మద్యం తాగించి.. కత్తితో బెదిరించి | Shocking incident at Narsingi Circle Neknampur Division | Sakshi
Sakshi News home page

మద్యం తాగించి.. కత్తితో బెదిరించి

Feb 20 2026 4:34 AM | Updated on Feb 20 2026 4:34 AM

Shocking incident at Narsingi Circle Neknampur Division

బాలికపై అత్యాచారం 

యువకుడు, ఇద్దరు బాలుర అఘాయిత్యం 

ఇద్దరు నిందితుల అరెస్టు, మరో బాలుడి పరారీ 

మణికొండ: షాపింగ్‌ చేద్దామంటూ మాయమాటలు చెప్పి.. ఆపై బలవంతంగా మద్యం తాగించి బాలికపై ఓ యువకుడు, ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి సర్కిల్‌ నెక్నాంపూర్‌ డివిజన్‌ పాషా కాలనీలో అమ్మమ్మ వద్ద ఓ బాలిక (16) నివసిస్తోంది. 

ఈ నెల 16న ఉదయం 8.30 గంటలకు పాఠశాలకు వెళ్తుతున్నానంటూ ఇంట్లోంచి వెళ్లింది. సా యంత్రం 4.30 గంటలవుతున్నా బాలిక ఇంటికి చేరుకోకపోవటంతో అమ్మమ్మతో పాటు ఆమె కూ తురు కాలనీలో తెలిసిన వారందరి వద్ద వెతికారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో నార్సింగి పో లీసులకు సోమవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు.  

దర్యాప్తు చేపట్టిన పోలీసులు..  
పోలీసులు మంగళవారం విచారణ చేపట్టారు. ఈ నెల 7న షాపింగ్‌ కోసం చార్మినార్‌కు వెళ్లిన బాలికకు తలాబ్‌కట్టాకు చెందిన బాలుడి (16)తో పరిచయమైనట్లు  తెలుసుకున్నారు. అప్పటినుంచి ఫోన్‌ మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 16న ఆ బాలుడు పిలవడంతో ఇంట్లోంచి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. బాలుడి ఫోన్‌ నంబర్‌ను ట్రేసింగ్‌లో పెట్టగా చెంగిచర్లలో ఉన్నట్టు లొకేషన్‌ తెలిసింది. 

బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లి బాలికను నిందితులు ఇమ్రాన్‌ (23) ఇద్దరు బాలుర (16)ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన మరో బాలుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను గురువారం కోర్టు ఎదుట హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. నిందితుడు ఇమ్రాన్‌పై పలు పోలీస్‌స్టేషన్‌లలో దోపిడీ, దొంగతనం, శారీరక నేరం వంటి కేసులతో పాటు రౌడీïÙట్‌ ఉందని వారు వివరించారు. 

అసలు ఏం జరిగింది? 
బాధితురాలు బాలికను తలాబ్‌కట్టకు చెందిన బాలుడు చార్మినార్‌కు పిలిపించుకున్నాడు. మదీనాతో పాటు చారి్మనార్‌ చుట్టు పక్కల రాత్రి వరకు ఇద్దరూ కలిసితిరిగారు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటోలో ఘట్‌కేసర్‌ మండలం చెంగిచర్లకు వెళ్లారు. అక్కడి డబుల్‌ బెడ్రూం గృహాల్లోకి బాలికను తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి, కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement