
ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమ అమలు తీరును ఓ విద్యార్థిని వినూత్నంగా వివరిస్తూ ఆకట్టుకుంది. కార్యక్రమ అమలు తీరుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆయా పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, స్టూడెంట్ చాంపియన్లు కార్యక్రమ ప్రయోజనాలను వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని సాయి సృజన.. ఆరు రోజుల పాటు అమలు చేస్తున్న కార్యక్రమాలను తనదైన శైలిలో వివరించింది. కలెక్టర్‌తో.. సోది చెబుతానమ్మా.. అంటూ వివరించి ఆకట్టుకుంది