వరంగల్‌లో యాచకులతో వినూత్న ర్యాలీ
హన్మకొండ చౌరస్తా: ‘అవినీతి కన్నా.. అ డుక్కు తినడం మి న్న ’అంటూ జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ సంయుక్త ఆధ్వ ర్యంలో మంగళవారం వరంగల్‌లో యాచకుల తో కలిసి ర్యాలీ నిర్వ హించారు. వేయిస్తంభాల ఆలయం నుంచి హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. లోక్‌సత్తా ఉభయ తెలుగు రాష్టాల అధ్యక్షుడు బండారు రామ్మోహన్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ వీవీ రావు, లోక్‌సత్తా సంస్థ సభ్యు డు శ్రీనివాసరెడ్డి, ఎల్‌బీ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.


