అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్: ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో తొలివిడత పోలింగ్ ఏర్పాట్లను మంగళవా రం పరిశీలించారు. తాడిహత్నూర్ జెడ్పీఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. నార్నూర్, గాదిగూడలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నార్నూర్ ఎంపీపీఎస్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే గాదిగూడ కేజీబీవీ వసతి గృహం తనిఖీ చేశారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎంపీడీవోలు పుల్లారావు, శ్రీనివాస్, తహసీల్దార్ రాజలింగు తదితరులున్నారు.


