ఖమ్మం జిల్లా: మండలంలోని తెట్టెలపాడు సర్పంచ్‌గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలిచారు. ఆమె చెల్లె (పిన్ని కుమార్తె), కర్ణాటక రాష్ట్రంలోని గుల్బ ర్గా కలెక్టర్ హెప్సిబారాణి బుధవారం నర్సమ్మను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. తొలుత నర్సమ్మ విజయంపై గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయకులు బిల్లగిరి ధనుంజయ్, గుంటి పుల్లయ్య, చిర్రా కృష్ణయ్య, రెడ్డిమల్ల నరేందర్, కొమ్ము శ్రీను, రెడ్డిమల్ల నరేందర్, పగిడిపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.


