ప్రతీ పరీక్షకు నాలుగు రోజుల వ్యవధి
షెడ్యూల్ విడుదల చేసిన టెన్త్ పరీక్షల విభాగం
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి మొదలవు తున్నా యి. ప్రధాన సబ్జెక్టులు ఏప్రిల్ 13తో ముగుస్తాయి. సైన్స్ రెండు పేపర్లుగా ఉంటుంది. ఈ పేపర్ ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకూ ఉంటుంది. మిగతా పేపర్లన్నీ ఉద యం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ నిర్వహి స్తారు.
పరీక్షల నిర్వహణలో ఈ సారి మార్పులు చేశారు. ప్రతీ పరీక్షకు మధ్య కనీసం నాలుగు రోజుల వ్యవధి ఉండేలా చేశా రు. విద్యార్థులు పరీక్షలకు సన్న ద్ధమయ్యేందుకు, ఎలాంటి ఒత్తి డి పడకుండా ఈ జాగ్రత్తలు తీ సుకున్నట్టు అధికార వర్గాలు తె లిపాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్, పరీక్షల తేదీ లను టెన్త్ పరీక్షల విభాగం మంగళవారం విడుదల చేసింది.


