ఆకట్టుకుంటున్న కళా ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న కళా ప్రదర్శన

Mar 12 2026 7:16 AM | Updated on Mar 12 2026 7:16 AM

కరీంనగర్‌ కల్చరల్‌: నగరంలోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్‌ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తయారు చేసిన సిల్క్‌, చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జిల్లా ప్రజలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తులను అందించడంతో పాటు చేనేత కార్మికులకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో కళాసిల్క్‌ ప్రదర్శన ఏర్పాటు చేశామని నిర్వాహకుడు సంజయ్‌ జైన్‌ తెలిపారు. ఈ ప్రదర్శనలో తెలంగాణకు చెందిన గద్వాల్‌, నారాయణపేట, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడ ప్రాంతాల చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అసోం మూగా, ఎరి సిల్క్‌, బిహార్‌లోని బాగల్పూర్‌ సిల్క్‌, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ట్రైబల్‌ వర్క్స్‌, కోసా సిల్క్‌, గుజరాత్‌కు చెందిన బంధనీ, కచ్‌ ఎంబ్రాయిడరీ డ్రెస్‌ మెటీరియల్స్‌ వంటి అనేక రాష్ట్రాల చేనేత ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement