వాతావరణ ం
గరిష్టం / కనిష్టం
310 / 110
జిల్లాలో గురువారం మంచు, చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి.
కలెక్టర్ పరిశీలన
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణను కలెక్టరేట్‌లోని మానిటరింగ్ సెల్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. పోలింగ్ బూత్‌ల్లో ఓటింగ్ సరళిని పరిశీలించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాస్, ఈడీఎం దుర్గాప్రసాద్, డీపీఓ ఆశాలతతో పాటు రాంబాబు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన భద్రత
ఖమ్మంక్రైం: జిల్లాలో మూడో విడత గ్రామపంచాయితీ ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పెనుబల్లి మండలం చింతగూడెం, ఏరుగట్ల, లంకపల్లి, కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి తదితర పోలింగ్ కేంద్రాలను పోలీసు కమిషనర్ సునీల్‌దత్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ముగిసే వరకు పహారా కొనసాగించాలని ఉద్యోగులకు సూచించారు. సీపీ కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఉండగా, ఏన్కూరు, కల్లూరు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను అడిషనల్ డీసీపీలు రామానుజం, ప్రసాద్‌రావు పరిశీలించారు.
వార్డు సభ్యుడిగా
తల్లిపై తనయుడి విజయం
ఇల్లెందురూరల్: ఇల్లెందు మండలంలోని సీఎస్పీ బస్తీ గ్రామపంచాయతీ ఆరో వార్డులో కాంగ్రెస్ మద్దతుతో తల్లి భూక్యా సక్కుబాయి, బీఆర్‌ఎస్ మద్దతుతో కుమారుడు భూక్యా రవికుమార్ పోటీ పడ్డారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రవికుమార్ తన తల్లిపై 9ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఇక పోలారం జీపీ రెండో వార్డులో కాంగ్రెస్ బలపర్చిన బానోత్ రమాదేవి ఒకే ఓటు తేడాతో విజయం సాధించింది.
వాతావరణ ం
వాతావరణ ం


