాజాగా చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ప్రజలు వణికిపోతున్నారు.వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం అధికారులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా డెడ్రా సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. ఇక, చిరుత దాడి నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే ఓ మహిళపై పులి దాడి చేయడంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అనంతరం, ఆదిలాబాద్ జిల్లాలోనే మరో ఇద్దరికిపై పులి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వన్య ప్రాణుల వరుస దాడుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. -
పులి కోసమే వెతుకుతున్నాం సర్..
కాగజ్‌నగర్ డివిజన్లో ఇటీవల ఇద్దరిపై దాడి చేసిన పులి ఆచూకీ కోసం అటవీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిర్పూర్ రేంజ్లో అటవీ అధికారి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఆయన కార్యాలయంలో నిజమైన పులిని తలపిస్తున్న పులి బొమ్మ ఆసక్తి రేపుతోంది.పులి భయంతో.. జ్వరం!ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో రైతు రౌత్ సురేశ్‌పై పులి దాడి చేయడాన్ని చూసిన అతని భార్య సుజాత జ్వరంతో మంచం పట్టింది. ఏ క్షణాన ఎవరిపై పులి దాడి చేస్తుందో తెలియక.. దుబ్బగూడ.. పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. – ఫొటోలు: సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఆదిలాబాద్‌లో పెద్దపులి హల్చల్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో గత నాలుగు రోజులుగా పెద్దపులి హల్చల్ చేస్తోంది. గత రెండ్రోజులుగా నార్నూర్ మండలం చోర్గావ్ గ్రామంలో తిష్టవేసి ఆవును తింటున్న దృశ్యం అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. దీంతో చోర్గావ్, సుంగాపూర్, బాబేఝరి, మంజ్రి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం గాదిగూడ మండలం ఖడ్కి గ్రామం మీదుగా బుడుకుంగూడ, సావురి గ్రామం మీదుగా రాంపూర్ చేరుకుంది. వేకువజామున గిరిజన రైతు ప్రకాశ్‌కు చెందిన ఆవుపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై చప్పుడు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదేరోజు మధ్యాహ్నం నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామ శివారులో పత్తి ఏరుతున్న మహిళలకు పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. అక్కడి నుంచి గంగాపూర్, మాన్కాపూర్ వైపు పులి వెళ్లిందని ప్రచారం జరగడంతో మాన్కాపూర్, రాజులగూడ, నార్నూర్, మహగావ్, నాగల్కొండ, భీంపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లిన వారంతా మధ్యాహ్నం ఇంటిబాట పట్టారు. ఎఫ్ఎస్వో సుదర్శన్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు బృందాలుగా విడిపోయి పులి జాడకోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
అమ్మో.. పులి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పులులు.. ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల్లో అలజడి రేపుతున్నాయి. జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ.. పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి. ప్రస్తుతం జానీ, ఎస్–12గా పిలుస్తున్న రెండు పులులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా పులుల రాకను అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు స్వాగతిస్తుండగా.. అడవి సమీప ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పత్తి పంట చేతికొచ్చే వేళ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.అక్కడ సరిపోక.. మ హారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాలలో పులుల సంఖ్య పెరిగింది. అక్కడి ఇరుకు ఆవాసం వల్ల ఆ పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. వాటిలో మగపులులే అధికమని అధికారులు చెప్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో ఎనిమిదేళ్ల మగపులి(జానీ) సంచరిస్తున్నట్టు గుర్తించారు. సుమారు రెండేళ్ల వయసున్న మరో మగ పులి (ఎస్ 12) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతోంది. ఇంకో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో కనిపించి వెళ్లిపోయింది.ఇక్కడ కోర్ ఏరియాలోకి వెళ్లలేక.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి వస్తున్న పులులు.. కవ్వాల్‌లోని కోర్ ఏరియాకు చేరుకోవాలంటే, 200 కిలోమీటర్లకుపైగా నడవాలి. ఇది వాటికి పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పోడు సాగు, పంట పొలాలు పులుల రాకకు ఆటంకంగా మారాయి. రహదారుల వెంట అండర్ పాస్‌లు, ఓవర్ పాస్‌లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే ఆ పులులు అడవి అంచుల్లోనే సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కవ్వాల్ బయట కాగజ్‌నగర్ డివిజన్లో ఐదు పెద్దవి, నాలుగు చిన్నవి కలిపి 9 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.మనుషులపై దాడులతో కలకలం రాష్ట్రంలోకి వస్తున్న పులులు.. పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. 