నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | road accident in nalgonda | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Mar 15 2026 3:36 PM | Updated on Mar 15 2026 5:50 PM

road accident in nalgonda

సాక్షి,నల్లగొండ: చింతపల్లి మండలం చెన్నారం గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని తొలుత దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏడుగురిని హైదరాబాద్‌కు తరలించారు.

మరణించిన వారిలో ఇద్దరు బీహార్‌కు చెందినవారిగా, మరో ఇద్దరు బొత్య తండాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు రోడ్లపై లారీలు నిర్లక్ష్యంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement