సూర్యాపేట జిల్లా: నిత్యం రద్దీతో ఉండే పల్లె వెలుగు బస్సు లకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రయాణి కుల సంఖ్య తగ్గింది. పది రోజుల క్రితం వరకు కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదు. గ్రామా ల్లో ఎన్నికల ప్రచారంలో మహిళలు ముమ్మరంగా పాల్గొంటుండటంతో బస్సుల్లో ప్రయాణించేవారు బాగా తగ్గిపొయారు. ప్రచారానికి వెళ్లేవారికి రోజు కు రూ.500 వరకు ఇస్తుండడం కూడా ఓ కారణం. పంచాయతీ ఎన్నికల హడావుడి ప్రారంభం కాక ముందు సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోలో ఉన్న పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండేదని.. ప్రస్తుతం అది సగానికి పడిపోయిందని ఆర్టీసీ వర్గాలు అంటు న్నాయి. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్టీసీ అధికారులు రోజువారి ట్రిప్పుల సంఖ్యను కూడా కుదించారు.


