బాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి
మానకొండూర్: ‘తాను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం వాగ్దానం చేసిన హామీలను నెరవేర్చకపోతే ప్రతీకులానికో చెప్పు నా మెడలో వేసుకొని బహిరంగంగా రాజీనామా చేసి వెళ్లిపోతా’అని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి గుమ్మడవెల్లి రాజేశ్వరి అభయం ఇచ్చారు. ఇందుకోసం రూ.వంద విలువైన బాండ్‌పేపర్‌పై హామీలను రాసిచ్చారు. డబ్బులు, మద్యం పంచకుండా తనలాగే మేనిఫెస్టో విడుదల చేసి కేవలం ఓట్లు అడగాలని తన ప్రత్యర్థులను వేడుకున్నారు.
ఆడబిడ్డ పుడితే రూ.10,016
వేములవాడ అర్బన్: గ్రామస్తులకు ఆడబిడ్డ పుడితే రూ.10,016 కట్నంగా అందిస్తానని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లి సర్పంచ్ అభ్యర్థి ఇటిక్యాల రాజు హామీ ఇస్తున్నాడు. తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు.
ఓటరులో చైతన్యం
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని జలాల్పూర్ గ్రామంలో పలువురు మహిళలు.. ‘మా ఓట్లను మద్యానికి, డబ్బులకు, బహుమతులకు అమ్ముకోము. నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకుంటాం’అని పలకలపై రాసి తమ ఇంటి గేటుకు పెట్టుకున్నారు.


