ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం | 3 Died In Road Accident adilabad District | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

Dec 10 2025 9:48 AM | Updated on Dec 10 2025 9:55 AM

3 Died In Road Accident adilabad District

ఆదిలాబాద్‌:  జిల్లాలోని జైనథ్‌ మండలం తరోడ గ్రామ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మూలమలుపులో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ  ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జైనథ్‌ నుండి ఆదాలాబాద్‌ వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పింది.  షేక్‌ మొహినుద్దీన్‌, షేక్‌ మోహిన్‌,  కదం కీర్తి సాగర్‌లు ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు పోలీసులు.

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అధికమయ్యాయి.  డిసెంబర్‌ 7వ తేదీ నాలుగు యువకులు కారులో ప్రయాణిస్తుండగా, మంచు కారణంగా దృశ్యమానం తగ్గిపోవడంతో వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు శ్రీపతి అశ్రిత్ రెడ్డి, పప్పుల శివమణి) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

మరో ఘటనలో, కీసరా నుంచి తర్నాకకు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో హర్షవర్ధన్ (మల్కాజిగిరి నివాసి) మృతి చెందాడు. గతనెల 3వ తేదీన  రంగారెడ్డి చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్‌– తాండూర్‌ రహదారిపై జరిగిన  రోడ్డు ప్రమాదం బాధితుల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement