‘ప్రథమ’ అదృష్టం దక్కేదెవరికో?
కై లాస్‌నగర్: జిల్లాలో ఇటీవల కొత్తగా ఐదు గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వాటికి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే ఒక టి ఏకగ్రీవమైంది. మిగతా నాలుగింటిలో సర్పంచ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. తమకు మద్దతివ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఇందులో అదృష్టం ఎవరిని వరించనున్నదనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆ ఐదు పంచాయతీలు ఇవే..
ప్రజల విజ్ఞప్తులతో పాటు పాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లాలో ఐదు పంచాయతీలను ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసింది. ఇందులో ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మగూడ, ఉట్నూర్ మండలంలోని వడ్‌గల్పూర్, బజార్‌హత్నూర్ మండలంలోని ఏసాపూర్, తాంసి మండలంలోని అట్నంగూడ, తలమడుగు మండలంలోని పునాగూడ పంచాయతీలు ఉన్నాయి. వీటికి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఎల్లమ్మగూడ, వడ్‌గల్పూర్–కే జీపీలకు తొలి విడతలో ఈ నెల 11న, అలాగే పునాగూడ, ఏసాపూర్ పంచాయతీలకు ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు.
అట్నంగూడ ఏకగ్రీవం..
తాంసి మండలంలోని లిమ్‌గూడ పంచాయతీ పరి ధిలో అనుబంధ గ్రామంగా ఉన్న అట్నంగూడను ప్రభుత్వం ఇటీవల జీపీగా ఏర్పాటు చేసింది. ఇక్కడి సర్పంచ్ పదవీని ఎస్టీ జనరల్‌గా రిజర్వ్ చేసింది. రెండో విడతలో భాగంగా ఈ నెల 14న ఈ పంచాయతీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ గ్రామస్తులు ఐక్యతను చాటారు. గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ తొలి సర్పంచ్‌గా సంజీవ్ అనే యువకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి.


