పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.. ఎన్నికల నియమావళిని ప్రతిఒక్కరూ పాటించా లి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు.. గొడవలకు దారి తీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొ ద్దు.. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హె చ్చరించారు. మంగళవారం ‘సాక్షి’కిచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: తొలివిడత ఎన్నికలకు ఎలాంటి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.?
ఎస్పీ: మొదటి విడత ఎన్నికలు ఆరు మండలాల్లో ఈ నెల 11న జరగనున్నాయి. 920 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశాం. ఒక్కో మండలాన్ని డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు పర్యవేక్షిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం.
సాక్షి: పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి నిబంధనలు పాటించాలి..?
ఎస్పీ: పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్ సెక్ష న్ అమలులో ఉంటుంది. 200 మీటర్ల వరకు ప్రత్యేక నిబంధనలు పాటించాలి. ఓటర్లు క్యూ లో ఉండి ఓటు హక్కు వినియోగించుకోవాలి.
సాక్షి: ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?
ఎస్పీ: తొలివిడతలో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైంది. ఎవరూ ప్రచారం చేయొద్దు. బయట వ్యక్తులు గ్రామాల్లో ఉండకూడదు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేసినా, గొడవలకు దారితీస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
సాక్షి: సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి భద్రత చర్యలు చేపడుతున్నారు..?
ఎస్పీ: సమస్యాత్మక కేంద్రాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నాం.
సాక్షి: సోషల్ మీడియాపై ఎలా నిఘా సారిస్తున్నారు?
ఎస్పీ: సోషల్ మీడియాలో ఇతరులను రెచ్చగొట్టేలా,కించపర్చేలా పోస్టులు పెట్టవద్దు. ఎవరైనా అతిక్రమిస్తే గ్రూప్ అడ్మిన్లతో పాటు మెంబర్లపై సైతం కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక బృందంద్వారా సోషల్ మీడియాపై నిఘా పెట్టాం.
సాక్షి: విజయోత్సవ ర్యాలీ చేపట్టవచ్చా..?
ఎస్పీ: ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీకి అనుమతి లేదు. సంబంధిత అధికా రుల అనుమతితో నిర్ధారించిన రోజున జరుపుకోవచ్చు. టపాసులు కూడా పేల్చ రాదు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి.
పటిష్ట బందోబస్తు


