రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది
ఆదివాసీ సంస్కృతి అద్దం పట్టేలా మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలు నిర్వహించారు
ఉదయం కేస్లాపూర్‌లోని మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజ సామగ్రితో బయలుదేరారు. డోలు, తుడం, కాలీకోమ్, పెప్రే వాయిస్తూ పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు
ముందుగా మైసమ్మ దేవతకు పూజలు చేసి ఆలయంలోనికి ప్రవేశించారు. నాగోబా దర్శనం అనంతరం సంప్రదాయ పూజలు షురూ చేశారు


