నేడు ఓయూలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం
ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి?
హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మాని యా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో బుధవారం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్ప టికే ఓయూ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్న ట్లు గతంలో ప్రకటించిన సీఎం.. నేడు ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నా రు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నా రు. యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీపైనా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఓయూకి రెండోసారి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించబోయే వరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి గత ఆగస్టు లో యూనివర్సీటీలో వివిధ హాస్టళ్ల ప్రారంభోత్సవానికి క్యాంపస్‌కు వచ్చారు. ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయా లని యూనివర్సిటీ అధికారులకు సూచించారు.
ఈ పనులకు శంకుస్థాపనలు
శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను కూల్చివేసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవన సముదాయం, ఇంజినీరింగ్ కాలేజీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఆడిటోరియం, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లా భవనం తదితర అభివృద్ధి పనులకు సభా వేదిక ద్వారానే సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాగా.. యూనివర్సిటీలోని విద్యార్థి, ఉద్యోగ, అధ్యాపక సంఘాలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత నెల రోజులుగా సీఎం రాక కోసం ఉస్మానియా యూనివర్సిటీ గంపెడాశతో వేచి చేస్తోంది. సీఎం వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనీ భావిస్తున్నాయి. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిక్రూట్‌మెంట్ ప్రకటన చేసే అవకాశం ఉందని ఓయూ అధికారులు చెబుతున్నారు.
ఇవీ డిమాండ్లు
⇒ దాదాపు 25 ఏళ్లుగా చాలీచాలనీ వేతనాలతో ఓయూలో కాంట్రాక్టు, పార్ట్ టైం టీచర్లు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. యూనివర్సిటీ న్యాక్ ఏ గ్రేడు వంటి వివిధ జాతీయ స్థాయి ర్యాంక్‌లను సాధించడానికి పాటుపడుతున్నామంటున్నారు. తమకు యూజీసీ వేతనాలను వర్తింపజేయాలని కోరుతున్నారు.
⇒ యూనివర్సిటీలోని బోధనేతర సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు 30 ఏళ్ల నుంచి ఆఫీస్ వర్క్‌లో వివిధ స్థానాల్లో సేవలందిస్తున్నారు. తాము కనీస వేతనాలకు నోచుకోవడం లేదంటున్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా బోధనేతర రంగంలో యూనివర్సిటి అభివృద్ధికి అహరి్నశలు కృషి చేస్తున్నామంటున్నారు. తమను క్రమబదీ్ధకరించాలనీ కోరుతున్నారు.
⇒ సీఏఎస్ ఇంటర్వ్యూల్లో 47 మందికి ప్రమోషన్స్‌లో అన్యాయం జరిగిందంటూ ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. సీఎం దీనిపై స్పందించి తమకు న్యాయం చేయాలనీ అధ్యాపకులు కోరుతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను వెంటనే అమలు చేయాలని యూనివర్సిటీ అ«ధ్యాపకులు వేడుకుంటున్నారు.


