breaking news
death incident
-
Hyd: కామాటిపురాలో దారుణ హత్య
హైదరాబాద్: పాతబస్తీలోని కామాటిపురా పీఎస్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. నిన్న(మంగళవారం) రాత్రి అరవింద్ మోస్లీ(30) అనే వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా అడ్డగించి హత్య చేశార పలువురు గుర్తు తెలియని దుండగులు. మోస్లీ తప్పించుకునే ప్రయత్నం చేసిన వెంబడించి మరీ హత్యకు పాల్పడ్డారు. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య పని ముగించకుని సైకిల్‌పై వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. పాతగొడవలు, వివాహేతర సంబంధం హత్యకు కారణం అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు అరవింద్ ఘోస్లే , బియ్యం షాప్‌లో పని చేస్తున్నాడు.. కామాటిపురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్టరీకి తరలించారు..కాగా, నగరంలో వరుసగా రెండు హత్యలు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతకుముందు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర గురయ్యాడు.. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. మల్కాజ్‌గిరిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వవ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే, వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. -
బోల్ భం భక్తుల దుర్మరణం
భువనేశ్వర్: దీక్షయాత్రలో ఉన్న నలుగురు బోల్ భం భక్తులు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదాల్లో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మయూర్భంజ్ జిల్లా బంగిరిపొషి పోలీసు స్టేషన్ పరిధి దువార్‌సుణి గ్రామ ప్రాంతంలో బోల్ భం భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న భారీ వాహనాన్ని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. బలంగీరు జిల్లా గుప్తేశ్వర్ శైవ క్షేత్రానికి బోల్‌భం భక్తులు వెళ్తుండగా ఎదురుగా దూసుకువస్తున్న లారీని బోల్ భం భక్తుల వాహనం ఢీకొని దాదాపు 10 అడుగుల లోయలోకి పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్న ఇద్దరు భక్తులు ఘటనాస్థలంలో తుదిశ్వాస విడిచారు. దుర్మరణం పాలైన బోల్ భం భక్తులను రంజిత్ రామ్, సిబ్బు సాహులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8మంది భక్తులను బరిపద ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. దుర్ఘటన సంభవించిన ప్రాంతంలో స్థానికులు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఒక ప్రాంతం నదీ తీరం నుంచి జలం సేకరించి వేరే చోట శివాలయంలో జలాభిషేకం నిర్వహించేం దుకు బోల్ భం దీక్షకులు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ విషాద సంఘటన సంభవించింది. సంబల్పూర్ జిల్లాలో ఇద్దరి మృతి సంబల్పూర్ జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. బోల్‌భం భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. బోల్‌భం భక్తులు సంబల్పూర్ నుంచి భువనేశ్వర్ వస్తుండగా బస్సు బోల్తా కొట్టింది. గాయపడిన వారందరినీ స్థానిక సంబల్పూర్ ఆస్పత్రిలో భర్తీ చేసి చికిత్స ప్రారంభించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బుర్లా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. -
ఆనంద ఆక్వా వద్ద స్వల్ప ఉద్రిక్తత
మొగల్తూరు: మొగల్తూరులోని ఆనంద ఆక్వా పరిశ్రమలో పనులు చేపట్టారంటూ గ్రామస్తులు పరిశ్రమ వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు తమ పరిసరాలు శుభ్రం చేయించుకునేందుకు కూలీలను నియమించుకున్నారు. అయితే పరిశ్రమ సూపర్వైజర్లు విధుల్లో చేరారనుకుని సీపీఎం నాయకులు యడ్ల చిట్టిబాబుతో కలిసి కొందరు స్థానికులు ఇక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో డీఎస్పీ పూర్ణచంద్రరావు రావడంతో వీరిని వారించారు. తాము పరిసరాలను శుభ్రం చేయించుకుంటే మీకొచి్చన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో కంపెనీ వద్ద పరిసరాలు శుభ్రం చేయడానికి వీలులేదని గ్రామస్తులు అనడంతో డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ పరిశ్రమను సీజ్ చేయడంతో ఎవరికీ లోపలకు వెళ్లే అవకాశం లేదని, దీంతో ఆరుబయట విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది పరిసరాలు శుభ్రం చేయించుకుంటున్నట్టు డీఎస్పీ చెప్పడంతో గ్రామస్తులు వెనుదిరిగారు.


