హైదరాబాద్: పుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి విచక్షణా రహితంగా ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రాంనగర్‌కు చెందిన చాకలి గోపాల్, శైలజ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్ ఎయిర్‌పోర్టు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండగా శైలజ వారు నివాసం ఉండే అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తుంది. గోపాల్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి శైలజను వేధిస్తున్నాడు.
దీనిపై ఇటీవలే ఆమె సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సలహా ఇవ్వడంతో తిరిగి ఇంటికి వచి్చంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి పుల్లుగా మద్యం తాగి వచి్చన గోపాల్ భార్యతో గొడవకు దిగి..వంటింట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా పొడిచాడు. దాదాపు 20 నుంచి 25 కత్తిపోట్లు పొడవడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. పిల్లలు చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడిన గోపాల్ అనంతరం పారిపోయాడు. శైలజ అరుపులకు బయటకు వచి్చన చుట్టుపక్కల వారు ఆమెను అంబర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ రాంచంద్రారెడ్డి కేసు నమోదు చేసి..మంగళవారం నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


