‘కాంగ్రెస్‌ పాలనపై తిరగబడే కాలం వచ్చింది’ | BRS Harish Rao Takes On Revanth Sarkar | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ పాలనపై తిరగబడే కాలం వచ్చింది’

Mar 15 2026 7:45 PM | Updated on Mar 15 2026 7:48 PM

BRS Harish Rao Takes On Revanth Sarkar

హరీష్‌ రావు(ఫైల్‌ ఫోటో)

హైదరాబాద్‌: ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్‌కు  అతిగతి లేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు

స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు.అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతా అన్నారు. 

పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హరీశ్ రావు గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నక్క మల్లేష్ గౌడ్, కాసా ధనుంజయ్ గౌడ్, నక్క పవన్ గౌడ్, నక్క చరణ్ గౌడ్, నక్క వికాస్ గౌడ్, కాసా వినయ్ గౌడ్, పట్లోళ్ల తిరుపతి రెడ్డి, నక్క వీర స్వామి గౌడ్, నక్క సాయి గౌడ్, బచ్చుగూడెం ఎల్లయ్య యాదవ్, కాసా రాజు గౌడ్, అత్తెల్లి శ్రీకాంత్ రెడ్డి, పెద్దోళ్ల రాజు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement