శంకరపట్నం: శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామంలో 6 ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మెట్‌పల్లి గ్రామానికి చెందిన సూరం ప్రతాప్, కొండపాక దేవయ్య, ఓదెల సత్యనారాయణ, గుర్రం శ్రీహరి, తిరుపతితో పాటు మరొకరు ఇంటికి తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. మంగళవారం అర్థరాత్రి వారి నివాసాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బుధవారం చుట్టుపక్కల వారు తలుపులు తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి, సీఐ వెంకట్, ఎస్సై శేఖర్‌రెడ్డి దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి వేలుముద్రలు సేకరించారు. నాలుగు ఇళ్లలో రూ.1.75 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు చోరీకి గురైందని బాధితులు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


