ప్రలోభాలు ఘరూ | - | Sakshi
Sakshi News home page

ప్రలోభాలు ఘరూ

Dec 10 2025 8:00 AM | Updated on Dec 10 2025 8:00 AM

ప్రలోభాలు ఘరూ

ప్రలోభాలు ఘరూ

● ముగిసిన తొలివిడత ప్రచారం ● జోరుగా మద్యం, డబ్బు పంపిణీ ● పోల్‌ మేనేజ్‌మెంట్‌పై అభ్యర్థుల దృష్టి

ముగిసిన మూడోవిడత ఉపసంహరణ..

సాక్షి,ఆదిలాబాద్‌: ఇన్నిరోజులు ఒక లెక్క.. ఇప్పు డు ఒక లెక్క.. ప్రచారంలో హోరెత్తించిన అభ్యర్థులు ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచా రం మంగళవారంతో ముగిసింది. సాయంత్రం నుంచి వీధులు మూగబోయాయి. ఇక ఓటరును నేరుగా ప్రసన్నం చేసుకోవడమే మిగిలింది. ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. గురువారం పోలింగ్‌ జరగనుంది.

మొదటి విడత

పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల స్వీకరణ నవంబర్‌ 27 నుంచి మొదలైంది. 29 వరకు ఆ ఘట్టం ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ త ర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు. గుర్తులు కేటాయించారు. డిసెంబర్‌ 4 నుంచి మొ దలైన ప్రచారం మంగళవారంతో పూర్తయింది. ఇంటింటి ప్రచారం చేపట్టిన అభ్యర్థులు తమను ఆదరించాలని ఓటర్లను వేడుకున్నారు.

ఇక నేరుగా ప్రసన్నం..

ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు ప్రచా రానికి ముగింపు పలికారు. ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు ఇవ్వాలని, తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. వారి ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లే పారు. డబ్బులు పంపిణీ మొదలైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల రూ.300 నుంచి రూ.500 వరకు, మరికొన్నిచోట్ల రూ.500నుంచి రూ.వెయ్యి వరకు పంచుతున్నారు. మరోవైపు మద్యం పంపకాలు, విందులు జోరందుకున్నాయి. బుధవారం ఒక్కరోజే సమయం ఉండటం, తెల్లవారితే పోలింగ్‌ ఉండనుండడంతో అభ్యర్థులు, వారి అనుచరులు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గెలు పే దిశగా పావులు కదుపుతున్నారు.

మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న జరగనుండగా, రెండో విడత 14న, మూడోవిడత 17న జరగనున్నాయి. చివరి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ని లిచే అభ్యర్థుల ప్రకటన మంగళవారం పూర్తయింది. మొదటి విడతలో ప్రచారం పూర్తి కాగా, రెండో విడత, మూడో విడతలకు సంబంధించి ప్రచారం ఊపందుకోనుంది.

30 పంచాయతీలు ఏకగ్రీవం

కైలాస్‌నగర్‌: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. జిల్లాలోని 151 పంచాయతీలు 1,220 వార్డులకు ఈ విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా 30 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లుగా అధికారులు తెలిపారు. ఇందులో బజర్‌హత్నూర్‌లో 5, బోథ్‌లో 3, నేరడిగొండలో 9, తలమడుగులో 7, గుడిహత్నూర్‌లో 6 సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement