భవిష్యత్‌ అంతా ఏఐదే | Governor Jishnu Dev Verma at AIU Central Zone VCs Conference | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ అంతా ఏఐదే

Feb 20 2026 4:20 AM | Updated on Feb 20 2026 4:20 AM

Governor Jishnu Dev Verma at AIU Central Zone VCs Conference

ఏఐయూ సెంట్రల్‌ జోన్‌ వీసీల సదస్సులో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పైనే భవిష్యత్‌ ఆధారపడి ఉందని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. ఏఐ వేగం శాస్త్రీయ పురోగతి మాత్రమే కాదని, నేటి తరానికి దీని ఉపయోగం ఎంతో ఉందన్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) నేతృత్వంలో సెంట్రల్‌ జోన్‌ వైస్‌ చాన్స్‌లర్ల సదస్సు ఉస్మానియా యూనివ ర్సిటీ కేంద్రంగా గురువారం ప్రారంభమైంది. గవర్నర్‌ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న మార్పులను విశ్వవిద్యాలయాలు అందిపుచ్చు కోవాలని సూచించారు. 

ఏఐ వేగానికి భారతీయ నైతికత, విలువలు తోడవ్వాలని, అంతర్జాతీయ సాంకేతికత వేగంతో మన యవత పోటీ పడాలని, అవసరమైన నైపుణ్య విలు వలు పెంచేందుకు కృషి జరగాలన్నారు. ఈ దిశగా మేధో మథనం చేసేందుకు మేధావులు నడుం బిగించాలని పిలుపు నిచ్చారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌ తర్వాత సాంకేతిక విప్లవం శరవేగంగా జరిగిందని, ఇప్పుడిది ప్రతీ వ్యక్తికీ నిత్యకృత్యమైందని తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఏఐ, క్వాంటం మయంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 

ఇందుకు అవసరమైన రీతిలో ఉన్నత విద్య బోధన విధానా న్ని మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పా రు. ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరం మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు, విద్యావేత్తలు కేవలం జ్ఞానాన్ని అందించేందుకే పరిమితం కాకూడదని, ఇంటెలిజెన్స్‌ ఆర్కిటెక్ట్‌గా మారాలన్నారు. విద్యార్థులను భావి సాంకేతికతకు సిద్ధం చేయాలని అధ్యా పకులను కోరారు. ఉస్మానియాలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ను స్మార్ట్‌ సిటీలు, మేధో రవాణా వ్యవస్థలు, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం జాతీయ స్థాయి హబ్‌గా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపారు. 

రేపటి తరాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ఏఐ అధారిత పరిశోధనలు అవసరమని ఏఐయూ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ వినయ్‌కుమార్‌ పాఠక్‌ అన్నారు. ఏఐ సమర్థవంతంగా ఉప యోగించుకోవాలని, ఈ దిశగా సదస్సు దిశా నిర్దేశం చేస్తుందన్న ఆశాభావం ఏఐయూ సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ పంకజ్‌ మిత్తల్‌ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ న్యూస్‌ ప్రత్యేక సంచికను గవర్నర్‌ ఆవిష్కరించారు. కార్య క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గడ్డం నరేష్‌ రెడ్డి, వివిధ విభాగాల డీన్లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement