ఆకాశంలో వికసించిన డ్రోన్‌ పుష్పాలు | Telangana Rising Global Summit 2025: Guinness Book of Records entry | Sakshi
Sakshi News home page

ఆకాశంలో వికసించిన డ్రోన్‌ పుష్పాలు

Dec 10 2025 5:23 AM | Updated on Dec 10 2025 5:23 AM

Telangana Rising Global Summit 2025: Guinness Book of Records entry

డ్రోన్ల ప్రదర్శన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు పత్రాన్ని సీఎం రేవంత్‌ అందజేస్తున్న ప్రతినిధి

ఫ్యూచర్‌ సిటీలో ఆహూతులపై వెలుగు పూలు

3 వేల డ్రోన్లతో వివిధ అంశాల ప్రదర్శన

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్‌ సిటీ సిగలో డ్రోన్‌ పుష్పాలు వికసించాయి. ఆకాశంలో కాంతి రేఖలు వెదజల్లుతూ కనువిందు చేశాయి. రాత్రి సరిగ్గా 8.53 నిమిషాలకు 3 వేల డ్రోన్లు ఆహూతులపై వెలుగు పూలు విరజిమ్మాయి. తెలంగాణ సాంకేతికత, సమర్థతను చాటి చెబుతూ సాగిన డ్రోన్‌ విన్యాసాలు అలరించాయి.

స్వాగత ముద్రతో ప్రారంభమైన డ్రోన్‌ ప్రదర్శనలో.. 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సృష్టే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్‌ 2047’, హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ, 12 లేన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ట్రిపుల్‌ ఆర్, కొత్త ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ సరోవర్, ఫ్యూచర్‌సిటీ, స్కిల్స్‌ వర్సిటీ, మ హిళా శక్తి, రైతు సంక్షేమం వంటివి ఆకాశంలో కనువిందు చేశాయి. 3 వేల డ్రోన్లతో కూడిన ప్రదర్శన గిన్నిస్‌ రికార్డు కావడంతో ఈ మేరకు బుక్‌లో నమోదు చేసిన రికార్డు పత్రాన్ని నిర్వా హకులు సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement