ఆరు దాటాకే పర్మీట్‌ రూమ్‌కు.. | permission to enter the permit room only after 6 pm: Komatireddy Rajagopal Reddy | Sakshi
Sakshi News home page

ఆరు దాటాకే పర్మీట్‌ రూమ్‌కు..

Feb 20 2026 4:23 AM | Updated on Feb 20 2026 4:23 AM

permission to enter the permit room only after 6 pm: Komatireddy Rajagopal Reddy

ఆంక్షలు ఉల్లంఘిస్తే సహించను 

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హెచ్చరిక

మునుగోడు: మద్యం దుకాణాల్లోని పర్మీట్‌ రూమ్‌లలో మద్యం ప్రియులను సాయంత్రం ఆరు గంటల తరువాతే అనుమతించాలని, మధ్యాహ్న సమయంలో అనుమతిస్తే తాను సహించబోనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన గురువారం మునుగోడులో మద్యం దుకాణాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో కొందరు మద్యం తాగడాన్ని చూసి ఆయన.. షాపుల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను పేద ప్రజల ఆరోగ్యం కోసం వారి ఆర్థిక అభివృద్ధి కోసం మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నానన్నారు. దానిని ప్రతి ఒక్కరు గమనించి ఆరోగ్యాలను కాపాడుకోవడంతో కుటుంబాలు అప్పులపాలు కాకుండా చూసుకోవాలన్నారు. ఏ పనీ చేయకుండా ఉదయం నుంచి మద్యం తాగడం సరికాదన్నారు. తన నిర్ణయం ప్రకారం రోజూ మధ్యాహ్నం ఒంటి గంట తరువాతే మద్యం దుకాణాలు తెరవాలని, సాయంత్రం ఆరు గంటల తరువాతే పర్మీట్‌ రూమ్‌ల్లో మద్యం తాగేందుకు అనుమతించాలని రాజగోపాల్‌రెడ్డి ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement