TG: బడ్జెట్‌ సమావేశాలు.. గవర్నర్‌కు ఆహ్వానం | TG Budget Sessions: Invitation Extended to Governor | Sakshi
Sakshi News home page

TG: బడ్జెట్‌ సమావేశాలు.. గవర్నర్‌కు ఆహ్వానం

Mar 15 2026 10:02 PM | Updated on Mar 15 2026 10:06 PM

TG Budget Sessions: Invitation Extended to Governor

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాను  ప్ర‌త్యేకంగా క‌లిసి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆహ్వానించారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాకు పుష్ప‌గుచ్ఛం అందించి.. శాలువాతో స‌త్క‌రించిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.  ఉప ముఖ్య‌మంత్రితో పాటుగా గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాను క‌లిసిన వారిలో ఆర్థిక శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్-ప్లానింగ్ సెక్రెట‌రి గౌర‌వ్ ఉప్ప‌ల్‌, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి స్కితా ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులున్నారు.

కాగా,  రేపటి(సోమవారం, మార్చి 16వ తేదీ) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 16 వ తేదీ నుంచి 30 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

తొలుత ఫిబ్రవరి 26వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా.. ఆ తేదీని కాస్త వెనక్కు జరిపింది తెలంగాణ ప్రభుత్వం.  రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించి తుది మెరుగులు దిద్దే క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల తేదీని కాస్త వెనక్కు జరపాల్సి వచ్చినట్లు సమాచారం. ఆర్థికశాఖ మల్లు భట్టి విక్రమార్క. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మార్చి 20వ తేదీన అసెంబ్లీ ప్రవేశపెడతారు.  గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement