Hyd: కామాటిపురాలో దారుణ హత్య | Serial Incidents causing uproar in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyd: కామాటిపురాలో దారుణ హత్య

Dec 10 2025 7:32 AM | Updated on Dec 10 2025 7:44 AM

Serial Incidents causing uproar in Hyderabad

హైదరాబాద్:   పాతబస్తీలోని కామాటిపురా పీఎస్‌ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది.  నిన్న(మంగళవారం) రాత్రి అరవింద్‌ మోస్లీ(30) అనే వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా అడ్డగించి హత్య చేశార పలువురు గుర్తు తెలియని దుండగులు. మోస్లీ తప్పించుకునే ప్రయత్నం చేసిన వెంబడించి మరీ హత్యకు పాల్పడ్డారు.  

రాత్రి  9 గంటల నుంచి 10 గంటల మధ్య పని ముగించకుని సైకిల్‌పై వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. పాతగొడవలు, వివాహేతర సంబంధం హత్యకు ‍కారణం అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు అరవింద్ ఘోస్లే , బియ్యం షాప్‌లో పని చేస్తున్నాడు.. కామాటిపురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్టరీకి తరలించారు..

కాగా, నగరంలో వరుసగా రెండు హత్యలు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతకుముందు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో రియల్టర్‌ దారుణ హత్య తీవ్ర  గురయ్యాడు.. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. 

మల్కాజ్‌గిరిలోని జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న సాకేత్‌ కాలనీ ఫోస్టర్‌ స్కూల్‌ సమీపంలో సోమవారం ఉదయం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వ‍వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement