బారులుదీరిన ఓటర్లు
ఏడు మండలాల్లో
88.84 శాతం పోలింగ్
అత్యధికంగా
కల్లూరు మండలంలో 90.72 శాతం
స్వల్ప ఘటనలు మినహా
ప్రశాంతంగా ఓటింగ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 88.84 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, వేంసూరు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలు, నామినేషన్లు దాఖలు కానివి మినహా 168గ్రామపంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు. కల్లూరు మండలం చెన్నూరు, పెనుబల్లి మండలం సూరయ్య బంజర తండాలో స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలుకాగా, పోలింగ్‌బూత్‌ల వద్ద ఓటర్లు బారులు దీరారు. వృద్ధులు, మహిళలు, యువత అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, మొదటి విడత ఎన్నికల్లో 90.08శాతం, రెండో విడతకు వచ్చే సరికి మరింత పెరిగి 91.21 శాతం పోలింగ్ నమోదైంది. కానీ మూడో విడతలో మొదటి విడత కంటే తగ్గడం గమనార్హం.
ఉదయం నుంచే..
జిల్లాలోని ఏడు మండలాల్లో మూడో విడతగా ఎన్నికలు జరగ్గా.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కట్టారు. వృద్ధులు, మహిళలు, యువత ఉత్సాహంతో పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులను వీల్‌చైర్లతోపాటు ఎత్తుకుని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చారు. పలుచోట్ల ఎన్నారైలు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా వచ్చి ఓట్లు వేశారు. ఏన్కూరు మండలం కొనాయిపాలెంలో ఒకే వార్డుకు ఎన్నికలు జరగగా, ఓటర్ల కోసం సిబ్బంది ఎదురు చూడాల్సి వచ్చింది. కాగా, మొత్తం ఓటర్లు 2,43,983 మందికి గాను పురుషులు 1,05,668 మంది, మహిళలు 1,11,095 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. వీరిలో మొత్తంగా 2,16,765 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ నుంచి ఓటింగ్ సరళిని పర్యవక్షించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తల్లాడ మండలం పినపాక గ్రామంలో జెడ్పీహెచ్‌ఎస్‌లోనూ పోలింగ్‌ను పరిశీలించారు.
పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు
పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కల్లూరు మండలం చెన్నూరులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్ కేంద్రానికి సమీపాన ఇంటర్‌నెట్ సెంటర్‌లో రూ.70 వేల నగదు దొరకడంతో వాటిని నెట్‌సెంటర్ యజమానివి చెప్పారు. కానీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల నగదు అని చెబుతూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక పెనుబల్లి మండలం సూరయ్య బంజరతండాలో ఇద్దరు ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరుపక్షాల వారు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ఘర్షణకు దిగడంతో పోలీసులు చెదరగొట్టారు.
బందోబస్తు
ఎన్నికలు జరిగిన గ్రామపంచాయతీల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 318 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతోపాటు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్దే కాక గ్రామాల్లోనూ పహారా నిర్వహించారు. ఇక 63 కేంద్రాల వద్ద అదనంగా సిబ్బందిని నియమించారు. చేశారు. పెనుబల్లి మండలం చింతగూడెం, ఏరుగట్ల, లంకపల్లి, కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిల్లోని పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తనిఖీ చేశారు.
మొదటిసారి ఓటు వేసిన యువతి
బారులుదీరిన ఓటర్లు
బారులుదీరిన ఓటర్లు
బారులుదీరిన ఓటర్లు
బారులుదీరిన ఓటర్లు
బారులుదీరిన ఓటర్లు
బారులుదీరిన ఓటర్లు
బారులుదీరిన ఓటర్లు


