
ప్రమాదవశాత్తు కుంటలో పడిన చిన్నారులు
ఆదిలాబాద్ జిల్లా మావల శివారులో ఘటన
ఆదిలాబాద్ రూరల్: ‘తాతా.. రైతుభరోసా డబ్బులు పడ్డా యా.. మాకు సైకిళ్లు కొనివ్వవా’.. అని ఆ చిన్నారులు అడగ్గానే తాత కాదనలేకపోయాడు. వారి కోరిక మేరకు శుక్ర వారం ఇద్దరికీ చెరో సైకిల్ కొనిచ్చాడు. అయితే మరుసటిరోజే అక్కాతమ్ముడు మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేసింది. మావల ఎస్సై ముజాహిద్ కథనం ప్రకారం..
మండల కేంద్రానికి చెందిన లంక స్వామి–గీత దంపతుల కు కుమారుడు విదాత్ (10), కుమార్తె వినూత్న (11) ఉన్నారు. వీరు ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ, 6వ తరగతి చదువుతున్నారు. రైతు భరోసా డబ్బులు రావడంతో స్వా మి తండ్రి రాజేశ్వర్ శుక్రవారం మనుమడు, మను మరాలి కి కొత్త సైకిళ్లను కొనిచ్చాడు. ఆ ఆనందంలో చిన్నారులిద్దరూ శనివారం పాఠశాలకు వెళ్లలేదు.
కుటుంబ సభ్యులంతా ఉదయం 10 గంటల ప్రాంతంలో పొలం పనులకు వెళ్లారు. అరగంట తర్వాత ఇద్దరు చిన్నారులు కూడా చెరో సైకిల్‌పై పొలానికి బయలుదేరారు. మార్గమధ్యలో బంజారాహిల్స్ ప్రాంతంలో రోడ్డుకు ఆనుకుని ఉ న్న నీటి కుంటలో ప్రమాదవశాత్తు వినూత్న సైకిల్‌తో సహా పడింది. ఆమెను రక్షించే క్రమంలో తమ్ముడు విదాత్ కూడా అందులో పడి ఊపిరాడక మృతి చెందారు. మధ్యా హ్నం అయినా పిల్లలు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, నీటికుంట సమీపంలో సైకిల్ కనిపించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.