కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం
ఆదిలాబాద్‌టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ అన్నారు. మెదక్‌లో మంగళవారం నిర్వహించిన సీఐటీయూ ఐదో రాష్ట్ర మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు పొంద డం లేదని పేర్కొన్నారు. వారిని వెంటనే ఆదుకో వాలన్నారు. అలాగే స్కీమ్, కాంట్రాక్ట్ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సునీత, మల్లేశ్, అగ్గిమల్ల స్వామి, నవీన్‌కుమార్, వెంకటమ్మ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.


