మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు.. కేటీఆర్‌ ఏమన్నారంటే? | KTR reacted to the comments on the Moinabad Pilot Rohith Reddy farmhouse incident | Sakshi
Sakshi News home page

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు.. కేటీఆర్‌ ఏమన్నారంటే?

Mar 15 2026 3:54 PM | Updated on Mar 15 2026 4:55 PM

KTR reacted to the comments on the Moinabad Pilot Rohith Reddy farmhouse incident

సాక్షి,హైదరాబాద్‌: మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో తన పేరును లాగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు డ్రగ్స్‌ టెస్టులు చేయించుకునేందుకు తాను రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

‘మాదకద్రవ్యాలు మనుషులుని రాక్షసులుగా మారుస్తాయి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు కూడా డ్రగ్స్ వాడటం దురదృష్టకరం. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. రాజకీయంగా ఎంతటి వారైనా మాదక ద్రవ్యాల్ని వినియోగించినా, అక్రమంగా విక్రయించినా, వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అయితే డ్రగ్స్‌ కేసులో బీఆర్‌ఎస్‌ పార్టీని లాగడాన్ని ఖండిస్తున్నాను. డ్రగ్స్ కేసును బీఆర్‌ఎస్‌పై రాజకీయ ప్రతీకారంగా వాడుకోవడం మీ రాజకీయాల ప్రతిబింబం. నేను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లుగా ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నాను. అలాగే, ప్రతి డ్రగ్స్‌ కేసులో నా పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులు ఇస్తాం’అని హెచ్చరించారు.

 

హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ కలకలం సృష్టించింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో వీకెండ్‌ పార్టీ జరిగింది. ఈ పార్టీలో డ్రగ్స్‌ తీసుకుని ఏపీ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌తో పాటు పలువురు పట్టుబడ్డారు. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫాం హౌస్‌ జరిగిన డ్రగ్స్‌ పార్టీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై కేటీఆర్‌ స్పందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement