రామగుండం: కాగజ్‌నగర్–బోధన మధ్య నడిచే మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్లిపుల్ యూనిట్ (మెమూ) ప్యాసింజర్ రైలు ప్రయాణం అత్యంత చవకగా ఉంది. ప్లాట్‌ఫారమ్ టికెట్‌కు సమానమైన చార్జి రూ.10తోనే 45 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఇది పేదలకు ఎంతోసౌకర్యంగా ఉంది. సిర్‌పూర్‌టౌన్ – కరీంనగర్(67771/67772), కరీంనగర్–బోధన్(67773/67774) మధ్య ఇది నిత్యం రాకపోకలు సాగిస్తోంది.
రామగుండం కేంద్రంగా చార్జీలు ఇలా..
రామగుండం – సిర్‌పూర్‌టౌన్ మధ్య.. పెద్దంపేట, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిన్‌రోడ్డు వరకు 45 కి.మీ. దూరం ఉంది. ఈమధ్య ఎక్కడికి ప్రయాణం చేసినా టికెట్ చార్జీ రూ.పది మాత్రమే. ఆ తర్వాత ఆసిఫాబాద్‌రోడ్, కాగజ్‌నగర్ వరకు రూ.20, సిర్‌పూర్‌టౌన్ వరకు రూ.25 ఉంది. రామగుండం – సిర్‌పూర్‌టౌన్ మధ్య దూరం 91కి.మీ. ఉంటుంది. రామగుండం – బోధన్‌కు మధ్య రాఘవపురం, పెద్దపల్లి, సుల్తానాబాద్ వరకు రూ.10, కరీంనగర్‌కు రూ.15, గంగాధరకు రూ.20, జగిత్యాలకు రూ.25, కోరుట్ల, మెట్‌పల్లి వరకు రూ.30, ఆర్మూర్‌కు రూ.40, నిజామాబాద్, బోధన్ వరకు రూ.45 చార్జి ఉంది. రామగుండం – బోధన్ మధ్య దూరం 195 కి.మీ. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తే అధిక సమయం తీసుకోవడంతోపాటు చార్జీలు అత్యధికమే. సుమారు రూ.500 వరకు ఉంటుంది.
మెమూ రైలులో ప్రయాణం అత్యంత చవక
నిరుపేద ప్రయాణికులకు ఎంతోఊరట
సిర్‌పూర్‌టౌన్ – బోధన్ మధ్య రాకపోకలు