2020 నవంబర్‌లో 18 రోజుల వ్యవధిలో ఏ2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై, పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18)పై పొలాల్లో దాడిచేసి చంపేసింది. గత ఏడాది నవంబర్‌లో మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. నాటి ఘటనల నేపథ్యంలో.. ఇప్పుడు అటవీ అధికారులు ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేశారు.కోర్ ఏరియాలోకి వెళ్లేలా చూస్తున్నాం.. టైగర్ జోన్ వెలుపల సంచరించే కొత్త పులులు కోర్ ఏరియాలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం. వేటగాళ్లు ఉచ్చులు వేయకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పులి దాడి చేసిన పశువుల యజమానులకు వెంటనే పరిహారం ఇస్తున్నాం. పులి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వుపులుల సంచారంతో భయంగా ఉందిపులి భయంతో పత్తి తీసే పనులు సాగడం లేదు. మా చేన్ల వైపు పులి రాకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. – ఆత్రం జైతు, భుర్కరెగడి గ్రామం, నిర్మల్ జిల్లా -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
పత్తిపై తేమ, ధరల కత్తి
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది. తేమ శాతం, తక్కువ ధర ఖరారుపై వివాదం ఏర్పడటంతో కొనుగోళ్లు జరగలేదు. తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలంటూ రైతులు రాత్రివరకు తమ ఆందోళన కొనసాగించారు. వివరాలిలా ఉన్నాయి.. సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. సీసీఐ క్వింటాల్ పత్తికి మద్దతు ధర రూ.7,521తో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు మొదట క్వింటాల్ పత్తికి రూ.6,700 ధర వేలం ద్వారా నిర్ణయించి, ఆ తర్వాత రూ.10, రూ.20 పెంచుతూ రూ.7,150 వరకు చేరుకున్నారు.ఆ తర్వాత ధర పెంచేందుకు ససేమిరా అన్నారు. దీంతో కలెక్టర్ రాజర్షిషా, మార్కెట్ అధికారులు ధర పెంచాలని ప్రైవేట్ వ్యాపారులకు సూచించినప్పటికీ వారు ఒప్పుకోలేదు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. సీసీఐతో పోలి్చతే ప్రైవేట్ ధర తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వారికి నచ్చజెప్పినప్పటికీ వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు.ప్రైవేట్ వ్యాపారులు రూ.7,200కు కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. మరోవైపు సీసీఐ అధికారులు కూడా నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని తెలిపారు. 8 నుంచి 12 మధ్య శాతం తేమ ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అది దాటితే క్వింటాలుకు రూ.75.21 చొప్పున కోత విధిస్తామని పేర్కొనడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తేమతో సంబంధం లేకుండా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మద్దతు తెలిపారు. కలెక్టర్ ఘెరావ్..ఉద్రిక్తత ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ అధికారులు, రైతులతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కలెక్టర్ పలుమార్లు చర్చించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ రూ.7,200కు కొనుగోలు చేసేలా ఒప్పించిన తర్వాత వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు ఘెరావ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మొత్తం మీద రాత్రి వరకు తేమ పేచీ తేలలేదు. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు పట్టుబట్టారు. కానీ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెప్పడం, ధర పెంచేందుకు ప్రైవేట్ వ్యాపారులు ఒప్పుకోక పోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.దీంతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మార్కెటింగ్ అధికారులు మరోసారి సీసీఐ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులతో చర్చించినా ఎటూ తేలలేదు. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్ యార్డు నుంచి పంజాబ్ చౌక్ చేరుకొని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. రాత్రి వరకు ప్రైవేట్ వ్యాపారులతో చర్చలు జరిపిన జిల్లా కలెక్టర్.. చివరకు మొదటి రోజు తీసుకొచ్చిన పత్తిని తేమతో సంబంధం లేకుండా క్వింటాల్ రూ.6,696 చొప్పున శనివారం కొనుగోలు చేసేలా వ్యాపారులను ఒప్పించారు. -
ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది
తల్లిదండ్రులు మడావి లక్ష్మణ్, కమలాబాయిలతో టీచరు ఉద్యోగం సాధించిన కుమార్తెలు కవిత, దివ్య, కళ్యాణి, టీచర్ కావడమే లక్ష్యమంటున్న చిన్నకుమార్తె కృష్ణప్రియ (కుడి చివర) ‘ఎంత మంది పిల్లలు?’ అనే ప్రశ్న వినిపించినప్పుడల్లా లక్ష్మణ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తినంత పనయ్యేది. ఎందుకంటే...‘నాకు అయిదుగురు ఆడపిల్లలు’ అనే మాట లక్షణ్ నోటినుంచి వినిపించడమే ఆలస్యం ‘అయ్యో!’ అనే అకారణ సానుభూతి వినిపించేది. ‘ఇంట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది అయిదుగురు ఆడపిల్లలంటే మాటలా! నీ కోసం చాలా కష్టాలు ఎదురుచూస్తున్నాయి’ అనేవాళ్లు. అయితే వారి పెదవి విరుపు మాటలు, వెక్కిరింపులు తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఇల్లు పిల్లలకు బడి పాఠాలు చెప్పే ఇల్లే కాదు... ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసేవారికి గుణపాఠాలూ చెబుతుంది.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన మడావి లక్ష్మణ్ బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ఆదివాసీ తెగకు చెందిన లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తరువాత ఆర్థిక కష్టాలు తీరాయి. లక్ష్మణ్– కమలాబాయి దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.‘ఆడపిల్ల ఇంటికి అదృష్టం’ అన్నారు చుట్టాలు పక్కాలు, పెద్దలు.రెండోసారి ఆడపిల్ల పుట్టింది. వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ అన్నారు.‘ఇద్దరు పిల్లలు చాలు’ అనుకునే సమయంలో ‘లేదు... లేదు... అబ్బాయి కావాల్సిందే’ అని పట్టుబట్టారు ఇంటి పెద్దలు.మూడో సారి... అమ్మాయి. ‘ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చాలు’ అనుకునే లోపే....‘అలా ఎలా కుదురుతుంది....అబ్బాయి...’ అనే మాట మళ్లీ ముందుకు వచ్చింది.నాల్గోసారి... అమ్మాయి.‘ఇక చాలు’ అని గట్టిగా అనుకున్నా సరే... పెద్దల ఒత్తిడికి తలవొంచక తప్పలేదు.‘ఆరు నూరైనా ఈసారి కొడుకే’ అన్నారు చాలా నమ్మకంగా పెద్దలు. దేవుడికి గట్టిగా మొక్కుకున్నారు.అయిదోసారి... అమ్మాయి. ‘అయ్యయ్యో’ అనే సానుభూతులు ఆకాశాన్ని అంటాయి. అయితే లక్ష్మణ్, కమలాబాయి దంపతులు ఎప్పుడూ నిరాశపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖర్చులకు సరిపడా జీతం రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. ‘ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా సరే పిల్లలను బాగా చదివించాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు లక్ష్మణ్. పిల్లల్ని చదివించడమే కాదు ఆడపిల్లలు అనే వివక్ష ఎక్కడా ప్రదర్శించేవారు కాదు. ఆటల్లో, పాటల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే బెత్తం పట్టుకోనక్కర్లేదు. వారికి నాలుగు మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఆ మాటే వారికి తిరుగులేని తారకమంత్రం అవుతుంది.అయిదుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ‘‘అమ్మా... మీ నాయిన టీచర్. మా నాయినకు మాత్రం చదువు ఒక్క ముక్క కూడా రాదు. నాకు మాత్రం సదువుకోవాలనే బాగా ఇది ఉండే. అయితే మా కుటుంబ పరిస్థితి చూస్తే... ఇంత దీనమైన పరిస్థితుల్లో సదువు అవసరమా అనిపించేది. ఎందుకంటే సదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఏ రోజుకు ఆరోజే బువ్వకు కష్టపడే మా దగ్గర డబ్బు ఎక్కడిది! అయినా సరే సదువుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను...’ అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. వారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఫలితం వృథా పోలేదు.ఇప్పుడు...రెండో కూతురు కవిత, మూడో కూతురు దివ్య, నాల్గో కూతురు కళ్యాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్న కూతురు కృష్ణప్రియ కొద్ది మార్కుల తేడాతో టీచర్ అయ్యే చాన్స్ మిస్ అయింది. అక్కలలాగే టీచర్ కావాలని కలలు కంటున్న కృష్ణప్రియకు మరోప్రయత్నంలో తన కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అప్పుడు ఒకే ఇంట్లో నలుగురు టీచర్లు!ఇంటర్ వరకు చదివిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువులు చదవాలనుకుంటోంది. వారిలాగే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటుంది. ఇప్పుడు లక్ష్మణ్‌ను చూసి జనాలు ఏమంటున్నారు? ‘నీకేమయ్యా... ఇంటినిండా టీచర్లే!’ ‘మీది టీచర్స్ ఫ్యామిలీ’నాన్న మాటలుతల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. వారి ఆశీర్వాద బలంతోనే టీచర్ అయ్యాను. ‘చదువే మన సంపద’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయన మాటలు మనసులో నాటుకు΄ోయాయి.– కవిత, రెండో కుమార్తెనేను టీచర్... అక్కహెడ్మాస్టర్అక్క కవితకు, నాకు ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను జైనూర్ మండలం జెండాగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. మా స్కూలుకు అక్క కవితనే ప్రధానో΄ాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మేము ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం సంతోషంగా ఉంది.– దివ్య, మూడో కుమార్తెఆరోజు ఎంత సంతోషమో!మొన్నటి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో నాకు ΄ోస్టింగ్ ఇచ్చారు. మొన్ననే విధుల్లో చేరాను. టీచర్‌గా మొదటి రోజు స్కూల్‌కి వెళ్లినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘మా ముగ్గురు పిల్లలు టీచర్లే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను’ అంటున్నాడు నాన్న.– కళ్యాణి, నాలుగో కుమార్తెటీచర్ కావడమే నా లక్ష్యంఅక్క కళ్యాణితో కలిసి నేను కూడా మొన్నటి డీఎస్సీ పరీక్ష రాశాను. కొద్ది మార్కుల తేడాతో నాకు ఉద్యోగం చేజారింది. అయితే నా లక్ష్యాన్ని మాత్రం వీడను. ఎలాగైనా టీచర్ కొలువు సాధిస్తాను.– కృష్ణప్రియ, ఐదో కుమార్తె – గోడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి