breaking news
Khammam District News
-
అక్రమ కేసులు పెడితే సహించం..
సత్తుపల్లి/ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ కార్యకర్తల జోలికి వచ్చినా, అక్రమ కేసులు బనాయించినా సహించేది లేదని మాజీ ఎంపీ సీతారాం నాయక్ హెచ్చరించారు. ఇటీవల సత్తుపల్లిలో తమ కార్యక్రమాలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. సత్తుపల్లిలో బీసీ బంద్ సందర్భంగా జరిగిన ఘర్షణపై బీజేపీ ఆధ్వర్యాన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటుచేయగా, బీజేపీ ఓబీసీ, ఎస్సీ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు గంగామల్ల ఆనందగౌడ్, అత్తునూరి క్రాంతికిరణ్‌తో కలిసి సీతారాంనాయక్ బుధవారం సత్తుపల్లి పర్యటించారు. అనంతరం సత్తుపల్లి, ఖమ్మంలో ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పోలీసులు బీజేపీ నాయకులపైనే అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు, గిరిజన నాయకుడు బానోతు విజయ్‌పై దాడి పోలీసులకు కనబడలేదా అని ప్రశ్నించారు. బీసీలపై ఎస్సీలతో కేసు పెట్టించడంపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ చెప్పినట్లు బీసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇవ్వాలంటే మంత్రివర్గంలోని ఓసీలను తొలగించి బీసీ నియమించాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ తీరుతో బీసీలకు రిజర్వేషన్లు రావని తెలిపారు. బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఈ.వీ.రమేష్, నాయుడు రాఘవరావు, సాలి శివ, సురేందర్‌రెడ్డి, రహ్మతుల్లా, బాలకృష్ణారెడ్డి, మట్టా ప్రసాద్, గెంటెల విద్యాసాగర్, రామలింగేశ్వరరావు, నున్నా రవి, నాయుడు రాఘవరావు, గుతా్త్ వెంకటేశ్వర్లు, రవిరాథోడ్, వీరవెల్లి రాజేష్‌గుప్తా, ఎన్.బెనర్జీ, మందడపు సుబ్బారావు, జ్వాల నరసింహారావు పాల్గొన్నారు. మాజీ ఎంపీ సీతారాంనాయక్ -
పక్కా ప్రణాళికతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ
ఖమ్మం అర్బన్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు బాధ్యతగా రోడ్ల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మంలో పది రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణగా రోడ్ల గుంతలు పూడ్చివేయించామని తెలిపారు. కల్లూరు, వైరా, సతుపల్లి, మధిర, ఏదులాపురం మున్సిపాలిటీల పరిధిలోనూ ఇలాగే చేయాలని చెప్పారు. అంతేకాక ఖమ్మం బైపాస్ రహదారిపైనా మరమ్మతులు చేసి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. అలాగే, జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్ల వద్ద త్య్రేక చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలీసు కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ రహదారులు కలిసే చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, పార్కింగ్ లేకుండా నూతన పాఠశాలలకు అనుమతి ఇవ్వొద్దని సూచించారు. డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకూబ్, డీఎంహెచ్ఓ కళావతిబాయి, ఆర్టీఓ వెంకటరమణ, నేషనల్ హైవే పీడీలు రామాంజనేయరెడ్డి, దివ్య పాల్గొన్నారు. పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఖమ్మం సహకారనగర్: మధిర నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆమె విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్‌తో కలిసి వీసీ ద్వారా సమీక్షించగా ఖమ్మం నుంచి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ మధిర నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు మొదలుపెట్టాలని, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు సిద్ధం చేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ పాఠశాలల్లో టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు, ల్యాబ్‌ల ఏర్పాటుకు నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, మధిర మండలం మహదేవపురం, చింతకాని మండలం నాగులవంచ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నందున పాఠశాల అభివృద్ధి నిర్వహణ కమిటీ పేరిట ఖాతాలు తెరవాలని తెలిపారు. బనిగండ్లపాడులో అభివృద్ధి పనులకు ఈనెల 25న డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్‌దత్ -
రూ.లక్ష విలువైన గంజాయి స్వాధీనం
ఖమ్మంరూరల్: మండలంలోని కస్నాతండా వద్ద ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.లక్ష విలువైన గంజా యిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నా రు. సీఐ ముష్కరాజు తెలిపిన వివరాలు.. ఖమ్మం రూరల్ మండలం కస్నాతండాకు చెందిన వాంకుడోత్ వినోద్, రంగారెడ్డి జిల్లా కొత్తపేటకు చెందిన వస్కుల రాజు, హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన గొడ్డెమల్ల సాయిరామ్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంకు చెందిన భూక్యా రోహిత్ ఖమ్మం – మహబూబాబాద్ హైవే పక్కన కస్నాతండా సమీపాన మద్యం తాగుతున్నారు. పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు అటువైపు వెళ్లగా రోహిత్ పారిపోయాడు. మిగిలిన ముగ్గురిని తనిఖీ చేయగా రూ.లక్షల విలువైన రెండు కేజీల గంజాయి లభించగా, ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈమేరకు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజు తెలిపారు. లీజ్‌కు ఇచ్చిన కారు తాకట్టు చింతకాని: దళితబంధు లబ్ధిదారుడు తన కారును లీ జ్‌కు ఇస్తే ఎదుటి వ్యక్తి తాకట్టు పెట్టడంతో కేసు నమోదైంది. చింతకాని మండలం తిరుమలాపురానికి చెంది న చాపలమడుగువీరబాబుకు దళితబంధు కింద కారు వచ్చింది. ఈ కారును లచ్చగూడెం వాసి తాటికొండ డిసిల్వాకు లీజ్‌కు ఇచ్చాడు. ఆయన ఖమ్మంలో వ్యక్తి వద్ద తాకట్టుపెట్టి రూ.లక్షన్నర తీసుకోగా, అదేకారును ఏపీలోని నూజివీడు వాసికి తాకట్టు పెట్టాడు. ఈ విష యం తెలిసి వీరబాబు వెళ్లి అడగగా రూ.లక్షన్నర ఇస్తే కారు ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన వీరబాబు చేసిన ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్షఖమ్మం లీగల్: ఓ మహిళ తీసుకున్న అప్పు చెల్లించేందుకు జారీచేసిన చెక్కు చెల్లకపోవడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు జడ్జి ఏపూరి బిందుప్రియ బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం సంభానీనగర్‌కు చెందిన మేకల రాంబాబు వద్ద మామిడిపద్మ 2020నవంబర్‌లో రూ.5లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2023 జూన్‌లో చెక్కు ఇచ్చి నామె ఖాతాలో నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో రాంబాబు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసుదాఖలు చేశాడు. విచారణ అనంతరం పద్మకు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.5లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. -
రైతు వేదికలు
● మూడేళ్లుగా అందని నిర్వహణ నిధులు ● ఒక్కో క్లస్టర్‌కు రూ.3.33 లక్షల బకాయి ● భారం భరించలేక ఏఈఓల ఇక్కట్లుభారంగా మారిన నేలకొండపల్లి/కామేపల్లి: రైతులకు సాగులో మెళుకువలు, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించడమే కాక శాస్త్రవేత్తల ద్వారా సలహాలు ఇప్పించాలనే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదికల ద్వారా ఆ స్థాయిలో సేవలు అందడం లేదు. నిర్వహణ నిమిత్తం గత మూడేళ్లగా ప్రభుత్వం పైసా విదల్చకపోవటంతో వ్యవసాయ విస్తీరణాధికారులు (ఏఈఓ) సొంత నగదుతో నెట్టుకొస్తున్నారు. దీంతో రైతు వేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఒక్కో క్లస్టర్‌కు దాదాపు రూ.3.33 లక్షల వరకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. పనిభారంతో సతమతం అవుతున్న తాము ఇకపై నగదు వెచ్చించే స్థితిలో లేమని ఏఈఓలు వాపోతున్నారు. 2020లో నిర్మాణం గత ప్రభుత్వం 2020లో ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌కు ఓ రైతు వేదికను నిర్మించింది. జిల్లాలో 129 రైతు వేదికలు నిర్మించగా నిర్వహణ కోసం నెలకు రూ.3 వేల చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. ఆ నిధులు చాలవని వ్యవసాయ శాఖ నివేదించడంతో రూ.9 వేల చొప్పున నిధులు విడుదల చేస్తామని 2020 ఏప్రిల్‌లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 2022 నవంబర్‌లో ఐదు నెలలకు సంబంధించి రూ.45 వేల చొప్పున విడుదలయ్యాయి. ఇక అప్పటి నుంచి అంటే 37 నెలలకు సంబంధించి ఒక్కో రైతువేదికకు దాదాపు రూ.3.33 లక్షల నిధులు బకాయి ఉన్నాయి. వసతులు కరువు అట్టహాసంగా నిర్మించిన రైతు వేదికల్లో కనీస వసతులు కానరావడం లేదు. ఏఈఓలు పంటలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేలా కంప్యూటర్లు ఉన్నా విద్యుత్ బిల్లులు, మరమ్మతులకు నిధులు రావడం లేదు. ఉన్నతాధికారులకు పంపించాల్సిన నివేదికలు ప్రింట్ తీయడానికి ప్రింటర్లు కూడా లేవు. స్టేషనరీ, తాగునీటి ఖర్చులన్నీ ఏఈఓలే భరించాల్సి రావడం, సహాయకులు కూడా లేక అన్ని పనులు చేయాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, శుభ్రం చేయించే బాధ్యత జీపీలు నిర్వహించాని సూచించినా వారూ పట్టించుకోవడం లేదు. అంతేకాక చాలా చోట్ల నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దీంతో మహిళా ఉద్యోగులు, రైతులు మరింత అవస్త పడుతున్నారు. అలాగే, 2019లో ఏఈఓలకు ఇచ్చిన ట్యాబ్‌లు సైతం సరిగా పనిచేయక నివేదికలు అప్లోడ్ చేసే సమయాన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.రైతు వేదికలకు నిర్వహణ నిధులు రావాల్సి ఉంది. చాలా చోట్ల సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయి. నిధుల బకాయిలతో పాటు నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. – డి.పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కారేపల్లి/ఖమ్మం వ్యవసాయం/తల్లాడ: కారేపల్లిలోని శ్రీలక్ష్మీప్రియ కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో ఇల్లెందు మార్కెట్ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్‌నాయక్, కోరం కనకయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తోందని తెలిపారు. ఈమేరకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇల్లెందు మార్కెట్ చైర్మన్, కార్యదర్శులు బి.రాంబాబు, నరేష్, వైరా ఏడీఏ కరుణశ్రీ, కాంగ్రెస్ నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, ధరావత్ భద్రునాయక్, షేరు, యాకూబ్ అలీ, సఫావట్ నాగులు, అడప పుల్లారావు పాల్గొన్నారు. అలాగే, తల్లాడలోని స్టేపు ల్ రిచ్ జిన్నింగ్ మిల్లు, ఖమ్మం మార్కెట్ పరిధి గుర్రాలపాడులోని జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ లక్ష్మీభాయి ప్రారంభించారు. పత్తిలో 8 నుంచి 12శాతం మేర తేమ ఉండేలా తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని ఆమె తెలిపారు. వరంగల్ రీజినల్ జేడీ శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీమ్, మార్కెట్ చైర్మన్లు, వైస్చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, బోళ్ల రంగారావు, కాపా సుధాకర్, మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్, సీసీఐ సీపీఓ పవన్‌కల్యాణ్, ఏఓలు ఎండీ.తాజుద్దీన్, వెంకటేశ్వర్లు, నాయకులు మట్టా దయానంద్, నారాయణవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పనులు కాకపోతే వేతనాల్లో కోత
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఆమె అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలోని 44 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేసి ఎంబీ రికార్డులు సమర్పిస్తే బిల్లులు విడుదలవుతాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని, లేనిపక్షంలో పాఠశాల సిబ్బంది, ఇంజనీరింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. అలాగే, పాఠశాలకు నీటి సరఫరా లేకపోతే భగీరథ పైప్‌లైన్ నుంచి కనెక్షన్ ఇప్పించాలని తెలిపారు. విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఎంపీడీఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఏఈలు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు తాకిందని దంపతుల ఘర్షణ ఖమ్మంఅర్బన్: ఖమ్మం–వైరా ప్రధాన రహదారి గోపాలపురం వంతెన సమీపాన ఆర్టీసీ బస్సు తమపైకి దూసుకొచ్చిందంటూ బైక్‌పై వెళ్తున్న దంపతులు డ్రైవర్, కండక్టర్‌తో ఘర్షణకు దిగారు. బుధవారం మణుగూరు నుంచి ఖమ్మం వస్తున్న ఖమ్మం డిపో బస్సు గోపాలపురం వంతెన వద్ద తమ ద్విచక్ర వాహనాన్ని తాకిందంటూ దంపతులు బస్సును ఆపారు. ఆపై డ్రైవర్ మధు, కండక్టర్ ఆదిలక్ష్మితో వాగ్వాదానికి దిగి దాడికి యత్నించగా, బస్సులో ప్రయాణికులు సైతం బైక్‌పై వెళ్తున్న వారిదే తప్పని చెప్పారు. అయినా వినకపోగా బస్సును ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా దంపతులు ఆవేశంగా మాట్లాడం, ప్రయాణికులంతా వారినే తప్పుపట్టడంతో సీఐ భానుప్రకాశ్ వారికి సర్దిచెప్పి ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఘటనలో బస్సు గంటకు పైగా నిలిచిపోగా అందులోని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. వివాహిత ఆత్మహత్య కేసులో రౌడీషీటర్ అరెస్ట్ రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెం గ్రామానికి చెందిన వివాహిత బోడా సుశీల ఆత్మహత్యకు కారణమైన రౌడీషీటర్, అదే గ్రామానికి చెందిన వినయ్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ మేరకు నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించినట్టు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సుశీలను వేధించడమే కాక లైంగిక దాడికి యత్నించి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆమె కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. అసంక్రమిత వ్యాధుల కట్టడిపై దృష్టిమధిర/బోనకల్/ఎర్రుపాలెం/చింతకాని: అసంక్రమిత వ్యాధుల వ్యాప్తిని అరికట్టేలా వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా క్షయ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వరికుటి సుబ్బారావు సూచించారు. మధిర మండం దెందుకూరు, బోనకల్, ఎర్రుపాలెం మండలం బనగండ్లపాడు పీహెచ్‌సీలను బుధవారం తనిఖీ చేసిన ఆయన టీబీ తదితర వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు చికిత్సపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆతర్వాత ఉద్యోగుల హాజరు, ఓపీ రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందూనాయక్ కూడా పాల్గొనగా వ్యాక్సిన్ల నిల్వలు, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయాల్సిన ఆవశ్యకతపై సూచనలు చేశారు. అలాగే, చింతకాని పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. వైద్యాధికారులు స్రవంతి, వి.కావ్య, ప్రశాంత్, అశ్విని, అల్తాఫ్తో పాటు ఉద్యోగులు దానయ్య, సందీప్, కాంతమ్మ, వెంకటేశ్వరావు, అమృత్, వీరేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలను సాధిద్దాం..
ఖమ్మం సహకారనగర్: ప్రతీ విద్యార్థికి ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్ సామర్థ్యాలు పెంచేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్‌లో ఇబ్బంది పడకుండా ఆంగ్లంపై పట్టు సాధించేలా వచ్చే సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలయ్యే ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ముప్ఫై రోజుల పాటు ప్రతీరోజు విద్యార్థి గంట సేపు చదివి సామర్థ్యాలు పెంచుకునేలా బుక్లెట్ తయారు చేశామన్నారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నందున కాస్త దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ చింతకాని మండలంలోని కొన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసిన ఈ కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. మిగతా చోట్ల ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
శిశువులకు శ్రీరామరక్ష
● 108 నియోనాటల్ ద్వారా అత్యవసర వైద్యం ● నవజాత శిశువు మరణాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు ● ఉమ్మడి జిల్లాలో 1,971 మందికి సేవలు ఖమ్మంవైద్యవిభాగం: అప్పుడే పుట్టిన శిశువు మొదలు 30రోజుల లోపు వయస్సు వారిని నవజాత శిశువులుగా పరిగణిస్తారు. ఈ వయస్సు శిశువుల సంరక్షణపై అవగాహన లేక కొన్ని, సరైన పోషణ అందక ఇంకొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈక్రమాన శిశు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యాన మరణాలు తగ్గించేలా అత్యవసర వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 108 నియోనాటల్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్ సేవలతో ఉమ్మడి జిల్లాలో వందలాది మంది శిశువుల ప్రాణాలు నిలిచాయి. ఉమ్మడి జిల్లాకు రెండు అంబులెన్స్‌లు కేటాయించగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందులకు సిబ్బంది వైద్యం అందిస్తూనే పెద్దాస్పత్రులకు తరలిస్తూ శిశు మరణాల తగ్గింపునకు పాటుపడుతున్నారు. రెండేళ్లుగా నిర్వహణ ఉమ్మడి జిల్లాలో 108 నియోనాటల్ అంబులెన్స్ సేవలు రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చాయి. అప్పటివరకు ఇప్పటి వరకు 1,971 మంది శిశువులకు వైద్య సేవలు అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సాధారణంగా 108 వాహనంలో శిశువు చికిత్సకు అవసరమైన సౌకర్యాలు ఉండవు. ఈమేరకు ప్రత్యేక పరికరాలతో నియోనాటల్ అంబులెన్స్‌లు సమకూర్చారు. ఇందులో వెంటిలేటర్ సౌకర్యంతో పాటు ఇంక్యూబేటర్, పల్స్ ఆక్సీమీటర్, సిరంజ్ పంప్, ఆక్సిజన్ సిలిండర్ ఉంటాయి. బరువు తక్కువ ఉన్న శిశువులు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో పుట్టేవారు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారికి అత్యవసర చికిత్స అందిస్తూ ఆస్పత్రులకు చేర్చడం సులువవుతోంది. నవజాత శిశు మరణాల నివారణే... కొన్నేళ్లుగా జిల్లాలో శిశు మరణాలు పెరిగాయి. బరువు తక్కువగా పుట్టడం, అవయవాల ఎదుగుదలలో లోపాలతో జన్మిస్తున్న వారికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉంటుంది. అయితే, శిశువు పరిస్ధితి ఇబ్బందిగా మారినప్పుడు ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యాన ఉమ్మడి జిల్లాకు రెండు నియోనాటల్ అంబులెన్స్‌లను కేటాయించగా వీటిలో వైద్యం అందిస్తూ పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. తద్వారా శిశు మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, కొన్ని ఆస్పత్రుల్లో చిన్నచిన్న సమస్యలకు కూడా కొందరు వైద్యులు వైద్యం చేయకుండా రిఫర్ చేస్తున్నారని, అలా కాకుండా జిల్లాలోనే వైద్యం అందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.ఉమ్మడి జిల్లాలో రెండు నియోనాటల్ వాహనాల ద్వారా సేవలు అందుతున్నాయి. శిశువులకు చికిత్స చేస్తూనే పెద్దాస్పత్రులకు తరలించడం ద్వారామరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. అత్యవసర వైద్యం అవసరమైన శిశువులనే రిఫర్ చేస్తే మరింత మందికి సేవలు అందుతాయి. – శివకుమార్, ఉమ్మడి జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్ -
వరి కోతల్లో జాగ్రత్తలతో అధిక దిగుబడి
కూసుమంచి: వరి కోతల వేళ రైతులు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక దిగుబడి నమోదవుతుందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండలంలోని పెరికసింగారంలో వరి కోతలనుబుధవారం ఆయన పరిశీలించి విత్తన రకాలు, పెట్టుబడి, దిగుబడులపై ఆరా తీశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ కోతల వేళ ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చూడడమేకాక, ఆరబోయడంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కూసుమంచిలోని పలు ఎరువుల దుకాణాల్లో నిల్వలు, రికార్డులను తనిఖీ చేశారు. ఆతర్వాత కూసుమంచి ఏఓ కార్యాలయంలో వ్యవసాయ యాంత్రికీకరణకు అందిన దరఖాస్తులపై ఆరా తీశారు. ఏఓ వాణి, ఏఈఓలు నవీన్, రవీందర్, వంశీకృష్ణ, సౌమ్య, ప్రియాంక పాల్గొన్నారు. టీకాలతోనే పశువులకు ఆరోగ్యం ముదిగొండ: రైతులంతా తప్పనిసరిగా పశువుల కు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, తద్వారా జీవాలు ఆరోగ్యంగా ఉంటా యని జిల్లా పశు వైద్యాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. ముదిగొండ మండలంలోని పమ్మి, సువర్ణాపురం, నూలక్ష్మీపురంలో వ్యాక్సినేషన్ శిబిరాలను బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పశువైద్య సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తూ టీకాలు వేయించాలని సూచించారు. లేదంటే సీజనల్‌గా వచ్చే వ్యాధులతో పశువులు నీరసించి వ్యవసాయ పనులకు సహకరించవని తెలిపారు. అనంతరం గ్రామాల్లో ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులకు అందచేసిన గేదెలను పరిశీలించి పోషణపై సూచనలు చేశారు. మండల పశువైద్యాధికారి అశోక్, ఇందిరా మహిళా డైరీ ఏపీఎంలు లక్ష్మణ్ రావు, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఓసీల్లో నిబంధనల అమలుపై ఆరా సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్, కిష్టారం సింగరేణి ఉపరితల గనులను పర్యావరణ, అటవీ శాఖల సభ్యులు ప్రొఫెసర్ ఆర్ఎం భట్టాచార్జీ, పర్యావరణ జనరల్ మేనేజర్ సైదులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలు ఆరా తీశారు. అలాగే, బొగ్గు రవాణా సమయాన దుమ్ము లేకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకున్నారు. కాలుష్యాన్ని అరికడుతూ పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఏరియా జీఎం షాలేం రాజు, ఓసీ పీఓ ఎస్వీఆర్.ప్రహ్లాద్, ఉద్యోగులు కోటిరెడ్డి, రాజేశ్వరరావు, కల్యాణ్‌రామ్, రవికిరణ్, పి.సత్యనారాయణ పాల్గొన్నారు. లోటుపాట్లు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కల్లూరురూరల్: ఎలాంటి సమస్యలు రాకుండా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్ సూచించారు. కల్లూరు రైతు వేదికలో బుధవారం ఆయన తహసీల్దార్ పులి సాంబశివుడు, ఏఓ ఎం.రూప తదితరులతో సమావేశమయయ్యారు. కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, కాంటాలు సమకూర్చుకోవాలని, ధాన్యం బస్తాలకు ట్యాగ్ వేశాకే మిల్లులకు పంపించాలని తెలిపారు. అంతేకాక రైతుల పూర్తి వివరాలను పోర్టర్లో నమోదు చేస్తే వారికి త్వరగా నగదు జమ అవుతుందని చెప్పారు. అనంతరం ఎర్రబోయినపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీసీఎస్ఓ తేమ శాతాన్ని పరీక్షించారు. -
అందరూ చదవాలి!
●యాపిల్.. బాల్.. కార్.. డాల్ఏమిటీ కార్యక్రమం.. జిల్లాలోని 814 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1 – 5వ తరగతి వరకు విద్యార్థులకు ఇంగ్లిష్ చదివే సామర్థ్యం పెంచాలనే లక్ష్యంతో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం అమలుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతీరోజు గంట పాటు ఇంగ్లిష్ రాయించడం, చదివిస్తూ ప్రతీ తరగతికి మెటీరియల్ సిద్ధం చేశారు. అంతేకాక యాప్ కూడా రూపొందించారు. ఈ యాప్‌లో ఉపాధ్యాయులు విద్యార్థుల పేర్లను నమోదు చేయాలి. ఇంగ్లిష్ అక్షరాలు రాయించడం, పలికించడం, ఆ తర్వాత పదాలు, చివరకు వాక్యాలు చదవడం, రాసే స్థాయికి తీసుకెళ్తారు. 29,393 మంది విద్యార్థులు జిల్లాలో 814 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండగా, 29,393 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరినీ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ యాప్‌లో నమోదు చేస్తారు. ఈనెల 27నుంచి మెటీరియల్ అందించి ఇంగ్లిష్ అక్షరాలు రాయడం, చదివించడంతో మొదలుపెడతారు. వచ్చే నెల 30 నాటికి అంటే నెల రోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఎలా పెరుగుతుందనే వివరాలను ప్రతీ బుధవారం యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చింతకానిలో పైలట్ ప్రాజెక్టు ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమ అమలుకు చింతకాని మండలంలోని 12 ప్రాథమిక పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండలంలోని పందిళ్లపల్లి, నామవరం, నాగులవంచ, రామకృష్ణాపురం, పాతర్లపాడు, ప్రొద్దుటూరు, కోమట్లగూడెం, చింతకాని, కొదుమూరు, అనంతసాగర్, బస్వాపురం, నేరడ పాఠశాలల్లో 50 మందికి పైగా విద్యార్థుల చొప్పున 650 మంది విద్యార్థులను యాప్‌లో నమోదు చేశారు. ఇప్పటికే ఇంగ్లిష్ అక్షరాలు పలికిండచంతో కార్యక్రమం మొదలైంది. 12 పాఠశాలల్లో ఈనెల 14న మొదలైన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 27వ తేదీ నుంచి ప్రారంభిస్తారు.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇంగ్లిష్ అభ్యసన సామర్థ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. ప్రాథమిక స్థాయిలో పట్టు సాధించకపోవడంతో పై తరగతులకు వెళ్లేకొద్ది ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన సందర్భంగా ఇంగ్లిష్‌లో చాలా మంది విద్యార్థులు వెనకబడి ఉన్నారని గ్రహించారు. ఈమేరకు ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు తర్ఫీదు సాధించేలా ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం814 ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తే ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ ఉద్దేశంతోనే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం తీసుకున్నాం. చింతకాని మండలంలోని కొన్ని పాఠశాలల్లో పైలట్‌గా ప్రారంభించాం. ఆపై జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించనున్నాం. ఇక్కడ విజయవంతం అయ్యాక అంగన్వాడీ కేంద్రాల్లోనూ అమలుచేస్తాం. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్ -
పత్తి కొనుగోళ్లలో సాంకేతిక సమస్య
● సాఫ్ట్వేర్ మొరాయించడంతో నిలిచిన కొనుగోళ్లు ● వచ్చే సోమవారం నుంచి తీసుకురావాలని సూచనఖమ్మంవ్యవసాయం/తిరుమలాయపాలెం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సాఫ్ట్‌వేర్‌లో ఎదురైన సాంకేతిక సమస్యలతో కొనుగోళ్లు నిలిచిపోగా, జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులు పత్తి వాహనాలతో పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎనిమిది జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలుకు నిర్ణయించగా, రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళ, బుధవారాల్లో నాలుగు కేంద్రాలు మొదలయ్యాయి. ఈమేరకు రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని వాహనాల్లో పత్తి తీసుకొచ్చారు. అక్కడ వ్యవసాయ శాఖ నమోదు చేసిన పంట సాగు వివరాలు, స్లాట్ వివరాలు పరిశీలించాక కొనుగోలు చేయాల్సి ఉండగా.. సాఫ్ట్‌వేర్‌లో సమస్యతో బ్రేక్ పడింది. ఈమేరకు ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి సమస్యపై సాఫ్ట్వేర్ సమకూర్చిన సంస్థ నిర్వాహకులతో మాట్లాడి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తొలిరోజు ఒక్కో మిల్లు వద్దకు 10 – 15 వాహనాల్లో పత్తితో రైతులు రాగా, సాయంత్రం కురిసిన వర్షంతో పత్తి కొంతమేర తడిసింది. ఈవిషయమై వివరణ కోరేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. కాగా, గోల్‌తండాలోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయని తెలుసుకున్న మద్దులపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్‌రెడ్డి, పాలేరు స్పెషల్ ఆఫీసర్ రమేష్ చేరుకుని మార్కెట్, సీసీఐ అధికారులతో మాట్లాడాక తేమ శాతం పరీక్షించి దిగుమతి చేసుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాంకేతిక సమస్యల నేపథ్యాన రైతులు నుంచి పత్తి తీసుకురావాలని అధికారులు సూచించారు. -
ముత్తగూడెం చెక్‌పోస్టు తొలగింపు
సత్తుపల్లి: పెనుబల్లి మండలం ముత్తగూడెంలోని రవాణా శాఖ చెక్‌పోస్టును బుధవారం అధికారులు తొలగించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా పలుచోట్ల లెక్కాపత్రం లేని నగదు బయటపడింది. ఈమేరకు అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల తొలగింపునకు నిర్ణయించింది. ఇందులో భాగంగా డీటీఓ ఎం.వెంకటరమణ పర్యవేక్షణలో ముత్తగూడెంలోని చెక్‌పోస్టు నుంచి సామగ్రిని ఖమ్మం తరలించారు. అంతేకాక చెక్‌పోస్టును మూసివేసినట్లు చెబుతూ మూడు భాషల్లో ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎంవీఐ రాజశేఖర్, ఏఎంవీఐ రాజశేఖర్‌రెడ్డి, ఉద్యోగులు బడేషా, సరిత, అశోక్ ఉన్నారు. నేటితో ముగియనున్న వైన్స్ టెండర్లు ఖమ్మంక్రైం: జిల్లాలోని 116వైన్స్ దక్కించుకునేందుకు టెండర్లు దాఖలు చేసే గడువు గురువారంతో ముగి యనుంది. ఈమేరకు బుధవారం 50 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,177 దరఖాస్తులు రాగా, చివరిరోజు మరిన్ని వస్తాయని అధికారులు భావిస్తున్నారు. నిర్మాణాల్లో వేగం పెంచాలి ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మోడల్ మిర్చి మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి. లక్ష్మీబాయి ఆదేశించారు. పనులను బుధవారం పరిశీలించిన ఆమె అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో చర్చించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ లక్ష్మణ్‌గౌడ్, ఈఈ యల్లేష్, వరంగల్ జేడీ ఉప్పల శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్, వైస్చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై ఒకే పిన్‌కోడ్
ఖమ్మం అంతటికీ 507 001 ● బట్వాడా కేంద్రాల విలీనం.. ఐడీసీ ఏర్పాటు ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలు వేగంగా, సమర్ధవంతంగా నిర్వహించేలా సంస్కరణలు తీకొస్తున్నారు. ఇందులో భాగంగానే నగరాలు, పట్టణాల్లో ఒకటికి మించి ఉన్న బట్వాడా కేంద్రాలను విలీనం చేస్తూ ‘ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్’(ఐడీసీ) ఏర్పాటుకు తపాలా శాఖ నిర్ణయించింది. తద్వారా కౌంటర్(ఫ్రంట్ ఆఫీస్), పంపిణీని క్రమబద్ధీకరించి బట్వాడా వేగంగా పూర్తిచేయొచ్చని చెబుతున్నారు. ఐడీసీగా ఖమ్మం హెడ్‌పోస్టాఫీస్ ఖమ్మం నగరంలోనూ కొత్త విధానం అమలుచేయనున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో టౌన్–1(హెడ్ పోస్టాఫీస్–507001), టౌన్–2(పాత కలెక్టరేట్–507002), టౌన్–3(గాంధీచౌక్–507003) బట్వా డా కేంద్రాలు ఉన్నాయి. మూడింటికి వేర్వేరు పిన్‌కోడ్ నంబర్లు ఉండడంతో కొత్త వ్యక్తులకు తెలియక పొరపడితే గమ్యస్థానాలకు చేర్చడంలో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యాన మూడు కేంద్రాలను విలీనం చేసి ఖమ్మం హెడ్ పోస్టాఫీస్ కేంద్రంగా ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేస్తారు. దీంతో మూడు పిన్కోడ్లను రద్దు చేసి నగరమంతా 507001 పిన్‌కోడ్ అమలుచేస్తారు. చకచకా ఏర్పాట్లు ఖమ్మం హెడ్‌పోస్టాఫీస్‌లో ఐడీసీ ఏర్పాటు పనులను వేగవంతం చేశారు. మూడు పోస్టాఫీసుల్లో పనిచేసే 29 మంది పోస్టుమెన్లు ఇకపై ఐడీసీలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో అందరికీ సరిపడా ఏర్పాట్లు సాగుతున్నాయి. బట్వాడా వస్తువుల పరిశీలన, పోస్టుమెన్ల సీటింగ్ పనులను త్వరలోనే పూర్తి చేసి ఐడీ సెంటర్‌ను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఖమ్మం నగరమంతా హెడ్ పోస్టాఫీస్ నుంచే బట్వాడాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు బట్వాడా కేంద్రాలు ఉండడంతో పలు సందర్భాల్లో జాప్యం జరిగి వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించి.. వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించడమే లక్ష్యంగా ఐడీసీ ఏర్పాటు చేయనున్నాం. – కె.సుబ్రహ్మణ్యం, పోస్టుమాస్టర్, హెడ్‌పోస్టాఫీస్, ఖమ్మం -
మైలురాయిగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ విద్యాచరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణాతో మంత్రి హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవేశాలు, భవన నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించాక మంత్రి మాట్లాడారు. కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ దేశంలోనే మొదటిది కాగా, ప్రపంచంలో రెండోదని తెలిపారు. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ విద్యాసంస్థకు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక్కడ చదివే విద్యార్థులు భూశాస్త్రవేత్తలు, ఖనిజ నిపుణులుగా కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, నిర్మాణాలకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఎన్ఎండీసీ, సింగరేణి, కోల్ ఇండియా ప్రతినిధులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు.వీసీ యోగితారాణాతో భేటీలో మంత్రి తుమ్మల -
పోస్టల్ బీమా విభాగంలో ఏజెంట్ల నియామకం
ఖమ్మంగాంధీచౌక్: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్ఐ), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(ఆర్పీ ఎల్ఐ) విభాగాల్లో కమీషన్ పద్ధతిపై తాత్కాలిక ప్రాతిపదికన ఏజెంట్లను నియమించనున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి తెలిపారు. పదో తరగతి పూర్తిచేసి 18 ఏళ్లు నిండిన నిరుద్యోగులు, గృహిణులు, మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, గ్రామీణ తపాలా సేవకులు అర్హులని పేర్కొన్నారు. తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను ‘పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం గాంధీచౌక్, ఖమ్మం–507003’ కు చిరునామాకు చేరే పంపించాలని, దరఖాస్తుకు ఎస్సెస్సీ మెమో, ఆధార్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలను జతపర్చాలని తెలిపారు. ఎంపికై న వారు రూ.500 ఎన్ఎస్సీ లేదా కేవీపీ రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, వివరాలకు సమీపంలోని తపాలా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అమావాస్య ఎఫెక్ట్ ! ● వైన్స్‌కు 13 దరఖాస్తులే నమోదు ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్‌కు దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం, దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించింది. అయితే, ఆదివారం, సోమవారం సెలవు కాగా, మంగళవారం అమావాస్య కావడంతో వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో మంగళవారం కేవలం 13దరఖాస్తులే నమోదయ్యాయి. అయితే, బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండడంతో చివరి రెండు రోజులు భారీగా దరఖాస్తులు అందే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే సిండికేట్‌గా మారిన వ్యాపారులు దరఖాస్తుల నమోదుకు సిద్ధమైనట్లు తెలిసింది. పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి తల్లాడ: ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయినందున పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని జిిల్లా పంచాయతీ ఆశాలత సూచించారు. తల్లాడ మండలంలోని మల్లవరంలో మంగళవారం పర్యటించిన ఆమె రికార్డులు తనిఖీ చేసి పన్నుల డిమాండ్, ఇప్పటివరకు వసూళ్లపై ఆరా తీశారు. ఇకనైనా వసూళ్లలో వేగం పెంచడమే కాక పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆతర్వాత గ్రామంలోని నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠ ధామాన్ని కూడా డీపీఓ పరిశీలించారు. ఎంపీడీఓ సురేష్‌బాబు, కార్యదర్శి సిద్ధిక్మియా, సిబ్బంది పాల్గొన్నారు. ఆహారంలో అయోడిన్ అవసరం ఖమ్మంవైద్యవిభాగం: అయోడిన్ సూక్ష్మపోషకాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని, అయోడిన్ కలిసిన ఉప్పు ఆరోగ్యానికి మంచిదేనని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి బి.కళావతిబాయి తెలిపారు. ‘ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం’ సందర్భంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అయోడిన్ లోపం వల్ల మానసిక మంద గమనం, బలహీనత, అలసట, గర్భిణులకు మృతశిశువులు పుట్టడమే కాక పుట్టిన పిల్లల్లో వైకల్యాలు ఎదురవుతాయని తెలిపారు. మెదడు అభివృద్ధి, మానసిక, శారీరక ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపునకు అయోడిన్ అవసరమని చెప్పారు. ఈమేరకు అయోడిన్ కలిగిన ఉప్పు వాడాలని, ఆశా కార్యకర్తల వద్ద ఉండే సాల్ట్ టెస్టింగ్ కిట్ల ద్వారా ఉప్పులో అయోడిన్ శాతాన్ని పరీక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు డీఎంహెచ్ఓ వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్లు రామారావు, భాస్కర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. గురుకులాల్లో సమస్యలు పరిష్కరిస్తాం వైరా: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, భవనాల కొరతకు త్వరలోనే పరిష్కార మార్గం చూపిస్తామని పాఠశాలల అసిస్టెంట్ సెక్రటరీ శారద తెలిపారు. వైరాలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ వైరా పాఠశాలలో డార్మెటరీ శిథిలావస్థకు చేరగా, డైనింగ్ హాల్ సైతం తాత్కాలికంగా నిర్మించామన్నారు. అలాగే, కోతుల బెడద పరిష్కారంపై దృష్టి సారించామని తెలిపారు. ఇటీవల పాఠశాల ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా కొన్ని చెట్లు నరికివేయించారని, కోతుల సమస్యతోనే కొమ్మలు నరికించినట్లు వెల్లడైందని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మమత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
● ఉమ్మడి జిల్లాలో 14జిన్నింగ్ మిల్లులకు అనుమతి ● తాత్కాలిక రిజిస్ట్రేషన్ల విధానం రద్దుఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పచ్చజెండా ఊపింది. జిన్నింగ్ మిల్లుల ఎంపిక పూర్తి కావడంతో కొనుగోళ్లు మొదలుకానున్నాయి. ఈమేరకు తిరుమలాయపాలెం మండలం గోల్‌తండాలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో తొలి కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తేమశాతం ఆధారంగా పత్తి క్వింటాకు గరిష్టంగా రూ. 8,110 ధర నిర్ణయించింది. అయితే వ్యాపారులు తేమ, నాణ్యత పేరిట రూ.6,500కు మించి చెల్లించడం లేదు. ఇంతలోనే సీసీఐ కేంద్రాలకు ఏర్పాటుకు జిన్నింగ్ మిల్లుల యజమానులు ముందుకు రాకపోతే ప్రభుత్వ జోక్యంతో కొనుగోళ్లకు లైన్‌క్లియర్ అయింది. ఉమ్మడి జిల్లాలో ఈఏడాది 4.46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. తద్వారా 50 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. 14 మిల్లులకు అనుమతి పత్తి కొనుగోళ్లకు ఖమ్మం జిల్లాలో జీఆర్ఆర్ ఇండస్ట్రీస్(వెంకటగిరి), శ్రీసాయిబాలాజీ జిన్నింగ్ మిల్(తల్లంపాడు), అమరావతి టెక్స్టైల్స్(దెందుకూరు), మంజీత్ కాటన్ మిల్స్(మాటూరు), శ్రీ శివగణేష్ కాటన్ ఇండస్ట్రీస్(ఇల్లెందులపాడు), స్టాపిలచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్(తల్లాడ), జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్(పొన్నెకల్), శ్రీ భాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్(గోల్ తండా)తో పాటు భద్రాద్రి జిల్లాలో ఆరింటిని ఎంపిక చేశారు. ఎకరాకు 12 క్వింటాళ్లు పంట దిగుబడిని అంచనా వేశాక ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి అవకాశం కల్పించారు. అయితే, ఈ ఏడాది అధిక వర్షాలతో ఎకరాకు ఐదు క్వింటాళ్లు మించే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ పోర్టల్‌లో పంట నమోదై ఉండడమే కాక ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే విక్రయానికి అనుమతిస్తారు. కాగా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ల(టీఆర్) విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కౌలు రైతుల కోసం ఈ విధానాన్ని తీసుకొస్తే కొందరు ఉద్యోగులు, వ్యాపారులు ఏకమై అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో పట్టాదారు అనుమతితో కౌలు రైతుల ద్వారా విక్రయ బాధ్యత ఏఈఓలకు అప్పగించారు. -
నోటరీ వ్యవస్థలో డిజిటల్ విప్లవం
● పారదర్శకత కోసం మరో అడుగు ● రెన్యూవల్ కాకపోతే సీఓపీల తొలగింపు ● ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 41 మంది సీఓపీలకు అనుమతి ● నవంబర్ 1 నుంచి ఆన్లైన్ విధానం ప్రారంభం ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత కోసం సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, భూరికార్డుల డిజిటలైజేషన్, ఆన్లైన్ ద్వారానే స్టాంప్ వెండింగ్ అమలు చేస్తుండగా ఇప్పుడు కీలకమైన నోటరీ విధానాన్ని కూడా ఆన్లైన్ చేయాలని నిర్ణయించింది. ఈ విధానం నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. తద్వారా నోటరీ కార్యకలాపాల్లో జవాబుదారీతనం పెరిగి, మోసాలకు తావు లేకుండా చేయొచ్చని ఆ శాఖాధికారులు భావిస్తున్నారు. లైసెన్స్ ఉంటేనే అనుమతి నోటరీ పబ్లిక్‌గా పనిచేసే న్యాయవాదుల విషయంలో స్పష్టత తీసుకొచ్చేలా ప్రభుత్వం సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) లైసెన్స్ కలిగిన వారి వివరాలనే ఆన్లైన్లో నమోదు చేయిస్తోంది. తద్వారా చట్టపరమైన అర్హత కలిగిన వారే నోటరీ సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక న్యాయవాదుల వివరాలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. నోటరీ పబ్లిక్‌లు జారీ చేసే ప్రతీ నోటరీని పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా కక్షిదారుడికి ఇచ్చే నోటరీ వివరాలు, సంతకాలు చేశాకే ఆన్లైన్లో పొందుపరుస్తారు. కక్షిదారుల వివరాలు, వారు సమర్పించిన ధ్రువపత్రాల వివరాలు పక్కాగా ఉంటేనే నోటరీ జారీ చేయాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలివ్వడం, రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రపర్చడం ద్వారా భవిష్యత్‌లో వివాదాలు ఎదురైతే ప్రామాణికంగా ఉంటాయి. రెన్యూవల్ కాకపోతే రద్దు నోటరీ విధానంలో పాత, వినియోగంలో లేని లైసెన్స్‌లకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా తమ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోని వారి లైసె న్సులు తొలగించే ప్రక్రియ మొదలైంది. సీఓపీ కలిగిన నోటరీ న్యాయవాదులు తమ లైసెన్సును ప్రతీ ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. కాల పరిమితి ముగిసే ఆరు నెలల ముందే జిల్లా రిజిస్ట్రార్ (స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలపరిమితి ముగిశాక రెన్యూవల్‌కు వస్తే సమస్యలు తలెత్తుతున్నందున ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. సామాన్య ప్రజలకు మేలు ఆన్లైన్ విధానం ద్వారా సామాన్య ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. నోటరీ ద్వారా ధ్రువీకరించిన పత్రాలు ఆన్లైన్లో నమోదు కానుండడంతో విశ్వసనీయత పెరుగుతుంది. అనధికార వ్యక్తులు నోటరీగా చెలామణి అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. నోటరీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కొనసాగుతున్న సంస్కరణల్లో దీనిని కీలక అడుగుగా భావిస్తున్నారు.పారదర్శకత కోసం ప్రభుత్వం అన్ని సేవలను డిజిటలైజేషన్ చేస్తోంది. అందులో భాగంగానే నోటరీలు కూడా ఆన్లైన్లో నమోదు చేశాకే కక్షిదారులకు అందించాలని నిర్ణయించింది. ఈ విధానం నవంబర్ 1నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే జిల్లాలో యాక్టివ్‌గా ఉండి, రెన్యూవల్ అయిన సీఓపీ లైసెన్సులను ఆన్లైన్ చేస్తున్నాం. ఈ విధానంపై న్యాయవాదులకు అవగాహన కల్పిస్తున్నాం. –ఎం.రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ -
మోడల్ గ్రామాలకు నజరానా
ఉమ్మడి జిల్లాలో అధిక సోలార్ ప్లాంట్లు కలిగిన రెండు గ్రామాలకు రూ.కోటి నజరానా ఇచ్చేలా సిఫారసు చేశారు.బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025అర్హులకే పీఠం!సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్ష పదవులకు నేతల ఎంపిక చివరి దశకు చేరింది. ఐదు నియోజకవర్గాల నుంచి జిల్లా అధ్యక్ష పదవికి 56 మంది, నగర అధ్యక్ష పదవికి పది మంది దరఖాస్తు చేసుకున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ ఐదేళ్లుగా పార్టీలో కొనసాగుతూ ఉన్న వారికే పదవులు దక్కుతాయని చెబుతున్నారు. పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారే కాక అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు కూడా పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో డీసీసీ పదవికి ఆరుగురు, నగర అధ్యక్ష పదవికి 12 మంది పేర్లతో ఏఐసీసీకి నివేదిక ఇవ్వగా.. వడబోత అనంతరం వచ్చే నెల 15 నాటికి ప్రకటించే అవకాశముంని సమాచారం. మంత్రులతోనూ చర్చ.. ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, మట్టా రాగమయి తదితరులు కలిశారు. ఈక్రమాన వారితోనూ ఏఐసీసీ నిబంధనలు, అధ్యక్ష పదవికి కావాల్సిన అర్హతలపై చర్చించినట్లు తెలిసింది. అన్ని నియోజకవర్గాల నుంచి డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తులు రావడంతో పోటీ పెరిగినట్లయింది. 2014 నుంచి 2023 వరకు అధికారంలో లేకపోవడంతో ఆ సమయాన పార్టీలో స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేందుకు పలువురు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో పార్టీకి విధేయులుగా ఉన్న వారికే పదవి ఇవ్వాలని ముఖ్యనేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. బంధువులు కావొద్దు.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం వచ్చిన 56 దరఖాస్తుల్లో ముఖ్య నేతలు ఆరుగురి పేర్లు ఏఐసీసీ పరిశీలనకు వెళ్లాయి. అలాగే నగర కమిటీకి కూడా ఆరుగురి పేర్లు ప్రతిపాదించారు. ఐదేళ్లపాటు నిరంతరాయంగా కాంగ్రెస్‌కు సేవలు అందించిన వారి పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదేసమయాన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు బంధువులు అయి ఉండొద్దనే నిబంధన విధించినట్లు సమాచారం. ఇవికాక పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్న వారినే పరిగణనలోకి తీసుకుని పార్టీకి విధేయులై సుదీర్ఘకాలం సేవలందిస్తున్న వారికి పదవి ఇస్తేనే న్యాయం చేసినట్లు అవుతుందనే భావన వ్యక్తమవుతోంది. షార్ట్ లిస్ట్ చేసి.. డీసీసీ అధ్యక్ష పదవికి 56, ఖమ్మం నగర అధ్యక్ష పదవికి పది దరఖాస్తులు రావడంతో వడబోత అనంతరం ఒక్కో పదవికి ఆరుగురి పేర్లతో మహేంద్రన్ జాబితా రూపొందించారు. ఈ జాబితాతో పాటు ఆయా నేతలు నిర్వహించిన పదవులు, ప్రజాక్షేత్రం, పార్టీ కేడర్‌లో ఉన్న అభిప్రాయాలతో ఈనెల 25న ఆయన అధిష్టానానికి సమర్పిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా డీసీసీ, నగర అధ్యక్షులను వచ్చేనెల 15లోగా పార్టీ ప్రకటిస్తుందని సమాచారం. ఆ ఆరుగురు ఎవరో? డీసీసీ, నగర అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నేతలు ఎవరికి వారు పదవి తమకే దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. డీసీసీకి దరఖాస్తు చేసుకున్న వారిలో వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్, నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్‌చౌదరి, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, సూతకాని జైపాల్, కొత్త సీతారాములు, ఎండీ.ముస్తఫా, బెల్లం శ్రీనివాసరావు, పగడాల మంజుల, సూరంపల్లి రామారావు, చోట బాబా తదితరులు ఉన్నారు. అలాగే నగర అధ్యక్ష పదవికి నాగండ్ల దీపక్‌చౌదరి, కమర్తపు మురళి, ఖాదర్‌బాబ, రషీద్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 66దరఖాస్తులు రావడంతో రెండు పదవులకు ఆరుగురి చొప్పున పేర్లను ఏఐసీసీకి ప్రతిపాదించడంతో.. ఎవరి పేర్లు జాబితాలో ఉన్నాయి.. అందులో ఎవరికి పదవి దక్కుతుందనే అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. డీసీసీ, నగర అధ్యక్ష పదవులకు ఐదేళ్ల అర్హత ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ ఈనెల 11 నుంచి 19 వరకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమై క్రియాశీలకంగా పని చేస్తున్న నేత ఎవరు.. ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు.. వారి పనితీరుపై అభిప్రాయాలు సేకరించారు. ఇలా ఐదు నియోజకవర్గాల్లో 3,800 మందితో ముఖాముఖి నిర్వహించగా.. అధ్యక్ష పదవులకు దరఖాస్తు చేసుకున్న వారితో ఈనెల 19న ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు.. పదవులు ఇస్తే పార్టీ మరింత బలోపేతానికి ఏం చేస్తారనే ఆరా తీశారు. -
శాంతిభద్రతల రక్షణలో పోలీసులే కీలకం
ఖమ్మంక్రైం: శాంతి భద్రతల సంరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం(ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీసు కమిషనర్ సునీల్‌దత్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తూ, అమరులైన సిబ్బందికి నివాళులర్పించడం అందరి బాధ్యత అని తెలిపారు. ఏ కార్యక్రమమైనా శాంతియుతంగా కొనసాగాలంటే పోలీసుల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. దీపావళి, హోలీ, వినాయక నిమజ్జనం వంటి వేడుకలు ప్రశాంతంగా కొనసాగడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నందున, పౌరులు వారికి కృతజ్ఞతగా ఉండాలని తెలిపారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ప్రజారక్షణ కోసం అహర్నిశలు ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించే పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని తెలిపారు. కాగా, పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈనెల 24న రక్తదాన శిబిరం, 25న సైకిల్ ర్యాలీ, 27వ తేదీన సిబ్బందికి వ్యాసరచన పోటీలు, 28వ తేదీన విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తొలుత అధికారులు, అమరవీరుల కుటుంబసభ్యులు స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఈ ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన 191 మంది పేర్లను ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి వినిపించారు. అడిషనల్ డీసీపీలు రామానుజం, ప్రసాద్‌రావు, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు, సుశీల్‌సింగ్, నర్సయ్య, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, అప్పలనాయుడు, నాగుల్‌మీరా, సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్‌బాబు, భానుప్రకాష్, రాజిరెడ్డి, రామకృష్ణ, చిట్టిబాబు, సత్యనారయణ, ఉస్మాన్‌షరీఫ్, స్వామి పోలీస్ అసోసియేషన్ నాయకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు,అమవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్ -
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత
● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనఖమ్మంరూరల్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం, తల్లంపాడులో రహదారుల నిర్మాణానికి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కొండాపురం నుంచి ముఠాపురం వరకు రూ.7.50కోట్లతో బ్రిడ్జి, పొన్నేకల్ నుంచి కొండాపురం వరకు రూ.5.20కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే, పీహెచ్సీ నిర్మాణం, పెద్దకుంట చెరువు శాశ్వత మరమ్మతు పనులు చేపడుతామని వెల్లడించారు. రాష్ట్రంలో పేదలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందిస్తుండగా, తెల్లరేషన్‌కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే, దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కాగా, మండలంలోని మద్దులపల్లిలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల భవన పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. రూ.25కోట్లతో మూడు అంతస్తులు గా చేపడుతున్న నిర్మాణం తుది దశలో ఉందని తెలి పారు. డీఏఓ డి.పుల్లయ్య, ఆర్డీఓ నర్సింహారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
అరెస్టులతో సమ్మెను ఆపలేరు
ఖమ్మంమయూరిసెంటర్: తగ్గించిన వేతనాలు పెంచాలని, జీఓ 60 ప్రకారం రూ.15,600 వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు 38 రోజులుగా సమ్మె చేస్తూ మంత్రులకు, అధి కారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ కార్మికుల జేఏసీ రాష్ట్ర నాయకులు కె.బ్రహ్మచారి అన్నారు. ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో విధులు నిర్వర్తిస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఖమ్మంలో మంత్రుల క్యాంపు కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించేందుకు ఎన్నెస్పీ క్యాంపునకు చేరుకున్నారు. మూడు జిల్లాల నుంచి వచ్చిన కార్మికులను పోలీసులు ఎన్నెస్పీ క్యాంపులో అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ 38 రోజుల్లో 20 సార్లు ఆర్థిక శాఖ మంత్రికి తమ గోడు వినిపిస్తూ వినతిపత్రం ఇచ్చామని, అయినా స్పందన లేదని అన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజన కార్మి కులను అరెస్టు చేయించడం దుర్మార్గమని అన్నారు. డైలీ వేజ్ వర్కర్లకు టైం స్కేల్ అమలు చేయాలని, అప్పటి వరకు కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ వర్కర్లకు ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో రూ.15,600 వేతనం చెల్లిస్తుంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం రూ.9,200 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. అరెస్టులతో సమ్మె ఆపలేరని, సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని వెల్లడించారు.సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జెల్లా ఉపేందర్, దొడ్డా రవికుమార్, నాగేశ్వరరావు, అనంతరాములు, లక్ష్మణ్, మోహన్, కౌసల్య, నర్సింహరావు, లక్ష్మి, శ్రీను, హీరా లాల్, ముత్త య్య, మంగమ్మ, తిరుపతమ్మ పాల్గొన్నారు. -
● వందనంలో ఇంటర్ విద్యార్థి మృతి ● ఇంజక్షన్ వికటించడంతో మృతి చెందాడని కుటుంబసభ్యుల ఆరోపణ ● మృతదేహంతో అర్ఎంపీ ఇంటి ఎదుట ఆందోళన
అండర్–19 బ్యాడ్మింటన్, కరాటే జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్, కరాటే జట్ల ఎంపిక పోటీలు ఆదివారం ఖమ్మంలోని సర్దార్‌పటేల్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపిక పోటీలను కోచ్‌లు జి.రాము, గోపతి సైదులు ఎస్.కే.ఖాసీం, ఎం.బాబు, ఎండీ. మహహబూబ్, ఎం.సురేష్, హరీష్, ఎం.సందేష్ పర్యవేక్షించగా జట్ల వివరాలను అండర్–19 క్రీడల కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం ప్రకటించారు. అండర్–19 బ్యాడ్మింటన్ బాలుర జట్టుకు ఎన్.నవీన్ ఉదయ్, ఎం.రాజీవ్, డి.నవీన్, ఎ.అరవింద్, జి.నవదీప్, బాలికల జట్టులో బి.ధరణి ప్రియ, ఎ.రష్మీ, కె.హెమీమా, ఎస్.గాయత్రి, జి.మహాలక్ష్మి స్థానం దక్కించుకున్నారు. అలాగే, కరాటే జట్టులో వివిధ కేటగీరీలకు గాను కె.అరుణతేజ్, డి.గౌరీశంకర్, కె.హర్షతేజ, కె.గణేష్, షాహిద్, ఎం.డీ. అసదుద్దీన్, ఎస్.కే.రియాన్, ఎం.లాస్యశ్రీ, వి.లక్ష్మీశ్రావణి, బి.సహస్రసేన్, ఎం.డీ.హఫషాజబీన్, కె.నిఖిత ఎంపికయ్యారు. నిర్లక్ష్య వైద్యానికి నిండు ప్రాణం బలి.. చింతకాని: ఓ గ్రామీణ వైద్యుడి(ఆర్ఎంపీ) నిర్లక్ష్యానికి ఇంటర్ విద్యార్థి బలయ్యాడు. తెలిసీ తెలియని వైద్యంతో జ్వరంతో వచ్చిన విద్యార్థికి ఇంజక్షన్ ఇవ్వడంతో అది కాస్తా వికటించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో విద్యార్థి కుటుంబసభ్యులు మృతదేహంతో గ్రామీణ వైద్యుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని వందనం గ్రామానికి చెందిన ఉద్వి జస్వంత్ (17) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చి అదే రోజు కొదుమూరు గ్రామంలోని గ్రామీణ వైద్యుడికి చూపించాడు. అతడు ఓ ఇంజక్షన్ వేయగా.. వెంటనే వాంతులు చేసుకొని అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కొద్దిసేపటికి మృతి చెందాడు. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు గ్రామీణ వైద్యుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వీరేందర్, ఏఎస్సై లక్ష్మణ్ అక్కడకు చేరుకొని కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. మృతికి కారకుడైన గ్రామీణ వైద్యునిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రొటోవేటర్ తగిలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి రఘునాథపాలెం: రొటోవేటర్ ఫిట్టింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. సీఐ ఉస్మాన్‌షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరబండ గ్రామానికి చెందిన మాదాసు నారాయణ (35) మంచుకొండలోని ఖాసీమ్‌కు చెందిన మామిడి తోటలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం రొటోవేటర్‌ను ట్రాక్టర్‌కు ఫిట్టింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఖమ్మంరూరల్: మండలంలోని మద్దులపల్లి వద్ద నాగార్జున సాగర్ కాల్వలో గుర్తు తెలియని ఓ వ్యక్తి(34) మృతదేహం లభ్యమైంది. మద్దులపల్లి గ్రామ శివారులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో పల్లెగూడెం బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.రాజు తెలిపారు. -
ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం ఈ ఎంపిక పోటీలు జరిగాయి. పోటీలకు 40 మంది బాలలు, 30 మంది బాలికలు హాజరు కాగా.. వివిధ పోటీల్లో క్రీడాకారులు తమ సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికల ప్రక్రియను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వై.రామారావు, బాస్కెట్‌బాల్ కోచ్‌లు పీ.వీ.రమణ, కృష్ణమూర్తి, రామారావు, భరత్‌చంద్ర పర్యవేక్షించారు. జట్లు ఇవే...అండర్–17 బాలుర బాస్కెట్‌బాల్ జట్టుకు అక్కి ఆయాన్, కె.స్నేహిత్, యశ్వంత్, హర్షవర్ధన్, సాత్విక్, సుమంత్, జెస్సు కిరణ్, చరణ్, సూర్య, గౌతమ్ సాహూ, ఎం.సాకేత్, రేహాన్, రైసింగ్, ఎస్.సాకేత్, అభినవ్, విశ్వతేజ, చత్రపతి శివాజీ, ఎండీ.గౌస్ అస్లాం ఎంపియ్యారు. అలాగే, బాలికల జట్టులో పి.అఖిల, రిశివశ్రీ, పూనం హన్సీ, సహస్ర, ఓంకారుణ్య, ఆయుషాన్ని, కీర్తి స్వప్నిక, తమన్ వి.తమరిత, చందనశ్రీ, దీక్షిత, యక్షిత, సాత్విక, ధతి, మనస్విని, కీర్తన, బి.హరిణి, కె.రితికాశాస్త్ర, కె.గ్రేస్‌కు స్థానం దక్కింది. -
అంతకంటే ఎక్కువే!
సగం కాదు.. 2023లో కళాశాల ఏర్పాటు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయగా, 2023 అక్టోబర్‌లో మొదటి సంవత్సరం బోధన ప్రారంభమైంది. మొత్తం 100 సీట్లతో కళాశాల ఏర్పాటు కాగా జాతీయ కోటాలో 15 శాతం, రాష్ట్ర కోటాలో 85 శాతం సీట్లు కేటాయించారు. హైదరాబాద్, వరంగల్ తర్వాత విశాలంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో ఖమ్మం మెడికల్ కళాశాల నిలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రితో పాటు కళాశాల, హాస్టళ్లు కలుపుకుని సుమారు 30 ఎకరాల మేర స్థలం ఉంది. అంతేకాక నగర నడిబొడ్డున కళాశాల ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది లేనందున ఇక్కడ చేర్పించేందుకు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాక హాస్టళ్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, నిరంతరం సెక్యూరిటీ, విశాలమైన తరగతి, ప్రాక్టికల్ గదులు ఉండడంతో నీట్ ర్యాంకర్ల చూపు ఇటు వైపు తిప్పేలా చేస్తోంది. మూడు బ్యాచ్‌ల్లోనూ వారే.. ఖమ్మం మెడికల్ కాలేజీకి అవసరమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లను కేటాయించడంతో బోధన సాఫీగా సాగుతోంది. కళాశాలలో ఈ ఏడాది 100 సీట్లలో 82 మంది విద్యార్థినులు ప్రవేశాలు పొందారు. వీరిలో చాలా మంది నిరుపేదలు, రైతు కుటుంబాలు, చిరువ్యాపారుల కుటుంబాల నుంచే వచ్చారు. అలాగే, గత ఏడాది 56 మంది, అంతకు ముందు ఏడాది 71 మంది అమ్మాయిలు చేరి ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్నారు. తద్వారా మూడు బ్యాచ్‌ల్లోనూ అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. జిల్లా విద్యార్థినులకు ప్రయోజనం గతంలో ఎంబీబీఎస్ సీటు సాధించటం కష్టమైన వ్యవహారంగా ఉండేది. కానీ ప్రస్తుతం అమ్మాయిలు చదువులో రాణిస్తూ లక్ష్యం వైపు కదులుతున్నారు. మూడు బ్యాచ్‌ల్లో చూస్తే 30 మంది జిల్లా విద్యార్థినులు ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు సాధించారు. మెరుగైన ర్యాంకుతో స్థానికంగా సీట్లు సాధిస్తుండడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా జిల్లాలోనే చదివే అవకాశం రావడం.. అనుకున్నట్లుగానే గత రెండేళ్లలో మంచి ఫలితాలు రావడంతో ఈసారి కూడా విద్యార్థినులు ఇటే మొగ్గు చూపారు. అంతేకాక జాతీయ కోటాలో మహారాష్ట్ర, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, కేరళ రాష్ట్రాల విద్యార్థులు 45 మంది చదువుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అమ్మాయిలే అధికం కళాశాలలో వసతులకు తోడు ఉత్తమ బోధన అందుతోంది. గత రెండు బ్యాచ్‌ల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో ర్యాంకర్లు ఇక్కడ చేరుతున్నారు. అందులో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు పటిష్టమైన భద్రత ఉండడంతో చదువు సాఫీగా సాగుతోంది. – డాక్టర్ శంకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
ఇందిరా డెయిరీ నా చిరకాల వాంఛ
● పాల ఉత్పత్తులతో దేశానికే ఆదర్శంగా నిలవాలి ● వైరా అభివృద్ధికి నిధులు.. అక్కడి నుంచే ఈ స్థాయికి చేరా ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బోనకల్/వైరా : పాల ఉత్పత్తులతో మధిర నియోజకవర్గ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుతో తన చిరకాల వాంఛ నెరవేరుతుందని తెలిపారు. బోనకల్లో ఆదివారం ఆయన నియోజకవర్గ పరిధిలోని ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2013లో మధిర నియోజకవర్గంలో 52వేల మంది మహిళా సంఘాల సభ్యులకు రెండేసి గేదెలు పంపిణీ చేసి డెయిరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కానీ అదే సమయాన రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆలస్యమైందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మధిర నియోజకవర్గంలోని మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న తన లక్ష్యం నెరవేరడానికి మార్గం ఏర్పడిందని తెలిపారు. రెండేసి గేదెలు.. సోలార్ ప్లాంట్లు ప్రతీ సభ్యురాలికి రెండేసి గేదెలు పంపిణీ చేయడమే కాక పాకల నిర్మాణం, సోలార్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని భట్టి వివరించారు. అలాగే, దాణా సరఫరా బాధ్యతను నిరుద్యోగ యువతకు అప్పగించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, రాష్ట్ర హస్తకళలు, గిడ్డంగుల సంస్థల చైర్మన్లు నాయుడు సత్యం, రాయ ల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఆర్అండ్బీ, పీఆర్, విద్యుత్ శాఖ, భగీరథ ఎస్ఈలు యాకోబు, వెంకటరెడ్డి, శ్రీనివాసాచారి, శేఖరరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, ఏడీఏ విజయచందర్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ ఆర్.రమాదేవి పాల్గొన్నారు. వైరాకు మరిన్ని నిధులు.. వైరా అభివృద్ధికి భవిష్యత్‌లో మరిన్ని నిధులు మంజూరు చేస్తానని, ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతోనే ఈస్థాయికి చేరానని భట్టి విక్రమార్క అన్నారు. ఆది వారం వైరాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైరాలో రూ. 500 కోట్లతో త్వరలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. అంతకుముందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, వైద్యులు కాపా మురళీకృష్ణ, ఉండ్రు శ్యాంబాబుతో పాటు 100 కుటుంబాల వారు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు శీలం వెంకటనర్సిరెడ్డి, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, ఏదునూరి సీతారాములు, బోళ్ల గంగారావు, దాసరి దానియేలు పాల్గొన్నారు. -
టీసీఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రదీప్, వీరేష్
ఖమ్మం స్పోర్ట్స్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి.వీరేష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురవారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఖమ్మం వచ్చిన అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ విజయచందర్‌రెడ్డి డాక్టర్ ప్రదీప్, వీరేశ్గౌడ్ను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించడానికి టీసీఏ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రదీప్, వీరేష్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా క్రికెటర్ల ఎంపిక చేపడతామని వెల్లడించారు. -
కల్లూరుకు సరికొత్త శోభ
● రూ.49 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సబ్‌కలెక్టర్ కార్యాలయ నిర్మాణం ● మంత్రి తుమ్మల సూచనలతో ప్రతిపాదనలుసత్తుపల్లి/కల్లూరు : సుమారు పది ఎకరాల స్థలంలో రూ.49 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయ నిర్మాణం జరగనుండగా కల్లూరు కొత్తశోభ సంతరించుకోనుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరేలా దీనిని డిజైన్ చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయంగా ఇది రూపుదిద్దుకుంటుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో ఈ మేరకు ప్రతిపాదనలను సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్ సిద్ధం చేసి ఆదివారం మంత్రికి అందజేశారు. అంతేకాక సబ్‌కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని మరో రూ.2.50 కోట్లతో ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండడంతో ప్రజలకు మెరుగైన సేవలు సులువుగా అందుతాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాక ప్రతిపాదనలు ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ప్రభుత్వ, ఎన్నెస్పీ భూములను పరిరక్షించాలని, సత్తుపల్లి వేశ్యకాంతల చెరువులో ఆక్రమణలు తొలగించాలని మంత్రి సూచించారు. అంతేకాక వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలో గ్రామకంఠం భూములను సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. -
వైన్స్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మంక్రైం: వైన్స్ షాపుల దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈనెల 23 వరకు పొడిగించింది. జిల్లాలో 116 వైన్స్‌కు శనివారం వరకే దరఖాస్తులు స్వీకరిస్తామని తొలుత ప్రకటించారు. ఈమేరకు శనివారం రాత్రి 11 గంటల వరకు మొత్తం 4,043 దరఖాస్తులు అందగా ఎకై ్సజ్ శాఖకు రూ.121.29కోట్ల ఆదాయం లభించింది. అయితే, బీసీల బంద్ కారణంగా బ్యాంకులు తెరుచుకోక డీడీలు తీయలేకపోయామని పలువురు విన్నవించడంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎౖక్సైజ్ అధికారి నాగేందర్‌రెడ్డి తెలిపారు. కాగా, 27వ తేదీ డ్రా తీసి వైన్స్ కేటాయిస్తామని వెల్లడించారు. అప్రమత్తతతోనే ప్రమాదాలు దూరం నేలకొండపల్లి: దీపావళి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఇదే సమయాన బాణసంచా కాల్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలని 108 సర్వీసుల ఉమ్మడి జిల్లా మేనేజర్ పి.శివకుమార్ సూచించారు. నేలకొండపల్లిలో ఆదివారం 108 వాహనం పనితీరు, రికార్డులను పరిశీలించాక ఆయన మాట్లాడారు. టపాసులు కాల్చే సమయాన అజాగ్రత్తగా ఉండడంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు పిల్లలు కాల్చే సమయాన పెద్దలు పర్యవేక్షించాలని, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాన 108 సేవలను వినియోగించుకోవాలని, తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఎంపీ దీపావళి శుభాకాంక్షలుఖమ్మం మామిళ్లగూడెం: దీపావళి పండుగతో పాటు సదర్ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై విజయం సాధించడానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే, యాదవ సమాజం అన్ని జాగ్రత్తల నడుమ సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఎత్తులు.. పై ఎత్తులు ! ● హోరాహోరీగా రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఖమ్మం టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ నిర్వహించారు. అండర్ – 8, 10, 12, 14 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించగా వివిధ జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–8 బాలుర విభాగంలో లావుడ్యా చౌహాన్, కార్తికేయ, దర్శన్‌రెడ్డి, ఈశ్వర్, హర్ష, అండర్–10లో శివనాగసారయి, అరిహంత్, గౌతమ్‌కృష్ణ, నిఖిల్చంద్ర, విశ్వతేజ, అండర్–12లో ఎస్.గౌతమ్ చంద్రమోఖిత్, రామ్ నిఖిత్, భూక్యా తనీష్, ఆర్యన్శర్మ వరుసగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. అలాగే, బాలికల అండర్–8 విభాగంలో సహస్ర, సామికా, తేజశ్రీ, జిహిత, జితిషా, అండర్–10లో అంధ్య, అనికారామ్, కార్తీక్ ప్రణవ్, అధ్విక గౌరీ, శరణ్యప్రియ, అండర్–12లో భవజ్ఞ, రీతూశ్రీ, కృతధార, నిహారిక, దిలీషా, అండర్–14 బాలికల విభాగంలో లక్ష్మి, హర్షిత, శ్రీసాత్విక, సిరిలయ, ఆరాధ్య మొదటి ఐదు స్థానాల్లో నిలవగా నిర్వాహకులు బహుమతులు అందజేశారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రఫీ, ఆర్గనైజర్ టి.వీరన్నతో పాటు శివకృష్ణ, కావ్య, హుస్సేన్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి ఏసీబీ సోదాలు
● అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుల్లో తనిఖీలు ● లెక్కకు మించి ఉన్న నగదు స్వాధీనం ● రికార్డులను వెంట తీసుకెళ్లిన అధికారులు పాల్వంచరూరల్/అశ్వారావుపేట/పెనుబల్లి: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఉమ్మడి జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో సోదాలు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆర్టీఏ చెక్ పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో పాల్వంచ మండలం జగన్నాథపురం, నాగారం కాలనీ గ్రామాల మధ్య బీసీఎం జాతీయ రహదారిపై ఉన్న చెక్‌పోస్టులో దాడులు నిర్వహించారు. కంప్యూటర్ డేటా, రికార్డులతోపాటు చెక్పోస్టులోఉన్న అధికారి, సిబ్బంది సెల్ఫోన్లను కూడా తనిఖీ చేశారు. ఓవర్‌లోడ్ ఫైన్, ట్యాక్స్ కలెక్షన్ వంటి విషయాల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలపై తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. లెక్కలో లేని రూ.26 వేల నగదు లభించిందని పేర్కొన్నారు. దొరికిన నగదు వ్యవహారంపై ఎంవీఐ, సిబ్బందిపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు సమాచారం. కాగా ఇదే చెక్ పోస్టులో గతేడాది ఆగస్టులో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అశ్వారావుపేట ఆర్టీఏ చెక్‌పోస్టులో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పెనుబల్లి మండల పరిధి లోని ముత్తగూడెం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన సొమ్ము కంటే అదనంగా రూ.6,660 ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎస్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
తుది నిర్ణయం ఏఐసీసీదే..
● డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ● డీసీసీకి 56, నగర అధ్యక్ష పదవికి 10 దరఖాస్తులు ● ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ వెల్లడిఖమ్మంమయూరిసెంటర్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర అధ్యక్ష పదవులకు నాయకుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అధ్యక్ష పదవులకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ వారం రోజుల క్రితం ఖమ్మం చేరుకున్నారు. తొలి రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత ప్రతీ నియోజకవర్గంలోని రెండు బ్లాక్‌ల్లో సమావేశాలు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. మొత్తంగా ఆయన 3,700 మందితో మాట్లాడారు. అధ్యక్ష పదవులకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారం ముగియగా.. డీసీసీ అధ్యక్ష పదవికి 56 మంది, నగర అధ్యక్ష పదవికి 10 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరితోనూ మహేంద్రన్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధ్యక్ష పదవులకు వచ్చిన దరఖాస్తుల్లో జిల్లాకు 6, నగరానికి 6 దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి 25వ తేదీ లోగా ఏఐసీసీకి అందజేస్తామని తెలిపారు. అందులో నుంచి ఒకరిని డీసీసీ అధ్యక్ష పదవికి, ఒకరని నగర అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని వివరించారు. కాగా, జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయిన మహేందరన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కార్పొరేటర్ రాపర్తి శరత్ తదితరులు కలిశారు. -
కారులో జర్నీ.. స్టార్ హోటళ్లలో బస
● 20 కేసుల్లో నిందితుడిగా హైటెక్ దొంగ ● వివరాలు వెల్లడించిన నగర ఏసీపీ రమణమూర్తి ఖమ్మంఅర్బన్: యుక్త వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయి చిన్నచిన్న పనులు చేస్తే వచ్చే డబ్బుతో సంతృప్తి లభించలేదు. దీంతో చోరీల బాట ఎంచుకున్న సదరు వ్యక్తి పలు కేసుల్లో శిక్ష అనుభవించినా తీరు మార్చుకోలేదు. చోరీసొత్తుతో కొన్న కారులోనే దొంగతనాలకు వెళ్లే ఆ నిందితుడు ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవనం సాగి స్తుండగా ఖమ్మంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో శనివారం నగర ఏసీపీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు.. ఏపీలోని గుంటూరు జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ శ్యామ్రిచర్డ్ 17 ఏళ్ల వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయాడు. హైదరాబాద్‌లోని ఓ జిరాక్స్ సెంటర్లో పనికి కుదిరినా వచ్చే డబ్బు సరిపోక దొంగతనాలు మొదలుపెట్టాడు. అలా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, సరూర్‌నగర్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, జీడి మెట్ల ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవాడు. ఫలితంగా పోలీసులకు పట్టుబడి పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా తీరు మార్చుకోలేదు. జిల్లాలోని ఖానాపురం హవేలీ, ఖమ్మం – 1, 2, 3 టౌన్‌తో పాటు రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, వైరా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇరవై ఇళ్లలో చోరీ చేశాడు. శుక్రవారం సాయంత్రం ఖమ్మంఅర్బన్ పోలీసులు ఖమ్మం – వైరా రహదారిపై వాహన తనిఖీలు చేపడుతుండగా కారులో వెళ్తున్న వంశీకృష్ణ వివరాలు ఆరా తీశారు. దీంతో చోరీల విషయం బయటపడింది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసినట్లు అంగీకరించడంతో 452గ్రాముల బంగారు నగలు (ప్రస్తుత విలువ రూ.51 లక్షలు), చోరీ సొమ్ముతో కొన్న ఎంజీ ఆస్టర్ కారు (రూ.15 లక్షలు) కలిపి రూ.66 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, చోరీ సొత్తును ఎప్పటికప్పుడు అమ్మేసే వంశీకృష్ణ ఆ డబ్బుతో బెంగళూరు, గోవా, హైదరాబాద్ నగరాల్లోని ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపేవాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్, ఎస్ఐ డి.శ్రావణ్‌కుమార్, సిబ్బంది వి.బాబు, వి.హరికృష్ణను ఏసీపీ అభినందించారు. -
అదనపు కోర్టులు ఏర్పాటుచేయండి
బూర్గంపాడు/కొత్తగూడెంటౌన్ : ప్రజల సౌలభ్యం కోసం భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు లేదా అసిస్టెంట్ సెషన్స్ కోర్టును, కొత్తగూడెంలో ఎస్సీ, ఎస్టీ కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానాన్ని, ఫ్యామిలీ కోర్టు, జువైనల్ జస్టిస్ బోర్డులు ఏర్పాటు చేయాలని కొత్తగూడెం, భద్రాచలం బార్ అసోసయేషన్ల సభ్యులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జె. శ్రీనివాసరావును కోరారు. సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో భద్రాచలం బార్ సభ్యులు, కొత్తగూడెం కోర్టులో స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులు ఈ మేరకు జడ్జికి వినతిపత్రాలు అందించారు. భద్రాచలం, మణుగూరు సబ్ డివిజన్లలో 600 పైగా సెషన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, జిల్లా కేంద్రం కొత్తగూడెం వెళ్లాలంటే ఈ ప్రాంత వాసులకు అసౌకర్యంగా ఉందని వివరించారు. ఆ తర్వాత కొత్తగూడెం బార్ అసో సియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ తదితరులు శ్రీనివాసరావును సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి పాటిల్ వసత్, అదనపు జిల్లా జడ్జి సరిత, సీని యర్ జడ్జిలు ఎం.రాజేందర్, కె.కిరణ్‌కుమార్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.కవిత, జూనియర్ జడ్జిలు కె.సాయిశ్రీ, బి.రవికుమార్, వి.శివనాయక్, డి.కీర్తిచంద్రికారెడ్డి బి.భవాని, కె.సురారెడ్డి, భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట దేవదానం, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, సభ్యులు జె.గోపీకృష్ణ, భాగం మాధవరావు, కాసాని రమేష్, ఉప్పు ఆరుణ్, ఆడపాల పార్వతి, మాలోత్ ప్రసాద్, కె.చిన్నికృష్ణ, కొడాలి శ్రీనివాసన్, పసుపులేటి రాంబాబు, రామకృష్ణ, సురేష్ పాల్గొన్నారు. హైకోర్టు జడ్జికి ‘బార్’ సభ్యుల విన్నపం -
చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి
బోనకల్: మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి కుంచం సందీప్ (16) శనివా రం మృతిచెందాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాల లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. దస రా సెలవుల అనంతరం కళాశాలకు వెళ్లడం ఇష్టంలేక ఇటీవల గడ్డిమందు తాగాడు. దీంతో గుర్తించిన ఆయ న తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. ఉరి వేసుకుని బలవన్మరణంకారేపల్లి: మానసిక ఇబ్బందుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన మాలోతు తావుర్యా – లక్ష్మి దంపతుల కుమారుడు సాయికుమార్ (25) రైల్వే కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఇటీవల బెంగళూరు ప్రాంతంలో పనులకు వెళ్లిన ఆయన దసరాకు ఇక్కడకు వచ్చి మళ్లీ వెళ్లాడు. తిరిగి ఈనెల 17వ తేదీన స్వ గ్రామానికి వచ్చిన సాయికుమార్ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. తల్లి లక్ష్మి అస్వస్థతకు గురికాగా ఆమెను చికిత్స నిమిత్తం తావుర్యా ఖమ్మం తీసుకెళ్లాడు. శనివారం సాయంత్రం వరకు స్నేహితులతో గడిపిన సాయికుమార్ ఉన్నట్టుండి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు తలుపు పగలకొట్టి సాయికుమార్‌ను ఇల్లెందు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
‘సాక్షి’పై కుట్రలు సరికాదు
కూసుమంచి: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను కాలరాసేలా వ్యవహరిస్తోందని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రజాసమస్యల ను వెలుగులోకి తీసుకొస్తున్న ‘సాక్షి’పత్రికతో పాటు ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్నికాలరాస్తోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం పాలేరు నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచిలో నిర్వహించిన ఆందోళనలో జర్నలిస్టులు, వివిధపార్టీలు, సంఘాల నా యకులుపాల్గొన్నారు. న్యూడెమోక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకట్రామిరెడ్డి, టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు పోలంపల్లి నాగేశ్వరరావుమాట్లాడుతూ.. సమాజానికి పత్రికలుమూల స్తం భాలుగా నిలుస్తుండగా వాస్తవాలను వెలికితీసే హక్కు ఉందని తెలిపారు. అయితే, ఏపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే సాక్షి మీడియా, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని, మీడియా గొంతు నొక్కితే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.కాంగ్రెస్,బీఆర్ఎస్, ఎన్డీ, సీపీఎం నాయకులు ఎండీ హఫీజుద్దీన్, ఎండీ కలీమ్,బాబునాయక్, ముత్తేశం, సైదానాయక్, వెంక న్న, చంద్రయ్య, బానోతుఉపేందర్, అద్దంకికోటయ్య, మల్లీడువెంకటేశ్వర్లు, ఉపేంద్రాచారి, సండ్ర బజారు, చెరకుపల్లివీరయ్య, బత్తులఉప్పలయ్య, ఎడవెల్లి రమ ణారెడ్డి, కొక్కిరేణి వీరస్వామి, వివిధ పత్రికల జర్నలిస్టులు, ఉద్యోగులు చాగంటి వెంకటేశ్వర్లు, మల్లెల ఉపేందర్, వాచేపల్లి హనుమంతరెడ్డి, పెంటమళ్ల కోట య్య, మెగిలి రామకృష్ణ, పందిరి వెంకటరెడ్డి, ఎండీ రంజాన్‌అలీ,మందులనాగరాజు, అత్తలూరి హనుమం తరావు,వడ్లమూడి వెంకటేశ్వర్లు, పోలేటి నారాయణ, గంధం రాంచందర్‌రావు, రాము, పడిశాల వెంకన్న, రాంబ్రహ్మం,వెంకటేశ్వర్లు, కర్ణబాబుపాల్గొన్నారు. -
భద్రాద్రి డీపీఓగా అనూష
చుంచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 62వ ర్యాంకుతో జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పోస్టుకు ఎంపికై న బొప్పన అనూషను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించారు. ఈమేరకు ఆమెను డీపీఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆరు జిల్లాలకు డీపీఓలను నియమించగా జాబితాలో ఖమ్మంకు చెందిన అనూష కూడా ఉన్నారు. ఐటీడీఏకు ఉత్తమ అవార్డుభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో కేంద్ర పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం బెస్ట్ ఐటీడీఏ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు పీఓ రాహుల్ శనివారంఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ధర్తీ ఆభా జాన్జాతీయ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పరిధిలోని 19 మండలాల్లో గల 130 గ్రామాల్లో ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం ప్రా రంభించామని, ఈ మేరకు గిరిజన సంక్షేమ, విద్యా, వైద్య, గ్రామీణాభివృద్ధి శాఖలను సమన్వయం చేస్తూ పనులు చేపట్టామని వివరించారు. విజన్ 2030 నాటికి ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో నడిచేలా ఆన్ని శాఖ లను అప్రమత్తం చేశామని వివరించారు. అవార్డు ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన పీఓ.. ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో ప్రతిభ చాటిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. పెద్దమ్మతల్లి ఆలయంలో నేడు రుద్రహోమం పాల్వంచరూరల్: మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆదివారంరుద్రహోమంనిర్వహించనున్నట్లుఈఓ ఎన్. రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 63034 08458 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
హైవే సర్వేను అడ్డుకున్న రైతులు
ఖమ్మంరూరల్: నాగ్‌పూర్ – అమరావతి హైవే నిర్మాణానికి మండలంలోని కామంచికల్‌లో శనివారం చేపట్టిన భూసర్వేను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూనిర్వాసితుల తరఫున హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే భూములు, బావులు, చెట్ల గుర్తింపునకు సర్వే చేయడం సరికాదన్నారు. మార్కెట్ ధర కంటే మూడింతలు రెట్టింపు పరిహారం చెల్లిస్తేనే భూమి ఇస్తామని తెలిపారు. రైతుల ఆందోళనతో రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు వెనుదిరిగారు. అనంతరం రైతులతో రెవెన్యూ అధికారులు చర్చించగా, పరిహారంపై తేల్చాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతులు వేములపల్లి సుధీర్, రాధాకృష్ణ, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, అనంతిని శ్రీనివాస్, శ్రీధర్, రఘు, పాటి వెంకటయ్య, ఉపేందర్‌రావు, రంగారావు, వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చూసొద్దాం రండీ !
భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో పర్యాటక రంగానికి పట్టుగొమ్మలాంటి పాపికొండల యాత్ర మళ్లీ సిద్ధమవుతోంది. వర్షాకాల సీజన్లో గోదావరి వరదల నేపథ్యంలో పర్యాటక యాత్ర నిలిచిపోగా.. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి గోదావరి ప్రవాహం నిలకడగా ఉండడంతో తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఏపీలోని రాజమండ్రి గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్‌కు అనుమతులు రావడంతో వారం కిత్రమే అక్కడ ప్రారంభించారు. కాగా గోదావరికి ఇవతల వైపున ఉన్న పోచవరం పాయింట్‌కు నేడో, రేపో అధికారిక అనుమతి రానుందని లాంచీల యజమానులు చెబుతున్నారు. దీంతో ఈ సీజన్‌కు పాపికొండల పర్యాటకాన్ని తిలకించేందుకు పలువురు రెడీ అవుతున్నారు. దసరా నాటికే కావాల్సి ఉన్నా.. ప్రతి ఏడాది భద్రాచలం నుంచి పరవళ్లు తొక్కుతున్న గోదావరికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారీగా వరదలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో గోదావరి ఉధృతిని దృష్టిలో పెట్టుకుని పాపికొండల విహారయాత్ర నిలిపేస్తుంటారు. ఈ ఏడాది జూలైలోనే ఈ యాత్రకు బ్రేక్ పడింది. ఈ సంవత్సరం భారీ వరదలు రాకున్నా గోదావరి నదీ ప్రవాహం నిరంతరం 30 – 45 అడుగుల మధ్య నమోదవుతూనే ఉంది. ఈ ఏడాది అత్యధిక పర్యాయాలు గోదావరి పరవళ్లు తొక్కడంతో పాపికొండల యాత్ర ఆలస్యమైంది. దసరా సెలవుల నుంచే పర్యాటక సీజన్ ప్రారంభం అవుతుంది. కానీ ఈ ఏడాది విజయదశమి నాటికి కూడా గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి రాకపోవడంతో జాప్యం జరిగింది. దీపావళి నేపథ్యంలో ఎదురుచూపులు.. మూడు నెలలుగా ఆగిపోయిన పాపికొండల పర్యాటకానికి ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం రాజమండ్రి వైపు నుంచి అనుమతి ఇచ్చింది. గండిపోచమ్మ గుడి బోటింగ్ పాయింట్ వద్ద వారం క్రితమే యాత్ర ప్రారంభమైంది. అయితే తెలంగాణ వైపు నుంచి అత్యధికంగా పర్యాటకులు వచ్చే పోచవరం పాయింట్ వద్ద అనుమతి కోసం ఏజెంట్లు, లాంచీల యజమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆదివారం, దీపావళి సెలవులు రావడంతో త్వరగా అనుమతిస్తే బాగుండేదని అంటున్నారు. యాత్రకు సంబంధించిన అన్ని పత్రాలూ సమర్పించామని, ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే ఆలస్యమని లాంచీల యజమానులు చెబుతున్నారు. వీరితో పాటుగా పర్యాటకంపై ఆధారపడి జీవిస్తున్న వివిధ రంగాల ప్రజలు సైతం యాత్ర ప్రారంభం కోసం వేచిచూస్తున్నారు. పాపికొండల యాత్ర ప్రారంభమైతే ఇటు ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రగిరిలోనూ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. పాపికొండల విహార యాత్ర నేడో, రేపో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమండ్రి వైపు యాత్ర నడుస్తోంది. పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద లాంచీలు సిద్ధంగా ఉన్నాయి. అనుమతి వస్తే ఇక సందడిగా మారనుంది. – మహేందర్, టికెట్ల విక్రయ కేంద్రం నిర్వాహకుడు, భద్రాచలంపచ్చని అడవులు, వాటి నడుమ అమాయక ఆదివాసీల జీవన విధానం, కట్టూబొట్టు, సంస్కృతి, సంప్రదాయాలు దర్శనమిచ్చే పాపికొండల యాత్ర ఎంతో మధురానుభూతిని నింపుతుంది. రెండు రోజుల్లో కార్తీక మాసం సైతం ప్రారంభం కానుండడంతో భక్తులు, పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో పాపికొండల పర్యాటక ధరలను గతంలో మాదిరిగానే నిర్ణయించారు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున వసూలు చేయనున్నారు. ఇక కళాశాల, పాఠశశాలల విద్యార్థులకు ప్యాకేజీలు ప్రకటించాల్సి ఉంది. పోచవరం ఫెర్రీ పాయింట్ వద్దకు చేరుకోవడానికి సొంత వాహనాల్లో లేదంటే భద్రాచలంలో ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. -
ముష్టికుంట్ల వాసికి డాక్టరేట్
బోనకల్: మండలంలో ని ముష్టికుంట్లకు చెంది న కేవీ నారాయణకు డాక్టరేట్ లభించింది. ‘ది రైటింగ్స్ ఆఫ్ ఆర్కే నారాయణ్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లిష్’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథాని కి ఉత్తరప్రదేశ్‌లోని జేఎస్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. కాగా, నారాయణ ప్రస్తుతం ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా డు. అంతేకాక సొంత ఇన్స్టిట్యూట్ ద్వారా పేద విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించారు. 26న సింగరేణి ఆధ్వర్యాన జాబ్‌మేళా సత్తుపల్లి: సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 26న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. సంస్థ ఆధ్వర్యాన నిర్వహించే జాబ్‌మేళా పోస్టర్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణి గనులతో కిష్టారం వాసులు నష్టపోయినందున గ్రామంలో పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసు కోవాలని సూచించారు. అలాగే, సైలో బంకర్ నుంచి వాయు కాలుష్యం వెలువడకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని తెలిపారు. మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు, చల సాని సాంబశివరావు, సింగరేణి పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు పాల్గొన్నారు. టీటీడీ ఆలయ ప్రతిపాదిత స్థలంలో పనులు ఖమ్మంఅర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన ఖమ్మం 15వ డివిజన్ అల్లీపురంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలంలో శనివారం చెట్ల తొలగింపు పనులను ప్రారంభించారు. ఇక్కడ సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమిని ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించగా ఇటీవల దేవాదాయ శాఖ స్థపతి, అధికారులు పరిశీలించారు. అయితే, కంపచెట్లు తొలగించి భూమిని చదును చేస్తే పూర్తిస్థాయి స్వరూ పం తెలుస్తుందన్న సూచనలతో పనులు మొదలుపెట్టారు. వీ.వీ.పాలెం సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు, నాయకులు పత్తిపాటి వీరయ్య, గౌని గోవర్దన్, పత్తిపాటి అప్పారావు, పత్తిపాటి వెంకటేశ్వర్లు, యనిగండ్ల సత్యనారాయణ, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, సనగండ్ల ఉపేందర్‌రావు, సామినేని సైదులు, ముత్తయ్య, గుండె ఆదినారాయణ, దమ్మాలపాటి సైదులు పాల్గొన్నారు. బందోబస్తును పరిశీలించిన సీపీఖమ్మంక్రైం: రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం బంద్‌కు పిలుపునివ్వగా.. పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించారు. బందోబస్తుపై ఆరాతీసిన ఆయన శాంతిభద్రతల కు విఘాతం ఏర్పడకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఏసీపీ రమణమూర్తి, సీఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీమా పరిహారం చెల్లించాల్సిందే.. ఖమ్మంలీగల్: ఆరోగ్య బీమా పథకంలో పాలసీ తీసుకున్న వారికి చికిత్స ఖర్చులు చెల్లించాల్సిందేనని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత తీర్పు చెప్పారు. రెండు కేసుల్లో శనివారం వెలువరించిన తీర్పుల వివరాలిలా ఉన్నాయి. మధిర మండలానికి చెందిన బలగం జయమహేశ్వరనాయక్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి 2021లో రూ.15,287 చెల్లించి ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నాడు. రూ.5.50 లక్షల పరిమితితో ఈ పాలసీ తీసుకోగా, కొన్నాళ్లకే మహేశ్వరనాయక్ కరోనా బారిన పడితే ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సచేయించుకున్నాడు. ఆయనవైద్యం బిల్లులు చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయిస్తే క్లెయిమ్ నిరాకరించారు. దీంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో న్యాయవాదులు వెల్లంపల్లి నరేంద్రస్వరూప్, కొలికొండ శరత్‌బాబు ద్వారా కేసు నమోదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారు చికిత్సకు అయిన రూ.94,945తో పాటు వేదనకు గురిచేసినందుకు రూ.10వేలు, ఖర్చుల కింద రూ.10వేలను 45రోజుల్లో చెల్లించాలని తీర్పు వెలువరించారు. అలాగే, బలగం స్వరూపారాణి దాఖలు చేసిన కేసులో ఆమె చికిత్సకు అయిన రూ.71,245తో పాటు మనోవేదన, ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని తీర్పు చెప్పారు. -
జలవనరుల శాఖ పనుల పరిశీలన
ఖమ్మంఅర్బన్: జిల్లాలో జలవనరుల శాఖ ఆధ్వర్యాన జరుగుతున్న పనులను ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ ఓలేటి వెంకటరమేశ్బాబు శనివారం పరిశీలించారు. ఖమ్మం కై కొండాయిగూడెం వద్ద 21 ఎంబీబీసీపై వంతెన నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించడమే కాక టేకులపల్లి వంతెన సమీపాన ప్రధాన రహదారి పక్కన రిటైనింగ్ వాల్ నిర్మాణ స్థలంపై ఆరా తీశారు. అలాగే, వైరా మండలంలో రిజర్వాయర్ కాల్వల ఆధునికీకరణ పనులు, స్నానాల లక్ష్మీపురంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, చెక్‌డ్యాం పనులను పరిశీలించారు. పనుల నాణ్యత, నిర్మాణంలో సాంకేతిక అంశాలపై ఉద్యోగులకు సీఈ సూచనలు చేశారు. ప్రతిపాదిత పనుల్లో మార్పులు అవసరమైతే చేయాలని ఆదేశించారు. జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అనన్య, బాబూరావు, డీఈ గోపాల్‌రావు, ఏఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
సేవాభావంతోనే వైద్యరంగంలో ఉన్నతి
‘వైట్ కోట్ సెర్మనీ’లో కలెక్టర్ అనుదీప్ఖమ్మంవైద్యవిభాగం: వైద్య వృత్తి పవిత్రమైందని.. చికిత్స కోసం వచ్చే వారితో సేవాభావం కలిగి ఉండడం ద్వారా వృత్తిలో ఉన్నతి సాధ్యమవుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో శనివారం నిర్వహించిన నూతన బ్యాచ్ వైట్ కోట్ సెర్మనీలో ఆయన మాట్లాడారు. ప్రజలు వైద్యులపై అపారమైన నమ్మకంతో వస్తారని, వైద్యులను దేవుళ్లుగా కొలుస్తారని తెలిపారు. వైద్య వృత్తిని ఎన్నుకున్న విద్యార్థులు వృత్తిలో రాణించడమే కాక పేద, ధనిక బేధం లేకుండా చికిత్స అందించాలనే తపన కలిగి ఉండాలని చెప్పారు. ఇటీవల తమ కుటుంబంలోని ఒకరికి కీలకమైన సర్జరీ నిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా నిర్వహించారన్నారు. కోయంబత్తూర్‌కు చెందిన అరవింద్ అనే ఆఫ్తమాలజిస్ట్ తన కెరీర్లో వేల మందికి చికిత్స చేసి కంటి చూపును కాపాడారని తెలిపారు. వృత్తిపై ప్రేమ కలిగి ఉండడం, దానిపై పట్టు సాధించడం, కాలానుగుణంగా పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరొచ్చని కలెక్టర్ వెల్లడించారు. ఇదే సమయాన వైద్యులు సైతం ఒత్తిడి తగ్గించుకుంటూ వారి ఆరోగ్యంపైనా దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు వైట్ కోట్లు అందజేసి ప్రమాణం చేయించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్, రాజేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాళ్లు సరిత, సృజన, వేణు, కిరణ్ కుమార్, రాంప్రసాద్, వైద్య కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు సిద్ధం
‘జిల్లాలో పండించిన పత్తి, ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం సిద్ధమైంది. అమ్మకానికి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరు కూడా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. దీపావళి తర్వాత ఎనిమిది సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి, వచ్చే నెల మొదటి వారం నాటికి 326 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలవుతాయి. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా అన్ని నియోజకవర్గాల్లో గోదావరి ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చాం. అధునాతన పరిజ్ఞానంతో ఖమ్మంలో రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నాం.’ అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పలు అంశాలపై ‘సాక్షి’కి శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షిప్రతినిధి, ఖమ్మంయాప్లో నమోదు తప్పనిసరి దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు చర్యలు చేపట్టింది. అయితే, రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో పంట వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బందితో నమోదు చేయించుకోవాలి. తద్వారా సీపీఐ కేంద్రాల్లో పత్తిని వెంటనే కొనుగోలు చేస్తారు. ఈ విషయమై రైతులకు ఇప్పటికే అవగాహన కల్పించాం. జిల్లాలోని ఎనిమిది జిన్నింగ్ మిల్లుల్లో దీపావళి తర్వాత సీసీఐ కేంద్రాలు ఏర్పాటవుతాయి. తేమ శాతం తక్కువగా ఉండి, నాణ్యమైన పత్తిని తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుంది. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలి. పత్తి కొనుగోళ్లను అదనపు కలెక్టర్, మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు. 72గంటల్లోగా ధాన్యం నగదు, బోనస్ వరి ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 326 కేంద్రాలు తెరుస్తాం. కల్లూరు మండలంలో ముందుగా కోతలు మొదలుకావడంతో అక్కడ రెండు కేంద్రాలు తెరిపించాం. వచ్చే నెల మొదటి వారం నాటికి అన్ని కేంద్రాలు తెరుచుకోనుండగా, ఒక్కో కేంద్రంలో నలుగురు సిబ్బంది ఉంటారు. అక్కడ కావాల్సిన వేయింగ్ మిషన్లు, గన్నీలు, టార్పాలిన్లు సిద్ధంగా ఉన్నాయి. ధాన్యం వివరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేసేలా సిబ్బందికి శిక్షణ ఇప్పించాం. సన్నధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో 72 గంటల్లోగా మద్దతు ధర, బోనస్ జమ అవుతుంది. చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా పౌర సరఫరాల సంస్థ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తారు. ధాన్యం తరలించాక ఎలాంటి తరుగు తీయొద్దని మిల్లర్లకు చెప్పాం. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి జిల్లాకు ఖమ్మం నగరం గుండెకాయ వంటింది. జిల్లా జనాభాలో సుమారు 50 శాతం ఇక్కడే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాం. రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా జాతీయ రహదారులకు వాడే కోల్డ్ మిక్స్‌ను మరమ్మతులకు వాడాలని చెప్పాం. ఇప్పటికే ఈ పనులు జరుగుతున్నాయి. కోల్డ్ మిక్స్ అనేది కొత్త టెక్నాలజీ. ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏఐ, కార్పొరేషన్ అధికారులతో సమావేశమై రోడ్ల నిర్వహణ, మరమ్మతులపై సూచనలు చేశాం. అలాగే, శానిటేషన్ కోసం కొత్త పరికరాలు కొనుగోలు చేయాలని చెప్పాం. పర్యాటక అభివృద్ధిలో భాగంగా రోప్ వేకు అవసరమైన భూ సమస్య కూడా పరిష్కారమైంది. ఇక టీటీడీ ఆలయ నిర్మాణానికి అల్లీపురంలో భూమి గుర్తించాం.జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇబ్బందులు లేవు. జిల్లా మంత్రుల ఆదేశాలతో ప్రతీ నియోజకవర్గంలో గోదావరి ఇసుకతో ఇసుక బజార్ ఏర్పాటు చేయించాం. కూసుమంచి, ఖమ్మంఅర్బన్, కామేపల్లి, మధిర, సత్తుపల్లిలోని ఈ పాయింట్ల ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక అందిస్తున్నాం. స్థానికంగా ఇసుక దొరికితే అక్కడ కూడా కూపన్ల ద్వారా ఇప్పిస్తు న్నాం. ఆధార్‌లో పేరు తప్పుగా ఉండడం, బ్యాంక్ అనుసంధానం కాకపోవడంతో కొందరి ఖాతాలో నగదు పడలేదు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారితో ఇంకొన్ని కారణాలతో సుమారు 100మందికి ఖాతాలో డబ్బ జమ కాలేదు. వీటిపై విచారణ చేపట్టి పరిష్కరించాం. జిల్లాలో 16వేలకు పైగా చిలుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే వంద వరకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. లబ్ధిదారులందరికీ దశల వారీగా క్రమం తప్పక బిల్లులు చెల్లిస్తున్నాం. దీపావళి తర్వాత పత్తి కొనుగోళ్లకు సీసీఐ కేంద్రాలు -
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూలవిరాట్ పాటు ఆలయ ఆవరణలోని స్వామి వారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరి పించారు. అలాగే, పల్లకీ సేవ నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ను కలిసిన ఆర్టీఐ కమిషనర్ ఖమ్మం సహకారనగర్: ఆర్టీఐ కమిషనర్ పీ.వీ.శ్రీనివాసరావు శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు, అధికారులకు అవగాహన, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్‌తో ఆయన చర్చించారు. దీపావళికి బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ఖమ్మంమయూరిసెంటర్: దీపావళి పండుగ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చి నట్లు ఉమ్మడి జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజశేఖర్ బాబు తెలిపారు. రూ.1కే సిమ్ అందించడమే కాక 30 రోజుల కాల పరిమితితో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉంటాయని పేర్కొన్నారు. కొత్తగా సిమ్ తీసుకునే వారికే కాక పోర్టబిలిటీ వినియోగదారులకు సైతం ఈ ప్లాన్ వర్తిస్తుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం సమీపంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్లో సంప్రదించాలని డీజీఎం ఓ ప్రకటనలో సూచించారు. పశువులకు గాలికుంటు నివారణ టీకాలు ఖమ్మం అర్బన్: జిల్లా వ్యాప్తంగా పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం గొల్లగూడెం శ్రీ కృష్ణ గోశాలలో శనివారం పశువులకు వ్యాక్సిన్ వేశాక ఆయన మాట్లాడారు. రైతులంతా తమ పశువులకు వ్యాక్సిన్ వేయించాలని, తద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు. ఈసందర్భంగా గోశాలలో 644 పశువులకు టీకాలు వేశారు. డాక్టర్ కాంతికుమార్, ఉద్యోగులు మణిదీప్, కృష్ణ, సత్యనారాయణ, గోశాల బాధ్యులు కేసా హన్మంతరావు, అకితే చౌదరి పాల్గొన్నారు. మొక్కజొన్న సాగుకు అగ్రిమెంట్ తప్పనిసరి వైరా: విత్తన మొక్కజొన్న కంపెనీల ప్రతినిధులతో అన్ని అంశాలపై అగ్రిమెంట్ చేసుకున్నాకే రైతులు సాగు మొదలుపెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరంలో ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీతో కలిసి ఆయన రైతులకు అవగాహన కల్పించారు. నోటి మాటగా చెప్పే ఏజెంట్లను నమ్మకుండా తప్పక అగ్రిమెంట్ చేసుకోవాలన్నారు. నమ్మకమైన ఏజెంట్ల వద్ద మాత్రమే విత్తనాలు తీసుకోవాలని, లాభా ల పేరిట గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాట లను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పారు. కాగా, పత్తి రైతులు పంట నమోదు చేయించుకోవడమేకాక సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని డీఏఓ సూచించారు. ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ రాజేష్, రైతులు పాల్గొన్నారు -
బీసీ రిజర్వేషన్‌తోనే మోదీకి పీఎం పదవి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసత్తుపల్లి: గుజరాత్లో బీసీ రిజర్వేషన్‌తోనే మోదీకి ప్రధాన మంత్రి పదవి దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన బంద్‌లో భాగంగా సత్తుపల్లిలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో తుమ్మల మాట్లాడుతూ చట్టబద్ధంగా చేసిన సవరణలను చూసి రిజర్వేషన్ల ఆమోదానికి ప్రధాని మోదీ కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో బీసీలకు అన్యాయం చేసిన బీజేపీకి రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్ పెట్టడం బీజేపీ ధ్వందవైఖరికి నిదర్శనమని తెలిపారు. సామాజిక న్యాయం కోసం రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీ గణన చేపట్టి బీసీ బిల్లును తీసుకొచ్చారని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్, నాయకులు గాదె చెన్నారావు, దండు ఆదినారాయణ, ఉడతనేని అప్పారావు, ఎం.డీ.కమల్‌పాషా, కె.సర్వేశ్వరరావు, నిమ్మటూరి రామకృష్ణ, టి.యోబు, తోట సుజలరాణి తదితరులు పాల్గొన్నారు. -
బంద్ సంపూర్ణం, ప్రశాంతం
● బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పిలుపు ● మద్దతు తెలిపిన అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ● మధ్యాహ్నం వరకు డిపోలు దాటని బస్సులు ఖమ్మంమయూరిసెంటర్: బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్న పార్టీలు, ప్రభుత్వాలు ఇకనైనా జనాభా దామాషా ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని.. లేకుంటే రాష్ట్రంలో మరో ఉద్యమం తప్పదని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యాన శనివారం రాష్ట్ర బంద్‌లో భాగంగా ఖమ్మంలో చేపట్టిన బంద్ ప్రశాంత వాతావరణంలో విజయవంతమైంది. బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, మాస్‌లైన్, న్యూడెమోక్రసీ, తెలంగాణ జన సమితి, ఆమ్ఆద్మీ పార్టీల నాయకులే కాక ప్రజా, విద్యార్థి సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఈమేరకు శనివారం తెల్ల వారుజామున 4గంటలకే జేఏసీ, అఖిలపక్ష పార్టీల నాయకులు ఖమ్మం బస్‌డిపోకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం ఖమ్మం పాతబస్టాండ్ ఎదురుగా జేఏసీ ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. బంద్‌తో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోగా, పెట్రోల్ బంక్‌లు, షాప్‌లను స్వచ్ఛందంగా మూసివేశారు. రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే.. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని వక్తలు పేర్కొన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు గుండాల కృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ నాయకుడు మందుల రాజేంద్రప్రసాద్ తదితరులు మాట్లాడుతూ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పాలకులు తమ అవసరాలకు బీసీలను వాడుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీలు, కుల, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు కూరాకుల నాగభూషణం, కొత్తా సీతారాములు, ఆకుల గాంధీ, ఆవుల అశోక్, వై.విక్రమ్, శెట్టి రంగారావు, బిచ్చాల తిరుమలరావు, కత్తి నెహ్రూ, జి.రామయ్య, పుచ్చకాయల వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, చెరుకుపల్లి నాగేశ్వరరావు, సిద్దా సాహెబ్, షేక్ షకీనా, ఎలమందల జగదీష్, పిండిపోలు రామ్మూర్తి చిలకల వెంకటనర్సయ్య, తూరుగంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీల బంద్‌కు బీజేపీ నాయకులు సైతం మద్దతు తెలిపి కొత్త బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో బీసీలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఇక ఎస్ఎఫ్ఐ, ఏఐ ఎస్ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యాన నగరంలో తెరిచి ఉన్న విద్యాసంస్థలను మూసివేయించారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ చేపట్టిన బంద్ ప్రభావం ఆర్టీసీపై పడింది. శనివారం తెల్లవారుజాము నుంచే నాయకులు రీజియన్‌లోని ఏడు డిపోలు, బస్టాండ్ల ఎదుట బైఠాయించారు. దీంతో అధికారులు బస్సులను డిపోలు, బస్టాండ్లకే పరిమితం చేశారు. రీజియన్‌లో 562 బస్సులకు గాను 450 బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని బస్సులను మధ్యాహ్నం తర్వాత నడిపించినా పెద్దగా ఫలితం కానరాలేదు. దీంతో ఆర్టీసీ రూ.1.10 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని అధికారులు వెల్లడించారు. కాగా, బస్సులు లేకపోవడంతో దీపావళికి స్వస్థలాలకు బయలుదేరిన వారు ఇబ్బంది పడ్డారు. -
నాణ్యమైన బొగ్గుతోనే సింగరేణికి పేరు
సింగరేణి(కొత్తగూడెం): వినియోగదారులకు నాణ్య మైన బొగ్గు అందించడం ద్వారా సింగరేణి పేరు నిలుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూవ్మెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బాదావత్ వెంకన్న తెలిపారు. కొత్తగూడెం ఏరియాలోని వీకే–7 ఓసీ, ఓసీ సీహెచ్‌పీ పనులను ఆయన శనివారం తనిఖీ చేశారు. రుద్రంపూర్ ప్రాంతంలోని మాయాబజార్ వద్ద నిర్మించే సీహెచ్‌పీ ప్లాన్‌పై ఆరా తీశారు. నవంబర్‌లో వీకే–7 ఓసీ మొదలైతే బొగ్గు ఉత్పత్తి, రవాణా మెరుగుపడుతుందని తెలిపారు. ఆ తర్వాత వ్యాగన్ లోడింగ్ పాయింట్, పీవీకే బంకర్, రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు సత్తుపల్లి ఓసీల నుంచి వచ్చే బొగ్గు నాణ్యతను పరిశీలించారు. అనంతరం పీవీకే–5 గనిని ఈడీ సందర్శించారు. ఏరియా జీఎం శాలేం రాజు, ఏరియా ఇంజనీర్ కె.సూర్యనారాయణ రాజు, అధికారులు రామకృష్ణ, శ్రీరమేష్, ఖనిరామ్ భరోసే మహతో, వి.శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ శాఖకు కిక్కు...
● 116 వైన్స్‌కు 4,043 దరఖాస్తులతో రూ.121.29కోట్ల ఆదాయం ● గత పాలసీతో పోలిస్తే తగ్గిన ఆదాయం, దరఖాస్తులు ● చివరిరోజు రాత్రి పొద్దుపోయే వరకు స్వీకరణఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ కేటాయింపునకు గతనెల 26వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. అయితే, శుక్రవారం వరకు 2,390 దరఖాస్తులే నమోదు కాగా చివరిరోజు ఏకంగా 1,653 దరఖాస్తులు అందాయి. దీంతో జిల్లాలోని మొత్తం వైన్స్‌కు 4,043 దరఖాస్తులు అందగా ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున ఎకై ్సజ్ శాఖకు రూ. 121.29కోట్ల ఆదాయం సమకూరింది. గత పాలసీలో 122 వైన్స్‌కు గాను 7,200 దరఖాస్తులు రావడంతో రూ.2లక్షల చొప్పున రూ.144 కోట్ల ఆదా యం లభించింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెంచడంతోనే 3వేలకు పైగా దరఖాస్తులు తగ్గాయని భావిస్తున్నారు. కాగా, ఈనెల 23వ తేదీన లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయిస్తారు. డిసెంబర్ 1నుంచి నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా కొత్త వ్యాపారులు రెండేళ్ల కాలపరిమితితో వైన్స్‌ను ప్రారంభిస్తారు. వారు సైతం రంగంలోకి... గతంలో ఖమ్మంలోని వైన్స్ దక్కించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల మద్యం వ్యాపారులు ఆసక్తి చూపేవారు. కానీ ఈసారి ఉమ్మడి కృష్ణా నుంచే కాక విజయనగరం, వైజాగ్ వ్యాపారులు ముందుకు రావడం విశేషం. రెండు రోజుల క్రితమే ఖమ్మం చేరుకున్న వారు ఇక్కడే బస చేసి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ అమ్మకాలు ఉండే వైన్స్‌ను ఎంచుకుని టెండర్లు దాఖలు చేశారు. పల్లీలు అమ్మే వ్యక్తి కూడా.. ఈసారి వైన్స్ దక్కించుకోవడానికి బడా వ్యాపారులే కాక చిరువ్యాపారులు సైతం ఆసక్తి కనబరిచారు. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని ఓ వైన్స్ ముందు పల్లీలు, ఇతర తినుబండారాలు అమ్మే ఓ వ్యక్తి అదే షాప్ కోసం టెండర్ దాఖలు చేశాడు. గత పాలసీలో మూడు దుకాణాలకు టెండర్ వేసినా దక్కలేదని ఆయన వెల్లడించాడు. ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెరగడంతో ఒకే దరఖాస్తు దాఖలు చేశానని.. తప్పనిసరి షాప్ వస్తుందని నమ్ము తున్నట్లు చెప్పడం విశేషం. ఎకై ్సజ్ అధికారుల ప్రచారంతో... మద్యం టెండర్లు చాలారోజులు మందకొడిగానే నమోదయ్యాయి. కొన్నిరోజులైతే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఎకై ్సజ్ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. వ్యాపార వర్గాలతో సమావేశమవుతూ వైన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇలా సుమారు 25వేల మంది వ్యాపారులతో బృందాలుగా సమావేశాలు నిర్వహించినట్లు ఎకై ్సజ్ ఉద్యోగుల ద్వారా తెలిసింది. తద్వారా చివరి రోజు నాటికి భారీగా దరఖాస్తు నమోదయ్యాయని భావిస్తున్నారు.మద్యం వ్యాపారులు ఈసారి పలు షాపులకు బల్క్‌గా దరఖాస్తులు వేశారు. ఓ బడా వ్యాపారి, ఆయన బృందం భద్రాద్రి జిల్లాలోని 70 షాపులకు టెండర్లు వేయగా, ఖమ్మం జిల్లాలోని సింగరేణి మినహా మిగతా అన్ని స్టేషన్ల పరిధిలో 150పైగా దరఖాస్తులు వేసినట్లు తెలిసింది. అలాగే, ఇంకో రెండు బృందాలు కూడా భారీగానే టెండర్లు దాఖలు చేశాయి. భారీగా అమ్మకాలు ఉంటాయని చెప్పే ఓ షాప్‌ను ఎంచుకున్న వ్యాపారుల బృందం పదుల సంఖ్యలో టెండర్లు వేసిందని సమాచారం. ఇక గ్రానైట్ వ్యాపారులు సైతం ఈసారి వైన్స్ దక్కించుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిసింది. కొన్ని ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 10మంది చొప్పున నగదు జమ చేసి ఒకటి, రెండుషాప్లకు టెండర్లు వేశారని సమాచారం. రిజర్వేషన్లు ఉన్న షాప్‌ల కోసం బడా వ్యాపారులు తమ బినామీలతో దరఖాస్తు చేయించారని చెబుతున్నారు. -
2వేలు దాటిన వైన్స్ దరఖాస్తులు
ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ షాపులకు టెండర్ల స్వీకరణ గడువు శనివారంతో ముగియనుంది. అయితే, ఇన్నాళ్లు తక్కువగా దరఖాస్తులు అందగా, శుక్రవారం వీటి సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు ఇప్పటివరకు 2,050 దరఖాస్తులు అందగా, రూ.3లక్షల చొప్పున ఎకై ్సజ్ శాఖకు రూ.61.50కోట్ల ఆదాయం సమకూరింది. చివరిరోజైన శనివారం భారీగా దరఖాస్తులు నమోదయ్యే అవకాశముండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 5గంటల వరకు క్యూలో ఉన్న ప్రతీ ఒక్కరి దరఖాస్తు స్వీకరిస్తామని జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగేందర్‌రెడ్డి తెలిపారు. మొత్తంగా దరఖాస్తు ఫీజు రూపంలో రూ.100కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. -
చేప పిల్లల పంపిణీకి సిద్ధం
● జిల్లాలో 882 జలాశయాల గుర్తింపు ● 3.48 కోట్ల పిల్లల విడుదలకు ఏర్పాట్లుఖమ్మంవ్యవసాయం: ఈ ఏడాది కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు ఉచిత చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ సిద్ధమైంది. ఆగస్టు ఆరంభం నుంచే కసరత్తు చేస్తుండగా వివిధ కారణాలతో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు సెప్టెంబర్ చివరి వారంలో కాంట్రాక్టర్లు పాల్గొనగా టెండర్లు ఖరారు చేశారు. ఈమేరకు జిల్లాలోని 882 జలాశయాల్లో చేపపిల్లల విడుదలకు ముగ్గురు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. మొత్తం 3.48 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నారు. ఇందులో 80–100 మి.మీ.ల చేప పిల్లలు 2.16 కోట్లు, 35–40 మి.మీ. పొడవైనవి 1.32 కోట్లు ఉంటాయి. పెద్ద చేప పిల్లకు రూ.1.70, చిన్న చేపలకు 68 పైసలను కాంట్రాక్టర్లకు చెల్లించేలా ధర ఖరారైంది. మొత్తంగా ప్రభుత్వం జిల్లాకు రూ.4.42 కోట్లు కేటాయించగా, విడుదల చేసే చేపపిల్లల్లో బొచ్చ, రవ్వు, బంగారుతీగ, మోసు తదితర రకాలు ఉన్నాయి. త్వరలోనే విడుదల టెండర్లు ఖరారైన నేపథ్యాన జిల్లాలోని జలాశయాల్లో త్వరలోనే చేపపిల్లలు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం శుక్రవారం లాంఛనంగా ప్రారంభించింది. ఒకటి, రెండు రోజుల్లో జిల్లాలోనూ చేపపిల్లల పంపిణీ మొదలయ్యే అవకాశముందని జిల్లా మత్స్య శాఖాధికారి శివప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని జలాశయాలు నిండా నీటితో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యాన చేప పిల్లలను విడుదల చేస్తే మార్చి, ఏప్రిల్ నాటికి అవి పెరగనున్నాయి. జిల్లాలో సుమారు 16వేల మంది మత్స్యకారులు చేపల వేట, అమ్మకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. -
రైతుల బీమా కోసం రూ.17.53 లక్షలు
ఖమ్మం అర్బన్: టేకులపల్లి ఆంధ్రాబ్యాంక్ సేవా సంఘం లిమిటెడ్‌లో సభ్యులైన రైతులకు బీమా ప్రీమియం చెల్లించాలని పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. ఖమ్మం రాధాకృష్ణనగర్‌లోని సంఘం కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ నాగచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరగగా రుణాల వసూళ్లలో వేగం పెంచి, కొత్త రుణాల మంజూరు చేయాలని తీర్మానించారు. అంతేకాక రూ.1.09 లక్షలతో పాలేరు నియోజకవర్గం గోకినపల్లిలో ఎరువుల గోదాం నిర్మాణం, బంగారం తాకట్టు రుణాలు గ్రాముకు రూ.5,700 నుంచి రూ.7వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇంకా 59ఏళ్ల లోపు 2,737మంది సభ్యులకు బీమా కోసం రూ.630 చొప్పున రూ.17.53 లక్షల ప్రీమియం చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ఎండీ లక్ష్మీప్రసన్న, సీఈఓ బి.అశోక్, వైస్ చైర్మన్ తమ్మినేని విజయలక్ష్మి, డైరెక్టర్లు వాకధాని రాంనారాయణ, కుర్ర భాస్కరరావు, రావెల కిషన్, మన్నేపల్లి రవి, లింగా నాగార్జున, భూక్యా ఉపేందర్, పొన్నం వెంకటేశ్వర్లు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ భూగర్భ కేబుల్ పనుల పరిశీలన మధిర: మధిరలోని ఆత్కూర్ క్రాస్ నుంచి మెయిన్ రోడ్డు మీఉదగా నందిగామ బైపాస్ వరకు రూ.28 కోట్ల వ్యయంతో వేస్తున్న భూగర్భ విద్యుత్ లైన్ పనులను ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ వంగూరి మోహన్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఉద్యోగులతో కలిసి పనులను పరిశీలించిన ఆయన త్వరగా పూర్తయ్యేలా వేగం పెంచాలని సూచించారు. తొలుత డైరెక్టర్‌ను ఉద్యోగులు సన్మానించారు. చీఫ్ ఇంజనీర్ తిరుమలరావు, డీఈలు బండి శ్రీనివాసరావు, భద్రుపవార్, ఏడీఈ ఎం.అనురాధ, ఏఈ ఎస్.అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు కల్లూరు రూరల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది నిబంధనల మేరకు వ్యవహరించాలని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ స్పష్టం చేశారు. కల్లూరు మండలం చండ్రుపట్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనికీ చేశారు. ఈ సందర్భంగా డీసీఎస్ఓ చందన్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 327 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతీ కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు, ఎలక్ట్రానిక్ కాంటా సిద్ధం చేసుకోవడమే కాక ఒక్కో బస్తాలో 40.700 కేజీ ధాన్యమే నింపాలని సూచించారు. కాంటాలు, మిల్లులకు తరలింపులో పొరపాట్లకు తావివ్వొద్దని ఆయన ఆదేశించారు. ‘చాంబర్’ ఎన్నికల షెడ్యూల్ విడుదల నవంబర్ 16న పోలింగ్, అదేరోజు ఫలితాలు ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి పీబీ.శ్రీరాములు శుక్రవారం విడుదల చేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ బేరర్ల పదవులతో పాటు 18 శాఖల పదవులకు నవంబర్ 16న ఎన్నిక నిర్వహించనున్నారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించి, 30వ తేదీన పరిశీలిస్తారు. ఇక 31న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చి బరిలో మిగిలిన వారి జాబితా విడుదల చేస్తారు. ఆపై నవంబర్ 16న పోలింగ్ నిర్వహించి అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలంతో పాటు సోమ నరసింహారావు, మన్నెం కృష్ణ పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పాత్రికేయలోకం డిమాండ్ చేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కల్తీ మద్యం వ్యవహారంపై ‘సాక్షి’ పత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ‘సాక్షి’ యాజమాన్యంతో పాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది. సంస్థ కార్యాలయాల్లోకి జొరబడి నిర్బంధ విచారణ సాగిస్తోంది. తరచూ నోటీసులు జారీ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో శుక్రవారం జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వం కక్ష గట్టి వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని, తప్పిదాలను ఎత్తి చూపితే సరిచేసుకోవాలే కానీ నేరంగా భావించకూడదని పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి
ఖమ్మం అర్బన్: జిల్లా కేంద్రంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం ముస్తఫానగర్‌లో రూ.3 కోట్లతో నిర్మించే బీసీ బాలుర వసతి గృహం పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ముస్తఫానగర్‌లో బీసీ వసతి గృహ నిర్మాణానికి రూ.3కోట్లు మంజూరు చేయగా, నగరంలోని కూలే స్థితిలో ఉన్న మరో మూడు హాస్టళ్లకు కూడా రూ.9 కోట్లు కేటాయించామని తెలిపారు. భవనాలు కలకాలం నిలిచేలా నాణ్యతతో నిర్మించాలని సూచించారు. కాగా, ప్రజల అంగీకారంతోనే బోనకల్ రోడ్డును విస్తరిస్తామని మంత్రి తెలిపారు. అయితే, అభివృద్ధి కోసం రోడ్డు వెడల్పు పనులకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. నష్టపోయే వారికి పరిహారం అందిస్తామని చెప్పారు. ఇక రైల్వేస్టేషన్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి.. కార్పొరేటర్లు వారి డివిజన్లలో విస్తరించాల్సిన రోడ్ల వివరాలతో ప్తిపాదనలు సమర్పించాలని సూచించారు. ఇక నగరంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం రూ.220 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ నిధులతో చేపట్టే పనులతో రానున్న వేసవిలో తాగునీటి కొరత రాకపోగా, ప్రతి ఇంటికీ శుద్ధమైన నీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు, నాయకులు రోజ్‌లీలా, కమర్తపు మురళి, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, అశోక్, తుపాకుల యలగొండ స్వామి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి జ్యోతి, ఆర్డీఓ నర్సింహారావు, ఈఈ రంజిత్, కృష్ణలాల్, సహాయ కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
కళాశాల భవనం పైనుంచి పడిన విద్యార్థి
రఘునాథపాలెం: మండలంలోని కేసీఆర్ కాలనీ ఎదురుగా ఉన్న కస్తూర్బా జూనియర్ కళాశాల విద్యార్థి భవనం రెండో అంతస్తు నుంచి పడగా తీవ్రగాయాలయ్యాయి. కూసుమంచి మండలం ధర్మతండాకు చెందిన జర్పుల సుమన్ కుమార్తె శ్రీ వల్లి కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం తెల్లవారుజామున స్టడీ అవర్‌కు శ్రీవల్లి రాకపోవడంతో గదిలో పరిశీలించా క చుట్టుపక్కల గాలిస్తుండగా పోర్టికో పక్కన రక్తపు మడుగులో గుర్తించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స విషయమై ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారని శ్రీవల్లి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోతే రోజువారి కూలీచేసే తాము చికిత్స కోసం రూ.లక్ష చెల్లించినా పరిస్థితి మెరుగుపడలేదని తెలిపారు. శ్రీవల్లి రెండో అంతస్తు నుంచి ఎలా పడిందో తెలియడం లేదని, పోలీసులు రాకముందే రక్తం మరకలు ఎందుకు తుడిచారని ప్రశ్నించారు. గురుకులం ప్రత్యేక అధికారి వై.లత మాత్రం రెండు రోజులుగా శ్రీవల్లి పీడకలలు వస్తున్నాయని చెప్పగా ఆమె తల్లితో ఫోన్లో మాట్లాడితే దీపావళికి తీసుకెళ్తామని చెప్పిందన్నారు. ఆస్పత్రికి స్కానింగ్ తీయించి ప్రమాదం లేదన్న చెప్పాకే తిరిగి వచ్చామని తెలిపారు. రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌షరీఫ్ పాఠశాలకు చేరుకుని వివరాలు ఆరా తీయగా.. ఆస్పత్రిలో మెజిస్టేట్ ద్వారా స్టేట్మెంట్ సైతం రికార్డు చేసినట్లు తెలిసింది. అయితే, శ్రీవల్లి భవనం పైనుంచి ఎలా పడిందో తెలియరాలేదు.రఘునాథపాలెం కేజీబీవీలో ఘటన -
సోలార్ విద్యుదుత్పత్తి పెంపు
● విద్యుత్ ఉద్యోగులు బాధ్యతతో పనిచేస్తేనే ఫలితం ● ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టిసాక్షిప్రతినిధి, ఖమ్మం: సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించడమే కాక ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లోనూ సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా అన్ని చర్యలు చేపడుతామని తెలిపారు. ఖమ్మం కలెక్టర్ పేర్కొన్నట్లు భవిష్యత్ అవసరాల దృష్ట్యా సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. జిల్లాలో పారిశ్రామిక అవసరాల దృష్ట్యా రెండు 400 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ‘పొలం బాట’తో పరిష్కారం వంగిన స్తంభాలు, లూజ్ వైర్ల సమస్యలను ప్రతీ వారం చేపట్టే పొలం బాటలో గుర్తించి పరిష్కరించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. వరదల, వర్షాల సమయాన ప్రాణాలకు తెగించి మరీ సిబ్బంది పని చేస్తున్నారని కొనియాడారు. అయితే, స్వార్థంతో వ్యవహరించే ఇంకొందరు శాఖ పేరు చూడగొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈమేరకు లైన్మెన్ మొదలు సీఎండీ వరకు బాధ్యతలు నిబద్ధతతో నిర్వహిస్తే విద్యుత్ శాఖ మంచి ఫలితాలను సాధిస్తుందని తెలిపారు. ఇక గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రావొద్దని, వ్యవసాయ కనెక్షన్లు త్వరగా మంజూరు చేయాలన్నారు. అంతేకాక నీటి పారుదల కాల్వలు, భూముల వద్ద సోలార్ విద్యుత్ ప్యానళ్లు, మీడియం ప్రాజెక్టుల వద్ద ఫ్లోటింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దేవాదాయ భూముల్లోనూ కూడా ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. అందుబాటులో అత్యవసర వాహనాలు విద్యుత్ సరఫరాలో లోపాలు ఎదురైన చోటకు పరికరాలతో సిబ్బంది వెళ్లేలా ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, వీటికి జీపీఎస్ ఏర్పాటు చేశామని ఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ప్రతీ వారం పొలంబాట నిర్వహిస్తుండగా, విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. గృహజ్యోతి పథకం కింద రెండు ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 10 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఖమ్మం మయూరి సెంటర్, బస్టాండ్ ఏరియాలో డిమాండ్ పెరగడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందన్నారు. అక్కడ ఎన్నెస్పీ భూమి ఉన్నందున ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే, జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు టి.సదర్లాల్, కె.తిరుమల్‌రావు, రాజుచౌహాన్, ఆర్.చరణ్‌దాస్, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు పాల్గొన్నారు. -
కన్నపేగు దూరమై.. కన్నీరుమున్నీరై..
కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి కన్నుమూత ఖమ్మంఅర్బన్: కుమారుడు మృతి చెందాడని తెలిసినప్పటి రోదిస్తున్న తల్లి.. ఆయన అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికి చేరిన కొద్దిసేపటికే కన్నుమూసింది. పేగు బంధాన్ని దూరం చేసుకున్న ఆ వృద్ధురాలు ఆవేదనను తట్టుకోలేక మృతి చెందిన విషాద ఘటన ఇది. ఖమ్మంలోని రామన్నపేట డబుల్ బెడ్రూం కాలనీకి చెందిన మునగంటి నాగాచారి అనారోగ్య సమస్యల కారణంగా గురువారం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏౖకైక కుమారుడి మృతి విషయం తెలిసినప్పటి ఆయన తల్లి రంగమ్మ(75) కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కాగా, పోస్టుమార్టం అనంతరం శుక్రవారం నాగాచారి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాక అంత్యక్రియలకు తీసుకెళ్లారు. ఆతర్వాత అందరితో పాటే ఇంటికి వచ్చిన రంగమ్మ తీవ్ర వేదనతో రోదిస్తూ కుప్పకూలి మృతి చెందింది. రోజు వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందగా ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదం నెలకొంది. -
నిమ్మతోటల్లో సస్యరక్షణ చర్యలు
వేంసూరు: నిమ్మ తోటలను చీడపీడలు ఆశిస్తున్నందున రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టా లని జిల్లా ఉద్యాన అధికారి ఎంవీ.మధుసూదన్ సూచించారు. వేంసూరు మండలం రాయుడుపాలెంలో పలువురు రైతులు సాగు చేస్తున్న నిమ్మ తోటలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్రీయ కృషి విసక్ యోజన పథకంలో భాగంగా సిమెంట్ స్తంభాలు పాతి తీగ జాతి పంటల సాగుకు అవకాశముందని తెలిపారు. ఎకరాకు రూ.లక్ష మేర సబ్సిడీ అందనున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల ఉద్యాన అధికారి శ్రావణి, రైతులు పాల్గొన్నారు. అందరి ఆమోదంతోనే ఎన్నికమధిర/చింతకాని: పార్టీ కార్యకర్తల అభీష్టం, అభిప్రాయాల మేరకే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేతలను ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ స్పష్టం చేశారు. మధి ర, చింతకాని మండలం నాగులవంచలో శుక్రవారం వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఆయ న పాల్గొన్నారు. ఈసందర్భంగా మధిర నియోజకవర్గంలోని మధిర,బోనకల్, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మహేంద్రన్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టించిన నాయకులకే పదవి దక్కుతుందని.. ఈ ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసా ద్, జిల్లా పరిశీలకురాలు రవళి, నాయకులు పుచ్చకాయల వీరభద్రం, నూతి వీరభద్రం, అంబటి వెంకటేశ్వర్లు, కొప్పుల గోవిందరావు, తోటకూరి ప్రగతి, కొమ్మినేని రమేష్, పసుపులేటి దేవేంద్రం, మడుపల్లి భాస్కర్, కన్నెబోయిన గోపి,బందెల నాగార్జున పాల్గొన్నారు. ఉద్యాన అధికారి వేణుకు ‘రైతునేస్తం’ అవార్డు ఖమ్మంవ్యవసాయం: ఉద్యాన పంటల సాగు లో రైతులకు విస్తృతంగా అవగాహ న కల్పించినందుకు వైరా ఉద్యాన అధికారి డాక్టర్ ఆకుల వేణు రైతునేస్తం పురస్కారా నికి ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల స్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, అధికా రులను పద్మశ్రీ డాక్టర్ ఐవీ.సుబ్బారావు పేరిట ఇచ్చే అవార్డులకు ఎంపిక చేశారు. జిల్లా నుంచి వైరా డివిజన్ ఉద్యాన అధికారి వేణుకు స్థానం దక్కగా ఈనెల 26న హైదరాబాద్‌లో అవార్డు స్వీకరిస్తారు. డాక్టర్ వేణు ఉద్యాన విద్యలో మాస్టర్స్ డిగ్రీతో పాటు పీహెచ్డీ చేయగా.. పంటల సాగులో ఆధునిక విధానాలపై రైతులకు అవగాహన కల్పించడమే కాక మియాజాకీ, అవకాడో, మెకాడ్మియా తదితర పంటలను పరిచ యం చేశారు. కాగా, వేణుతో పాటు గతంలో ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల ఉద్యాన అధికారి పనిచేసి ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న జినుగు మరియన్న అవార్డుకు ఎంపికయ్యారు. ‘ఏరుగట్ల’ లబ్ధిదారులకు న్యాయం చేయండిఖమ్మం మామిళ్లగూడెం/పెనుబల్లి: పెనుబల్లి మండలం ఏరుగట్లలోని డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డికి శుక్రవారం వినతి పత్రాలు అందజేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏరుగట్ల లో డబుల్‌బెడ్ రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల కేటా యింపులో అక్రమాలపై విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలన్నారు. తొలుత స్థలం ఇచ్చిన 15మంది అర్హులకే ఇళ్లు కేటాయించాలని కోరారు. అంతేకాక గ్రామస్తులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వరరావు, నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, ఈ.వీ.రమేష్, విజయరాజ్, భాస్కర్ణి వీరంరాజు, బొర్ర నరసింహారావు, సుదర్శన్ మిశ్రా, మట్టా ప్రసాద్, పడిగల మధుసూదన్, పర్సా రాంబాబు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
సభకు సీపీఐ శ్రేణులను సిద్ధం చేయండి
ఖమ్మంమయూరిసెంటర్/చింతకాని: సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని డిసెంబర్ 26న జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించి పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని జిల్లా కార్యదర్శి దండి సురేష్ కోరారు. ఈమేరకు జిల్లాలోని ప్రతీ ఇంటికి శతాబ్ది ఉత్సవాల సందేశాన్ని అందించాలని ఆయన తెలిపారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో శుక్రవారం నగర కార్యదర్శి ఎస్.కే.జానీమియా అధ్యక్షతన జరిగిన సమావేశంతో పాటు చింతకానిలో చాట్ల రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సురేష్ మాట్లాడారు. పార్టీ ప్రస్థానంలో అనేక విజయాలు ఉన్నాయని, వీటిని నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. సీపీఐ అగ్రనాయకత్వంతో పాటు 40దేశాల ప్రతినిధులు హాజరయ్యే సభ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని సురేష్ కోరారు. ఈ సమావేశాల్లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు మహ్మద్ సలాం, నాయకులు కొండపర్తి గోవిందరావు, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, ఏనుగు గాంధీ, నూనె శశిధర్, తాటి నిర్మల, వరదా నర్సింహారావు, బోడా వీరన్న, సైదా, రవికుమార్, కూచిపూడి రవి, దూసరి శ్రీరాములు, దూసరి గోపాలరావు, మార్గం శ్రీను, అబ్బూరి మహేష్, దొబ్బల వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి బంద్‌కు సిద్ధం
● బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం పిలుపు ● మద్దతు తెలిపిన పార్టీలు, కార్మిక, విద్యార్థి సంఘాలుఖమ్మంమయూరిసెంటర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యాన శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా జిల్లాలో బంద్‌ను విజయవంతం చేసేందుకు బీసీ సంఘాల నాయకులు విస్తృత ప్రచారం చేశాయి. అలాగే, శుక్రవారం కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. గత మూడు రోజులుగా జిల్లాలో నాయకులు విస్తృత ప్రచారం చేయడంతో పాటు పలు పార్టీల మద్దతు కూడగట్టారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, మాస్‌లైన్, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ జన సమితితో పాటు అనుంబంధ సంఘాలు, యు వజన సంఘాల నాయకులు బంద్‌కు మద్దతు ప్రకటించారు. అంతేకాక విద్యాసంస్థల బాధ్యులు, వ్యా పార సంస్థల ప్రతినిధులను కోరడంతో వారు కూడా సానుకూలంగా స్పందించారు. బంద్ ద్వారా రిజర్వేషన్ల ఆవశ్యకతను చాటిచెప్పడమే కాక అందరి మద్దతుతో సాధించుకోవడమే తమ లక్ష్యమని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. జేఏసీ సమావేశం రిజర్వేషన్ల సాధనకు శుక్రవారం చేపడుతున్న బంద్‌ను జయప్రదం చేసేందుకు బీసీ సంఘాల జేఏసీ నేతలు శుక్రవారం ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈసమావేశంలో గుండాల కృష్ణ, బొమ్మ రాజేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, కూరపాటి వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాసరావు, యర్రా శ్రీనివాసరావు, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. బంద్ విజయవంతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఖమ్మం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బంద్ జరిగేలా అన్ని పార్టీలు, సంఘాల నేతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అంతేకాక జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో విజయవంతానికి ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఖమ్మం సహకారనగర్: బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యాన బంద్‌కు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈమేరకు ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, పీఆర్టీయూ నాయకుడు సతీష్ శుక్రవారం ఎస్టీఎఫ్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడమనే నిర్ణయం సమానత్వానికి దారి తీసే చారిత్రక నిర్ణయమన్నారు. ఈమేరకు రాష్ట్రం నుంచి పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. నాయకులు బుర్రి వెంకన్న, ఉద్దండ్, సతీష్, యాదగిరి, మన్సూర్, కత్తి. నెహ్రూ శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకన్న, మాదాల. నాగేశ్వరరావు, స్వర్ణకుమార్, సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికే ముప్పు..
వైరా: ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకగా నిలిచే పత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజాస్వామ మనుగడకే ముప్పు ఎదురవుతుందని జర్నలిస్టు సంఘాలు, పార్టీల నాయకులు పేర్కొన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పత్రికను ఏపీ ప్రభుత్వం కేసులు పేరుతో వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ‘సాక్షి’ కార్యాలయానికి నోటీసులు ఇచ్చే పేరుతో పోలీసులు తరచూ రావడం, ఎడిటర్‌పై కేసులు నమోదు చేసి జర్నలిస్టులను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్‌లో డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో పార్టీలు, సంఘాల నాయకులు, జర్నలిస్టులు శీలం వెంకటనర్సిరెడ్డి, దాసరి దానియేలు, దార్నా రాజశేఖర్, మల్లు రామకృష్ణ, ముళ్లపాటి సీతారాములు, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, సుంకర సుధాకర్, యమాల గోపాలరావు, గుజ్జర్లపూడి దేవరాజు, కంకణాల శిరీష, జర్నలిస్టులు పారుపల్లి కృష్ణారావు, సూతకాని ప్రేమ్‌చంద్, షేక్ మహ్మద్ రిజ్వాన్, చంద్రశేఖర్, ఏపూరి రాజారావు, గొల్లమందల విజయ్, పులి కృష్ణార్జున్‌రావు, గద్వాల రవీందర్, షేక్ రఫీ, సూతకాని శ్రీకాంత్, నందిగామ మనోహర్, ప్రశాంత్, భూక్యా శ్రీను, చారి, ఆది శ్రీకాంత్, ఎక్కిరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన జర్నలిస్టులు
● ‘సాక్షి’ పత్రిక, ఎడిటర్‌పై అక్రమ కేసులకు నిరసన ● ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ● పార్టీలు, సంఘాలకు అతీతంగా నాయకుల మద్దతు మధిర: ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, పాలకుల తప్పులను ఎత్తిచూపడం బాధ్యతగా భావించే మీడియా గొంతు నొక్కాలని, స్వేచ్ఛను హరించివేయాలని కుట్ర పన్నిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు గర్హనీయమని వివిధ పార్టీలు, సంఘాలతో పాటు జర్నలిస్టు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడమే కాక పత్రికకు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మధిర అంబేడ్కర్ సర్కిల్లో జరిగిన నిరసనలో జర్నలిస్టులు, పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందు ఉంచడమే తప్పుగా ‘సాక్షి’పై అక్రమ కేసులు బనాయిస్తూ మీడియా గొంతు నొక్కేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అనంతరం తహసీల్ వరకు ర్యాలీకి వెళ్లి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు మిరియాల వెంకటరమణ గుప్తా, తూమాటి నవీన్‌రెడ్డి, బెజవాడ రవిబాబు, మడుపల్లి గోపాలరావు, చిత్తారు నాగేశ్వరరావు, చిలివేరు సాంబశివరావు, కుంచం కృష్ణారావు, ఏనోకు మాదిగ, కనకపూడి శీను మాదిగ, మధిర ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పాగి బాలస్వామి, గౌరవ అధ్యక్షుడు మక్కెన నాగేశ్వరరావుతో పాటు జర్నలిస్టులు అట్లూరి సాంబిరెడ్డి, చేకూరి వినోద్, పల్లపోతు ప్రసాదరావు, సురభి వెంకన్న, గంధం శ్రీనివాసరావు, కాశిబోయిన రామారావు, కందిమళ్ల వీరస్వామి, మిరియాల శ్రీనివాసరావు, శ్రీరామోజు యోగేష్, రావిరాల శశికుమార్, ధనిశెట్టి శ్రీనివాసరావు, తాళ్లూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.సత్తుపల్లి: ప్రతికా స్వేచ్ఛపై దాడి చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని వక్తలు పేర్కొన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై వరుసగా ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం గర్హనీయమన్నారు. ఈమేరకు సత్తుపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తోట కిరణ్(టీయూడబ్ల్యూజే–టీజేఎస్), మాచినేని బాలకృష్ణ(టీడబ్లూయజే–ఐజేయూ) మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతికా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. జర్నలిస్టు సంఘాల ఐక్యతతోనే ప్రభుత్వాల నియంతృత్వ పోకడలను అడ్డుకోవచ్చని తెలిపారు. బీసీ సంఘం, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మాస్‌లైన్, ఎమ్మార్పీఎస్, వడ్డెర సంఘం, లంబాడీ హక్కుల సంఘం నాయకులు నారాయణవరపు శ్రీనివాస్, గాదె చెన్నారావు, దండు ఆదినారాయణ, సర్వేశ్వరరావు, అమర్లపూడి శరత్, పిల్లి మల్లికార్జున్, శ్రీనివాసరావు, తన్నీరు జమలయ్య, నందునాయక్తో పాటు మసీద్ కమిటీ, లయన్స్‌క్లబ్ బాధ్యులు ఎం.డీ.కమల్‌పాషా, రవి, మందపాటి ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులు ఎం.డీ.షైబుద్దీన్, భీమిశెట్టి రఘురామారావు, ఎస్.కే.ఖాదర్‌బాబా, బీ.వీ.రామారావు, జీడిమళ్ల శ్రీనివాసరావు, కొవ్వూరు సాంబశివరావు, బొర్ర కోటేశ్వరరావు, గోపరాజు గోపి, నర్రా అరుణ్, బాబు, రామిశెట్టి లక్ష్మణ్‌రావు, శ్రీకాంత్, ఐ.శ్రీనివాసరావు, సతీష్, ఎస్.కే.మీరా, బాజీ, సురేష్, మహా శ్రీనివాస్, తడికమళ్ల అప్పారావు, గురవయ్య, కొత్తపల్లి సుధాకర్, చీపు గంగాధర్, లింగగిరి రామకృష్ణ, కాకర్ల జగన్, ఎస్.కే.మునీర్, బల్లెం చిరంజీవి, జంగం కిరణ్, అశోక్, ఎండి మేరాజ్, బేతి ఆనంద్, బేతి సునీత, రాము తదితరులు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి.. ఆర్థిక స్వావలంబన
● ఇందిరా డెయిరీతో 20వేల మంది మహిళలకు లబ్ధి ● అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజబోనకల్: ఇందిరా డెయిరీ ఏర్పాటుతో మహిళలకు ఉపాధి లభించి ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. డెయిరీలో వాటాదారులుగా చేరిన మధిర నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండేసి పాడిగేదెలను సబ్సిడీ పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. బోనకల్‌లోని పాల శీతలీకరణ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించిన ఆమె డెయిరీ కేంద్రాలకే పాలు అప్పగించేలా మహిళల్లోఅవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం నియోజకవర్గ స్థాయి లబ్ధిదారులతో సమావేశమైన అదనపు కలెక్టర్ ఇప్పటివరకు అందిన గేదెల పోషణ, పాల ఉత్పత్తిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 125 మంది లబ్ధిదారులకు సబ్సిడీపై గేదెలు పంపిణీ చేయగా, నచ్చిన గేదెలు కొనుగోలు చేసుకునే వెసలుబాటు కల్పించినట్లు తెలిపారు. ఇప్పటికే ఎర్రుపాలెం మండలంలో రోజుకు 10వేల లీటర్ల పాలు కొనుగోలు చేసేలా బల్క్ మిల్క్ చిల్లింగ్(బీఎంసీ) సెంటర్ నిర్మించామన్నారు. అక్కడ పాల సేకరణ చేపడుతుండడంపై ఆమె అభినందించారు. మిగిలిన నాలుగు మండలాల్లోనూ బీఎంసీలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో 60 వేల మంది సభ్యుల లక్ష్యం కాగా, మొదటి విడతలో 20 వేల మందికి లబ్ధి జరగనుందని అదనపు కలెక్టర్ తెలిపారు. అధికారులపై ఆగ్రహం పాల శీతలీకరణ కేంద్రం నిర్మాణ పనులు సక్రమంగా నిర్వహించడం లేదని అధికారులపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల శీతలీకరణ కేంద్రానికి వచ్చి, వెళ్లే మార్గాలపై సరైన నిర్ణయం తీసుకోకుండా నిర్మాణం చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. పాల వాహనాల రాకపోకలు ఎలా సాగుతాయని అసహనం వ్యక్తం చేసిన ఆమె ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఏపీఎం, డీపీఎం, ఏఈలపై మండిపడ్డారు. తొలుత మండలంలోని ముష్టికుంట్లలో భవిత భవన నిర్మాణాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్.. పాఠశాలలో గదులు ఉన్నా అదనంగా నిర్మిస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఉన్న గదులను ఉపయోగించుకోకుండా ప్రభుత్వ ధనం వృథా చేయడం సరికాదని, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ ఆర్.సన్యాసయ్య, డీపీఎం శ్రీనివాస్, ఏపీడీ జయశ్రీ, ఇందిరా డెయిరీ ప్రత్యేకాధికారి రాజారావు, ఏపీఎంలు లక్ష్మణరావు, తిరుమలరావు తదితరులు -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
ఎర్రుపాలెం: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ము లుగుమాడుకు చెందిన ఇద్దరు స్నేహితులు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఆముదాల రాము(24) శుక్రవారం ఉదయం ఖమ్మం ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు. ఆయన సోదరుడు రాంబాబు ఫిర్యాదుతో కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. కాల్వలో గల్లంతైన బాలుడు.. పెనుబల్లి: చేపల వేట కోసం వెళ్లి సాగర్ కాల్వలో గల్లంతైన రేపల్లే మనోజ్(14) మృతి చెందాడు. పెనుబల్లి మండలం వీ.ఎం.బంజరు జంగాల కాలనీకి చెందిన రేపల్లే మనోజ్, పర్వతం శివ తుమ్మలపల్లి వద్ద సాగర్ కెనాల్లో గాలాలతో చేపలు పట్టడానికి గురువారం వెళ్లారు. ఈక్రమాన మనోజ్ ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోగా, ఆయన రక్షించే క్రమంలో శివ కూడా నీట మునిగాడు. సమీపాన ఉన్న మేకల కాపరి శివను రక్షించినా మనోజ్ మాత్రం గల్లంతయ్యాడు. దీంతో ఎస్సై కె.వెంకటేష్ ఆధ్వర్యాన గాలింపు చేపట్టగా శుక్రవారం మధ్యాహ్నం మనోజ్ మృతదేహం బయటపడింది. రోడ్డుప్రమాదంలో వ్యక్తి.. ఖమ్మంక్రైం: ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఖమ్మం వన్ టౌన్‌సీఐ కరుణాకర్ వెల్లడించిన వివరాలు... ఖమ్మం ముస్తఫానగర్‌లో నివసించే యలగందుల వెంకటేశ్వర్లు(58) వడ్రంగిగా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా కుటుంబంతో వచ్చిన సీసీఆర్బీ కానిస్టేబుల్ కొండపల్లి మురళిబాబు వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు ట్రాఫిక్ పోస్ట్‌కు ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ఘటనలో కానిస్టేబుల్ మురళి, ఆయన కుమార్తె ఆశ్రిత తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
హోటల్లో బూజు పట్టిన చట్నీ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో ఆహార తనిఖీ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యం పాలిట శాపంగా మారుతోంది. అధికారులు చూసిచూడనట్లు వ్య వహరిస్తుండడంతో జిల్లా కేంద్రంలోని కొందరు హోటళ్ల నిర్వాహకులు అపరిశుభ్ర వాతావరణంలోనే నిర్వహించడంతో పాటు నిల్వ ఉండి, ఫంగస్ వచ్చిన పదార్థాలనే వినియోగిస్తున్నారు. కొద్దిరోజులుగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను అరికట్టడానికి తనిఖీలు చేపడుతున్న కేఎంసీ శానిటేషన్ ఉద్యోగులు గురువారం రాపర్తినగర్ వద్ద ఓ టిఫిన్ సెంటర్లో పరిశీలించారు. శానిటరీ సూపర్వైజర్ ఎం.సాంబయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు తనిఖీల్లో పాల్గొనగా ఆ హోటల్లోని ఫ్రిడ్జ్ తలుపులకు ఫంగస్ రాగా, నిల్వ ఉన్న చట్నీలోనూ బూజు వచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు హోటల్ నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా విధించి, తీరు మార్చుకోకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే, పలు షాపుల్లో నిషేధిత ప్లాస్టిక్‌ను సీజ్ చేసి పది దుకాణదారులకు రూ.42వేల జరిమానా విధించారు.నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా -
మెరుగైన సేవలతో నమ్మకం
● వైద్యపరీక్షలకు బయటకు పంపితే చర్యలు ● ఆస్పత్రుల పనితీరుపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల పనితీరుపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందితే జిల్లా ఆస్పత్రిపై భారం తగ్గుతుందన్నారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆస్పత్రుల్లో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆస్పత్రులలో ఆశించిన పురోగతి లేదని తెలిపారు. సరిపడా వైద్యులు, సిబ్బంది ఉన్నా అతి తక్కువ ప్రసవాలు జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీవీపీ ఆస్పత్రులో నెలకు కనీసం 200 ప్రసవాలు జరిగేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు. అలాగే, డయాగ్నోస్టిక్ హబ్‌కు శాంపిళ్లు పంపాలే తప్ప ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే సమయాన ఆస్పత్రులకు కావాల్సిన యంత్రాలపై ప్రతిపాదనలు సమర్పించాలని, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్‌గౌడ్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధిధికారి రమేష్, సూపరింటెండెంట్లు, వైద్యులు పాల్గొన్నారు. ఓటరు దరఖాస్తులు పరిష్కరించండి ఖమ్మం సహకారనగర్: ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించగా, కలెక్టరేట్ కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులను సత్వరమే పరిష్కరించడమే కాక ప్రతీ పోలింగ్ బూత్‌కు ఉద్యోగిని నియమించాలని, నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని తెలిపారు. ఖమ్మంవ్యవసాయం: దళారుల సమస్యకు చెక్ పెట్టేలా రైతులే నేరుగా స్లాట్ బుక్ చేసుకుని సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కేంద్రప్రభుత్వం రూపొందించిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి స్లాట్ బుక్ చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. స్లాట్ బుక్ చేసుకున్న రోజు వెళ్లలేకపోతే 24 గంటల ముందు రద్దు చేసుకోవాలని, ఒక రైతు మూడుసార్లే రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. -
పారదర్శకంగా జిల్లా అధ్యక్ష ఎన్నిక
వైరా/ఏన్కూరు: కాంగ్రెస్ పార్టీలో అనుభవంతో పాటు పార్టీ అభివృద్ధికి పాటు పడే నాయకులనే అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తామని, ఇదంతా పారదర్శకంగా సాగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు కె.మహేంద్రన్ స్పష్టం చేశారు. వైరా, ఏన్కూరులో గురువారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం నిర్వహించిన ఏ, బీ బ్లాక్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాలు సేకరించాక మహేంద్రన్ మాట్లాడారు. కార్యకర్తల అభిప్రాయ సేకరణ తర్వాతే అధ్యక్షులను ఎన్నుకోవాలన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈమేరకు పార్టీలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని చెప్పారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మహేంద్రన్ సూచించారు. అనంతరం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడగా డీసీసీ ఎన్నికల ఇన్చార్జి రవళిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు నూతి సత్యనారాయణ, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, బానోత్ బాలాజీ, అనుమోలు కృష్జార్జునరావు, కట్ల రంగారావు, ఏదునూరి సీతారాములు, శీలం వెంకటనర్సిరెడ్డి, వడ్డె నారాయణరావు, సూరంపల్లి రామారావు, దార్న రాజశేఖర్, మిట్టపల్లి నాగి, కోసూరి శ్రీను, స్వర్ణ నరేంద్ర, మంగీలాల్, చంద్రప్రకాశ్, గుగులోత్ లచ్చిరామ్, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, వేముల కృష్ణప్రసాద్, లేళ్ల వెంకటరెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, కొప్పుల ప్రభావతి, లాలూనాయక్, గాలీబ్, హరిలాల్, నాగేశ్వరరావు, శేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ -
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం
సాక్షిప్రతినిధి,ఖమ్మం: వానాకాలం వరి కోతలు జిల్లాలోని పలు చోట్ల మొదలయ్యాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి ముందుగా కోతకు వస్తోంది. ఈనేపథ్యాన ఎక్కడ కోతలు మొదలైతే అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా పౌర సరఫరాల సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. వచ్చేనెల మొదటి వారం నాటికి జిల్లాలో మొత్తం 326 కేంద్రాలు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా కల్లూరు మండలంలోని ఎర్రబోయినపల్లి, పుల్లయ్యబంజరలో రెండు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. 3.69 లక్షల మె. టన్నుల ధాన్యం సేకరణ జిల్లాలో ఈ వానాకాలం సాగైన వరికి సంబంధించి 3,69,609 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యంలో 18,480 మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం, 3,51,129 మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం ఉన్నాయి. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తుండడంతో సన్నధాన్యం సేకరణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 1,18,040 హెక్టార్లలో వరి సాగు కాగా 7,23,988 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 51,971 మెట్రిక్ టన్నులు రైతుల అవసరాలు, విత్తనాల కోసం వినియోగిస్తారు. అలాగే, వ్యాపారులు, మిల్లర్లు 3,02,408 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తారనే భావనకు వచ్చారు. ఇక మిగిలిన మిగిలిన 3,69,609 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనుంది. దీపావళి తర్వాతే కోతలు దీపావళి పండుగ అనంతరం.. అమావాస్య దాటాక జిల్లాలో వరి కోతలు ముమ్మరమయ్యే అవకాశముంది. సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయడంతో ఈ ఖరీఫ్‌లో ఎక్కువగా వరి సాగైంది. భారీ వర్షాలు పడడంతో సాగర్ నీటిని ఎలాగైనా విడుదల చేస్తారనే అంచనాతో ఆయకట్టులోని బోర్లు, బావుల కింద వేల ఎకరాల్లో ముందస్తుగా వరి సాగు చేశారు. నేలకొండపల్లి, కూసుమంచి, సత్తుపల్లి, కల్లూరు, ముదిగొండ, వైరాలో వరి ముందుగానే కోతకు వస్తోంది. ఈ ప్రాంతాల్లో కేంద్రాలను తొలుత తెరుస్తారు. ఆపై మిగతా చోట్ల వచ్చేనెల మొదటి వారం నాటికి కేంద్రాలు తెరవాలనే నిర్ణయానికి వచ్చారు. కాగా, జిల్లాలో 326 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడుతామని, ఇందులో 51 కేంద్రాల ద్వారా దొడ్డు రకం, 275 కేంద్రాల ద్వారా సన్న రకం ధాన్యం సేకరిస్తామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలత ‘సాక్షి’కి తెలిపారు. శాఖ దొడ్డు రకం సన్న రకం మొత్తం డీసీఎంఎస్ – 28 28 డీఆర్డీఏ 49 89 138 పీఏసీఎస్ 2 155 157 మెప్మా – 03 03 మొత్తం 51 275 326 -
‘నాన్నే నా హీరో’ పుస్తక ఆవిష్కరణ
సత్తుపల్లిరూరల్: నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా అద్భుతమైన కథలు రాసిన సత్తుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి ఆవుల పోతురాజు మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తాడని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తెలిపారు. విద్యార్థి రాసిన 20 కథలతో గార్లపాటి–బొల్లేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యాన ‘నాన్నే నా హీరో’ శీర్షికన పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకాన్ని రాగమయి దయానంద్ గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే పోతురాజు వంటి మరికొందరు బయటకు వస్తారని తెలిపారు. అనంతరం విద్యార్థి, ఆయన తల్లి తిరుపతమ్మ, ఉపాధ్యాయులు ఎం.రమాదేవి, వెంకటాచార్యులు, హెచ్ఎం సోదు షేక్, పుస్తకాన్ని ప్రచురించిన రామకృష్ణ, బి.మధుసూదన్‌రాజును సత్కరించారు. కార్యక్రమంలో రామిశెట్టి శ్రీనివాసరావు, పసుపులేటి నాగేశ్వరరావు, మహమ్మద్ షాకీర్ హుస్సేన్, గోలి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఖమ్మంలో రానున్నారు. ఉదయం 10–30 గంటలకు ఖమ్మం చేరుకోనున్న భట్టి తొలుత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ఆతర్వాత 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ శాఖపై అధికారులతో సమీక్షించనున్నారు.నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్ర, శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం ఖమ్మం 22వ డివిజన్ ముస్తఫానగర్‌లో బీసీ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత సాయంత్రం 5గంటలకు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఆయిల్ పామ్ మొలకలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, శనివారం ఉదయం రఘునాథపాలెం తహసీల్ సమీపాన చిల్డ్రన్స్ హోమ్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. కలెక్టర్‌ను కలిసిన ఎంపీ ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి గురువారం కలెక్టరేట్లో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు అందజేశారు. అలాగే, ఎంపీ నిధులతో చేపడుతున్న పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎంపీ సమీక్షించారు. ఖమ్మం రూరల్: రూరల్ మండలంలోని మారె మ్మ దేవస్థానం వద్ద జరిగిన పలు కార్యక్రమాలకు ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి హాజరయ్యారు. నాయకులు కొప్పుల చంద్రశేఖర్, ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, మొగిలిచర్ల సైదులు, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు. దర్యాప్తులో ఆధారాల సేకరణే కీలకం ఖమ్మంక్రైం: నేరదర్యాప్తులో ఆధారాలు సేకరించడాన్ని కీలకంగా భావించాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. కమిషనరేట్ ఆవరణలో ఆధునికీకరించిన ఫింగర్ ఫ్రింట్ యూనిట్ కార్యాలయాన్ని గురువారం సీపీ పరిశీలించి మాట్లాడారు. ఫింగర్‌ప్రింట్ యూనిట్లలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలిలో సేకరించిన వేలిముద్రలను శాసీ్త్రయ విశ్లేషణ ద్వారా పాత నేరస్తులు, అనుమానితుల వేలిముద్రలతో పోల్చిచూస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, ఏఆర్ ఏసీపీ సుశీల్‌సింగ్, సీఐలు, ఆర్ఐలు నరేష్, కామరాజు, సురేష్, బాలాజీ పాల్గొన్నారు. ఖమ్మం మార్కెట్‌కు సెలవులు ఖమ్మంవ్యవసాయం: వారాంతపు సెలవులు, దీపావళి పండుగ సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజుల సెలవులు ప్రకటించారు. ఈనెల 18 శనివారం, 19న ఆదివారం వారాంతపు సెలవులు కాగా, 20న సోమవారం నరక చతుర్దశి, 21వ తేదీ మంగళవారం దీపావళి సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తిరిగి 22వ తేదీ బుధవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు యదావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఖమ్మంక్రైం: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(పోలీసు ఫ్లాగ్ డే)ను పురస్కరించుకుని విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో జరిగే పోటీల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను ఈనెల 28వ తేదీలోగా సమర్పిస్తే, జిల్లాలో ప్రతిభ కనబర్చిన ముగ్గురికి బహుమతులు అందించడంతో పాటు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. వివరాల కోసం 87126 59256 నంబర్లో సంప్రదించాలని సీపీ సూచించారు. -
పెరిగి.. తగ్గుతున్న మిర్చి ధర
మధిర: మార్కెట్లో ప్రస్తుతం మిర్చి ధర నిలకడగా ఉంది. ఓ వారం క్వింటాకు రూ 500 పెరుగుతుండగా మరో వారం తగ్గుతోంది. రెండేళ్లుగా కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన మిర్చిని రైతులు ఇప్పుడు తప్పనిసరై విక్రయిస్తున్నారు. మరో రెండు నెలలు గడిస్తే ఈ ఏడాది సాగు చేసిన మిర్చి చేతికి రానుండడంతో చేసేదేం లేక.. ధర రాకున్నా అమ్ముతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది పంటల పెట్టుబడికి డబ్బు అవసరం కావడంతో తక్కువ ధరకై నా అమ్మాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఎగుమతులు లేక.. తెలుగు రాష్ట్రాల్లో పండిన తేజ రకం మిర్చి చైనా, బంగ్లాదేశ్, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇక్కడ పండే పంట ఎక్కువగా చైనాకు ఎగుమతి చేస్తారు. కానీ ఈసారి ఎగుమతుల ఆర్డర్లు లేవంటూ వ్యాపారులు కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో గత ఏడాది సాగు చేసిన మిర్చి ధర పెరుగుతుందనే ఆశతో నిల్వ చేసిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. దీంతో ప్రస్తుత జిల్లా మార్కెట్లలో క్వింటా మిర్చికి రూ.11వేల నుంచి రూ.14,500 ధర పలుకుతోంది. జెండా పాట రూ.14వేలుగా నమోదవుతున్నా ఆ ధరతో కొనుగోళ్లు జరగడం లేదని చెబుతున్నారు. మధిర, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు తదితర మార్కెట్లలోనూ తేజ రకం క్వింటా రూ.15 వేల ధరే ఉంది. అయినా కొనడం లేదు... ధర తక్కువగానే ఉన్నా ఎగుమతిదారులు కొనడం లేదు. గతంలో కొని చైనాలో నిల్వ చేసిన మిర్చిని ఇప్పుడు వినియోగిస్తుండడమే ఎగుమతులు లేకపోవడానికి కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ మిర్చి సాగు పెరగడం.. అక్కడ తేజ రకాన్ని పోలిన మిర్చి సాగవుతుండడంతో తక్కువ ధరకే కొంటున్నట్లు సమాచారం. జిల్లాలో 42 కోల్డ్ స్టోరేజీలు ఉండగా సుమారు 30లక్షల బస్తాల మిర్చి నిల్వలు ఉన్నాయి. అయితే, జిల్లాలో నిల్వ ఉన్న మిర్చి అమ్ముడయ్యే వరకు ధర పెరిగే పరిస్థితి లేదని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. కాగా, వివిధ కారణాలతో మిర్చి దిగుబడి, ధర తగ్గడంతో ఈసారి జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయంది. గత ఏడాది జిల్లాలో 59వేల ఎకరాల్లో సాగైతే ఈ ఏడాది 25వేల ఎకరాల్లోనే సాగవడం గమనార్హం. -
మరో 45మంది టీచర్ల సర్దుబాటు
ఖమ్మం సహకారనగర్: పలు ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లను కొరత తీర్చేందుకు అదనంగా ఉన్న చోట్ల నుంచి కేటాయిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టారు. తాజాగా మరో 45మందిని వివిధ పాఠశాలలకు కేటాయిస్తూ అదనపు కలెక్టర్, డీఈఓ డాక్టర్ పి.శ్రీజ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీరంతా నూత న స్థానాల్లో వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. ఏఎంఓగా ప్రభాకర్‌రెడ్డి విద్యాశాఖలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్(ఏఎంఓ)గా పెసర ప్రభాకరరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీజను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ప్రభాకర్‌రెడ్డికి పలువురు హెచ్ఎంలు, వివిధ సంఘాల బాధ్యులు శుభాకాంక్షలు తెలిపారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..
సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఖమ్మంమయూరిసెంటర్: అతివృష్టితో జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ వర్షాలతో దిగుబడి పడిపోగా, ధర కూడా లేనందున రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ విషయమై శుక్రవారం నుంచి 21వ తేదీ వరకు పంటలను పరిశీలించి, ఆతర్వాత మూడు రోజులు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకోతే 30వ తేదీన కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని చెప్పారు. కాగా, బీసీల రిజర్వేషన్ పెంపుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు బి.రమేష్, కె.వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్యార్థుల సృజనాత్మకకు వేదికనేడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎకో బజార్ ఖమ్మం సహకారనగర్: తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యాన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ‘ఎకో ఫ్రెండ్లీ బజార్’ ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఎకో బజార్ ఏర్పాటుచేయనున్నారు. విద్యార్థులు ప్రతిభ చాటేలా మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న ఎకో బజార్లో విద్యార్థులు తమ ఆలోచనల నుంచి రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. తక్కువ ఖర్చుతో బృందాలుగా రూపొందించిన ఉత్పత్తుల్లో పూజా వస్తువులు, అలంకరణ సామగ్రి, పిండివంటలు తదితర వస్తువులు ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సృజనాత్మకత, పర్యావరణ చైతన్యం, మార్కెటింగ్ నైపుణ్యాలు పెంపొందుతాయని కాలేజీ ప్రిన్సిపాల్ బానోతు రెడ్డి, ప్రోగ్రాం కోఆర్టినేటర్ రవిశంకర్ తెలిపారు. -
డ్రైవర్లు, కండక్టర్ల కృషితోనే ఆర్టీసీ ఉన్నతి
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు మూలస్తంభాలుగా నిలుస్తున్నారని.. సంస్థ ఉన్నతిలో వారి పాత్ర కీలకమని కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ అన్నారు. రీజియన్ స్థాయి ప్రగతిచక్ర అవార్డులకు ఎంపికై న సిబ్బందికి ఖమ్మంలో గురువారం అవార్డులు అందజేశాక ఈడీ మాట్లాడారు. ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే ప్రయాణికుల మన్ననలు పొందడంతో పాటు సంస్థ అభివృద్ధి బాట పడుతుందని తెలిపారు. ఆర్ఎం ఏ.సరిరామ్ మాట్లాడుతూ వివిధ కేటగిరీల డ్రైవర్లు 18మంది, కండక్టర్లు ఏడుగురు, మెకానిక్‌లు ముగ్గురు ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారని చెప్పారు. అలాగే, రీజియన్‌లో ఉత్తమ బస్టాండ్‌గా వైరా బస్టాండ్ ఎంపికైందని ఆర్ఎం తెలిపారు. డ్రా విజేతలకు బహుమతులు దసరా సెలవుల్లో బస్సుల్లో ప్రయాణించిన వారి నుంచి ముగ్గురికి డ్రా ద్వారా ఎంపిక చేయగా విజేతలకు ఈడీ సోలమన్ బహుమతులు అందజేశారు. వరుసగా మూడు బహుమతులు సాధించిన ఎల్.కాంతారావు, సాయిబాబా, సునీల్‌కుమార్‌కు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల చెక్కులు అందజేశారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, పర్సనల్ ఆఫీసర్ సంపత్తో పాటు డిపో మేనేజర్లు సూపర్వైజర్లు పాల్గొన్నారు. కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ -
టీటీడీ ఆలయ నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ
● స్థల అప్పగింతపై కార్యాచరణ ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అనుదీప్ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం అర్బన్ మండలం అల్లీపురం సమీపాన తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యాన వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడమేకాక పర్యాటకం, ఉపాధి పరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో గురువారం ఆయన దేవాదాయ శాఖ స్థపతి ఎన్.వల్లీనాయగం, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆలయ నిర్హాణానికి అల్లీపురం వద్ద గుర్తించిన 20 ఎకరాల స్థలం అప్పగింతపై దృష్టి సారించాలని సూచించారు. ఆలయ నిర్మాణమే కాక విడిది గృహాలు, వేద పాఠశాల, కల్యాణ మండపం, కళాక్షేత్రం, భజన మండపం, హెలీప్యాడ్ నిర్మాణానిక ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. స్థల పరిశీలన ఖమ్మం అర్బన్: టీటీడీ ఆధ్వర్యాన నిర్మించే ఆలయ కోసం అల్లీపురం–కొత్తగూడెం మధ్య గుర్తించిన స్థలా న్ని దేవాదాయ శాఖ స్థపతి వల్లీనాయగం, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు పరిశీ లించారు. అక్కడ స్థలం వివరాలు ఆరా తీయడంతో పాటు నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం.వీరస్వామి, డీఈ రమేష్‌బాబు, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. -
పంటల్లో తెగుళ్ల బెడద
సూపర్‌బజార్(కొత్తగూడెం): వాతావరణ పరి స్థితుల్లో రోజుకో రకంగా ఉంటున్నాయి. కొద్ది రోజుల పాటు ఎడతెగకుండా వర్షాలు కురి శా యి. ప్రస్తుతం మధ్యాహ్నం ఎండగా ఉంటు న్నా సాయంత్రం మంచుప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యాన వివిధ పంటలను తెగుళ్లు ఆశిస్తుండగా దిగుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు వివిధ పంటల్లో తీసుకోవాల్సి న యాజమాన్య పద్ధతులను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డి నేటర్ డాక్టర్ టి.భరత్ వెల్లడించారు. వరి అధిక తేమతో కూడిన వాతావరణం వరిలో మానుపండు తెగులు సోకడానికి అనుకూలం. ఈ లక్షణా లు కనిపిస్తే ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు 0.4గ్రాములు + ట్రైపోసెక్సీస్ట్రెబిన్ టేబుకోన జోల్ లేదా ఒక ఎం.ఎల్. ప్రొఫైకోనజోల్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంటలో పాము పొడ తెగులు లక్షణాలు గమనిస్తే వర్షాలు తగ్గాక ఒక మి.లీ. ప్రొపికోనజోల్ను లీటర్ నీటిలో కలిపి 15 రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అలాగే, వరిలో సుడిదోమ ఆశిస్తే నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత 0.6 గ్రాముల పైమెట్రోజిన్ లేదా 0.48 మి.లీ. టేప్లోమేజపైరిన్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇంకా కంకి నల్లి ఆశిస్తే ఒక మి.లీ. స్ప్రైరోమైసిపిన్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే, బాక్టీరియా ఎండు తెగులు ఉధృతి కనిపిస్తే ఎకరానికి 400 గ్రాముల కాపర్ హైడ్రాకై ్సడ్, స్టేపీటోమైసిన్ సల్ఫైడ్ 60 గ్రాములు అందిస్తూ.. యూరియా మోతాదును తగ్గించి నీటిని తడి – పొడి విధానంలో అందించాలి. అయితే, ఈ తెగులుకు పూర్తిగా నివారించడానికి సరైన మందులు లేవు. పత్తి ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు 2 మి.లీ. ప్రోఫినోపాస్ లేదా 1.5 గ్రాముల దియోడికార్బ్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే, ఎకరానికి 5 – 6 లింగాకర్షణ బుట్టలు అమరిస్తే పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. అలాగే, పత్తిలో కాయకుళ్లు లక్షణాలు గమనిస్తే వర్షాలు తగ్గాక 0.2 గ్రాముల ప్లాంటమైసిన్ + 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి అపరాలు వెచ్చటి గాలి, అధిక తేమ వాతావరణ పరిస్థితుల్లో కంది, పెసర, మినుము పంటలను మారుకా మచ్చల పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు ఆనవాళ్లను గమనిస్తే వర్షాలు తగ్గిన తర్వా త నివారణకు ఒక మి.లీ. నోవాలురాన్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టేన్ బెంజ్యోట్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి కూరగాయలు ●టమాట పంటలో సూది పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు 0.3 మి.లీ. స్పైనో సాడే లేదా 0.2 మి.లీ. ఇండాక్సికార్బ్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక వంగలో కొమ్మ, కాయ తులసి పురుగు ఆశిస్తే 0.4 గ్రాముల ఇమామెక్టేన్ బెంజ్యోట్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి -
సన్నగా.. దారి తప్పిస్తూ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వం ఎన్ని మార్పులు చేసినా, ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. పలువురిపై కేసులు నమోదు చేసినా రేషన్ దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. సన్నబియ్యం పంపిణీ చేస్తే లబ్ధిదారులంతా తీసుకుంటారని, తద్వారా బియ్యం పక్కదారి పట్టే అవకాశం లేదని ప్రభుత్వం భావించింది. కానీ దీన్ని కూడా అక్రమార్కులకు వరంలా మార్చుకుని కొందరు డీలర్లు, దళారులు కలిసి యథేచ్ఛగా బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల లబ్ధిదారులే బియ్యం అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో పలు చోట్ల అక్రమంగా తరలిస్తున్న సన్నబియ్యం స్వాధీనంచ చేసుకుని 29 ఘటనల్లో 6 ‘ఏ’ కేసులు నమోదు చేశారు. దశాబ్దాలుగా ఇదే దందా.. రేషన్ బియ్యం రవాణా ఏళ్లుగా వ్యవస్థీకృత నేరంలా మారింది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న బియ్యం కొందరికి కాసులు కురిపిస్తోంది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డుబియ్యం పంపిణీ చేయగా చాలా మంది లబ్ధిదారులు తినలేక డీలర్లు, వ్యాపారులకు విక్రయించే వారు. దీంతో ఇదే వ్యాపారంగా పెట్టుకున్న కొందరు సేకరించాక ప్రాసెస్ చేయించి అధిక ధరలకు విక్రయించేవారు. బడా వ్యాపారులైతే మిల్లర్లు, డీలర్లు, ఇతరుల నుంచి భారీ మొత్తంలో రేషన్ బియ్యం సేకరించి పాలిష్ అనంతరం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఓడ రేవులకు, ఆపై విదేశాలకు కూడా ఎగుమతి చేశారు. ఇలా పేదలకు పాలకులు అందించే రేషన్ బియ్యం అక్రమార్కులకు రూ.కోట్లు సంపాదించి పెట్టింది. సన్న బియ్యంతోనూ.. పేద, మధ్య తరగతి ప్రజలు దొడ్డుబియ్యం తినలేక తీసుకోవడం లేదని.. పలువురు డీలర్లకే విక్రయిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. తద్వారా దారి మళ్లుతోందని గుర్తించగా సన్నబియ్యం పంపిణీలో ఈ వ్యవహారానికి చెక్ పెట్టొచ్చని భావించింది. సన్నబియ్యమైతే అందరూ తింటారని, తద్వారా డీలర్ల వద్ద మిగలవని.. ఆపై అక్రమాలు జరగవని అంచనా వేసింది. మొదటి రెండు నెలలు ప్రభుత్వం అనుకున్నట్లుగా లబ్ధిదారులంతా బియ్యం తీసుకెళ్లగా ఎక్కడా దారి మళ్లిన ఆనవాళ్లు బయటపడలేదు. కానీ సన్నబియ్యంకు డిమాండ్ ఉండటం, ధర కూడా ఎక్కువగా వస్తుండడంతో లబ్ధిదారులు విక్రయించడం మొదలుపెట్టడంతో దళారులు మళ్లీ రంగంలోకి దిగి ఇతర ప్రాంతాలకు తరలించడం ఆరంభించారు. ఎక్కడ వీలుంటే అక్కడ.. గతంలో దొడ్డు బియ్యం కేజీ రూ.10 లోపు విక్రయించగా.. సన్నబియ్యానికి వ్యాపారులు రూ.20 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమాన కొందరు రేషన్‌షాపుల్లో డీలర్లకే విక్రయిస్తుండగా, ఇంకొందరు తీసుకున్నాక వ్యాపారులు అప్పగిస్తున్నట్లు సమాచారం. అయితే, దందాకు ఎంఎల్ఎస్ పాయింట్లు కూడా కీలకంగా మారాయనే చర్చ జరుగుతోంది. కొందరు డీలర్లు ఇక్కడి నుంచి తీసుకెళ్లినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నా బయటకు తీసుకెళ్లడం లేదని సమాచారం. తద్వారా వ్యాపారులు కొందరు లబ్ధిదారులు, డీలర్ల నుంచే కాక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సేకరించి వాహనాల్లో భారీగా సన్నబియ్యం రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. సన్నబియ్యం తరలిస్తున్న ఘటనలు వెలుగు చూడడంతో అధికారులు నిఘా కట్టుదిట్టం చేశారు. దీంతో కొన్నిచోట్ల బియ్యం పట్టుపడుతున్నా అక్రమంగా తరలించే బియ్యం అంత కంటే భారీగానే ఉంటుందని చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్ వరకు టాస్క్‌ఫోర్స్ బృందాలు పలు మిల్లులు, రేషన్‌దుకాణాల్లో 28సార్లు తనిఖీ చేపట్టాయి. రేషన్ షాప్‌ల్లో బియ్యం నిల్వల్లో తేడా ఉన్నచోట నాలుగు కేసులు, బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై 25 కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో 651.60 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. కాగా, ఈనెల 14న నేలకొండపల్లిలోని ఓ రైస్ మిల్లులో 600 క్వింటాళ్ల బియ్యాన్ని అనుమానంతో పౌర సరఫరాల సంస్థ అధికారులు సీజ్ చేశారు. అయితే, ఈ బియ్యం శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించగా పీడీఎస్ బియ్యం కాదని తేలింది.బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రేషన్‌బియ్యం -
రాష్ట్ర బంద్‌కు అఖిలపక్షం మద్దతు
సత్తుపల్లి/సత్తుపల్లిటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 18న చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు అఖిపక్షం మద్ధతు ఇచ్చిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు అన్నివర్గాల ప్రజలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సత్తుపల్లిలో గురువా రం ఆయన మాట్లాడారు. అన్ని వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించాలన్నారు. నాయకులు దండు ఆదినారాయణ, పాండు, రఫీ, గాదె చెన్నారావు, శరత్, రంగారావు, మరికంటి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సంధీప్, చల్లారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కాగా, బీసీ సంక్షేమ సంఘం తలపెట్టిన బంద్‌కు బీజేపీ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లిలో ఆయన మాట్లాడగా, నాయకులు రమేష్, నాయుడు రాఘవరావు, విజయ్, శివకృష్ణ, నరేష్, వీరంరాజు, సుదర్శన్ మిశ్రా, సురేందర్‌రెడ్డి, కృష్ణయ్య, శ్రీను, రాంబాబు పాల్గొన్నారు. గంజాయి సేవిస్తున్న ఆరుగురి అరెస్ట్ సత్తుపల్లి: గంజాయి పీలుస్తున్న ఆరుగురిని సత్తు పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తుపల్లి మండలానికి చెందిన జె.సింహాద్రి, కె.రంజిత్ తమ స్నేహితులైన ఎస్.రాజేష్, అశోక్‌తో కలిసి ఒడిశా వెళ్లి మధు అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేశారు. ఈ గంజాయిని సింహాద్రి వద్ద దాయగా, గురువారం పీల్చేందుకు రేజర్ల సమీపాన డంపింగ్ యార్డ్ సమీపానికి రంజిత్, పవన్ సాయి, శ్రీనాథ్, స్వామి, రక్షక్ వచ్చారు. అదేసమయాన పెట్రోలింగ్‌కు వెళ్లిన చూసిన పోలీసులను చూసి పారిపోతుండడంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 320 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ -
పీడీఎస్‌యూ మహాసభల ఆహ్వాన కమిటీ ఎన్నిక
ఖమ్మంమయూరిసెంటర్: మతం పేరుతో ప్రజల విభజనకు జరుగుతున్న కుట్రలను యువత, విద్యార్థులు అడ్డుకోవాలని టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌రాజు సూచించారు. డిసెంబర్లో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు జరగనుండగా ఖమ్మంలో గురువారం రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృధ్వీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పోస్టర్లు ఆవిష్కరించి ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఈసందర్భంగా మనోహర్‌రాజు మాట్లాడుతూ నూతన విద్యావిధానం పేరుతో విద్యావ్యవస్థల్లో మత రాజకీయాలను జొప్పించేలా కేంద్రం యత్నిస్తోందని విమర్శించారు. ఇక ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సైతం విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లేదని చెప్పారు. అనంతరం ఆహ్వాన సంఘం గౌరవ అధ్య క్షుడిగా వైవీ.రమణరావు, అధ్యక్షుడిగా వి.మనోహర్ రాజు, ప్రధాన కార్యదర్శిగా కాంపాటి పృధ్వీ, రాష్ట్ర కోశాధికారిగా ఆవుల అశోక్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ిపీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్‌తోపాటు పోటు రంగారావు, వడ్డెల్లి కృష్ణమూర్తి, ఐవీ.రమణ, తదితరులు పాల్గొన్నారు. -
డీసీఎంను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఎనిమిది మందికి గాయాలు కొణిజర్ల: ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. భద్రాద్రి జిల్లా మణుగూరు నుండి ఖమ్మం వస్తున్న ఆర్టీసీ బస్సు కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపాన ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న భూక్యా లక్ష్మి, వడ్డె గిరి, వేము వాణి, కొత్తకోట భిక్షపతి, ఉప్పలయ్య, భాస్కర్, దుర్గాభవాని, భూక్యా బిందుకు గాయాలయ్యాయి. వీరిని 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించినట్లు కొణిజర్ల ఎస్ఐ సూరజ్ తెలిపారు. బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూటీనేలకొండపల్లి: ప్రమాదవశాత్తు స్కూటీ బస్సు కిందకు దూసుకెళ్లగా యువకుడు తృటిలో ప్రాణా పాయం నుంచి బయటపడ్డాడు. మండలంలోని గువ్వలగూడెంకు చెందిన మహేష్ గురువారం స్కూటీపై నేలకొండపల్లి రాగా, పొట్టి శ్రీరాముల సెంటర్లో మలుపు తిరుగుతుండగా కోదాడ నుంచి ఆర్టీసీ బస్సు ఖమ్మం వెళ్తోంది. ప్రమాదవశాత్తు బస్సు కిందకు స్కూటీకి దూసుకెళ్లగా మహేష్ పక్కకు దూకడంతో రెప్పపాటులో ప్రమాదం తప్పినట్లయింది. వీసాలు ఇప్పిస్తానని మోసం15 మంది నుంచి రూ.70 లక్షల వసూలు ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలోని నారాయణపురం, రాజుపాలెం గ్రామాల యువకులను విదేశాలకు పంపిస్తానంటూ వీసాల పేరిట నగదు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై గురువారం కేసు నమోదైంది. ఏపీ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన మోట్ల అభినవ్‌కుమార్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటుచేశాడు. ఆయనకు ఎర్రుపాలెం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వేముల సురేష్‌కు అభినవ్ పరిచయం కాగా.. జార్జియా దేశంలోని హాస్టళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికాడు. దీంతో రూ.4లక్షలు చెల్లించిన సురేష్ ఈ విషయాన్ని తన స్నేహితులు, బంధువులకు చెప్పాడు. ఈమేరకు నారాయణపురం, రాజు పాలెం గ్రామాలకు చెందిన 15మంది యువకులు రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు మొత్తం రూ.70లక్షల వరకు అభినవ్ వసూలు చేశాడు. ఆపై వీసాలు ఇప్పించడంలో జాప్యం చేస్తుండగా అనుమానంతో ఒత్తిడి చేశారు. దీంతో ఆయన ముఖం చాటేయగా మోసపోయామని గ్రహించిన బాధితుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు ఎర్రుపాలెం ఎస్ఐ రమేష్ తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తులకు వైద్యసాయం ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్‌లో మతిస్థిమితం లేని గుర్తుతెలియని వ్యక్తులకు కొన్నాళ్లుగా ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆరుగురికి మెరుగైన వైద్యం అందేలా గురువారం పోలీసుల సమక్షాన ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించినట్లు ఫౌండేషన్ చైర్మ న్ శ్రీనివాసరావు తెలిపారు. ఆతర్వాత కోర్టు అనుమతి తీసుకుని పోలీసు సిబ్బంది సాయంతో వారికి మెరుగైన వైద్యం కోసం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది సుధాకర్ పాల్గొన్నారు. -
హద్దులు దాటుతున్న ఇసుక
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ ఆధారంగా కొందరు ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ తతంగం వెనుక అక్కడి అధికార పార్టీ నేతలున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో అవసరాల కోసమంటూ ఇసుకను తెలంగాణలోని అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా ఖమ్మం, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే, అక్రమ రవాణాను రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఇటీవల పదుల సంఖ్యలో ఇసుక లారీలు (టిప్పర్లు) పట్టుబడడం అక్రవ రవాణాను బయటపెట్టింది. దర్జాగా సరిహద్దులు దాటించి.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుపేదల కోసమంటూ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అక్కడి అధికార పార్టీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అక్కడి ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్ల నుంచి నిర్మాణాల పేరుతో అనుమతి తీసుకుని టన్నుకు రూ.250 నుంచి రూ.500 వరకు చెల్లిస్తారు. ఆపై అనుమతి తీసుకున్న ప్రాంతానికి కాకుండా విజయవాడ, కొవ్వూరు సమీపం నుంచి తెలంగాణలోని అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా ఖమ్మం, హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రణాళికాయుతంగా... ఇసుక దందాను అక్రమార్కులు తెలివిగా నడిపిస్తున్నారు. ఎక్కడి నుంచి.. ఎప్పుడు .. ఎలా తరలించాలన్న అంశంపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమాన ఇసుక తరలించే కొన్ని లారీలకు నంబర్ ప్లేట్లు తొలగిస్తున్నారు. లేకపోతే నేషనల్ హైవే అథారిటీ అవసరాల కోసమంటూ స్టిక్కర్లు వేస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు ఇసుక తరలిస్తున్నామని చెబుతూ తెలంగాణలో డంప్ చేస్తున్నారు. కొన్నిసార్లయితే టైల్స్, జిప్సం పౌడర్ అని చెబుతూ లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తరలిస్తున్నారు. అప్పుడప్పుడు పట్టుబడుతూ.. ఇటీవల అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. కొన్ని లారీలు కొవ్వూరులో ఇసుకను లోడ్ చేసుకుని ఏలూరుకు వెళ్లాల్సి ఉండగా దారి మళ్లించడంతో తెలంగాణ సరిహద్దు.. ఏపీలోని జీలుగుమిల్లి వద్ద పోలీసులకు చిక్కాయి. ఓ లారీ మార్గమధ్యలో మరమ్మతులకు గురై దాదాపు 12గంటల పాటు ఏపీ భూభాగంలోనే ఉంది. అయినా అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే లారీ తెలంగాణలోకి ప్రవేశించాక పట్టుబడింది. ఉచిత ఇసుక పథకం ద్వారా అనుమతి తీసుకున్న చోటకు కాకుండా ఇంకో చోటకు తరలిస్తున్నారు. తెలంగాణ సమీపాన ఆంధ్రా సరిహద్దుల వెంట ఇసుక డంప్ చేసి వ్యాపారం చేస్తున్నారు. 50 టన్నులు ఉన్న లారీకి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లిస్తారు. అదే ఇసుకను హైదరాబాద్‌లో టన్నుకు రూ.3వేల నుంచి రూ.3,500 వరకు విక్రయిస్తారు. ఇలా ఒక లారీ బయటకు వస్తే రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు వస్తుండగా.. ఖర్చులు పోగా లారీకి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు మిగులుతాయి. ఇలా ప్రతీరోజు 50 నుంచి 100 లారీల ఇసుకను వివిధ మార్గాల్లో హైదరాబాద్ తరలిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. ఏపీ నుంచి తెలంగాణకు లారీల్లో తరలింపు -
ఎకరాకు 300గజాల ప్లాట్
టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలిఖమ్మంఅర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన ఖమ్మంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి అసైన్డ్ భూములు కలిగిన రైతులు సహకరించాలని అర్బన్ తహసీల్దార్ దొడ్డారపు సైదులు కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఆయన అల్లీపురం, కొత్తగూడెం రైతులతో సమావేశమయ్యారు. ఆలయ నిర్మాణ అవసరాలకు రైతులు భూమి ఇస్తే ఎకరాకు 300 గజాల చొప్పున అదే ప్రాంతంలో అన్ని వసతులతో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను అమ్మడం, కొనడానికి హక్కు ఉండదని చెప్పారు. కానీ ఇందుకు బదులుగా ఇచ్చే ప్లాట్లపై పూర్తి హక్కులు లభిస్తాయని భరోసా కల్పించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో టీటీడీ ఆలయ నిర్మాణానికి నిర్మాణం చేపట్టనుందని.. తద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించనున్నందున రైతులు సహకరించాలని తహసీల్దార్ కోరారు. ఈసమావేశంలో వీ.వీ.పాలెం సొసైటీ అధ్యక్షుడు రావూరి సైదుబాబు, నాయకులు వెనిగండ్ల సత్యనారాయణ, సంక్రాంతి నాగేశ్వరరావు, బర్ల కోటేశ్, రవి, గద్దల రాంబాబు, ఫ్రాన్సిస్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలి పారు. ఖమ్మంలో బుధవారం ఆయన డిపో మేనేజర్లు, సూపర్వైజర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి అన్నవరం, పంచారామాలకు సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లు తెలి పారు. కార్తీకమాసంలో ప్రతీ ఆదివారం రాత్రి 8 గంటలకు అన్ని బస్టాండ్ల నుండి బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం యాత్రల వివరాలతో కూడిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, పీఓ సంపత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ ఖమ్మం స్పోర్ట్స్: బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 25 పాఠశాలల్లో మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని, వారానికి ఆరు సెషన్లు మించకుండా 24తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. కాగా, కరాటే శిక్షణకు మహిళలకు ప్రాధ్యానత ఇస్తామని, ఎక్కడైనా అందుబాటులో లేకపోతే పురుషులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వనుండగా, బ్లాక్ బెల్ట్ ఉన్న వారు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 2గంటల్లోగా సర్దార్ పటేల్ స్టేడియంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ఖమ్మం సహకారనగర్: పెనుబల్లి మండలం ఏరుగట్లలో నిర్మాణం పూర్తయిన –40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో లబ్ధిదారుల సమక్షాన ఇళ్లు కేటాయించామని జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ తెలిపారు. గతంలోనే లబ్ధిదారులను ఎంపిక చేయగా, ర్యాండమైజేషన్ ద్వారా ఇళ్ల కేటాయింపు చేపట్టామని చెప్పారు. ఈకార్యక్రమంలో ఈడీఎం దుర్గాప్రసాద్, ఉద్యోగులు రాజశేఖర్, ప్రవీణ్ పాల్గొన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యాన ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు ఖమ్మంక్రైం: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్ డే)ను పురస్కరించుకుని రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. పోలీసుల త్యాగాలు, విధుల్లో వారి ప్రతిభను చాటేలా తీసిన మూడు ఫొటోలు, మూడు నిమిషాల లోపు నిడివితో రూపొందించిన షార్ట్‌ఫిల్మ్ పెన్‌డ్రైవ్‌లను తమ కార్యాలయంలో ఈనెల 22వ తేదీలోగా అందజేయాలని సూచించారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఈ ఏడాది అక్టోబర్ వరకు తీసిన ఫొటోలు, షార్ట్ ఫిల్మ్లనే సమర్పించాలని తెలిపారు. వివరాల కోసం 87126 59256 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. -
సమన్వయంతో పని చేస్తున్నారా?!
సత్తుపల్లి: పాత, కొత్త కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారా.. స్థానిక సంస్థల్లో విజయం వరిస్తుందా.. అంటూ ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ ఆరా తీశారు. జిల్లా అధ్యక్ష పదవి ఎంపికకు చేపడుతున్న అభిప్రాయ సేకరణలో భాగంగా సత్తుపల్లి, కల్లూరుల్లో బుధవారం సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ సమావేశాల్లో మహేంద్రన్ పాల్గొనగా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలు, బ్లాక్‌ల వారీగా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లాలో పార్టీ పనితీరు ఎలా ఉందని ప్రశ్నించగా.. ముగ్గురు మంత్రులు పార్టీని ముందుకు నడిపిస్తున్నారని కార్యకర్తలు బదులిచ్చారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులుగా పాత నాయకులనే ఎంపిక చేయడంతో పనితీరు సంతృప్తిగానే ఉందని తెలిపారు. అవకాశం ఇవ్వండి.. డీసీసీ అధ్యక్ష పదవిని డాక్టర్ మట్టా దయానంద్‌కు అప్పగించాలని పార్టీ శ్రేణులు కోరాయి. సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి రాగమయి గెలుపునకు కృషి చేశారని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దయానంద్‌కు అధ్యక్ష పదవి అప్పగిస్తే పార్టీకి లాభం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతరులకు అవకాశం కల్పించాలనుకుంటే ఎమ్మెల్యే రాగమయి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, నాయకులు మట్టా దయానంద్, తుమ్మల యుగంధర్, చక్కిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అభిప్రాయ సేకరణలో ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ -
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం
● 72గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి నగదు ● వీసీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్, తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం సహకారనగర్: గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేలా అధికార యంత్రాంగం సిద్ధం కావాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో 48 నుంచి 72గంటల్లో నగదు జమ అవుతుందనే విషయమై అవగాహన కల్పించాలని చెప్పారు. కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాణ్యమైన పంటకు మద్దతు ధర ఖమ్మంవ్యవసాయం: నాణ్యమైన పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందుతుందనే అంశంపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. మంత్రుల వీసీ అనంతరం అధికారులతో సమావేశమైన ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి వానాకాలం పంటల కనీస మద్దతు ధరల వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రేడ్ ‘ఏ’ రకం వరికి రూ.2,389తో పాటు రూ.500 బోనస్, సాధారణ రకానికి రూ. 2,369, పత్తి తేమశాతం ఆధారంగా గరిష్టంగా రూ.8,110, మొక్కజొన్న రూ.2,400 మద్దతు ధర నిర్ణయించారని చెప్పారు. కేంద్రాల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్ చేసుకునే అంశంపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఆర్డీఓ సన్యాసయ్య, డీసీఎస్ఓ చందన్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత, డీఏఓ డి.పుల్ల య్య, మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం, జిల్లా రవాణా అధికారి వెంకటరమణ, జిల్లా సహకార అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి ఖమ్మం అర్బన్: జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచడమే కాక అవసరమైన చోట మరమ్మతులు చేయించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆర్అండ్బీ, జాతీయ రహదారుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. వర్షాలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. జిల్లా ప్రవేశం వద్ద నలువైపులా బోర్డులు ఏర్పాటు చేసి మొక్కలు నాటాలని తెలిపారు. అలాగే, బైపాస్ బ్రిడ్జి వెడల్పునకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ ఎస్ఈలు యాకూబ్, శ్రీనివాసాచారి, నేషనల్ హైవే పీడీ రామాంజనేయరెడ్డి, ఈఈలు పవార్, తానేశ్వర్, యుగంధర్ దితరులు పాల్గొన్నారు. -
ఈ మూడు రోజులే కీలకం
● 116 వైన్స్‌కు ఇప్పటివరకు 492 దరఖాస్తులే.. ● 18వ తేదీతో ముగియనున్న గడువుఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ కేటాయింపునకు టెండర్లు ఆహ్వానించగా ఇప్పటివరకై తే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈనెల 18వ తేదీ శనివారంతో గడువు ముగియనుంది. దీంతోచివరి మూడు రోజుల్లో అత్యధిక దరఖాస్తులు రాబట్టుకునేలా ఎకై ్సజ్ శాఖ అధికారులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గత పాలసీలో గరిష్టం జిల్లాలో గత ఎకై ్సజ్ పాలసీలో వైన్స్‌కు అందిన దరఖాస్తుల ద్వారా రూ.144 కోట్లకు పైగా ఆదాయం నమోదైంది. అప్పట్లో దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా ఈసారి రూ.3లక్షలకు పెంచారు. దీంతో ఈసారి కూడా గణనీయమైన సంఖ్యలో దరఖాస్తులు.. అదే స్థాయిలో ఆదాయం వస్తుందని అధికారులు భావించారు. కానీ బుధవారం నాటికి జిల్లావ్యాప్తంగా వైన్స్‌కు కేవలం 492 దరఖాస్తులు రావడం గమనార్హం. గడువు సమీపిస్తున్నా దరఖాస్తులు ఆశాజనకంగా లేకపోవడం.. మద్యం వ్యాపారంలో ఉన్న వారితో భేటీలు నిర్వహించి అవగాహన కల్పించినా ఫలితం లేకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పదుల సంఖ్యలోనే... జిల్లాలో ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1, 2, నేలకొండపల్లి, మధిర, వైరా, సత్తుపల్లి సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు ఎకై ్సజ్ స్టేషన్–1 పరిధిలోని వైన్స్‌కు దరఖాస్తులు అధికంగా వచ్చాయి. కొన్ని స్టేషన్ల పరిధిలో పదుల సంఖ్య కూడా దాటలేదు. అయితే గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, చివరి రెండు రోజులైన శుక్ర, శనివారాల్లో దరఖాస్తుదారులు పోటెత్తే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఒకవేళ దరఖాస్తులు తగ్గినా ఫీజు రూ.3లక్షలుగా ఉన్నందున గతంలో మాదిరే ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు.దరఖాస్తు ధర గత పాలసీలో రూ.2లక్షలు ఉంటే ఈసారి రూ.3లక్షలకు పెంచడంతో వ్యాపారుపై ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష అదనపు భారం పడుతోంది. దీంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి తమ ప్రాంతాల పరిధిలో బాగా అమ్మకాలు ఉండే షాపులను ఎంచుకుని కలిసొచ్చే వారి పేర్లతో టెండర్లు వేయటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గత పాలసీలో అధికంగా టెండర్లు వేసిన ఆంధ్రా వ్యాపారులు సైతం ఈసారి మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది. జిల్లా వ్యాపారులతో పాటు ఏపీ వ్యాపారులతోనూ సమావేశమైన ఎకై ్సజ్ అధికారులు అవగాహన కల్పించగా వారు ముందు కొచ్చినట్లు సమాచారం. అంతేకాక పలువురు రాజకీయ ప్రముఖులు సైతం బినామీల పేర్లతో టెండర్లు వేయాలనే భావనతో ఉన్నారని... వరంగల్, నల్లగొండ వ్యాపారులు సైతం ఖమ్మం జిల్లా వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
అడిషనల్ డీసీపీ ప్రసాద్రావుఖమ్మంక్రైం: రానున్న దీపావళి సందర్భంగా బాణసంచా షాప్‌లు ఏర్పాటుచేసే వారు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు సూచించారు. తద్వారా ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చని తెలిపారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో 86, పెవిలియన్ మైదానంలో 42 షాపులు కలిపి 128షాప్‌ల ఏర్పాటుకు నిర్ణయించగా, 148మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో డ్రా తీసి షాప్‌లు కేటాయించారు. అనంతరం అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్ శాఖల సూచనతో షాప్‌లు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. విక్రయాల సమయాన తగిన జాగ్రత్తలు పాటించాలని, అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, బాణాసంచాల షాప్‌లు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బు వసూలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈకార్యక్రమంలో నగర ఏసీపీ రమణమూర్తి, ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ పాల్గొన్నారు. -
సత్తుపల్లి గనుల్లో ఖనిజాలు...
ఏరియా జీఎం షాలేంరాజుసత్తుపల్లి: సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో స్కాండియం, స్ట్రాటియం, నియోడియోనియం తదితర ఖనిజాలు ఉన్నట్లు గుర్తించామని కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు వెల్లడించారు. స్థానిక జీఎం కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఇక్కడ ఖనిజాల ఆనవాళ్లను గుర్తించగా పరీక్షల కోసం హైదరాబాద్, భువనేశ్వర్‌కు చెందిన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఖనిజాల వెలికితీత సాధ్యాసాధ్యాలు పరిశీలించాక వాణిజ్యపరంగా అవసరమని భావిస్తే వెలికితీస్తామన్నారు. కాగా, సత్తుపల్లి కోల్ హ్యాండ్లిగ్ ప్లాంట్, సైలో బంకర్ మరమ్మతు పనులు త్వరలోనే చేపడతామని చెప్పారు. అంతేకాక కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన సమంత కంపెనీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఈ ఏడాది చివరికల్లా ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇక్కడి ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే, సత్తుపల్లికి సీఎస్ఆర్ నిధుల కింద రూ.32 కోట్లు, డీఎంఎస్టీ నిధులు రూ.247 కోట్లను సింగరేణి తరఫున కేటాయించామని జీఎం వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి సూచనలతో ఈనెల 26న సత్తుపల్లిలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఎస్ఓటీ జీఎం కోటిరెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ శౌర్య పాల్గొన్నారు. -
మున్నేటికి రిటైనింగ్ వాల్ మరింత...
ఖమ్మంఅర్బన్: మున్నేటి వరద ముప్పు నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను రక్షించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతుండగా, దీన్ని మరింత పొడిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే రూ.690 కోట్ల అంచనా వ్యయంతో మున్నేటికి ఇరువైపులా సుమారు 17 కి.మీ. మేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని కాలనీలకు కూడా ముప్పు పొంచి ఉన్నందున ఇంకా 13 కి.మీ. పొడిగించాలని నిర్ణయించారు. ఈమేరకు జలవనరుల శాఖ డీఈ ఉదయ్‌ప్రతాప్, ఏఈలు రాజేశ్వరరావు, సంతోష్‌రెడ్డితో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యాన సర్వే చేస్తున్నారు. గత ఏడాది మున్నేటికి వరద ముంచెత్తడంతో వేలాది ఇళ్లు ముంపునకు గురయ్యాయి. అలాంటి వరద మళ్లీ వచ్చినా ఇబ్బంది లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పొడిగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ప్రకాశ్‌నగర్ వద్ద నుంచి ధంసలాపురం వద్ద నేషనల్ హైవే వంతెన వరకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేపడుతున్నారు. 13 కి.మీ. మేర పొడిగించేలా నిర్ణయం -
విజయవాడలో కారేపల్లి వాసి ఆత్మహత్య
కారేపల్లి: కుటుంబ సమస్యల నేపథ్యాన ఓ వ్యక్తి విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారేపల్లి మండలం ఆలియాతండా గ్రామానికి చెందిన బానోతు హరిచందర్ (32) విజయవాడలో ఓ రెసిడెన్షియల్ స్కూల్లో వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా కుటుంబ సమస్యలు ఉండడంతో ఆవేదన చెందిన ఆయన విజయవాడలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మృతదేహాన్ని బుధవా రం స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, హరిచందర్కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. రూ.74 వేల విలువైన గంజాయి స్వాధీనం కామేపల్లి: ఒడిశా నుంచి గంజాయి తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. మండలంలోని ముచ్చర్ల క్రాస్ రోడ్డులో బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా జాస్తిపల్లికి చెందిన పల్లపు వేణు, ముచ్చర్లకు చెందిన షేక్ యాసిన్ బైక్‌పై వెళ్తూ పోలీసులను చూసి పారిపోయే యత్నం చేశారు. వారిని పట్టుకుని బ్యాగ్‌లో తనిఖీ చేయగా రూ.74,250 విలువైన 1.485 కేజీల గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఒడిశాకు చెందిన అభి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారని తేలడంతో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. కడవరకూ తోడుగానే... భర్త దశదిన కర్మలోగా భార్య మృతి సత్తుపల్లిరూరల్: ఇటీవలే భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి ఆయనను తలుచుకుంటూ కన్నీరుము న్నీరుగా రోదిస్తున్న భార్య సైతం కన్నుమూసింది. భర్త దశదిశ కర్మ కు ఓ రోజు ముందే ఈ ఘటన జరగడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన నంధ్యాల పుల్లారెడ్డి (90) అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 2వ తేదీన మృతి చెందాడు. అప్పటినుంచి ఆయన భార్య సత్యవతి(80) నిద్రాహారాలు మాని రోదిస్తోంది. ఈ క్రమాన గురువారం పుల్లారెడ్డి దశదిన కర్మకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగానే, సత్యవతి బుధవారం ఉదయం కన్నుమూసింది. దీంతో ఆయన కుటుంబంతో పాటు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, పుల్లారెడ్డి దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
పాడిసంపదతో రైతుల ఆర్థికాభివృద్ధి
కల్లూరురూరల్/ఖమ్మంవ్యవసాయం: రైతులు వ్యవసాయం చేస్తూనే పాడి పశువుల పోషణ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించొచ్చని జిల్లా పశు సంవర్థక, పశువైద్యాధికారి బోడేపూడి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కల్లూరు మండలంలోని కొర్లగూడెంలో పశువులకు టీకాలు వేసిన ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 14 వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సకాలంలో టీకాలు వేయిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే పశువులు మేత తినక నీరసిస్తాయని, పాల దిగుబడి పడిపోతుందని తెలిపారు. ఈ మేరకు రైతులు తమ గేదెలు, దున్నలతో పాటు ఆవులు, ఎద్దులకు టీకాలు వేయించాలని సూచించారు. పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నీరజ, పశువైద్యాధికారులు మమత, సఫియా, ఉద్యోగులు శ్రీనివాస్, కె.రామకృష్ణ, ఆమని, నయీమ్, శ్రీను, నాగరాజు, గోపాలమిత్ర పాల్గొన్నారు. -
పిల్లల్లో పోషణ లోపం
● బరువు తక్కువగా మరికొందరు.. ● ‘పోషణ మాసం’ సర్వేలో గుర్తింపు ● మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా అవగాహన సదస్సులుసత్తుపల్లిటౌన్: పిల్లలకు అందించాల్సిన పోషకాహా రంపై తల్లిదండ్రులకు అవగాహన లేక సమస్యలు ఏర్పడుతున్నాయి. పిల్లల పోషణతో పాటు ఆరో గ్యం మెరుగుపర్చడమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నా పూర్తిస్థాయిలో ఫలితాలు రావ డంలేదు. సరైన పోషకాలు అందక పలువురు చిన్నా రుల్లో ఎదుగుదల లోపిస్తోంది. ఈ నేపథ్యాన అంగన్వాడీల ద్వారా చిన్నారుల్లో బలహీనత, రక్తహీనత, పోషణ లోపాలు నివారించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాలో కల్లూరు, కామేపల్లి, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, మధిర, సత్తుపల్లి, తిరుమలాయపాలెంలలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో తల్లిదండ్రులతో పాటు ఇతర లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా ‘పోషణ మాసం’ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అతి తీవ్రలోపపోషణ, తీవ్ర లోపపోషణతో 1,940 మంది చిన్నారులు, అతితక్కువ బరువు, తక్కువ బరువుతో 4,171 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక ప్రణాళికతో.. బాల్యం బాగుంటే భవిష్యత్ బంగారుమయమవుతుందనే నినాదంతో ప్రభుత్వం మాతాశిశు సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఏటా గర్భిణులు, బాలింతలు చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యాన సెప్టెంబర్ 17వ తేదీనుంచి అక్టోబర్ 16వ తేదీవరకు పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. గర్భం దాల్చి నప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకా హారం ఆవశ్యకతతో పాటు బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారు. ఈ సమయాన చిన్నారుల ఆరోగ్యాన్ని పరీక్షించి లోపాలను గుర్తించడంతో పాటు అందించాల్సిన ఆహా రంపై అవగాహన కల్పిస్తున్నారు. లోపాలను అధిగమించేలా.. ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేయడమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు స్థానికంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల ద్వారా పోషకాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణులకు సీమంతం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్గార్డెన్ల పెంపకం చేపట్టి అందులో పండించే కూరగాయల ద్వారా భోజనం సమకూరుస్తారు. అలాగే, చిన్నారుల ఎత్తు, బరువు పరీక్షించి పరిస్థితులు మెరుగపడేలా బాలామృతం, క్యాల్షియం, ఐరన్ మాత్రలు పంపిణీ చేపడుతున్నారు. అంతేకాక పోషకాహారం, తల్లిపాల ఆవశ్యకతపై ర్యాలీలు, సదస్సులతో అవగాహన పెంపొందిస్తున్నారు.ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగపరిచేలా ప్రత్యేక దృష్టి సారించింది. ఈక్రమంలోనే పోషణమాసంలో వయస్సుకు తగిన బరువు లేని చిన్నారుల ఎదుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆహారంలో పాలు, పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాలను చేర్చడం వల్ల ప్రయోజనాలను వివరిస్తున్నాం.– రాంగోపాల్‌రెడ్డి, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖాధికారి -
బాల రచయితగా పోతురాజు
సత్తుపల్లిరూరల్: ప్రతిభ ఎవరి సొంతమూ కాదు.. పట్టుదల, కృషిచేసి ఉంటే ఏ స్థాయికై నా ఎద గొచ్చని నిరూపించాడు సత్తుపల్లి మండలం గంగా రం గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థి ఆవుల పోతురాజు. ఇప్పటివరకు విద్యార్థి 20 కథలు రాయగా, వీటిని గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు జి.రామకృష్ణ, బి.మధుసూదన్‌రాజు ఆధ్వర్యాన పుస్తకంగా తీసుకొస్తున్నారు. ఈ మేరకు బుధవారం వారు వివరాలను వెల్లడించారు. పెను బల్లి మండలం టేకులపల్లికి చెందిన ఆవుల యాక య్య – తిరుపతమ్మకు మారేషు, అంకిత, పోతు రాజు ముగ్గురు సంతానం. గంగిరెడ్ల సామాజిక వర్గానికి చెందిన యాకయ్య కుటుంబం పదేళ్ల క్రితం సత్తుపల్లికి చేరుకొని గుడిపాడురోడ్డు చివర గుడా రం వేసుకొని గంగిరెద్దులను ఆడిస్తూ జీవనం సాగిస్తోంది. సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పోతురాజు 9వ తరగతిలో ఉన్నప్పుడే వేమన శతకంలోని వంద పద్యాలు నేర్చుకుని అవధానం చేశాడు. అయితే, పోతురాజుకు కథలు రాసే నైపుణ్యం ఉందని గ్రహించిన తెలుగు ఉపాధ్యాయురాలు ఎం.రమా దేవి ప్రోత్సహించగా ఇరవై కథలు రాశాడు. దీనికి హెచ్ఎం సోందు షేక్ పోతురాజుకు సహకరించారు. ఆపై విషయం గార్లపాటి, బొల్లేపల్లి ట్రస్ట్ బాధ్యులకు చేరడంతో పుస్తకాన్ని ప్రచురించడానికి సిద్ధమయ్యారు. దాతల చేయూతతో పుస్తక ప్రచురణ చివరి దశకు చేరిందని రామకృష్ణ, మధుసూదన్‌రాజు తెలిపారు.సంచార కుటుంబం నుంచి సాహితీ లోకంలోకి.. -
ఆరోగ్యశ్రీ డీఈఓల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆరోగ్య శ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల (డీఈఓలు) సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరగగా, డీఈఓల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గం వివరాలను టీఎన్జీవోస్ రాష్ట్ర నాయకుడు నందగిరి శ్రీనివాస్ ప్రకటించారు. సంఘం అధ్యక్షుడిగా కె.వినయ్‌కుమార్(ఖమ్మం), అసోసియేట్ అధ్యక్షుడిగా కె.శ్రీహరి(దుబ్బాక), కార్యదర్శిగా జి.సుధాకర్(భద్రాచలం), కోశాధికారి గా పి.సంతోష్(గజ్వేల్)ను ఎన్నుకున్నారు. అలా గే, ఉపాధ్యక్షులుగా ఎన్.ఎల్లేశ్(జనగామ), పి.సంతోష్(మెదక్), సహాయ కార్యదర్శిగా బి.సతీశ్(వరంగల్), శోభ(కరీంనగర్), ప్రచార కార్యదర్శిగా బి. గౌతమ్(కామారెడ్డి), ప్రచార కార్యదర్శిగా మౌని క (బాన్సువాడ), కార్యవర్గ సభ్యులుగా ఎస్కేఇమ్మాన్(కామారెడ్డి), జి.సాగర్(ఖమ్మం), సునీల్(బూర్గంపాడు)ను ఎన్నుకున్నారు. -
పెద్దాస్పత్రిలో టాస్క్‌ఫోర్స్ సభ్యుల తనిఖీ
ఖమ్మంవైద్యవిభాగం: టాస్క్‌ఫోర్స్ రాష్ట్ర కమి టీ సభ్యురాలు, వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ శశిశ్రీ బుధవారం ఖమ్మం జనరల్ ఆస్పత్రిని తనిఖీచేశారు. వివిధ వార్డు లు, ఆపరేషన్ థియేటర్, డ్రగ్ స్టోర్‌ను పరిశీలించిన ఆమె అగ్నిమాపక నియంత్రణ పరికరాల నిర్వహణపై ఆరా తీశారు. అలాగే, మందుల లభ్యత, ఈ – ఔషధి పోర్టల్‌ను వివరాల నమోదుపై సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.నరేందర్‌తో సమీక్షించారు. రూ.5 లక్షలకు పైగా విలువైన పరికరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హెచ్‌ఈఈఓ వి.రవికుమార్, ఎం.దుర్గ, బయో మెడికల్ ఇంజనీర్ ఇస్లావత్ రెడ్డి, ఫార్మసీ సూపర్వైజర్ వై.పద్మావతి పాల్గొన్నారు. ఆ తర్వాత పాండురంగాపురం బస్తీ దవాఖానాను సైతం శశిశ్రీ తనిఖీ చేశారు. వ్యాక్సిన్లతో వ్యాధుల వ్యాప్తికి చెక్మధిర: బాలింతలు, గర్భిణులతో పాటు చిన్నారులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించ డం ద్వారా వ్యాధులు దరిచేరవని జిల్లా వాక్సిన్ లాజిస్టిక్ మేనేజర్ చింతల వెంకటరమణ తెలిపారు. మధిర మండలంలోని దెందుకూరు, మడుపల్లి, మధిర పీపీ యూనిట్లలో బుధ వారం వ్యాక్సినేషన్ శిబిరాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. టీకా ల నిల్వపై సిబ్బందిని ఆరా తీయడమేకాక డోస్‌ల వారీగా క్రమం తప్పకుండా టీకాలు వేయాలని సూచించారు. అలాగే, ఆస్పత్రులకు వచ్చిన బాలింతలు, గర్భిణులకు టీకాల ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ పృథ్వీరాజ్‌నాయక్, సీహెచ్ఓ వి. వెంకటేశ్వర్లు, ఉద్యోగులు గోవింద్, లంకా కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఉచిత గుండె జబ్బుల నిర్ధారణ శిబిరం ఖమ్మంవైద్యవిభాగం: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) జిల్లా కమిటీ ఆధ్వర్యాన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి సౌజన్యంతో బుధవారం చిన్నపిల్లల గుండె జబ్బుల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఐఏపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యాన ఐఎంఏ హాల్లో నిర్వహించిన శిబిరంలో పెద్దసంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యు లు భరత్‌కుమార్, సాయిభార్గవ్తో పాటు ఏఐజీ ఆస్పత్రి గుండె జబ్బుల వైద్యనిపుణులు చిన్న స్వామిరెడ్డి, లింగస్వామి చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. పిల్లల్లో గుండెజబ్బులకు కారణాలపై అవగాహన కల్పించడంతో పాటు చికిత్సకు ఉన్న అవకాశాలను వివరించామని తెలిపారు.అత్యవసర సేవల వాహనాల తనిఖీమధిర: మండలంలో 108, 1962, 102 వాహనాలను జిల్లా అత్యవసర సేవల అధికారి ఆవులూరి దుర్గాప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. వాహనాల పనితీరు, రోజువారి కేసులను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో కీలకమైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు పేరెల్లి రవీంద్రబాబు, గుజ్జర్లపూడి రామయ్య, తాజుద్దీన్, వెంకటేశ్వర్లు, తోటపల్లి రాజేశ్, పశు వైద్యాధికారులు సౌజన్య, నందిని పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో పోషకాహారం
చింతకాని: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారా న్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమా ధికారి కె.రాంగోపాల్‌రెడ్డి సూచించారు. పోషణ మా సోత్సవంలో భాగంగా చింతకాని రైతువేదికలో బుధవారం గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేయించారు. ఈ సందర్భంగా డీడ బ్ల్యూఓ మాట్లాడుతూ.. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని తెలిపారు. అంతేకాక పిల్లల్లో మానసిక, శారీరక అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. పోషకాహర లోపంతో చాలామంది పిల్ల లు రక్తహీనతతో బాధపడుతున్నందున బాలింతలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనం తరం తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారం తయారీపై ప్రదర్శన నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీ ఓ కమలప్రియ, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, తహసీల్దార్ బాబ్జీప్రసాద్, మండల వైద్యాధికారి ఆల్తాఫ్, వెంకటేశ్వర్లు, ఉద్యోగులు షామిలి, పద్మావతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్‌రెడ్డి -
పాఠశాలలకు క్యాలెండర్లు!
● నెలల వారీగా కార్యకలాపాల ముద్రణ ● పరీక్షలు, సెలవుల వివరాలతో రూపకల్పన ● సవివరంగా సమావేశాలు, ముఖ్య తేదీలు కూడా.. ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్లను అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో వీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు ఇటీవలే క్యాలెండర్లు చేరగా.. 1,137 ప్రభు త్వ పాఠశాలలకే కాక కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈఓ కార్యాలయంతో పాటు ఎమ్మార్సీలు, పాఠశాలలకు అందించనున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు చేరిన ఈ క్యాలెండర్లను పాఠశాలలకు పంపిస్తున్నారు. లక్ష్యం ఇలా.. పాఠశాల విద్యాశాఖ ప్రతీ విద్యార్థికి ఉచితంగా, సమానంగా, నాణ్యమైన విద్య అందేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రతీ విద్యార్థిలో పఠనం, లెక్కలు, శాసీ్త్రయ ఆలోచన, డిజిటల్ పరిజ్ఞానం వంటి అంశాల్లో దృఢమైన పునాదులను ఏర్పర్చేలా కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. విద్యార్థి సమగ్ర అభివృద్ధి కోసం 21వ శతాబ్దపు నైపుణ్యా లు, విలువలు, సామాజిక – భావోద్వేగ సౌఖ్యాన్ని పెంపొందించడమనే లక్ష్యాలను క్యాలెండర్లపై ముద్రించారు. ఆకట్టుకునేలా క్యాలెండర్లు ప్రభుత్వం పాఠశాలలకు అందిస్తున్న క్యాలెండర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. క్యాలెండర్‌పై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన రావడమే కాక రోజువారీ కార్యక్రమాలు అర్థమయ్యేలా రూపొందించారు. విద్యావిధానాన్ని తెలియజేస్తూనే ఒక్కో నెల పేజీపై నీతి సందేశం ముద్రించారు. పాఠశాల పనిదినాలు, పండుగలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, తల్లిదండ్రులు, పాఠశాల సముదాయ సమావేశాలు, సెలవులు, వైజ్ఞానిక ప్రదర్శనల వివరాలు కూడా పొందుపరిచారు. అలాగే, యోగా, ధ్యానం, బ్యాగ్‌లు లేకుండా పాఠశాలలకు వచ్చే వివరాలు కూడా ముద్రించారు. గతంలో ఫోన్లోనే.. ఇప్పటివరకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు అకడమిక్ క్యాలెండర్‌ను ఫోన్లోనే పంపించే వారు. ఈసారి కొత్తగా ముద్రించి పంపిణీ చేస్తున్నారు. దీనిపై అన్ని వివరాలు ఉండడంతో ఏయే తేదీల్లో ఏయే కార్యక్రమాలు నిర్వహించాలో తెలిసిపోతుంది. -
18న బంద్‌ను విజయవంతం చేయండి
ఖమ్మంమామిళ్లగూడెం: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న చేపడు తున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘంజిల్లా అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ పిలుపునిచ్చా రు. ఖమ్మం అంబేడ్కర్ భవనంలో బుధవారం జరిగిన కుల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యాన కుల సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ఈ మేరకు 14మంది కన్వీనర్లను నియమించా రు. నాయకులు, పుల్లారావు, శివ, వెంకట్రామ య్య, వీరన్న, సుంకర శ్రీనివాస్, రామ్మూర్తి గౌడ్, కృష్ణమాచారి, మధుగౌడ్, పిండిప్రోలు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. బంద్‌కు మాస్‌లైన్ మద్దతు ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లును ఆమోదించకపోవడం, ఇతర అంశాలను నిరసిస్తూ బీసీ సంఘాలు ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్య దర్శి పోటు రంగారావు తెలిపారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని పేర్కొన్నారు. ఈ క్రమాన బీసీల పోరాటానికి అండగా నిలిచేలా బంద్‌కు మద్దతు ప్రకటించినట్లు రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. వైరా: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్‌కు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య, నాయకులు అమ్మిక రామారావు తెలిపారు. వైరాలో జరిగిన సంఘం నియోజకవర్గ స్థాయి సమావేశంలో వారు మా ట్లాడారు. నాయకులు ఓర్సు శ్రీనివాసరావు, దరిపల్లి శ్రీనివాస్, మాచర్ల యుగంధర్, దేవరకొండ కృష్ణ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి సెమినార్‌కు జిల్లా ఉపాధ్యాయుడు
తిరుమలాయపాలెం: రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన – శిక్షణ మండలి సంయుక్త ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సెమినార్లో తిరుమలాయపాలెం జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయు డు పెసర ప్రభాకర్‌రెడ్డి పాల్గొననున్నారు. ‘విద్యార్థుల కెరీర్ ఎంపిక – కౌన్సెలింగ్ ప్రభా వం’ అంశంపై నిర్వహిస్తున్న ఈ సెమినార్‌కు ప్రభాకర్‌రెడ్డి ‘ఈరోజు నేర్చుకోండి – రేపు నాయకత్వం వహించండి’ శీర్షికతో రాసిన పరి శోధనా పత్రం ఎంపికై ంది. రాష్ట్రవ్యాప్తంగా అందిన 105పరిశోధనా పత్రాల్లో 30పత్రాలను ఎంపిక చేయగా ప్రభాకర్‌రెడ్డి ఆర్టికల్ కూడా ఉంది. ఈమేరకు హైదరాబాద్‌లో బుధవారం జరిగే సెమినార్లో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్య ఆర్జేడీ సత్యనారా యణరెడ్డి, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, ఎంఈఓ శ్రీనివాసరావు, హెచ్ఎం విజయకుమారి తది తరులు అభినందించారు. రేపు జాబ్ మేళా ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేలా గురువారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో సేల్స్ మేనేజర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగే జాబ్‌మేళాకు 25–40 లోపు వయసు కలిగి డిగ్రీ అర్హత ఉన్న వారు హాజరుకావాలని, వివరాలకు 96183 40376 నంబర్లో సంప్రదించాలని సూచించారు. స్కేటింగ్‌లో జిల్లా క్రీడాకారులకు పతకాలు ఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్‌లో ఈనెల 8నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. బాలికల అండర్–18 విభాగంలో జి.హలయ, అండర్–15లో టి.జ్ఞాన్వి, అండర్–8లో వీక్ష, బాలుర విభాగంలో అండర్–15 నుంచి డి.విధిలేష్, అండర్–6లో శిశిర్ కౌశల్, నిర్వాణ్ బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. అంతేకాక హలయ, జ్ఞాన్వి, వీక్ష డిసెంబర్లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కాగా, డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్ సురేష్ మంగళవారం అభినందించారు. అండర్–14 కబడ్డీ జట్ల ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి పాఠశాలల విభాగంలో అండర్–14 కబడ్డీ జట్లను మంగళవారం ఎంపిక చేశారు. ఖమ్మంలోని సర్దార్ పటే ల్ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీలను డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం జట్ల వివరాలను జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వై.రామారావు ప్రకటించగా.. ఈ జట్లు 16 నుంచి సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లా బాలుర జట్టుకు బి.ఓంకార్తీక్, పి.సంతోష్, డి.ధనుష్, వి.జయప్రకాష్, బి.ఆకా ష్, ఎ. మనోజ్, ఎ.అరుణ్, బి.అంజిబాబు, ఎ. శివ, ఎస్.గోపి, పి.బాబు, ఎస్.ప్రతీక్, బాలికల జట్టుకు సీహెచ్.గాయత్రి, డి.యామినిశ్రీ, పి. ప్ర వల్లిక,బి.వర్ష, పి.సింధుజ, ఎస్కే ఫరీదా,కె.భవా ని, పి.జాస్మిన్,ఎం.లిఖిత, కె.వినయశ్రీ, జి.సృజ న, ఎం.శ్రీజ ఎంపికయ్యారని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ఆర్థికాభివృద్ధిబోనకల్: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో మహిళల ఆర్థికాభివృద్ధితో పాటు ఇంకొందరికి ఉపాధి లభిస్తుందని ఇక్రిశాట్ సీనియర్ ఆఫీసర్ బానోతు శ్రీను తెలిపారు. బోనకల్ ఐకేపీ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ఇక్రిశాట్ అధికారులు స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుండి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఈ రుణాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ప్రధానంగా పండే పంటల ఆధారంగా ఆహార ఉత్పత్తులు తయారుచేసి అమ్ము తూ లాభాలు గడించేలా మహిళలను వీఓఏలు ప్రో త్సహించాలని సూచించారు. డీపీఎంలు శ్రీనివాస్, రాజారావు, ఏపీఎం వెంకటేశ్వర్లు, సీఈఓ సాయిగణేష్ పాల్గొన్నారు. -
ఆరు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి సమీపాన సాగర్ కాల్వలో ఆరు రోజుల క్రితం స్నానం కోసం వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఖమ్మం వైఎస్సార్‌నగర్‌కు చెందిన ఎలగందుల వెంకన్న(60) కాల్వ లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. కొణిజర్ల మండలం రామనర్సయ్యనగర్ సమీపాన కాల్వలో మంగళవారంమాయన మృతదేహాన్ని గుర్తించిన స్థానాకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోవడంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యాన బయటకు తీసి ఖమ్మం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు.600 క్వింటాళ్ల బియ్యం సీజ్ నిర్ధారణ కోసం ల్యాబ్‌కు శాంపిళ్లు నేలకొండపల్లి: మండలంలోని కొత్తకొత్తూరులో ఓ రైస్ మిల్లులో నిల్వ ఉన్న బియ్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు సీజ్ చేశారు. రైస్‌మిల్లులో పీడీఎస్ బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ ఆధ్వర్యాన మంగళవారం సివిల్ సప్లయీస్, టాస్క్‌ఫోర్స్, పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దాదాపు 600 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేయడంతో పాటు పీడీఎస్ బియ్యమా, కాదా అని నిర్ధారణ కోసం శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, భారీగా బియ్యం పట్టుబడడంతో ఎక్కడ సేకరించారు, ఎవరు కొనుగోలు చేశారనే కోణాల్లో ఆరా తీస్తున్నారని తెలిసింది. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో ముగ్గురి అరెస్ట్ తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద ప్రేమపెళ్లి విషయమై సోమవారం జరుగుతున్న అడ్డుకోబోయిన హెడ్‌కానిస్టేబుల్ బాలుపై దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంకు చెందిన ఆంగోత్ వివేక్, గుగులోత్ నవీన్, నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన భూక్యా శంకర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంజీవ్, ఎస్ఐ కె.జగదీష్ తెలిపారు. రుణం పేరుతో నగదు స్వాహాకు యత్నంరఘునాథపాలెం: రూ.5లక్షల రుణం మంజూరైందని చెబుతూ ఫీజు కింద రూ.49,500 నగదును సైబర్ నేరగాళ్లు స్వాహా చేసేందుకు యత్నించారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తికి చెందిన మాలోత్ అశోక్‌కు గత నెల 20న ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షల రుణం మంజూరైందని నమ్మబలికారు. అయితే, ప్రాసెసింగ్ ఫీజుగా రూ49,400 చెల్లించాలని చెప్పడంతో పాటు ఆన్లైన్లో పంపించాడు. ఆతర్వాత సదరు వ్యక్తుల ఫోన్ స్విచాఫ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించిన అశోక్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ.35 వేల నగదు విత్‌డ్రా చేయకుండా అడ్డుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. -
పతక విజేతలను అభినందించిన సీపీ
ఖమ్మంక్రైం: రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు వివిధ సందర్భాల్లో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పోలీస్ సేవా పతకాలకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు ఉద్యోగులు ఎంపికయ్యారు. కమిషనరేట్ నుంచి 82మంది పతకాలు అందుకోగా పోలీసు కమిషనర్ సునీల్‌దత్ మంగళవారం వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తూ మెరుగైన పనితీరు కనబర్చాలని సూచించారు. పతకాలు అందుకున్న వారిలో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు తదితరులు ఉండగా, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, కామరాజు పాల్గొన్నారు. -
అసౌకర్యాల నడుమే చదువులు
● నాలుగేళ్లయినా పూర్తికాని పాఠశాల భవన నిర్మాణం ● అయినా పట్టించుకోని యంత్రాంగం, పాలకులు ● యడవల్లిలో విద్యార్థులు, గ్రామస్తుల ధర్నాముదిగొండ: అధికారుల పట్టింపులేనితనం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సమకూరడం లేదు. అదనపు తరగతి గదులతో పాటు భవనాల నిర్మాణాలకు రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నా సకాలంలో పూర్తికాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముదిగొండ మండలంలోని 36 ప్రాథమిక పాఠశాలలు, ఐదు యూపీఎస్‌లు, 14 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక ప్రభుత్వ ఉన్నతపాఠశాల ఉన్నాయి. వీటిల్లో 3,082 మంది చదువుకుంటుండగా.. పలు చోట్ల సౌకర్యాల లేమి వేధిస్తోంది. కమలాపురం జెడ్పీహెచ్ఎస్లో గదులు శిథిలావస్థకు చేరి సరిపడా లేకపోవడంతో చెట్ల కిందే బోధన సాగుతోంది. బాణాపురం పాఠశాలలోనూ అదనపు గదుల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. యడవల్లి, న్యూలక్ష్మీపురం, కమలాపురం, మేడేపల్లి, వల్లభి హై స్కూళ్ల ఆవరణలో చిన్నపాటి వర్షానికే వరద చేరుతోంది. వేసవి సెలవుల్లో ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు తీర్చాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవకపోవడంతోవిద్యాసంవత్సరం ప్రారంభమై నా లుగు నెలలు దాటినా సమస్యలు అలాగేమిగిలిపోయాయి. ఒకే ప్రాంగణంలో రెండు స్కూళ్లు మండలంలోని యడవల్లిలో ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే జెడ్పీహెచ్ఎస్ కొనసాగుతోంది. ఫలితంగా తరగతి గదులే కాక మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిపోక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆట స్థలం లేకపోవడం, మరో పక్క ఇరుకు, చీకటి గదులతో అవస్థలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యాన మరో ప్రాంతంలో కొత్త భవన నిర్మాణం నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టినా పూర్తికావడం లేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేక విద్యారుర్థులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. టెంట్ వేసి ప్లకార్డులతో రెండు గంటల పాటు ధర్నా కొనసాగించారు. అంతేకాక గేట్లకు తాళం వేసి ఉపాధ్యాయులను సైతం లోపలకు వెళ్లనివ్వలేదు. చివరకు ఎంఈఓ రమణయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం కె.శాంతి, ఎస్ఐ కృష్ణప్రసాద్ చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.యడవల్లిలో అసంపూర్తిగా ఉన్న గదులు, భవన నిర్మాణ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కాంట్రాక్టర్‌కు బిల్లులు అందక పనులు చేయలేదని చెబుతున్నారు. కొన్ని పనులను అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టినా ఇంకొన్ని మిగిలిపోయాయి. – రమణయ్య, ఎంఈఓ, ముదిగొండ -
నిధుల పక్కదారిపై విచారణ
వైరా: వైరా మున్సిపాలిటీ ఉద్యోగి తన ఖాతాలోకి జనరల్ ఫండ్ నిధులు బదలాయించుకున్న ఘటనపై వరంగల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ విచారణ చేపట్టారు. ఈ విషయమై 10వ తేదీన ‘సాక్షి’లో ‘ఉద్యోగి ఖాతాల్లోకి మున్సిపల్ నిధులు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా అధికారులు స్పందించారు. ఈమేరకు వైరా మున్సిపాలిటీకి మంగళవారం వచ్చిన షాహిద్ మసూద్ నాలుగు గంటలకు పైగా రికార్డులు పరిశీలించారు. అకౌంటెంట్ ఏ.వెంకటేశ్వరరావును పిలిపించి కమిషనర్ యు.గురులింగం సమక్షాన విచారణ చేపట్టారు. ఎలాంటి రికార్డులు లేకుండానే 30 చెక్కుల ద్వారా రూ.52 లక్షలకు తన ఖాతాలోకి బదలాయించుకున్నట్లు గుర్తించారు. జనరల్ ఫండ్‌తో పాటుగా 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కనీసం నిబంధనలు పాటించకుండా చెక్కులు రాసినా గత కమిషనర్ వేణు ప్రశ్నించకపోవడం, ఫైళ్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడంతో రీజినల్ డైరెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు నిగ్గుతేల్చేలా ఆడిట్ చేయించాలని ఆయన కమిషనర్ గురులింగంను ఆదేశించారు. అంతేకాక నిధుల రికవరీ, క్రిమినల్ చర్యలు తీసుకోవడంపై చర్చించారు. -
‘పేట’ చెరువు అభివృద్ధికి రూ.4.86 కోట్లు
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం మామునూరులోని పేట చెరువును పర్యాటకంగా అభివృద్ధిచేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ. 4.86 కోట్లు మంజూరు చేశారని మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు తెలిపారు. చెరువును టూరిజం శాఖ డీఈ ఎన్.రామకృష్ణ, ఏఈ నరేష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు మారాబత్తుల మోహన్‌రావు, గంతాల లక్ష్మారావు, గంగారపు కృష్ణారావు, బండారు రామారావు, రాధాకృష్ణ పాల్గొన్నారు. -
పకడ్బందీగా చట్టం అమలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలయ్యేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన ఆమె ఈ చట్టం కింద జారీ చేసిన అనుమతులు, రెన్యువల్స్ కోసం వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులను సీజ్ చేయడమే కాక పోలీసుల అభిప్రాయం తీసుకున్నాక సరైన ఆధారాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలు నిబంధనల ప్రకారం జరగాలని స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో అదనపు డీసీపీ ప్రసాదరావు, డీఎంహెచ్ఓ కళావతిబాయి, డిప్యూటీ డీఎంహెచ్ఓ చందునాయక్, ఐఏంఏ అధ్యక్షులు రెహానాబేగం, అధికారులు వెంకటరమణ, రామారావు, నరేందర్, రాజశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో తనిఖీ ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ మంగళవారం తనిఖీ చేశారు. పోషకాహర లోపంతో జన్మించిన చిన్నారులకు వైద్యసేవలు అందించే ఎన్ఆర్సీ వార్డుతో పరిశీలించి సేవలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం చిన్నారులకు పౌష్టికాహరం పంపిణీ, డయోగ్నస్టిక్ హబ్‌లో పరీక్షలు, సదరమ్ క్యాంపుల నిర్వహణ, మరుగుదొడ్ల మరమ్మతులను పరిశీలించి సూచనలు చేశారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ -
మహిళ, శిశు సంక్షేమమే లక్ష్యం
కల్లూరు: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మహిళలు, శిశువుల సంక్షేమమే లక్ష్యంగా ఉద్యోగులు పని చేయాలని ఐసీడీఎస్ వరంగల్ ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి సూచించారు. కల్లూరులో మంగళవారం నిర్వహించిన పోషణమాసం సమావేశంలో ఆర్జేడీ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులను నిరంతరం పరిశీలిస్తూ పోషకాహార లోపం ఎదురుకాకుండా చూడాలని తెలిపారు. గర్భిణీగా తేలగానే పేరు నమోదు చేసి సలహాలు ఇవ్వాలని చెప్పారు. అలాగే, చిన్నారులకు బోధన, తక్కువ ఖర్చుతో పోషకాహారం తయారీపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే రక్తహీనత సమస్య ఎదురుకాదని చెప్పారు. అనంతరం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినీత్, సీడీపీఓ నిర్మలజ్యోతి, ఏసీడీపీఓ రత్తయ్య, సూపర్వైజర్లు సంధ్యారాణి, సుజాత, భవాని, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
టన్ను చెరుకు ధర రూ.3,578
నేలకొండపల్లి: మండలంలోని రాజేశ్వరపురం మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో టన్ను చెరుకు ధర రూ.3,578.35గా నిర్ణయించామని ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ నామా కృష్ణయ్య తెలిపారు. ఫ్యాక్టరీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ.210 అదనంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాక రైతులకు మూడు టన్నుల విత్తనం, పిలకతోటలో ఖాళీలు పూరించడానికి 500 మొక్కలు ఉచితంగా అందిస్తామని తెలిపారు. అధిక దిగుబడి సాధించిన రైతులకు వరుసగా రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా, ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా టన్ను చెరుకుకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ ఏడాది 85వేల మెట్రిక్ టన్నుల చెరుకు గానుగ ఆడించడం లక్ష్యం కాగా, డిసెంబర్ మొదట్లో క్రషింగ్ ప్రారంభిస్తామని కృష్ణ య్య చెప్పారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కోట య్య, ఉద్యోగులు వెంకటేశ్వర్లు, అప్పారావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ క్రమశిక్షణే ప్రామాణికం
ఖమ్మంరూరల్/కూసుమంచి: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు పార్టీలో క్రమశిక్షణగా ఉండడమే ప్రధాన అర్హత అని ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవిపై పాలేరు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించేందుకు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి, కూసుమంచిలో మంగళవారం సమావేశాలు నిర్వహించారు. నాలుగు మండలాల పార్టీ శ్రేణులు హాజరైన ఈ సమావేశాల్లో మహేంద్రన్ మాట్లాడారు. పార్టీ భవిష్యత్‌కు తోడు క్రమశిక్షణే ఆధారంగా అధ్యక్ష పదవి ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ క్రమాన అందరికీ ఆమోదయోగ్యమైన నేతను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అనంతరం మండలాల వారీగా నాయకులను ఒక్కరొక్కరుగా పిలిచి అభిప్రాయాలు సేకరించారు. మొదటి నుండి కాంగ్రెస్‌ను అట్టిపెట్టుకుని, అధికారం ఉన్నా, లేకున్నా కొనసాగుతున్న నాయ కుల వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఈమేరకు డీసీసీ అధ్యక్ష పదవి కోసం మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్‌బాబు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకుని పార్టీలో తమ పాత్రను వివరించారు. ఇంకా ఈసమావేశాల్లో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ పరిశీలకుడు చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్ష ఎంపికపై ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ -
రెండో విడత పుస్తకాలు రెడీ..
● జిల్లాకు చేరిన 1,54,650 పార్ట్–2 పుస్తకాలు ● సాఫీగా సాగనున్న బోధనఖమ్మంసహకారనగర్: గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడం ప్రహసనంలా సాగేది. విద్యార్థులు, నాయకులు తరచూ ఆందోళనలు చేపట్టాల్సి వచ్చేది. కొన్నిచోట్ల విద్యాసంవత్సరం మొదలయ్యాక రెండు, మూడు నెలలు గడిచినా అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలు వచ్చేవి కాదు. కానీ కొన్నాళ్లుగా అలాంటి ఇక్కట్లు లేకుండా పుస్తకాలు అందుతున్నాయి. గత రెండేళ్లుగా పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తుండగా.. ఈసారి పార్ట్–2 పాఠ్య పుస్తకాలు సైతం సకాలంలోనే జిల్లాకు చేరుతున్నాయి. ఒకే పుస్తకం.. రెండు భాగాలు రాష్ట్ర ప్రభుత్వం పార్ట్–2 పాఠ్య పుస్తకాలను జిల్లాకు చేరవేయడం మొదలుపెట్టింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు కలిపి ఒకే సబ్జెక్టు పుస్తకాన్ని రెండు భాగాలుగా ముద్రిస్తున్నారు. ఓ పక్క తెలుగు, మరోపక్క ఇంగ్లిష్‌లో ముద్రించాల్సి రావడంతో రెండేళ్ల నుంచి ఈ విధానం అమలుచేస్తున్నారు. పార్ట్–1 పాఠ్య పుస్తకాలు ఏప్రిల్ నెలాఖరులోనే జిల్లాకు చేరగా పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు పంపిణీ చేశారు. వీటి ఆధారంగా బోధన చివరి దశకు చేరడంతో పార్ట్–2 పుస్తకాలు చేరవేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు 1,303 ఉండగా సుమారు 68వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వీరికి పార్ట్–2 పుస్తకాలు 1,66,600 అవసరమని జిల్లా అధికారులు నివేదిక సమర్పించారు. ఇందులో ఇప్పటికే 1,54,650 పాఠ్య పుస్తకాలు చేరగా, ఎమ్మార్సీలకు తరలించి అక్కడి నుంచి పాఠశాలలకు పంపిస్తున్నారు. తీరనున్న ఇక్కట్లు విద్యార్థులకు విద్యాసంవత్సరం మొదటల్లోనే పార్ట్–1 పాఠ్య పుస్తకాలు అందగా బోధన సాఫీగా సాగింది. వీటి ఆధారంగా బోధన చివరి దశకు చేరుతుండగానే పార్ట్–2 పుస్తకాలు పంపిస్తున్నారు. త్వరలోనే ఈ పుస్తకాలు ఎమ్మార్సీల నుంచి పాఠశాలలకు, అక్కడి నుంచి విద్యార్థులకు అందుతాయి. దీంతో పాఠ్య పుస్తకాల కొరత లేకుండా బోధన జరుగుతుందని చెబుతున్నారు. -
పిల్లలను బయటకు పంపితే చర్యలు
‘బీఏఎస్’పై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మంమయూరిసెంటర్: బకాయిల పేరిట విద్యార్థినులను బయటకు పంపే పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్)పై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బీఏఎస్ కింద ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన విద్యార్థులను బకాయిల పేరిట యాజమాన్యాలు ఇబ్బంది పెట్టకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఈ విషయంలో తల్లిదండ్రులను బలవంతం చేస్తే తీవ్రంగా పరిగణించాలని చెప్పారు. ఈ వీసీలోజిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఉద్యోగులు ఏ.నారాయణరెడ్డి, శ్రీనివాసరావు సంబంధిత తదితరులు పాల్గొన్నారు. అన్ని వసతులతో కార్యాలయాల సముదాయం ఖమ్మంరూరల్: సకల సౌకర్యాలతో ఖమ్మం రూరల్ మండల కార్యాలయాల సముదాయాన్ని నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తరుణీహాట్లో నిర్మించనున్న సముదాయంపై కలెక్టరేట్లో మంగళవారం ఆయన సమీక్షించారు. కార్యాలయాలన్నీ ఒకేచోట అన్ని వసతులతో ఉండేలా నమూనా సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే, అంతర్గత రహదారులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పార్కింగ్, తాగునీటి వసతి కల్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఈసమావేశంలో ఆర్అండ్బీ డీఈ భగవాన్, ఏఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఖమ్మంఅర్బన్: సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూమి సేకరణపై కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1,138 ఎకరాల అటవీ శాఖ భూమి సేకరించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే జలవనరుల శాఖ ద్వారా వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిలో ఖాళీ స్థలాలను అటవీశాఖకు బదలాయించి, అందుకు బదులు ఆ శాఖ భూమి తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జల వనరుల శాఖ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యోగులు రమేష్‌రెడ్డి, బాబురావు, కిషోర్, నవీన్‌కుమార్ పాల్గొన్నారు. -
మక్కల కొనుగోళ్లకు సిద్ధం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో సాగైన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించేలా ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే పంట కోతలు జోరందుకుంటున్నాయి. వారం, పది రోజుల్లో కలెక్టర్ల ఆధ్వర్యాన జిల్లా పర్చేజింగ్ కమిటీల సమావేశాలు నిర్వహించి పంట సాగు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. భద్రాద్రి జిల్లాలో అత్యధికం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 98,554 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఇందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 96,864 ఎకరాల్లో సాగు చేయగా, ఖమ్మం జిల్లాలో కేవలం 1,690 ఎకరాల్లోనే సాగు చేశారు. భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, పినపాక, మణుగూరు, ఆళ్లపల్లి, పాల్వంచ, బూర్గంపాడు ప్రాంతాల్లో సాగు ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లాలో నీటి వనరులు అధికంగా ఉండటంతో ఇతర పంటలు సాగవుతున్నాయి. యాసంగిలో మాత్రం ఖమ్మం జిల్లాలోనూ మొక్కజొన్న సాగు అధికంగా ఉంటుంది. కాగా, భద్రాద్రి జిల్లాలో పంట సాగు ఆధారంగా 2,42,160 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఏజెన్సీలో జోరుగా సాగు భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉంది. గుండాల మండలంలో అధికారికంగా 30వేల ఎకరాల్లో, అనధికారికంగా సుమారు 40వేల ఎకరాల్లో పంట సాగవుతున్నట్లు అంచనా. ఆళ్లపల్లి మండలంలో అధికారికంగా 15వేలు, అనధికారికంగా 20వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతంలో డ్వాక్రా మహిళలు, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోళ్లు జరిగేవి. కానీ మూడేళ్లుగా మద్దతు ధర లేకపోవడంతో నిలిపివేశారు. ప్రైవేట్ వ్యాపారుల వద్దే ధర ఎక్కువగా ఉండడంతో రైతులు అటే మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం మద్దతు ధరను రూ.2,400కు పెంచింది. ప్రైవేట్ వ్యాపారులు మరింత పెంచితే రైతులు వ్యాపారులకే విక్రయించే అవకాశముంది. ప్రస్తుతానికై తే వ్యాపారులు రూ.2వేలలోపే కొనుగోలు చేస్తుండగా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైతే రైతులు వస్తారని భావిస్తున్నారు. 23 కేంద్రాలకు ప్రతిపాదన మొక్కజొన్న రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయించనుంది. ఈమేరకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వాన జిల్లా స్థాయి పర్చేజింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. పంట సాగు ఆధారంగా భద్రాద్రి జిల్లాలో 20, ఖమ్మం జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆయా కేంద్రాల్లో సుమారు 30శాతం పంటను కొనుగోలు చేసే అవకా శముందని సమాచారం. మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో పీఏసీఎస్‌లు, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా మక్కల కొనుగోళ్ల ప్రక్రియ చేపడతారు.ఉమ్మడి జిల్లాలో 98,554 ఎకరాల్లో సాగు ఉమ్మడి జిల్లాలో మక్కల కొనుగోళ్లకు చర్యలు మొదలయ్యాయి. పర్చేజింగ్ కమిటీ సమావేశాల అనంతరం ప్రక్రియ మొదలవుతుంది. పంట సాగు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించాం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ.2,400 మద్దతు ధరతో కొనుగోళ్లు ఉంటాయి. – సునీత, మేనేజర్, మార్క్‌ఫెడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లాగత ఏడాది క్వింటా మొక్కజొన్నలకు రూ.2,225 మద్దతు ధర ఉండగా, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.2,400గా ప్రకటించింది. వానాకాలంలో సాగు చేసిన మొక్కజొన్న కోతలు మొదవుతుండగా.. రైతులు తేమ తగ్గేలా కల్లాల్లో ఆరబోస్తున్నారు. అయితే, ప్రభుత్వ కొనుగోళ్లు మొదలుకాకపోవడంతో కొన్నిచోట్ల వ్యాపారులు క్వింటాకు రూ.2 వేల లోపే ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈనేపథ్యాన మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైతే రైతులకు లాభం జరగనుంది. -
యూనివర్సిటీ అభివృద్ధి అందరి బాధ్యత
ఖమ్మం సహకారనగర్: యూనివర్సిటీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని.. తద్వారా బోధన, పరిశోధనల్లో అగ్రగామిగా నిలుస్తామని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, తరగతి గదులు, బోధనను పరిశీలించాక అధ్యాపకులతో సమావేశమయ్యారు. అధ్యాపకులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, తద్వారా వారు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని తెలిపారు. ప్రిన్సిపాల్ రవికుమార్, అధ్యాపకులు, ఉద్యోగులు శ్రీనివాస్, రవి, కె.వెంకటనరసయ్య పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్లో భాగస్వాములు కావాలి ఖమ్మం రాపర్తినగర్: ప్రతీ విద్యార్థి జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)లో భాగస్వాములయ్యేలా అధ్యాపకులు అవగాహన కల్పించాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి సూచించారు. ఖమ్మంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ఎస్ఎస్పై విద్యార్థులు ఆసక్తి పెంచుకునేలా అధ్యాపకులు చొరవ చూపాలన్నారు. యూనివర్సిటీ పరిధిలో అత్యధికంగా కళాశాలలు కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అవసరమైన నిధులు కేటాయిస్తామని తెలిపారు. కరోనా కారణంగా ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడినా.. గత ఏడాది నుంచి విస్తృతం చేశామన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, జిల్లా ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ ఎం.శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సమావేశంలో భద్రాద్రి జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆనంద్‌బాబు, ప్రియదర్శిని, గాయత్రి డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు నవీన్‌బాబు, కె.సునీల్‌కుమార్, డైరెక్టర్ కుటుంబరావు, ఎన్ఎస్ఎస్ పీఓలు విల్సన్, ఎస్.జయప్రద తదితరులు పాల్గొన్నారు.కేయూ వైస్ చాన్స్‌లర్ ప్రతాపరెడ్డి -
జిల్లాలో వికసిత్ భారత్ పాదయాత్ర
ఖమ్మం రాపర్తినగర్: కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ‘మై భారత్’ నేతృత్వంలో వికసిత్ భారత్ పేరిట పాదయాత్ర నిర్వహించనున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. ఖమ్మంలోని కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశమంతా పాదయాత్రలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో త్వరలోనే మూడు రోజుల పాటు నుంచి యాత్ర ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు https//mybharta.gov.in ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, జిల్లా అధికారి ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు. రెండో పంటగా అపరాలతో లాభాలు వైరా: పత్తి, వరి సాగు చేస్తున్న రైతులు రెండో పంటగా అపరాలు సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యాన మంగళవారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేటివ్ డీన్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్, మధిర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రుక్ష్మిణీదేవి, కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి మాట్లాడారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. అలాకాకుండా భూమిలో దున్నితే భూసారం పెరిగి రైతులపై ఎరువుల భారం తగ్గుతుందని తెలిపారు. ఆతర్వాత పంటలను ఆశిస్తున్న చీడపీడలు, వాటి నివారణ, మధిర ఏఆర్ఎస్ ద్వారా అందుబాటులో ఉన్న వంగడాలు, కేవీకే ద్వారా అందే సేవలను వివరించారు. వైరా ఏడీఏ టి.కరుణశ్రీ, రైతులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. స్లాట్ బుకింగ్‌తోనే పత్తి కొనుగోళ్లు కామేపల్లి: పత్తి సాగుచేసిన రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని, తద్వారా సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లకు అవకాశముంటుందని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. మండలంలోని మద్దులపల్లిలోని పత్తి చేన్లను మంగళవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. రైతులు పత్తితీత విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. ఏఓ తారాదేవి, రైతులు పాల్గొన్నారు. ‘నవోదయ’ దరఖాస్తు గడువు పెంపు కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2026–27 విద్యాసంవత్సరానికి ప్లస్ వన్(11వ తరగతి)లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశపరీక్ష కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు తెలిపారు. పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
చారిత్రక సభకు సన్నద్ధం కావాలి
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శత వసంత ఉత్సవాల ముగింపు సభ డిసెంబర్ 26న జరగనున్నందున పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. ఖమ్మంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం కర్నాటి భానుప్రసాద్ అధ్యక్షతన మంగళవారం జరగగా ఆయన మాట్లాడారు. వందేళ్ల కమ్యూనిస్టుల పోరాట చరిత్ర, త్యాగాలను నేటి తరానికి తెలియజేసేందుకు శత వసంత సంబరాల ముగింపు వేడుకలను ఖమ్మంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. లక్షలాది మందితో జరిగే బహిరంగసభకు 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్రజలు తరలివచ్చేలా ప్రత్యేక కళారూపాలతో ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. కాగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని పార్టీలు దొంగాట ఆడుతున్నాయని ఆరోపించిన కూనంనేని... బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కేలా జరిగే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈసమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
శరవేగంగా
కట్టుదిట్టంగా..ప్రభుత్వం నిర్దేశించిన స్థలంలో.. పేదలకు అనువుగా, సౌకర్యవంతంగా ఇళ్లు ఉండేలా డిజైన్ రూపొందించిన ప్రభుత్వం మండల కేంద్రాల్లో నమూనా గృహాలను కూడా నిర్మించింది. ఇల్లు మంజూరైన అనంతరం లబ్ధిదారుడు ముగ్గు పోసుకుంటే పంచాయతీ కార్యదర్శి ఫొటో తీసి ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో అప్లోడ్ చేస్తారు. బ్యాంకు అకౌంట్ నంబర్, స్థలం వారిదా, కాదా అని నిర్ధారించుకున్నాక ఇంటినిర్మాణం మొదలవుతుంది. ఒక్కసారి ఫొటో అప్లోడ్ చేశాక నిర్మాణ స్థలం మార్చడానికి వీల్లేకుండా నిబంధనలు పొందుపరిచారు. స్థలం 400 చదరపు అడుగుల(60 గజాలు)కు తగ్గకుండా ఉండాలి. ఇందులోని 45 గజాల్లో ఇంటి నిర్మాణం చేపట్టేలా పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పిస్తున్నారు. అధికారుల పరిశీలన ఇంటి నిర్మాణాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిబంధనలకు అనుగుణంగా పనులు జరిగేలా అవగాహన కల్పిస్తున్నారు. పునాది నిర్మాణం పూర్తయ్యాక మూడు చోట్ల నుంచి లబ్ధిదారుల ఫొటో తీసి కార్యదర్శి యాప్‌లో అప్లోడ్ చేస్తే ఏఈ పరిశీలిస్తారు. నిర్దేశిత స్థలం, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్ అన్నీ సక్రమంగా ఉంటే ఏఈ అప్రూవ్ చేయాలి. ఇదే సమయాన ఇల్లు ఎంత స్థలంలో నిర్మిస్తున్నారు, బెడ్రూం, వంట గది వేర్వేరుగా ఉన్నాయా, లేదా అని గుర్తించాక మేసీ్త్ర ఫోన్ నంబర్, పేరు అప్లోడ్ చేస్తే డీఈ లాగిన్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి బేస్మెంట్ లెవెల్, స్లాబ్, ఇల్లు పూర్తయ్యే వరకు పర్యవేక్షించి పీడీ లాగిన్‌కు చేరవేస్తారు. పీడీ సూపర్ చెకింగ్ తర్వాత కలెక్టర్‌కు, అక్కడ నుంచి గృహ నిర్మాణ శాఖ ఎండీ లాగిన్‌కు వెళ్తే అన్నీ పరిశీలించి దశల వారీగా నిధులు జమ చేస్తున్నారు. నిర్మాణాల పూర్తిపై దృష్టి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లుగానే, నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయించేలా ప్రభు త్వం సూచనలు చేస్తోంది. కొందరు నిరుపేద లబ్ధి దారులు ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణాలు ప్రారంభించడం లేదు. దీంతో అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు. ఇలా ప్రతీ అంశంలో ప్రత్యేక శ్రద్ధతో ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం అయ్యేలా యంత్రాంగం ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై యంత్రాంగం దృష్టి జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. అర్హులను గుర్తించి మంజూరు పత్రాలు ఇవ్వడమే కాక నిర్మాణం పూర్తిచేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు. అంతేకాక నిర్మాణ వివరాలను ఎప్పటికప్పుడు ఇందిరమ్మ యాప్‌లో అప్లోడ్ చేసి దశల వారీగా బిల్లులు మంజూరు చేయిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం -
పలు ప్రాంతాల్లో వర్షం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 11గంటల సమయాన భారీ శబ్దాలతో మెరుపులు, ఉరుములకు తోడు వర్షం మొదలైంది. కాగా, ఖమ్మంతో పాటు పలు గ్రామాల్లో పిడుగులు పడడంతో ని ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి. ఖమ్మం, పాలేరు డివిజన్లలో ఓ మోస్తరు వర్షపాతం నమోదుకాగా, సోమవారం ఉదయం కూడా కొన్నిచోట్ల వర్షం కురిసింది. రఘునాథపాలెంలో అత్యధికంగా 56 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, తిరుమలాయపాలెంలో 30.8, నేలకొండపల్లిలో 23.2, ముదిగొండలో 17,2, పెనుబల్లిలో 13.2, ఖమ్మం రూరల్‌లో 11.2 మి.మీ., సోమవారం సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 47 మి.మీ.లు, వేంసూరులో 35, సత్తుపల్లి మండలం గంగారంలో 22.3, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ వద్ద 19.8, సత్తుపల్లిలో 18 మి.మీల వర్షపాతం నమోదైంది. కాగా, భారీ వర్షంతో చేతికొచ్చే దశలో ఉన్న పత్తి పంటకు నష్టం ఎదురవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అరకొరగా చెట్లపై ఉన్న పత్తి రంగు మారుతుండగా ధర పడిపోతుందని చెబుతున్నారు. -
రెండు పాడిగేదెల చోరీ
బోనకల్: మండలంలోని కలకోటలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు పాడి గేదెలను చోరీ చేశారు. గ్రామానికి చెందిన తోటపల్లి గురవయ్య ఆదివారం రాత్రి తన గేదెలను ఇంటి ముందు కట్టేశాడు. సోమవారం ఉదయంకల్లా రూ.1.50లక్షల విలువైన గేదెలు లేకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మున్నేటి వరదలో చిక్కుకున్న ట్రాక్టర్లు ముదిగొండ: మండలంలోని పెద్దమండవ మున్నేటిలో సోమవారం ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో తీసుకొచ్చేందుకు వెళ్లిన మూడు ట్రాక్టర్లు సహా డ్రైవర్లు చిక్కుకున్నారు. నీటి ప్రవాహం పెరుగుతుండగానే కూలీలు అప్రమత్తమై పరుగుపరుగున ఒడ్డుకు చేరారు. అప్పటికే ట్రాక్టర్ల ఇసుక లోడు చేసి ఉన్నా బయటకు తీసుకురాలేక డ్రైవర్లు సైతం బయటకు వచ్చారు. దీంతో వరద ప్రవాహంలోనే మూడు ట్రాక్టర్లు నిలిచిపోయాయి. కాగా, మున్నేటి ఉధృతితో ముదిగొండ మండలం పండ్రేగుపల్లి – చింతకాని మండలం రామకృష్టాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుదాఘాతంతో దుక్కిటెడ్లు మృతి కారేపల్లి: స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో దాన్ని తాకిన రెండు దుక్కిటెడ్లు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. కారేపల్లి మండలం తొడితలగూడెంకు చెందిన రైతు శ్యాంలాల్ సాహు తన చేనులో ఉన్న విద్యుత్ స్తంభానికి రెండు ఎద్దులను కట్టివేశాడు. ఈక్రమాన వర్షం రావడంతో స్తంభానికి విద్యుత్ సరఫరా కాగా ఎడ్లు షాక్‌కు గురైన అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.2లక్షల విలువైన దుక్కిటెడ్ల మృతితో జీవనాధానం కోల్పోయినందున తమ కుటుంబాన్ని ఆదుకోవాలని శ్యాంలాల్ కోరాడు. ఈవిషయమై విద్యుత్ సిబ్బంది స్పందించాలని స్థానికులు విన్నవించారు. అలాగే, ఇలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని కోరారు. -
ప్రేమజంట పెళ్లిపై పీఎస్‌లో ఘర్షణ
తిరుమలాయపాలెం: ఓ ప్రేమజంట వివాహం చేసుకోగా, పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడగా అదుపు చేసేందుకు యత్నించిన ఓ హెడ్‌కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గోల్‌తండా వాసి బోడ కృష్ణ కుమార్తె బోడ కీర్తనకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు కొత్తతండాకు చెందిన అంగోత్ నవీన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈనెల 12న బయటకు వెళ్లిన కీర్తన నవీన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ ఘటనపై కృష్ణ ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రేమజంటను సోమవారం స్టేషన్‌కు పిలిపించారు. అక్కడకు ఇరు కుటుంబాల వారు రావడంతో కీర్తన బంధువులు నవీన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగగా అదుపు చేసేందుకు యత్నించిన హెడ్‌కానిస్టేబుల్ బాలును నెట్టేయడంతో తల గోడకు తాకి తీవ్ర గాయమైంది. ఈమేరకు ఎస్ఐ కూచిపూడి జగదీష్ ఇరువర్గాలను అదుపు చేసి బాలుకు స్థానికంగా చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాక కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకి చెందిన అంగోత్ వివేక్, గుగులోత్ నవీన్, గుగులోత్ మాజీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అదుపు చేసేందుకు యత్నించిన హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు -
నూతన సబ్స్టేషన్లతో మెరుగైన విద్యుత్ సరఫరా
తల్లాడ: అంతరాయాలు లేకుండా, మెరుగైన విద్యుత్ సరఫరా చేసేలా అవసరమైన చోట విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. తల్లాడ మండలం అన్నారుగూడెంకు 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు కాగా, సోమవారం ఆయన స్థలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ స్థానిక రైతులు, నాయకులతో చర్చించి ప్రతిపాదించిన స్థలాల వివరాలు చర్చించారు. కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటుతో అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావుపేట, బాలపేట, ఏన్కూరు మండలం గార్లొడ్డు గ్రామాల కు ఉపయోగం ఉంటుందని తెలిపారు. ట్రాన్స్‌కో ఎస్ఈ రాంబాబు, డీఈలు ఎల్.రాములు, భద్రుపవార్, కృష్ణారావు, దాసు, ఏడీఈలు సతీష్, ఖాదర్‌బాబా, ఏఈలు రాయల ప్రసాద్, కవిత, రైతులు పాల్గొన్నారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం వేంసూరు: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ పోషణ లోపం నివారణకు కృషి చేస్తున్నామని ఐసీడీఎస్ వరంగల్ ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి తెలిపారు. ఈమేరకు లబ్ధిదారులు అంగన్వాడీల్లో సేవలను సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. వేంసూరు మండలం కొండెగట్ల కేంద్రంలో గురువారం పౌషణ మాసోత్స వం సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాలతో కూడిన ఆహారం ఆవశ్యకతపై ఆర్జేడీ అవగా హన కల్పించారు. అలాగే, ప్రతిజ్ఞ చేయించారు. సీడీపీఓ మెహరున్సీసా బేగం, సూపర్వైజర్ భవాని, అంగన్వాడీ టీచర్లు కరుణ, నాగలక్ష్మి, పద్మ, చంద్రకళ, వాణి, జయ పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి ఖమ్మంక్రైం: జోన్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురికి ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఇందులో ఖమ్మం కమిషనరేట్‌కు కేటాయించిన ఉద్యోగులు సోమవారం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన సీపీ పదోన్నతితో పాటు బాధ్యతలు పెరగనున్నందున చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. అడిషనల్ డీసీపీ రామానుజం తదితరులు పాల్గొన్నారు. -
పలు రైళ్ల రద్దు
● పది రైళ్లకు 18వ తేదీ వరకు బ్రేక్ ● మూడో లైన్ పనులతో నిర్ణయం ఖమ్మంరాపర్తినగర్: జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. పాపటపల్లి – డోర్నకల్ మార్గంలో మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నారు. పలు రైళ్లను మంగళవారం నుంచి ఈనెల 18 వరకు రద్దు చేయగా, ఇంకొన్నింటిని మాత్రం నిర్ణీత తేదీల్లోనే నడిపిస్తారు. అలాగే, ఆదిలాబాద్ – తిరుపతి(17406) కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఈనెల 16, 17 తేదీల్లో రీ షెడ్యూల్ చేశారు. తద్వారా రైలు గంటన్నర ఆలస్యంగా నడుస్తుంది. రద్దయిన రైళ్ల వివరాలు కాజీపేట – డోర్నకల్ మార్గంలో ఇరువైపులా రాకపోకలు సాగించే(67765, 67766) ప్యాసింజర్‌ను ఈనెల 18వ తేదీ వరకు రద్దు చేశారు. అలాగే, డోర్నకల్ – విజయవాడ(67767, 67768), విజయవాడ – కొత్తగూడెం (67215, 67216) ప్యాసింజర్లతో పాటు గుంటూరు – సికింద్రాబాద్ ఇంటర్సిటీ (12705, 12706), విజయవాడ – సికింద్రాబాద్ (12713, 12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 18వ తేదీ వరకు ఇరువైపులా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాక కోర్బా –కూచ్‌వెలి (22647) ఎక్స్‌ప్రెస్‌ను 15, 18వ తేదీల్లో, కూచ్‌వెలి – కోర్భా ఎక్స్‌ప్రెస్ (22648)ను ఈనెల 13, 16వ తేదీల్లో, గోరఖ్‌పూర్–కూచ్‌వెలి (12511) ఎక్స్‌ప్రెస్‌ను 10, 12వ తేదీల్లో, కూచ్‌వెలి – గోరఖ్‌పూర్ (12512) ఎక్స్‌ప్రెస్‌ను 17వ తేదీన, బరౌని – ఎర్నాకులం (12521) ఎక్స్‌ప్రెస్‌ను 13న, ఎర్నాకులం – బరౌని ఎక్స్‌ప్రెస్ (12522)ను 17వ తేదీన రద్దు చేశారు. అంతేకాక విశాఖపట్నం – న్యూఢిల్లీ (20805) ఎక్స్‌ప్రెస్‌ను 16, 17న, తిరుగు ప్రయాణం(20806)లో 16న, విశాఖపట్నం – గాంధీగమ్ (20803) ఎక్స్‌ప్రెస్‌ను 16న, తిరుగు ప్రయాణం(20804)లో 19వ తేదీన, గుంటూరు – సికింద్రాబాద్ (17201) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 18వరకు, తిరుగు ప్రయాణం (17202)లో ఈనెల 17వ తేదీ వరకు, షాలిమర్ – చర్లపల్లి రైలును రెండు మార్గాల్లో (18045, 18046) వెళ్లేటప్పుడు 16, 17వ తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 17, 18వ తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక సీఎస్టీ ముంబై– భువనేశ్వర్ (11019) రైలును 16, 17వ తేదీల్లో, భువనేశ్వర్ – సీఎస్టీ ముంబై (11020) రైలును 17, 18వ తేదీల్లో, సాయినగర్ షిర్డీ – కాకినాడ ఎక్స్‌ప్రెస్(17205)ను 16న, కాకినాడ – సాయినగర్ షిర్డీ (17206) ఎక్స్‌ప్రెస్‌ను 18వ తేదీన దారి మళ్లించి నడిపించనున్నాఉ. -
రెండు రోడ్లకు రూ.40కోట్లు
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని ఆర్అండ్బీ పరిధి రెండు ప్రధాన రహదారుల విస్తరణ కోసం కేంద్ర రోడ్డు నిధి (సీఆర్ఎఫ్) నుండి రూ.40 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఒక్కో రహదారికి రూ.20 కోట్ల చొప్పున కేటాయించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిధులతో రెబ్బవరం – గన్నవరం రోడ్డు, లోకారం నుండి పెనుబల్లి వరకు రహదారులను విస్తరించనుండగా త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు తెలిసింది. ఇవికాక ‘హైబ్రీడ్’ విధానంలోనూ కొన్ని రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. మధిర నియోజకవర్గంలో ఆరు, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఒక్కో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనట్టు సమాచారం. వీటి పనులకు కూడా త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఖమ్మం – ఇల్లెందు రోడ్డు విస్తరణ ప్రారంభం నాలుగు నెలల విరామం తర్వాత ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపై రఘునాథపాలెం మండలంలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. రూ.38 కోట్ల అంచనా వ్యయంతో ఏడాదిన్నర క్రితం రఘునాథపాలెం నుంచి మంచుకొండ వరకు రహదారి విస్తరణ పనులు మొదలుపెట్టారు. అయితే, రూ.6కోట్ల విలువైన పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ నిలిపివేశారు. అభివృద్ధి పనులు ఆగిపోవడం, అప్పటికే రోడ్డు దెబ్బతిని ఉండడంతో రాకపోకలకు ఇక్కట్లు ఎదురయ్యాయి. దీంతో ఆర్అండ్బీ అధికారులు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకురాగా, బిల్లుల సమస్య పరిష్కరిస్తానని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇవ్వడంతో కాంట్రాక్టర్ సోమవారం నుంచి పనులు మొదలుపెట్టారు.సీఆర్ఎఫ్ నిధులతో విస్తరణ -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య?
తల్లాడ: మండలంలోని మల్సూర్తండాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ(19) ఇంటి వద్ద నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. దీంతో ఆయనను ఖమ్మంలోని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాగా, ప్రేమ విఫలం కావడంతోనే మణికంఠ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు తల్లాడ ఎస్ఐ వెంకటకృష్ణ ఆధ్వర్యాన విచారణ చేస్తున్నారు.యువకుడిపై పోక్సో కేసు ఖమ్మంక్రైం: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం జహీర్‌పుర ప్రాంతానికి చెందిన గోపి సుక్కు అదే ప్రాంతానికి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ మోహన్‌బాబు తెలిపారు. గంజాయి రవాణాదారులపై పీడీ యాక్ట్ ఖమ్మంరూరల్: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన సిద్దిపేట జిల్లా మందపల్లికి చెందిన పల్లపు రఘు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం మండలం వెంకటాద్రికి చెందిన మహ్మద్ ఖాజా పాషాపై పీడీ యాక్టు కొనసాగిస్తున్నట్లు ఖమ్మంరూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు. వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 24న రూ.89లక్షల విలువైన 179 కేజీల గంజాయిని కారులో తరలించే క్రమాన కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ వద్ద పట్టుబడ్డారు. దీంతో వీరిని రిమాండ్ నిమిత్తం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. అలాగే, ఆగస్టు 26న రఘు, పాషాపై కూసమంచి సీఐ సంజీవ్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. వీరిపై పీడీ యాక్టు నమోదును తెలంగాణ అడ్వైజరీ కమిటీ బోర్డు ఆమోదించడంతో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఏసీపీ తెలిపారు. చిరుతపులి గోర్ల తస్కరణ.. ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): చనిపోయిన చిరుతపులి గోర్లను తస్కరించిన వ్యక్తికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్త్రేట్ కే.సాయిశ్రీ సోమవారం తీర్పు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్బుగూడెం బీట్ పరిధిలో కంపార్ట్మెంట్–35 అటవీ ప్రాంతాన 2016 సంవత్సరంలో రెండు చిరుతపులులు రెండు మేకలపై దాడి చేసి హతమార్చాయి. దీంతో బాధిత రైతు మేకల కళేబరాలపై పురుగుల మందు చల్లాడు. వాటిని తిన్న రెండు చిరుతలు మృత్యువాత పడ్డాయి. ఈమేరకు అటవీశాఖ బీట్ ఆఫీసర్ రమేష్ బాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి, చిరుతపులి గోర్లను తస్కరించినట్లు గుర్తించారు. దీంతో అటవీశాఖ అధికారులు అబ్బుగూడెం గ్రామానికి చెందిన బూస సత్యం, పోతిని మంగయ్య, బూస హనుమంతరావు, కర్రి ఆశయ్య, ఎం.లక్ష్మారెడ్డి, ఎం.లక్ష్మయ్యపై అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ ఆరుగురిలో లక్ష్మయ్య కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. మిగిలిన వారిలో ఎం.లక్ష్మారెడ్డి నిందితుడిగా తేల్చిన కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగా, మిగిలిన వారిపై నేరం రుజువుకాలేదని కేసు కొట్టేసింది. -
● మా పరిస్థితి ఏమిటి సార్?
నిరుపేదలు, తల్లిదండ్రులు లేని పిల్లల కోసం ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్)ను ప్రవేశపెట్టి ప్రైవేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తోంది. అయితే, గత రెండున్నరేళ్ల నుంచి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో నిర్వహణ భారంగా మారిందంటూ పాఠశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. దసరా సెలవుల అనంతరం కొన్నిచోట్ల విద్యార్థులను అనుమతించకపోవడంతో తల్లిదండ్రులు నచ్చచెప్పి చేర్పించారు. ఈనేపథ్యాన బీఏఎస్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులతో తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి తమ గోడు వివరించారు. బకాయిలు విడుదల చేసి పిల్లల చదువుకు ఆటంకం రాకుండా చూడాలని కోరారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
కలప విలువ రూ.3కోట్లకు పైగానే..
● సండ్ర కలప రవాణాపై కొనసాగుతున్న విచారణ ● పాత్రధారులు, వారి వాటాలపై అధికారుల ఆరాఖమ్మంవ్యవసాయం: ఉత్తరాది రాష్ట్రాలకు విలువైన కలపను అక్రమంగా తరలించిన వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ సిస్టం(ఎన్టీపీఎస్) ద్వారా తప్పుడు వివరాలతో పర్మిట్లు తీసుకుని సాధారణ కలప స్థానంలో రూ.కోట్ల విలువైన సండ్ర కలపను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, అరుణాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని పాన్ మసాలా తయారీ ఫ్యాక్టరీలకు తరలించారు. అయితే, మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ కలపను సేకరించినా చింతకాని మండలం నుంచి తుమ్మ కలప తరలిస్తున్నట్లు పర్మిట్లు తీసుకున్నారు. ఈ అక్రమాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి అటవీ అధికారులు గుర్తించడంతో కొద్ది రోజులుగా విచారణ జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రేంజ్ పరిధిలోని మన్నెగూడెం, తోడేళ్లగూడెం, సీరోలు, కురవి ప్రాంతాల అసైన్డ్ భూముల నుంచి సండ్ర కలపను నరికి, చింతకాని సెక్షన్ నుంచి 24 లారీల కలపకు పర్మిట్లు తీసుకోవడం విశేషం. ఒక్కో లారీ సండ్ర కలప విలువ రూ. 15 లక్షల వరకు ఉండగా, మొత్తం రూ.3.60 కోట్ల విలువైన కలప అక్రమంగా తరలించినట్లు తేల్చారు. దీంతో పాటు తరలింపునకు సిద్దం చేసిన మరో మూడు లారీల సండ్ర కలపను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఎవరి వాటా ఎంత? విలువైన సండ్ర కలప రవాణాలో పాలుపంచుకున్న వారిని ఫోన్‌కాల్ డేటా ఆధారంగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ప్రధాని సూత్రధారితో పాటు ఆయనకు సహకరించిన అటవీ శాఖ ఉద్యోగులు, మధ్యవర్తులను ఇప్పటికే విచారించి వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారి, మధ్యవర్తులు ఎవరిరెవరితో మాట్లాడారో నిగ్గు తేల్చే క్రమాన అటవీ ఉద్యోగుల పాత్ర బయటపడింది. ఈక్రమంలోనే ప్రధాన సూత్రధారితో అధికారులకు ఒప్పందాలు, మధ్యవర్తి అకౌంట్ ద్వారా నగదు లావాదేవీలు వెలుగు చూసినట్లు సమాచారం. అక్రమాల వెనుక ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొందరు అటవీ ఉద్యోగులు ఉండగా, ఇప్పటికే ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో మహబూబాబాద్ అటవీ శాఖలో ఇంకొందరు ఉద్యోగులపై వేటు పడే అవకాశముందని సమాచారం. -
సాంకేతికను అందించేలా ఏటీసీ
ఖమ్మం సహకారనగర్: అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విద్యార్థులకు ఉపాధి కల్పించేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని ఐటీఐ ప్రాంగణంలో నిర్మించిన ఏటీసీని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌తో కలిసి మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఐటీఐల్లోని సంప్రదాయ కోర్సులతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నందున నైపుణ్య కోర్సులను రూపొందించి బోధనకు ఏటీసీలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రానున్న 5 – 10 ఏళ్లలో జరిగే మార్పులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటీసీలో కోర్సుల బోధన ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెంల్లో నాలుగు ఏటీసీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. రోబోటిక్స్ బోధన కూడా.. ఖమ్మం ఏటీసీలో రోబోటిక్స్‌తో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, మరమ్మతులపై శిక్షణ కోర్సులు ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా కోర్సులను ప్రభుత్వం డిజైన్ చేయించిందని చెప్పారు. ఇక్కడ రోబోటిక్స్ కోర్సు పూర్తిచేసే విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పోలీసు కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ విద్యార్థులు చేసే కోర్సులు – పరిశ్రమల్లో అవసరాలకు తేడా ఉన్నందున ప్రభుత్వం ఏటీసీలను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఏటీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, విద్యుత్, ఆర్అండ్బీ ఎస్ఈలు శ్రీనివాసాచారి, యాకోబు, ఆర్డీఓ నర్సింహారావు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ కృష్ణవేణి, కార్పొరేటర్ సత్యనారాయణ, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణంపై సమీక్ష ఖమ్మంఅర్బన్: ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన నిర్మించే వేంకటేశ్వర స్వామి ఆలయానికి కావాల్సిన స్థలంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ అనుదీప్, ఆర్డీఓ జి.నరసింహారావు, తహసీల్దార్ డి.సైదులుతో సమావేశమైన ఆయన ఆలయ నిర్మాణానికి అనువుగా, ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని ఎంపిక చేసి టీటీడీ బృందానికి నివేదిక ఇవ్వాలని తెలిపారు. ఈక్రమాన రవాణా సౌకర్యాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మేయర్ పి.నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పీఏసీఎస్ అధ్యక్షుడు రావూరి సైదబాబు తదితరులు పాల్గొన్నారు. -
యాచకులు ఎందరు, ఎక్కడ?
● కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వివరాలు సేకరణ ● బిక్షాటనకు కారణాలు, వారి జీవనశైలిపై ఆరా ● కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో సర్వే చేస్తున్న మెప్మా అధికారులు ● ఈనెల 16వ తేదీ నాటికి నివేదికలు సిద్ధం ఖమ్మంమయూరిసెంటర్: రద్దీ ప్రాంతాల్లో, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లు, వీధుల వెంట బిక్షాటన చేస్తున్న వారి వివరాలు, వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టణాలు, నగరాల్లో యాచకుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. యాచకుల జీవన శైలి, తీసుకుంటున్న ఆహారం, ఆరోగ్యం, యాచనకు కారణాలు తెలుసుకునేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక నమూనా రూపొందించింది. ఈ నమూనా ఆధారంగా ఖమ్మ ం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మధిర, సత్తుపల్లి, కల్లూరు, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మెప్మా అధికారులు, సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యం మున్సిపాలిటీల పరిధిలో పేదరిక నిర్మూలన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల పరిధిలో బిక్షాటనే జీవనాధారంగా గడిపే వారి సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతోంది. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా యాచకుల దరికి చేరడం లేదు. సరైన చిరునామాతో పాటు ఆధార్ కార్డు తదితర గుర్తింపు లేకపోవడం.. ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. దీంతో వీరి వివరాలు గుర్తించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పక్కాగా వివరాల నమోదు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో బిక్షాటనే జీవనంగా బతుకుతున్న వారి వివరాల సేకరణకు కేంద్రప్రభుత్వం ‘మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్’ పేరుతో సర్వే చేయిస్తోంది. ఆదివారం ప్రారంభమైన సర్వే ఈనెల 16వరకు మెప్మా సీఓలు, ఆర్పీల ఆధ్వర్యాన కొనసాగుతుంది. కేఎంసీలో సోమవారం సర్వే తీరుతెన్నులపై దిశానిర్దేశం చేశారు. టీఎంసీ జి.సుజాత, సీఓలు రోజా, సల్మా, ఉపేంద్ర ఆర్పీలకు శిక్షణ ఇచ్చి, గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. బిక్షాటన ఎందుకు? మెప్మా ఉద్యోగులు సర్వేలో బాగంగా యాచకుల పూర్తి వివరాలను సేకరించనున్నారు. పురుషులు / సీ్త్రలు, వయసు, కుటుంబ స్థితిగతులు, పెళ్లయిందా, విడాకులు తీసుకున్నారా.. పెళ్లయితే పిల్లలు ఎందరు, వారి వయస్సు, మతం, కులం తదితర వివరాలు ఆరా తీస్తున్నారు. అంతేకాక బిక్షాటనకు కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. దివ్యాంగులా, వృద్ధాప్యమే కారణమా, మాదకద్రవ్యాలను వాడుతున్నారా, చేతిలో పిల్లలతో చేస్తున్నారా.. మాతృభాష, రాత్రి ఎక్కడ నివాసముంటున్నారనే తదితర వివరాలను నమోదు చేసుకుంటారు. యాచకుల వివరాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నమూనా విడుదల చేసింది. మొదటి, రెండో కేటగిరీల్లో యాచకుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలపై ప్రశ్నలు ఉన్నాయి. ఎవరైనా బలవంతం చేస్తున్నారా, లేక జీవనం కోసమే బిక్షాటన చేస్తున్నారా.. వచ్చే డబ్బులు ఎంత, ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారనే అంశాలను మూడో కేటగిరీలో పొందుపరిచారు. నాలుగో కేటగిరీ కింద చేయూతనిస్తే బిక్షాటన నిలిపేస్తారా, చదువు, నైపుణ్య శిక్షణపై ఆసక్తి ఉందా, బిక్షాటన నిలిపిస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉన్నాయి. ఐదో కేటగిరిలో యాచకుల ఆహారం, ఆరోగ్య పరిస్థితులు, ఆరో కేటగిరి ద్వారా జీవితంలో ఏం కావాలి, ప్రభుత్వం నుంచి సాయం ఆశిస్తున్నారా, ఎవరైనా దుర్భాషలాడారా అనే వివరాలు సేకరిస్తున్నారు. -
దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హతల మేర పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో ఆయన దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించడమే కాక ఏవైనా తిరస్కరిస్తే అందుకు కారణాలు తెలియచేయాలని చెప్పారు. ●ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాలకు భవన నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లతో కలిసి అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రూ.200 కోట్ల వ్యయంతో 20 – 25 ఎకరాల్లో పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, జూనియర్ కళాశాలల మరమ్మతులకు మంజూరైన రూ.2.90 కోట్ల నిధులతో అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. ప్రతీ అధికారి వారానికి రెండేసి గురుకులాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని తెలిపారు. ●జిల్లాలో ధాన్యం, పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేలా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కొనుగోళ్లకు ఏర్పాట్లపై చర్చించిన ఆయన కేంద్రాల్లో వసతుల కల్పన, గన్నీ బ్యాగుల లభ్యతపై సూచనలు చేశారు. కాగా, కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అనుదీప్ తనిఖీ చేసి భద్రతపై సమీక్షించారు. ●కలెక్టరేట్లోని అన్ని శాఖల ఉద్యోగులు విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రోజుకు రెండుసార్లు హాజరు వేయాలని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. ఇందిరా డెయిరీ పథకం, జాతీయ రహదారులకు భూసేకరణ, ఉద్యోగుల హాజరుపై సమీక్షించిన ఆయన ఎవరైనా రెండు సార్లు హాజరు నమోదు చేయపోపోతే చర్యలు తప్పవని తెలిపారు. ●ఖమ్మంవైద్యవిభాగం: అత్యవసర సమయాల్లో ఉపయోగపడే సీపీఆర్‌పై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ ఉద్యోగులకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆకస్మికంగా వచ్చే గుండెపోటు నుంచి బాధితులను రక్షించేందుకు సీపీఆర్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సమావేశాల్లో డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, డీఐఈఓ రవిబాబు, పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ కళావతి బాయి, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, ఉద్యోగులు చందూనాయక్, శ్రీనివాసరావు, ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు. ‘ప్రజావాణి’లో కలెక్టర్ అనుదీప్ -
బదిలీల్లో రాజకీయ ఒత్తిళ్లు?
● వైరాలో మొన్న కమిషనర్, నేడు సీఐ ● నిలిచిపోయిన సీఐ బదిలీవైరా: వైరా నియోజకవర్గంలో పలువురు అఽధికారుల బదిలీలు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. తొలుత ఉత్తర్వులు వెలువడడం, కొత్త అధికారి బాధ్యతల స్వీకరణకు వచ్చేలోగా ఆ ఉత్తర్వులు ఆగిపోయాయని చెప్పడం సర్వసాధారణంగా మారింది. ఇందుకు రాజకీయ పార్టీల నేతల నుంచి ఉన్నతాధికారులపై వస్తున్న ఒత్తిడే కారణమని తెలుస్తోంది. ఆగస్టులో కమిషనర్ గత ఆగస్టులో వైరా మున్సిపల్ కమిషనర్ చింతా వేణును బదిలీ చేయడమే కాక ఆయన స్థానంలో నల్లగొండ జిల్లా నుంచి యు.గురులింగంను కేటాయించారు. దీంతో గురులింగం బాధ్యతలు స్వీకరించడానికి కార్యాలయానికి రాగా, ఆయన బదిలీ నిలిపేశారని తెలియడంతో వెనక్కి వెళ్లారు. ఆతర్వాత ఏం జరిగిందో ఏమో కానీ మళ్లీ గురులింగంనే కేటాయించగా ఆయన విధుల్లో చేరారు. ఇక తాజాగా శనివారం వైరా సీఐ నూనావత్ సాగర్ బదిలీ అయినట్లు ఉత్తర్వులు అందాయి. ఆయనను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేయడమే కాక ఐజీ కార్యాలయంలో ఉన్న వినయ్‌కుమార్ వైరాకు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం వినయ్‌కుమార్ వైరా చేరుకోవడంతో సాగర్ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే వినయ్‌కుమార్‌ను వెనక్కి వచ్చేయాలని సూచించడంతో పాటు వైరా సీఐగా సాగరే కొనసాగుతారని మౌఖిక ఆదేశాలు రావడం గమనార్హం. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి పెరగడం, పలా నా అధికారే కావాలని నేతలు పట్టుబడుతుండడంతోనే బదిలీల్లో మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా వైరా ఏసీపీగా తమకు అనుకూలమైన అధికారికి పోస్టింగ్ ఇప్పించుకోవాలని కొందరు నేతలు ప్రయత్నిస్తుండడంతోనే ఇంకా ఎవరినీ నియమించడం లేదని సమాచారం. -
జాతీయ స్థాయి టోర్నీలో వైశాలికి రజతం
ఖమ్మం స్పోర్ట్స్: ఒడిశా రాష్ట్రం భువన్నేశ్వర్లో జరుగుతున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఖమ్మంకు చెందిన బి.వైశాలి హెప్టాథిలిన్ ఈవె ంట్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. అండర్–18 బాలికల విభాగంలో పోటీకి దిగిన ఆమె ప్రతిభ చాటిది. ఈ సందర్భంగా వైశాలిని డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్ అహ్మద్ అభినందించారు. అండర్–17 ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్: అండర్–17 విభాగంలో ఉమ్మడి జిల్లా బాలబాలికల వాలీబాల్ జట్లను సోమవారం ఎంపిక చేశారు. జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు పెద్దసంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో బాలురు అత్యధికంగా రావడంతో తొలుత 100మందిని గుర్తించి, స్క్రీనింగ్ అనంతరం వారిలో నుంచి జట్టును ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లా బాలుర జట్టుకు యు.ఉదయ్ ముఖేష్, బి.నందకిషోర్, బి.చరణ్, ఎం.సాయిక్షయ్కుమార్, ఎస్.కే.షరీఫ్, ఎం.ధనుంజయ్, కె.నవీన్, బి.చేతన్, డి.రోహన్, పి.సాయిరాంతో పాటు స్టాండ్ బైగా బి.గణేష్, ఎస్.కే.ముద్దషీర్ ఎంపికయ్యారు. అలాగే, బాలికల జట్టుకు జి.హాసిని, కె.అమృత, బి.నాగేశ్వరి, పి.అనూష, బి.శ్వేత, బి.గౌతమి, వి.లావణ్య, టి.ఉమారాణి, హెచ్.భార్గవి, స్టాండ్ బైగా పి.కరుణ్యా, కె.చరితరెడ్డి ఎంపిక చేశారు. ఎంపిక పోటీలను జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావుతో పాటు పీఈటీలు చిన్ని, పవన్‌కుమార్, రామారావు తదితరులు పర్యవేక్షించారు. ప్లేట్లెట్లు పడిపోయిన వ్యక్తికి వైద్యుడి రక్తదానం సత్తుపల్లిరూరల్: చికిత్స చేయడమే కాదు అవసరమైతే చేయూతనివ్వాలనే భావనతో రక్తదానం చేసిన ప్రభుత్వ వైద్యుడు మానవత్వాన్ని చాటాడు. సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన రాంబాబు ఇటీవల గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా పరీక్షించిన డాక్టర్ అవినాష్ ఆయనకు ప్లేట్ లైట్స్ తక్కువగా ఉన్నందున ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆతర్వాత రాంబాబు ఖమ్మంలో చికిత్స చేయించుకుంటుండగా వివరాలు ఆరా తీసేందుకు సోమవారం అవినాష్ అక్కడకు వెళ్లారు. అయితే, ఆయనకు రక్తం ఇచ్చేందుకు సత్తుపల్లి నుండి ఇద్దరు వెళ్లినా గ్రూప్ సరిపోకపోవడం, పరిస్థితి విషమిస్తుండడంతో అవి నాష్ స్వయంగా రక్తదానం చేయడంపై పలువురు అభినందించారు. ఆపరేటర్ నియామకాలకు రేపు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన నిర్వహించే సదరం శిబిరాల్లో రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంటర్నెట్ వాడకంపై ప్రావీణ్యత, డేటా ఎంట్రీ పనిలో అనుభవం కలిగిన అభ్యర్థులు మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వీరికి బుధవారం 60 మార్కులతో రాత పరీక్ష నిర్వహించడమే కాక ఇంటర్వ్యూ అనంతరం ఎంపిక చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. రామయ్యకు ముత్తంగి అలంకరణ భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి పూజలు చేశాక నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, నిత్యకల్యాణంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
తక్షణమే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ఖమ్మంమయూరిసెంటర్: పత్తి చేతికొస్తున్న నేపథ్యాన ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి రైతులను ఆదుకోవాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు. సంఘం నాయకులు సోమవారం ఖమ్మం మార్కెట్లో పత్తి రైతుల సమస్యలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్, మార్కెట్ కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయకుండా పత్తి రైతులను ఆదుకునేలా వెంటనే కొనుగోళ్లు మొదలుపెట్టాలని కోరారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ముందుకురాగానే ప్రభుత్వమే మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు, కోలేటి నాగేశ్వరరావు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కమ్మకోమటి నాగేశ్వరరావు, కేలోతు లక్ష్మణ్, పాశం అప్పారావు, గుగులోత్ తేజనాయక్, కుర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య -
నిర్విరామ కృషితోనే సాధ్యం
● వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీ మేనేజర్లు, సిబ్బందికి అభినందన దమ్మపేట:అప్పారావుపేట, అశ్వారావుపేట పామా యిల్ ఫ్యాక్టరీల మేనేజర్లు, సిబ్బంది నిర్విరామ కృషితోనే మూడు లక్షల టన్నుల పామాయిల్ గెలల క్రషింగ్ సాధ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిర్దేశిత క్రషింగ్ లక్ష్యాన్ని సాధించిన నేపథ్యంలో ఆదివారం మండలంలోని అప్పారావుపేట ఫ్యాక్టరీ ప్రాంగణంలో అధికారులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీల మేనేజర్లు కళ్యాణ్, నాగబాబులతోపాటు సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆయిల్‌పామ్ సాగులో ఎకరాకు 12 టన్నులు పైబ డి దిగుబడి సాధించిన రైతులు స్వీయ అనుభవా లను వివరించారు. వారినీ సన్మానించారు. మహా రాష్ట్రకు చెందిన రైతు చంద్రశేఖర్ వ్యవసాయంలో అనుసరిస్తున్న రీజనరేటివ్ విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రీజనరేటివ్ విధానాన్ని పరిశీలించేందుకు 40 మంది రైతులను అక్కడికి పంపుతామన్నారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించి, రాబోయే సంవత్సరానికి నూతన ఫ్యాక్టరీ నిర్మించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఆయిల్‌ఫెడ్ సిబ్బందికి పదోన్నతి కల్పించాలన్నారు. తోటల్లో ఆయిల్‌పామ్ చెట్లపై నుంచి వెళ్తున్న విద్యుత్తు లైన్లను మార్చాలని విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్‌ను ఆదేశించారు. అప్పారావుపేట గ్రామ అభివృద్ధి, అశ్వారావుపేట లో డివైడర్ నిర్మాణానికి ఆయిల్‌ఫెడ్ నిధులు కేటా యిస్తామన్నారు. ములకలపల్లి మండలంలో పది వేల ఎకరాల సాగు విస్తీర్ణం దాటితే ఫ్యాక్టరీ నిర్మిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. 15 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం.. ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 15 లక్షల ఎకరాల్లో పామాయిల్ మొక్కలను పెంచడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. అత్యధిక ఓఈఆర్ 19.92ను సాధించడంతో రైతులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. భ ద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ రైతులు మునగ, వెదురు, కూరగాయలు సాగు, పట్టు పురుగుల పెంపకంపై కూడా దృష్టి సారించాలని అన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ పేటలో పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ నెలకొల్పాలని, అచ్యుతాపురంలో ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూ విస్తీర్ణంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్సు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఓఎస్డీ కిరణ్ కుమార్, డివిజనల్ మేనేజర్ రాధాకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్లు కళ్యాణ్, నాగబాబు, సొసైటీ చైర్మన్ ఎల్లిన రాఘవరావు, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు రావు గంగాధరరావు, కాసాని నాగప్రసాద్, కె.వి, రైతులు పాల్గొన్నారు. -
‘సౌర’ పందెం.. రూ.కోటి ఖాయం
● ఉమ్మడి జిల్లాలో కొణిజర్ల, భద్రాచలం ఎంపిక ● ఎంఎన్ఆర్ఈ ద్వారా ప్రజలకు ఉపయోగపడేలా సోలార్ ప్లాంట్లు ● ‘గృహజ్యోతి’తో ఇంకా ముందుకు రాని ప్రజలు ఖమ్మంవ్యవసాయం: సౌర విద్యుత్ ఉత్పత్తిని విస్తృతపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలతో కూడిన పథకాలను అమలుచేస్తోంది. ప్రధాన మంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి కుసుమ్ వంటి పథకాలు ఉండగా.. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెనివబుల్ ఎనర్జీ(ఎంఎన్ఆర్ఈ) పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద మోడల్ సోలార్ విలేజ్‌లకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. నిబంధనల ఆధారంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించిన గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడేలా ఈ నిధులు వినియోగిస్తారు. మోడల్ సోలార్ విలేజ్‌గా పరిగణించడానికి తాజా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5 వేలకు మించి ఉండాలి. ఇక 2025 ఏప్రిల్ నుంచి ఆరు నెలల కాలాన్ని గడువుగా నిర్దేశించగా.. ఈ సమయంలో నిబంధనల ప్రకారం అధికంగా సౌర విద్యుత్ కనెక్షన్లు, సామర్థ్యాన్ని బట్టి జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తారు. ఆ గ్రామానికి ఎంఎన్ఆర్ఈ పథకం కింద రూ. కోటి విలువైన సౌర ప్లాంట్ల నజరానా ప్రకటించారు. దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న ఈ పథకాన్ని ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 4 నుంచి అక్టోబర్ 3 వరకు, భద్రాద్రి జిల్లాలో ఏప్రిల్ 9 నుంచి అక్టోబర్ 8వరకు అమలు చేశారు. విద్యుత్ శాఖ పర్యవేక్షణలో రెడ్ కో సంస్థ ఈ పోటీలు నిర్వహించింది. పోటీ పడిన గ్రామాలు 22.. ఎంఎన్ఆర్ఈ పథకం కింద నిబంధనల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 22 గ్రామాలు ఎంపికయ్యాయి. ఖమ్మం జిల్లాలో అన్నారుగూడెం(తల్లాడ మండలం), నేలకొండపల్లి, కొణిజర్ల, వల్లభి(ముదిగొండ మండలం), తనికెళ్ల(కొణిజర్ల మండలం), తల్లాడ, ముదిగొండ, కందుకూరు(వేంసూరు) గ్రామాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో అశ్వాపురం, భద్రాచలం, సారపాక, నాగినేనిప్రోలు(బూర్గంపాడు మండలం), రుద్రంపూర్(చుంచుపల్లి మండలం), దమ్మపేట, కూనవరం(మణుగూరు మండలం), ముల్కలపల్లి, బూర్గపాడు, చండ్రుగొండ, బాబూక్యాంప్(చుంచుపల్లి మండలం), మందలపల్లి(దమ్మపేట మండలం), సమితి సింగారం(మణుగూరు మండలం) చర్ల గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో అర్హులైన వారికి సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సూర్య ఘర్ పథకం కింద రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇంటి పైకప్పు 100 నుంచి 300 ఆపైన స్క్వేర్ ఫీట్ ఉన్న భవనాలకు అవకాశం కల్పించారు. ఒక కిలోవాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు రూ.30 వేల రాయితీ, 2 కిలోవాట్ల సౌరప్లాంట్‌కు రూ. 60 వేలు, 3 కిలోవాట్ల సౌరప్లాంట్‌కు రూ.78 వేల రాయితీ సౌకర్యం కల్పించారు. రూ.కోటి నజరానా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో నిర్వహించిన మోడల్ సోలార్ విలేజ్ పథకం పోటీల్లో ఖమ్మం జిల్లా నుంచి కొణిజర్ల, భద్రాద్రి జిల్లా నుంచి భద్రాచలం గ్రామాలు విజేతలుగా నిలిచాయి. భద్రాచలంలో 180 విద్యుత్ సర్వీసులు సౌర విద్యుత్‌కు అనుసంధానం పొందగా 2 వేల కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పునరుత్పత్తి చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల కూడా అత్యధికంగా పోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొని ముందంజలో నిలిచింది. దీంతో ఈ రెండు గ్రామాలను రెండు జిల్లాల స్థాయిలో మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేశారు. సోలార్ పథకం కింద విజేతలుగా నిలిచిన గ్రామాలకు విడుదల చేసే రూ. కోటి నిధులను ఆయా గ్రామాల్లో ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని నిర్దేశించారు. ప్రభావం చూపుతున్న ‘గృహజ్యోతి’ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకరాన్ని గృహజ్యోతి పథకం కింద కల్పించింది. గ్రామాల్లో 80 శాతం మంది విద్యుత్ కనెక్షన్లు ఈ పథకంలో ఉన్నాయి. దీంతో ఉచిత విద్యుత్ పొందుతున్న లబ్ధిదారులు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. 3 కిలోవాట్ ప్లాంట్ ఏర్పాటుకు కంపెనీలను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.2.40 లక్షల వరకు ఖర్చవుతుంది. కిలోవాట్లు తగ్గితే వ్యయం కూడా తగ్గుతుంది. అయితే ఈ పథకం ఏర్పాటుకు రుణ సౌకర్యం కల్పించినా.. వినియోగదారులకు సిబిల్ స్కోర్ ఉంటేనే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. చాలా మందికి సిబిల్ స్కోర్ సరిగా లేక రుణాలకు అర్హత సాధించలేక పోయారు. దీంతో మోడల్ సోలార్ విలేజ్ పథకానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. -
సుందర వనం !
ఖమ్మం నగరంలో పచ్చదనం పరిఢవిల్లుతోంది. నగర పాలక సంస్థ (కేఎంసీ) ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంతో పార్కులు, ప్రధాన రహదారులు, వాకింగ్ ట్రాక్‌లు, డివైడర్లు హరిత శోభ సంతరించుకుని ఆహ్లాదం పంచుతున్నాయి. వన మహోత్సవంలో లక్ష్యాలకు అనుగుణంగా వివిధ శాఖల అధికారులు రకరకాల మొక్కలు నాటడంతో పచ్చదనంతో నిండిపోయాయి. నాటిన ప్రతీ మొక్క సంరక్షణకు కేఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. – ఖమ్మంమయూరిసెంటర్ఆకర్షణీయంగా మొక్కలు.. నగరంలోని పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ట్యాంక్బండ్లు, రహదారుల వెంట, డివైడర్లలో మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా రు. మొక్కలు నాటడం, వాటిని పెంచడంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య.. ఉద్యాన అధికారిణికి ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు. దీంతో డివైడర్లతో పాటు పార్కులు, వాకింగ్ ట్రాక్‌ల్లో మొక్కలను ఆకర్షణీయంగా పెంచుతున్నారు. పెరిగిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తున్నారు. పార్కులకు వచ్చే వారిని ఈ మొక్కలు కనువిందు చేస్తున్నాయి. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసే వారికి ఈ పచ్చటి వాతావరణం మానసిక ప్రశాంతతను అందిస్తోంది. వక్క మొక్కలు కూడా.. ఈ ఏడాది నగరంలో 4 లక్షలకు పైగా మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 90 శాతం పూర్తి చేయగా.. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో రెండు పార్కుల్లో మొక్కలు నాటాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పూలు, పండ్ల మొక్కలతో పాటు కేఎంసీకి ఆదాయం తీసుకొచ్చే మొక్కలకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి పలు ప్రదేశాల్లో నాటారు. నగరంలో 6వేల వక్క మొక్కలను ప్రత్యేకంగా నాటించారు. కేఎంసీ డంపింగ్ యార్డ్‌లోని ఖాళీ స్థలంలో అత్యధికంగా 10 వేల మొక్కలు ఒకే చోట నాటగా.. వీటిలో నీడనిచ్చేవి, పండ్ల మొక్కలు ఉన్నాయి. వీటి చుట్టూ బ్యాంబూ మొక్కలను బోర్డర్‌లా పెంచుతున్నారు. ఇక నగరంలో 36 కిలోమీటర్ల మేర ఉన్న డివైడర్ల మధ్య వక్క, టాల్ ప్లాంట్స్, కాగితపు పూల మొక్కలు నాటారు. విజయవంతంగా వన మహోత్సవం.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం ఖమ్మంలో విజయవంతమైందని అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటడంతో నగరంలో పచ్చదనపు విస్తీర్ణం పెరిగింది. మొక్కలు నాటడమే కాకుండా, వాటి సంరక్షణకు కేఎంసీ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు నగరానికే మణిహారంగా మారింది.ఖమ్మంలో పరిఢవిల్లుతున్న పచ్చదనం -
ఆలయం నిర్మిస్తే ఆధ్యాత్మిక శోభ
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ● శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి స్థల పరిశీలనఖమ్మంఅర్బన్: జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తయితే ఆధ్యాత్మిక, పర్యాటక శోభ సంతరించుకుంటుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక కోసం ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. నగరంలోని 15వ డివిజన్ కొత్తగూడెం, అల్లీపురం ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు, మ్యాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీటీడీ ఆలయ నిర్మాణానికి అనువైన పలు స్థలాల ప్రతిపాదనలు పరిశీలించామని, రహదారి అనుసంధానం, భౌగోళిక అనుకూలత, వసతిగృహాల ఏర్పాటుకు గల సౌకర్యాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. టీటీడీ అధికారులు, స్తపతులు, పండితులు త్వరలో ఖమ్మానికి వచ్చి తుది స్థలాన్ని ఖరారు చేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో అర్డీఓ జి.నరసింహారావు, అర్బన్ తహసీల్దార్ డి.సైదులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పైరవీలకే పెద్దపీట..?
● టీచర్ల కేటాయింపుల్లో లోపాలున్నాయని ఉపాధ్యాయ సంఘాల ఆందోళన ● ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం సత్తుపల్లి: పైరవీలు చేసినవారు, పలుకుబడి ఉన్న ఉపాధ్యాయులను వారికి నచ్చిన స్థానాల్లో సర్దుబాటు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం డీఈఓగా ఐఏఎస్ అధికారిణి బాధ్యతల్లో ఉన్నప్పటికీ కొందరు ఎంఈఓలు తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులను ఏకంగా జిల్లా కేంద్రానికి సమీపంలో సర్దుబాటు చేశారనే చర్చ సాగుతోంది. దసరా సెలవుల ముందు సర్దుబాటు ప్రక్రియ చేపట్టి, ఉన్న ఫలంగా విధుల్లో చేరాలని ఉత్తర్వులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు విధుల్లో చేరినట్లు తెలిసింది. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో సర్దుబాటు, పైరవీలు, అవతవకలపై నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపించేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిని కలిసి సర్దుబాటులో లోపాలపై ఫిర్యాదు చేయగా మండల అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇన్చార్జ్ ఎంఈఓల పాఠశాలలకు.. సత్తుపల్లి నియోజకవర్గంలో పనిచేస్తున్న ఎంఈఓలందరూ ఇన్‌చార్జ్‌లుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు కాకర్లపల్లి జెడ్పీహెచ్ఎస్, వేంసూరు ఎంఈఓ చల్లంచర్ల వెంకటేశ్వరరావు చౌడారం హైస్కూల్, పెనుబల్లి ఎంఈఓ సత్తెనపల్లి సత్యనారాయణ వీఎం బంజర్ జెడ్పీహెచ్‌ఎస్‌ల్లో హెచ్ఎంలుగా పనిచేస్తున్నారు. సర్దుబాటు ప్రక్రియలో వారు పనిచేస్తున్న పాఠశాలలకు ఇబ్బందులు రాకుండా ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పదో తరగతి ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై సత్తుపల్లి ఇన్చార్జ్ ఎంఈఓ రాజేశ్వరరావును వివరణ కోరగా.. ప్రభుత్వ జీఓ ప్రకారం సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేశామని, ఎలాంటి అక్రమాలకు తావు లేదని స్పష్టం చేశారు. పెనుబల్లి మండలం కొండ్రుపాడు జెడ్పీహెచ్ఎస్ హిందీ ఉపాధ్యాయుడు గంగరాజును బోనకల్ మండలం ఆళ్లపాడు జెడ్పీహెచ్‌ఎస్‌కు డిప్యూటేషన్‌పై పంపించారు. కోండ్రుపాడు పాఠశాలకు గణేశ్పాడు ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్‌పై పంపించారు. అసలు కోండ్రుపాడు పాఠశాల నుంచి డిప్యూటేషన్‌పై ఎందుకు పంపారు? ఇతర పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై ఎందుకు తెచ్చారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెనుబల్లి జెడ్పీహెచ్ఎస్లో అదనంగా ఉపాధ్యాయులు ఉన్నా.. ఎంఈఓ ఇన్చార్జ్ కావడంతో సర్దుబాటులో ఈ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించినట్లు విమర్శలు వస్తున్నాయి. వేంసూరు మండలం దుద్దేపూడి యూపీఎస్‌లో పనిచేస్తున్న రవికుమార్‌ను ఖమ్మం, యూపీఎస్ రామన్నపాలెంలో పనిచేస్తున్న బాలాజీని ఖమ్మం డిప్యూటేషన్‌పై పంపించారు. మార్గదర్శకాల ప్రకారం ఆ మండలంలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అదే మండలంలో సర్దుబాటు చేయాల్సి ఉన్నప్పటికీ జిల్లా కేంద్రానికి పంపడంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాకర్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో గణిత ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ అదనంగా గణిత ఉపాధ్యాయుడిని పంపించినట్లు తెలుస్తోంది. యూపీఎస్ కొమ్ముగూడెంలో 14 మంది విద్యార్థులకు హిందీ పోస్టు మాజూరు లేనప్పటికీ 330 మంది విద్యార్థులు ఉన్న జెడ్పీహెచ్ఎస్ నుంచి ఉపాధ్యాయురాలిని సర్దుబాటు చేయడంతో ఆమె డీఈఓను కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
ముగిసిన టీటీ ర్యాంకింగ్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్ : మూడు రోజులుగా నగరంలోని సర్థార్ పటేల్‌స్టేడియంలో జరిగిన బాలసాని సాన్యసయ్య స్మారక రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ టోర్నీ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ ఖమ్మంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడా సంఘాల బాధ్యుల కృషి వల్లే ఖమ్మంలో విరివిగా రాష్ట్రస్థాయి టోర్నీలు జరుగుతున్నాయన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు బాలసాని విజయ్‌కుమార్, రాష్ట్ర టీటీ అసోసియేషన్ అధ్యక్షులు కె.కె.మహేశ్వరి, కార్యదర్శి సి.నాగేందర్‌రెడ్డి, ఎన్.లక్ష్మీకాంత్, సీనియర్ కోచ్ సోమనాథ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్–11 బాలికల విభాగం ఫైనల్స్‌లో అపర్ణ, యశశ్రీ, అండర్–13 విభాగంలో డి.అవంతిక, బి.వి.మహిమకృష్ణ, అండర్ –15 విభాగంలో బి.వి. మహిమకృష్ణ, గాయత్రి కృష్ణ, అండర్–17 విభాగంలో అవంతిక, పి.జలని, అండర్–19 విభాగంలో కె.శ్రేష్ఠ, వైష్ణవి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. బాలుర అండర్–11 విభాగంలో ఎం.విహాన్, నివాస్, అండర్–13 విభాగంలో సాగర్, పి.వేదాన్ష్, అండర్–15 విభాగంలో జె.ఎ. విలోహిత్, ప్రమాణ్, అండర్–17 విభాగంలో ఎం.ధర్మతేజ సాయి, పి.శ్రీహానీష్, అండర్–19 విభాగంలో అరూష్రెడ్డి, ఎం.దేవాన్ష్, పురుషుల విభాగంలో స్వర్నెండ్ చౌదరి, బి.వరుణ్ శంకర్, మహిళల విభాగంలో నిఖితా బాను, వరుణి జైస్వాల్ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. -
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్
చింతకాని: మండలంలోని నాగులవంచ పెట్రోల్ బంకు వద్ద ఆదివారం ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బంధం లక్ష్మీనారాయణ (45) మృతి చెందగా అతని కుమారుడు గగన్‌కు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కొణిజర్ల మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులతో కలిసి ఖమ్మంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావటంతో ద్విచక్ర వాహనంపై తన కుమారుడితో కలిసి ఖమ్మం నుంచి ముష్టికుంట్ల గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో నాగులవంచ పెట్రోల్ బంకు వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో లక్ష్మీనారాయణతో పాటు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే లక్ష్మీనారాయణ మృతి చెందగా, కుమారుడు గగన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.తండ్రి మృతి, కుమారుడికి గాయాలు -
ఎస్సీ వర్గీకరణ ఓ రాజకీయ కుట్ర
ఖమ్మంమామిళ్లగూడెం: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై అతిపెద్ద రాజకీయ కుట్ర జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ పేరుతోనే దళితులకు సామాజిక న్యాయం జరుగుతుందా? అని, ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అవసరం లేదా..? అని ప్రశ్నించారు. పంజాబ్, హరియాణాలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని, దానిని ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తం చేశాడని ఆరోపించారు. శాసీ్త్రయత లేని, రాష్ట్ర జనాభా లెక్కలతో ఎస్సీ రిజర్వేషన్ వల్ల చాలా తక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సమావేశంలో కామ ప్రభాకర్‌రావు, బల్లెం లక్ష్మణ్, మిరియాల బాలశౌరి, తోట దుర్గాప్రసాద్, కనికెళ్ల నాని, నెల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పీఈటీ అసోసియేషన్ కమిటీ ఎన్నికకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల కళాశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సునీల్‌రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్ డైరెక్టర్), ఉపాధ్యక్షులుగా పి.అజయ్, ఎస్.కుమారస్వామి, బి.రమేశ్, జి.సునీత, కోశాధికారిగా ఎస్.కిరణ్‌కుమార్‌గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్, బి.వెంకట్రామ్, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మహ్మద్ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది. వడ్డీ వ్యాపారులకు మావోయిస్టుల హెచ్చరిక దుమ్ముగూడెం: అవసరాన్ని బట్టి పేద ప్రజల వద్ద పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులను హెచ్చరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న పేరుపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. అధిక వడ్డీలు కట్టలేని పరిస్థితిలో పేదలు ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలన్నారు. వ్యాపారుల దౌర్జన్యాలు తట్టుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొందరు చనిపోతున్నారని, మరికొందరు ఆస్తులు అమ్ముకుని రోడ్డుపై పడుతున్నారని తెలిపారు. గైనకాలజిస్ట్లు లేక బాలింత కొత్తగూడెం తరలింపు గర్భంలోనే శిశువు మృతి మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఆస్పత్రిలో గైనికాలజిస్ట్‌లు లేక సరైన సమయంలో వైద్యం అందక గర్భంలోనే శిశువు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. ఎర్రపు వినయ్ సివిల్ విభాగంలో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, భార్య స్వాతి 9 నెలల గర్భిణి. స్వాతికి తరచూ షుగర్ రావడంతో రోజూ క్రమం తప్పకుండా ఇన్సులిన్ వేసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో మణుగూరు సింగరేణి ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో భర్త వినయ్ కొత్తగూడెం మెయిన్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ క్రమంలో మణుగూరు ఆస్పత్రికి సాధారణ పరీక్షల కోసం వెళితే కొత్తగూడెం మెయిన్ ఆస్పత్రికి రిఫర్ చేశారని అక్కడ గుండె చప్పుడు పరిశీలించిన వైద్యులు ప్రైవేట్ స్కాన్ చేయించగా, అప్పటికే శిశువు మృతి చెందిందని తెలిపారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ ఉంటే శిశువు ప్రాణం దక్కి ఉండేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆదివాసీలు ఉద్యమించాలి టేకులపల్లి: ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు నిర్వహించిన కొమురం భీమ్ ఆశయ సాధనకు ఆదివాసీలు ఉద్యమించాలని తుడుందెబ్బ జాతీయ కో కన్వీనర్ కల్తి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో ఆదివా రం కొమురం భీమ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్, జంగిల్, జమీన్ కావాలంటూ నైజాం నవాబులు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరు సల్పారని అన్నారు. భద్రాచలంలో జరిగిన ధర్మ యుద్ధం సభ సక్సెస్ కావడంతో కొందరు లంబాడీ నాయకులు తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. -
ఘాటు తగ్గిన మిర్చి
● ఈ ఏడాది గణనీయంగా పడిపోయిన సాగు ● ధర లేకపోవడంతో రైతుల అనాసక్తి ● సాగు చేసిన తోటల్లోనూ కలుపు ప్రభావం ● పంటకు పెరుగుతున్న పెట్టుబడి తల్లాడ: ఈ ఏడాది జిలాల్లో మిర్చి సాగు గణనీయంగా తగ్గింది. ధర పెరగకపోవడం, చీడపీడల కారణంగా గతేడాది మిర్చి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. కనీసం పెట్టుబడులు కూడా రాలేదు. కొన్నిచోట్ల పంట అమ్మితే కూలీల ఖర్చులు కూడా రావనే ఉద్దేశంతో చేతికందిన మిర్చిని తోటల్లోనే వదిలేశారు. దీంతో ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తి వైపు మొగ్గుచూపారు. సగానికి తగ్గిన సాగు.. జిల్లాలో గతేడాది 70వేల ఎకరాల్లో మిర్చిసాగు చేయగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 30 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇంకా అక్కడక్కడా మరో ఐదు వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. జూన్, జూలైలో మిర్చి నారు పోయగా సెప్టెంబర్ మొదటి వారం నుంచి సాగు పనులు ప్రారంభించారు. ఈ ఏడాది మిరప సాగు విస్తీర్ణం తగ్గడంతో జిల్లాలోని పలు నర్సరీల్లో పెంచిన మిరపనారు మిగిలి పోయింది. చాలా నర్సరీల్లో వేలాది మొక్కలు మిగిలిపోగా, నిర్వాహకులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. రైతులపై కలుపు భారం ఈ ఏడాది మిర్చి రైతులను కలుపు బెడద తీవ్రంగా వేధిస్తోంది. సాగు చేసిన నెల రోజుల్లోనే అధిక వర్షాలతో కలుపు బాగా పెరిగింది. తద్వారా మిరప మొక్కల ఎదుగుదల లోపించి దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీలతో కలుపు తీయించాలంటే ఎకరానికి రూ.20 వేల వరకు ఖర్చువుతోంది. ఇప్పటికే దుక్కి, నారు, ఎరువులకు రూ.40 వేల వరకు ఖర్చు చేయగా పంట చేతికందేసరికి ఎకరాకు రూ.లక్ష దాటుతోందని రైతులు అంటున్నారు. గిట్టుబాటు ధర లేక నష్టం.. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులకు సరైన ధర లేక తీవ్రంగా నష్టపోయారు. బంగ్లాదేశ్, చైనా దేశాల్లో మిర్చి సాగు పెరగడంతో విదేశీ ఎగుమతులు లేక ధర పెరగడం లేదు. మధ్యప్రదేశ్‌లోనూ గత ఖరీఫ్‌లో మిర్చి దిగుబడి పెరగడంతో ఇక్కడి పంటకు డిమాండ్ తగ్గింది. ఖమ్మం మార్కెట్లో జెండా పాట క్వింటా రూ.13 వేలకు మించలేదు. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. -
హామీలన్నీ అమలు చేస్తున్నాం
ఖమ్మంరూరల్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల పాలయినా, ఆర్థిక వ్యవస్థ సక్రమంగా లేకున్నా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన సాగుతోందని చెప్పారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న వెంకటగిరిలో ఖమ్మం – కోదాడ ఆర్అండ్బీ రోడ్డు నుంచి జీ ప్లస్ – 2 కాలనీ వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా దీవెనలతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.1.53 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.2.65 కోట్లతో మినీ స్టేడియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సరఫరాకు రూ.10 లక్షలు ఖర్చు చేశామని చెప్పారు. వెంకటగిరి ఆర్అండ్బీ రోడ్డు నుంచి జంగాల కాలనీ, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి నుంచి కోటనారాయణపురం మీదుగా ఇందిరమ్మ కాలనీ, వెంకటగిరి ఎస్సీ, బీసీ కాలనీ నుంచి గుదిమళ్ల వరకు రోడ్లు మంజూరు చేశామని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీలో అదనపు నిధులు మంజూరు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అక్కడే అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి.. త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్‌బాబు, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏటీసీ.. అంతా రెడీ
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఐటీఐ కళాశాలలను ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)లుగా అప్‌గ్రేడ్ చేసింది. తొలి విడతలో రాష్ట్రంలో మూడు ఐటీఐలను ఏటీసీలుగా మార్చగా అందులో ఖమ్మం నగరంలోని టేకులపల్లి ఐటీఐ కూడా ఉంది. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఈ సెంటర్‌కు ఆరు కొత్త కోర్సులు మంజూరయ్యాయి. వాటిలో గత, ప్రస్తుత విద్యాసంవత్సరాల్లో 172 చొప్పున సీట్లు కేటాయించగా అన్నీ భర్తీ అయ్యాయి. రూ.13 కోట్లు కేటాయింపు.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.77 కోట్లు కేటాయించగా పనులు పూర్తయ్యాయి. కాగా, టాటా టెక్నాలజీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మరో రూ.8 కోట్ల వ్యయంతో విద్యార్థులకు అవసరమైన పరికరాలు, ఫర్నిచర్, బోధన సిబ్బందిని సమకూరుస్తున్నారు. కళాశాలలో ఉన్న పాత భవనంలోనే ఇప్పటివరకు విద్యార్థులకు బోధన చేశారు. అయితే తరగతి గదులు, ఇతర సమస్యలు నెలకొన్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించారు. ఏటీసీ భవనం సోమవారం ప్రారంభమైతే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందనున్నాయి. ఏర్పాట్లు పూర్తి.. నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏటీసీ భవనాన్ని ప్రారంభిస్తారని, ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతారని ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. వీరితో పాటు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డి, గారపాటి రేణుకా చౌదరి, రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తీన్మార్ మల్లన్న, పింగళి శ్రీపాల్‌రెడ్డి, కలెక్టర్ అనుదీప్‌ను కూడా ఆహ్వానించామని వివరించారు. -
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
దుమ్ముగూడెం: మండలంలో ఇసుక లారీలు వందల సంఖ్యలో రావడంతో తూరుబాక నుంచి పెద్దనల్లబల్లి వరకు కొన్ని కిలో మీటర్ల మేర ఇసుక లారీలు నిలిచిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఏపీలోని సీతపేటం వద్ద భద్రాచలం – చర్ల ప్రధాన రహదారిపై రెండు ఇసుక లారీలు దిగబడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వందల సంఖ్యలో లారీలు ప్రధాన రహదారిపై నిలిచిపోవడంతో సామాన్య ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఇసుక లారీలను ములకపాడు వయా మారాయిగూడెం నుంచి డైవర్షన్ చేసి పంపినప్పటికీ అటువైపు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. రహదార్లపైనే నిలుపుతున్న ఇసుక లారీలు చర్ల: మండలంలో కొనసాగుతున్న ఇసుక క్వారీల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక రవాణా కోసం వచ్చే లారీలకు ఇసుక రీచ్‌ల నిర్వాహకులు యార్డులను ఏర్పాటు చేయకపోవడంతో లారీ డ్రైవర్లు ఎక్కడబడితే అక్కడ లారీలను నిలుపుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల కొద్ది వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా తిరుగుతున్న ఓవర్ లోడ్ ఇసుక లారీలు వల్ల రోడ్లు ఎక్కడికక్కడే కృంగిపోయి పెద్ద ఎత్తున లారీలు దిగబడుతున్నాయి. ఇసుక రీచ్‌ల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఎందుకు లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు
మధిర: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన సంగెపు సుధాకర్ శనివారం రాత్రి రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు నుంచి జారి పడి తీవ్ర గాయాలతో పట్టాల మధ్యలో ఉండగా సమాచారం అందుకున్న మధిర రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు దోర్నాల రామకృష్ణ సహకారంతో మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. -
ఫలితాలపై ‘ప్రత్యేక’ దృష్టి
ఖమ్మంసహకారనగర్: విద్యాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు చర్యలు చేపడుతూనే.. ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నాలుగు రోజుల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసి, ఆ వెంటనే రివిజన్ ప్రారంభించాలని, తద్వారా ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని 212 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6,500 విద్యార్థులు మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రత్యేక తరగతులిలా.. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉదయం 7.45 నుంచి 8.45 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సమయాల్లో విద్యార్థులను చదివించడంతో పాటు వారికి గల సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. తద్వారా ప్రతీ సబ్జెక్టుపైనా పిల్లలకు పట్టు పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలో ప్రతీ రోజు ఉద యం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మాకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నాం.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు మా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక తరగతుల్లో శ్రద్ధగా చదువుకొని మంచి ఫలితాలు సాధిస్తాం.– యశస్విని, మడుపల్లి, మధిర మండలం ప్రత్యేక తరగతుల ద్వారా ఎక్కువగా చదువుకునే అవకాశం కలుగుతోంది. ఈసారి స్పెషల్ క్లాసులు కొంత ముందుగానే ప్రారంభించారు. ప్రత్యేక తరగతుల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. –కె.విఘ్నేశ్, మడుపల్లి, మధిర మండలం ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండడంతో రివిజన్‌కు చాలా సమయం దొరుకుతుంది. తరగతి గదిలో వచ్చిన సందేహాలు ప్రత్యేక తరగతుల్లో నివృత్తి చేసుకుంటున్నాం. చిన్న చిన్న మాక్ టెస్టులు, స్లిప్పు టెస్టులకు కూడా టైం దొరుకుతోంది. – ఎం.నాగేశ్వరి, జల్లేపల్లి, తిరుమలాయపాలెం మండలం -
డైనోసార్.. స్టెగోడాన్
● సింగరేణి తవ్వకాల్లో లభించిన అవశేషాలు ● తెలంగాణ గడ్డపై నడయాడిన భారీ జంతువులు ● బిర్లా సైన్స్ సెంటర్లో ప్రత్యేక పెవిలియన్ లో ప్రదర్శనసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సృష్టి పరిణామ క్రమంలో భూమిపై మంచుయుగం అంతరించాక రాక్షస బల్లులు (డైనోసార్లు), రాకాసి ఏనుగు(స్టెగోడాన్)ల వంటి భారీ జంతువులు వేర్వేరు కాలాల్లో ఆవిర్భవించాయి. ఈ జంతువులు క్రీస్తు పూర్వం మిలియన్ సంవత్సరాల క్రితమే భూమిపై సంచరించాయి. ఆ కాలంలో జీవించిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగులు, రాక్షస బల్లులు ప్రాణహిత–గోదావరి లోయ ప్రాంతంలో ఒకప్పుడు రాజ్యమేలాయి. అందుకు సంబంధించిన అవశేషాలు కొన్నేళ్లుగా వెలుగుచూస్తున్నాయి. బొగ్గు తవ్వకాల్లో.. గోదావరి–ప్రాణహిత నది పరీవాహకంలో సింగరేణి సంస్థ వందేళ్లకు పైగా బొగ్గును వెలికితీస్తోంది. 2020–21లో పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో ఓబీ (మట్టి) తొలగిస్తుండగా భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమైన ఐదు ఏనుగు కొమ్ములు లభించాయి. వీటిపై పరిశోధనలు జరిపి, క్రీస్తు పూర్వం 26 వేల నుంచి 23 వేల ఏళ్ల క్రితం భూమిపై సంచరించిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగుల అవశేషాలుగా తేల్చారు. ఈ ఏనుగు 13 అడుగుల ఎత్తుతో 13 టన్నుల బరువుతో ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వీటన్నింటినీ కొత్తగూడెంలోని ఎక్స్‌ఫ్లోరేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ఎపిక్ సెంటర్లోని మ్యూజియంలో భద్రపర్చారు. గత ఏప్రిల్‌లో స్టెగోడాన్ అవశేషాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో 2025 ఏప్రిల్‌లో స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగుల అవశేషాలు లభించాయి. ఈ విషయం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో అప్పటికే సింగరేణి ఆధీనంలో స్టెగోడాన్ ఏనుగుల అవశేషాలపై దృష్టి పడింది. తెలంగాణ గడ్డపై జీవించిన ప్రాచీన జీవజాలానికి సంబంధించిన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సింగరేణి–బిర్లా సైన్స్ సెంటర్లు జత కట్టాయి. అందులో భాగంగా బిర్లా సైన్స్ సెంటర్లో సింగరేణి పెవిలియన్ పేరుతో ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటుకు నిర్ణయించారు. సింగరేణి తవ్వకాల్లో లభించిన వందలాది పురాతన శిలాజాల్లో 50కి పైగా శిలాజాలను హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్లో ప్రదర్శనకు పెట్టారు. అందులో స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు దంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే డైనోసార్లు సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన గోదావరి పరీవాహక ప్రాంతం ఒకప్పుడు భారీ జంతువులకు నెలవుగా ఉండేది. ప్రస్తుతం బిర్లా సైన్స్ ప్లానిటోరియంలోని డైనోసారియంలో కనిపించే డైనోసార్ ఆకృతికి సంబంధించిన అవశేషాలు మంచిర్యాల జిల్లా వేమనపల్లి దగ్గర అడవుల్లో 1974–80 మధ్య లభించాయి. అంతకు ముందు 1960, 70వ దశకాల్లో ఏటూరునాగారం ఏజెన్సీలో సైతం ప్రాచీనకాలానికి సంబంధించిన జంతుజాలం అవశేషాలు లభించాయి. వీటిని బిర్లా సైన్స్ సెంటర్, ఆర్కియాలజీ మ్యూజియం, వరంగల్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) మ్యూజియం–బండ్లగూడలో భద్రపరిచారు. -
13 నుంచి శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగయ్యేలా ఈనెల 13 నుంచి పది రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపడుతున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి బైపాస్ రోడ్, సారధినగర్, ఎఫ్‌సీఐ గోడౌన్ ప్రాంతాల్లో శనివారం కలెక్టర్ పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా, సైడ్ డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలు, మట్టిని తొలగించాలని ఆదేశించారు. అలాగే, పవర్ స్వీపింగ్ యంత్రాల పనితీరును పరిశీలించిన కలెక్టర్ కార్మికులు, జవాన్ల వారీగా రోజువారీ కార్యాచరణ రూపొందించాలని, ప్రతీ ఉద్యోగి పారిశుద్ధ్య డ్రైవ్‌లో పాల్గొనాలని తెలిపారు. అంతేకాక ప్రధాన రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఉద్యాన అధికారి రాధిక, ఉద్యోగులు పాల్గొన్నారు.ఖమ్మంలో పర్యటించిన కలెక్టర్, కమిషనర్ -
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, శ్రీస్వామి వారి విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్య కల్యాణం గావించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ చేయగా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మంలో వేంకటేశ్వర స్వామి ఆలయం● రేపు స్థలాలు పరిశీలించనున్న టీటీడీ బృందం ఖమ్మంఅర్బన్: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన నిర్మించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతితో టీటీడీ సానుకూలంగా స్పందించగా కొద్దిరోజుల క్రితం ఓ బృందం ఇక్కడ సానుకూలతలను పరిశీలించింది. ఆ తర్వాత 15వ డివిజన్ అల్లీపురం పరిధి హైదరాబాద్–దేవరపల్లి హైవే వెంట ధంసలాపురంలో సర్వే నంబర్లు 565, 563, 564, 565లో సుమారు 20 ఎకరాల భూమి అనుకూలంగా ఉందని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అంతేకాక అదే గ్రామంలో సర్వే నంబర్ 408లో మరో 20 ఎకరాల భూమి కూడా ఉందని తెలిపారు. ఈ స్థలాలతో పాటు రఘునాథపాలెం బైపాస్‌లో నరిసింహులు గుట్ట భూమిని సైతం సోమవారం టీటీడీ బృందం పరిశీలించనుంది. ఆ తర్వాత స్థలాన్ని ఖరారు చేసి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. పీఎం డీడీకేవై ప్రత్యక్ష ప్రసారం వైరా/ఖమ్మంవ్యవసాయం: పీఎం ధన ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించగా.. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వైరా కేవీకేలో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు రైతులతో ప్రధాని మోదీ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, డీడీకేవైతో లబ్ధిని వివరించారు. అలాగే, వివిధ పంటల్లో తెగుళ్ల నివారణ, యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి, మధిర, వైరా ఏడీఏలు విజయచంద్ర, కరుణశ్రీ, శాస్త్రవేత్తలు డాక్టర్ పావని, డాక్టర్ వై.చైతన్య, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం మార్కెట్ నుంచి చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, మార్కెట్ సహాయ కార్యదర్శి వీరాంజనేయులుతో పాటు పలువురు రైతులు ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. -
పంచమి మంచిదని..
ఖమ్మంక్రైం: పంచమి తిథి మంచిదని భావించి, రెండో శనివారం సెలవును సైతం రద్దు చేసుకొని ఎకై ్సజ్‌శాఖ నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు టెండర్ల కార్యక్రమం కొనసాగించింది. పంచమి మంచిదని వ్యాపారులు భారీగానే దరఖాస్తులు సమర్పించారు. శనివారం ఒక్కరోజే 116 మద్యం దుకాణాలకు గాను 86 దరఖాస్తులు వచ్చా యి. దీంతో ఇప్పటివరకు 158 దరఖాస్తులకు గాను రూ.4.74 కోట్ల ఆదాయం జిల్లా ఎకై ్సజ్ శాఖకు వచ్చింది. సోమవారం నుంచి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంపై కేసుముదిగొండ: మండలంలోని బాణాపురం – పెద్దమండవ ప్రధాన రహదారిలో శుక్రవారం రాత్రి జరి గిన రోడ్డు ప్రమాదంపై శనివారం ముదిగొండ సీఐ మురళి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్‌ల కథనం ప్రకారం.. పెద్దమండవకు చెందిన గొర్రెముచ్చు యోహాన్ కుమారు డు సాయి ద్విచక్రవాహనపై తన చెల్లెలు సన(9), స్నే హితుడు పేరం ప్రవీణ్ (13)ను ఎక్కించుకుని ఖమ్మం వెళ్తున్నాడు. మార్గమధ్యలో బాణాపురం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా ట్రాక్టర్ వచ్చింది. ఆ లైటింగ్‌కు ద్విచక్రవాహనం అదుపుతప్పి కట్టెలపై పడటంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. గొర్రె ముచ్చు సన, సాయి లను ఖమ్మం తరలిస్తుండగా సన మృతిచెందింది. సాయి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా డు. సాయి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ప్రవీణ్ తండ్రి బుజ్జిబాబు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ముదిగొండ సీఐ మురళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్కలు తరమడంతో ఇంట్లోకి దుప్పి..
సత్తుపల్లి: చుక్కల దుప్పిని కుక్కలు తరమడంతో అర్బన్‌పార్క్ ఫెన్సింగ్ దూకి ఇంట్లోకి వచ్చిన ఘట న పట్టణంలోని జలగంనగర్‌లో శనివారం చోటుచేసుకుంది. అర్బన్ పార్కులోకి ప్రవేశించిన కుక్కలు వెంటాడటంతో ఫెన్సింగ్ దూకి ఇళ్లలోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.అటవీశాఖ అధికారులకు స్థానికు లు సమాచారం ఇవ్వడంతో తాళ్ల సహాయంతో దుప్పి ని బంధించి పశువుల ఆస్పత్రికి తరలించారు. గత నెలలో చుక్కల దుప్పిని గాయపరిచిన ఘటన మరువకముందే మరో ఘటన జరగటంతో అటవీశాఖ అధికారుల వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రూ.50 లక్షల సింగరేణి నిధులతో చైన్‌లింక్ ఫెన్సింగ్ వేసినా దుప్పులకు రక్షణ లేకపోవడం, అర్బన్ పార్కులోకే వెళ్లికుక్కలు వెంట పడు తున్నాయా..? బయటకు వచ్చినప్పుడు దాడి చేస్తున్నాయా..? అనే విషయంపై అటవీ అధి కారు లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అటవీశాఖ అధికారులను వివరణ కోసం ప్రయత్నించగా దాటవేశారు. -
వాలీబాల్, హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ కళాశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన వాలీబాల్, హ్యాండ్‌బాల్ బాలబాలికల జట్లను ఎంపికచేశారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన ఎంపిక పోటీలకు 170 మంది వాలీబాల్క్రీడాకారులు, వంద మంది హ్యాండ్‌బాల్ క్రీడా కారులు హాజరయ్యారు. ఇక్కడ ఎంపిక చేసిన జట్లు హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని జిల్లాక్రీడల సంఘం కార్యదర్శి ఎండీ మూసాకలీం తెలిపారు. వాలీబాల్ జిల్లా బాలుర జట్టుకు జి.అక్షయ్‌కుమార్, ఎ.గోపినాథ్, వి.నా యుడు, ఈ.అనిల్‌కుమార్, ఎస్.శివకోటి, పి.విష్ణువర్దన్, బి.కల్యాణ్‌ప్రసాద్, ఎన్.శ్రీహాస్, టి.వినయ్, ఎం.శ్యామ్, ఎండీ అస్లాం, పి. వంశీ, టి.శ్రీరాం, రవికుమార్, జోషినాథ్, రోహిత్, బాలికల జట్టుకు బి.అంబిక, ఎం.నక్షత్ర, కె.ప్రసన్నకుమారి, జి.నవ్యశ్రీ, ఎ.కీర్తన, విద్యశ్రీ, బి.తనూజ, ఆర్.శ్రావణి, డి.పుష్పలత, అతియా ఫాతిమా, ఎస్.ఉమాలత, వి.బేబికల్యాణి, అస్మిత ఎంపికయ్యారని పేర్కొన్నా రు. హ్యాండ్‌బాల్ బాలుర జట్టులో విగ్నాగ్పక్, తి యామాత్, కె.వేణు, ఎస్కే ఇమ్రాన్, ఎం. యశ్వంత్, ఎస్కే జకీరుల్లా, జె.గౌతమ్, ఎం.హర్షిత్, జె.రాంచరణ్, వి.పవన్, జి.లాల్‌కృష్ణ, ఐ.కార్తీక్, ఎండీ అబ్దుల్లా, సీహెచ్ కార్తీక్‌రెడ్డి, ఎం.జనార్దన్, సంతోష్‌కుమార్, కె.వంశీ, ఎన్.కార్తీక్ ఎంపికయ్యా రని తెలిపారు. అలాగే, బాలికల జట్టులో ఉషాశ్రీనేహా, టి. భవాని, పి.సింధు, వి.సంధ్య, జె.సౌమ్య, సాబా తబాస్సుమ్,డి.భారతి, కె.సాత్విక, కె.హర్షిణి, సీహెచ్.మాధురి, జె.జ్యోత్స్న, అక్షర, బి. రిషి త, ఎన్.అక్షర, బి.కార్తీకరెడ్డికి స్థానం దక్కిందని వెల్లడించారు. ●జిల్లా పాఠఽశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన జిల్లా అండర్–14 బాలబాలికల కబడ్డీ జట్లను శనివారం ఖమ్మంలో ఎంపిక చేశారు. ఈ పోటీలకు 107 మంది బాలురు, 70 మంది బాలికలు హాజరుకాగా జిల్లా జట్లను సంఘం కార్యదర్శి వై.రామారావు ప్రకటించారు. బాలుర జట్టుకు బి.హర్ష, పి.సంతోష్, ఎ.మనోజ్, కె.యశ్వంత్, ఎ.యశ్వంత్, ఆర్.జేమ్స్, బి.అరుణ్, బి.వెంకటేశ్, ఎల్.కౌశిక్, బి.సరిరాం, కె.నాగర్జున, బి.అంజిబాబు, ఎస్. గోపి, కె.అక్షయ్కృష్ణ, పి.బాబు, బాలికల జట్టుకు నాగస్వర్చిత, ఎం.శ్రీజ, కెభవ్యశ్రీ,, కె.ఫరిదా, బి.అనూ, కె.భవాని, జి.సృజన, ఎస్కే సమీనా, డి.దేవిశ్రీ, వి.మోక్షితకృష్ణ, ఎల్.స్పందన, జి.అంకిత ఎంపికయ్యారని తెలిపారు. ●కల్లూరు: ఉమ్మడి జిల్లా ఖో–ఖో బాలబాలికల జట్లను కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఎంపిక చేశారు. అండర్–19 విభాగంలో జట్ల ఎంపికకు నిర్వహించిన పోటీలకు బాలురు 130 మంది, బాలికలు 90 హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేశామని నిర్వహణ కార్యదర్శి బోడా బీమా, పసుపులేటి వీరరాఘవయ్య, మూసా ఖలీమ్ తెలిపారు. పోటీలను పీఈటీలు, కోచ్‌లు ఎస్.రామారావు, పి.పవన్‌కుమార్, ఎ.కృష్ణ, ప్రసాద్, సైదులు, సమ్మయ్య, కై సర్ పద్మావతి, స్టేడియం ఇన్చార్జ్ గౌతమ్‌రెడ్డి, నాగబాబు, మామిడాల వెంకటేశ్వరరావు, గోపాల్‌రావు పర్యవేక్షిచారు. -
క్షేత్రస్థాయిలో కార్యకర్తల సూచనలు తీసుకుంటాం
ఖమ్మంమయూరిసెంటర్: hÌêÏ, ¯]lVýSÆý‡ M>…{VðS-‹Ü A«§ýlÅ„ýS ç³§ýl-Ð]l#-ÌSMýS$ M>…{VðS-‹Ü {Ôóæ×æ$ÌS ¯]l$…_ §ýlÆý‡-RêçÜ$¢-Ë$ BàÓ°-çÜ$¢-¯]l²r$Ï HIïÜïÜ ç³ÇÖÌS-MýS$-Ë$ Ð]l$õßæ…{§ýl¯ŒS ™ðlÍ´ëÆý‡$. QÐ]l$Ã…ÌZ° hÌêÏ ´ëÈt M>Æ>Å-ÌS-Ķæ$…-ÌZ Ôèæ°ÐéÆý‡… BĶæ$¯]l Ð]l*sêÏ-yéÆý‡$. ç³§ýl-Ð]l#ÌS ¿ýæÈ¢MìS AÀ-{´ëĶæ$ õÜMýS-Æý‡-׿ ^ólç³-rtyýlÐól$ M>MýS °Äñæ*-fMýS-Ð]l-Æ>Y-ÌZÏ »êÏMŠSÌS ÐéÈV> çÜÐ]l*-Ðól-Ô>-Ë$ °Æý‡Ó-íßæ-Ýë¢-Ð]l$° ^ðl´ëµÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> BĶæ$¯]l çÜÐ]l*-Ðól-Ô>ÌS òÙyýl*Å-ÌŒæ¯]l$ {ç³MýS-sìæ…^éÆý‡$. B¨ÐéÆý‡…-(-12Ð]l ™ól©) E§ýlĶæ$… QÐ]l$Ã… 60 yìlÑf¯Œl, 13¯]l E§ýlĶæ$… Æý‡çœ¬-¯é£ýl-´ë-Ìñæ… Ð]l$…yýl-ÌS…ÌZ, Ð]l$«§éÅ-çßæ²… hÌêÏ, ¯]lVýSÆý‡ A¯]l$-º…«§ýl çÜ…çœ*ÌS A«§ýlÅ-„ýS$-ÌS-™ø QÐ]l$Ã…ÌZ çÜÐ]l*-ÐólÔèæ… E…r$…§ýl° ™ðlÍ´ëÆý‡$. CMýS 14¯]l E§ýlĶæ$… ´ëÌôæÆý‡$ °Äñæ*-fMýS-Ð]l-Æý‡Y…ÌZ H »êÏMŠS, Ð]l$«§éÅ-çßæ²… ½ »êÏMŠS, 15¯]l️ E§ýlĶæ$… çÜ™èl$¢-ç³-ÍÏ °Äñæ*-fÐ]l-Æý‡Y…ÌZ° H »êÏMŠS, Ð]l$«§éÅ-çßæ²… ½ »êÏMŠS-ÌZ, 17¯]l E§ýlĶæ$… Ð]l$«¨Æý‡ °Äñæ*-fMýS-Ð]l-Æý‡Y…ÌZ° H »êÏMŠS-ÌZ, Ð]l$«§éÅ-çßæ²… ½ »êÏMŠS ÌZ çÜÐ]l*-Ðól-Ô>-Ë$ °Æý‡Ó-íßæ-Ýë¢-Ð]l$° ^ðl´ëµÆý‡$. 18¯]l E§ýlĶæ$… hÌêÏ M>…{VðS-‹Ü M>Æ>Å-ÌS-Ķæ$…-ÌZ OÐðl§ýl$Å-Ë$, Ðól$«§é-Ð]l#-ÌS-™ø, Ð]l$«§éÅ-çßæ²… ¯éÅĶæ$-Ðé§ýl$-Ë$, {´÷-òœçÙ-¯]l-ÌŒæÞ-™ø çÜÐ]l*-ÐólÔèæ… °Æý‡Ó-íßæ…^èl-yýlÐól$ M>MýS 19¯]l hÌêÏ M>…{VðS-‹Ü M>Æ>Å-ÌS-Ķæ$…-ÌZ hÌêÏ, ¯]lVýSÆý‡ A«§ýlÅ„ýS ç³§ýl-ÑMìS §ýlÆý‡-RêçÜ$¢ ^ólçÜ$-MýS$¯]l² ÐéÇ™ø Ð]l¬RêÐ]l¬ü çÜÐ]l*-Ðól-Ôèæ-Ð]l$-Ð]l#-™éÐ]l$° Ð]l$õßæ…{§ýl¯ŒS ÑÐ]l-Ç…^éÆý‡$. D çÜÐ]l*-Ðól-Ôèæ…-ÌZ M>…{VðS-‹Ü hÌêÏ, ¯]lVýSÆý‡ A«§ýlÅ-„ýS$-Ë$ ç³#ÐéÓâýæÏ §ýl$Æ>Y-{ç³-Ýë§Šæ, Ð]l$çßæÃ§Šæ gêÐól§Šæ, Æ>çÙ‰ Wyýlz…VýS$ÌS M>Æöµ-Æó‡-çÙ¯ŒS O^ðlÆý‡Ã¯ŒS Æ>Ķæ$ÌS ¯éVóS-ÔèæÓ-Æý‡-Æ>Ð]l#, ¯éĶæ$-MýS$-Ë$ yéMýStÆŠ‡ í³.{Ôèæ-Ð]l-׊æMýS$-Ð]l*-ÆŠ‡-Æð‡yìlz, Æý‡Ð]l-ãÆð‡yìlz, Æ>iÐŒæ-Æð‡yìlz, ^ðlMìSP-ÌS… Æ>gôæ-ÔèæÓ-Æý‡-Æ>Ð]l#, ¯éVýS…yýlÏ ©ç³MŠS ^ú§ýlÇ, »êÌS-Ýë° ÌS„îSÃ-¯éÆ>Ķæ$-׿, Mö…yýl-»êÌS Møsôæ-ÔèæÓ-Æý‡-Æ>Ð]l#, ^øsê »ê»ê, Ððl¬MýSP ÔóæQÆŠ‡-VúyŠæ ´ëÌŸY¯é²Æý‡$. -
19న రాష్ట్రస్థాయి అండర్–14 చెస్ టోర్నీ
ఖమ్మంఅర్బన్: తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 19న ఖమ్మంలో రాష్ట్రస్థాయి అండర్– 14 చెస్ టోర్నీ నిర్వహించనున్నారు. ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగే టోర్నీ పోస్టర్లను శనివారం నగర ఏసీపీ రమణమూర్తి ఆవిష్కరించారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు టి.వీరన్న తెలిపారు. వివరాల కోసం 83281 02378, 94913 57631 నంబర్లలో సంప్రదించాలని కోరారు. వర్కర్లకు రూ.10 వేలు ఇవ్వాలి తల్లాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు ప్రతీనెల రూ.10 వేలు గౌరవ వేతనం చెల్లించాలని వ ర్కర్ల యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సత్తెనపల్లి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. తల్లాడలో మహాదేవ లక్ష్మి, తాళ్లూరి లక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన యూని యన్ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్ర కారం రాష్ట్రంలోని 54వేల మంది వర్కర్లకు నెల నెలా రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేశా రు. కోడిగుడ్లతో పాటు నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి శింగు నరసింహారావు మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థికి రూ.25 చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీ యూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాదల లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయు లు, నాయకులు రావి శివరామకృష్ణ, మల్లేశ్, రాంబాబు, దండు ఆదినారాయణ, మద్దోజు శ్రావణ్, ఓర్సు రమేశ్, దయాకర్, రామారావు, రహీం పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతితిరుమలాయపాలెం: మిర్చి తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు విద్యుదాఘాతా నికి గురై బావిలో పడి మృతిచెందిన ఘటన మండలంలోని పడమటితండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూక్య చంద్రు (54) మిర్చి తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కి గురై పక్కనే ఉన్న వ్యవసాయబావిలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య అచ్చమ్మ కుమా రుడు భూక్యా నరేశ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. పోలీసులు కేసు నమోదు చేశారు. కూలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్మధిర: పట్టణంలోని శివాలయం రోడ్డులో పోతులూరి వీరబ్రహ్మం గుడి వద్ద ఏర్పాటు చేసిన విద్యు త్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు స్తంభం శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కూలిపోయాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవ రూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు విద్యుత్ శాఖాధికారులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పిచ్చికుక్క దాడిలో గాయాలు కొణిజర్ల: పిచ్చికుక్క దాడి చేయడంతో ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు గాయపడిన ఘటన వైరామున్సిపాలిటీ పరిధి,మండలంలోని జమ్మికోయ బంజరలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన బానోత్ కృష్ణవేణి, ఆమె కూతు రు ఉమ ఇంట్లో పనులు చేసుకుంటుండగా పిచ్చికుక్క వారి ఇంటి ఆవరణలోకి వచ్చి గేదె దూడను కరి చి గాయపరిచింది. ఉమ కుక్కును అదిలించడానికి రావడంతో పిచ్చికుక్క అమైపె కూడా దాడి చేసి కరిచింది. ఉమ అరుపులు విని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా పిచ్చికుక్క దాడిచేసింది. స్థానికులు కర్రలు తీసు కుని వెంట పడగా కుక్క పారిపోయింది. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని మున్సిపల్ అధికారులు కుక్క ల బెడదను తొలగించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. -
కాంగిరేసులో..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు మొదలైంది. పార్టీలో సంస్థాగత మార్పులు చేసి కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. అలాగే నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవినీ భర్తీ చేయనున్నారు. ఈ రెండు పదవులపై శనివారం ఏఐసీసీ పరిశీలకుడు అభిప్రాయ సేకరణ చేశారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వారికే డీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ పరిశీలకుడు ఈనెల 19వ తేదీ వరకు నియోజకవర్గాల్లో పర్యటించి.. రోజుకో నియోజకవర్గంలోని రెండేసి బ్లాక్‌ల్లో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలతో పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు.ముందు డీసీసీ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేలా సంస్థాగతంగా మార్పులకు అధిష్టానం నిర్ణయించింది. ఈమేరకు ప్రాంతాల వారీగా పరిశీలకులను నియమించింది. జిల్లా కాంగ్రెస్‌లోనూ సుదీర్ఘకాలంగా సంస్థాగత మార్పులు జరగలేదు. 2019 ఫిబ్రవరి 7న డీసీసీ అధ్యక్షుడిగా పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షుడిగా జావేద్ నియమితులయ్యారు. ఆ తర్వాత కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు మారినా ఇక్కడ ఆరేళ్లుగా వారే కొనసాగుతున్నారు. వీరి ఆధ్వర్యానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించడమే కాక పలు ఎన్నికలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అధిష్టానం నిర్ణయంతో ఈ రెండు పదవుల భర్తీకి అభిప్రాయ సేకరణ చేస్తుండగా.. త్వరలోనే జిల్లా, మండల కమిటీలు, ఇతర నియామకాలు కూడా చేపట్టనున్నారు. ఎవరైతే మంచిది? జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి భర్తీపై ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ దృష్టి సారించారు. ఈమేరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇదే క్రమాన శనివారం ఖమ్మంలో పార్టీ ముఖ్యనేతలు, మండల స్థాయి నేతలు, పీసీసీ సభ్యులతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడి ‘మీకు ఎందుకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు’ అన్న అంశంపై ఆరా తీశారు. దరఖాస్తు చేసుకోని నేతలను ఎవరైతే బాగుంటుందని సలహాలు అడిగారు. అలాగే సాయంత్రం కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో ఖమ్మం నగర అధ్యక్షుడి నియామకంపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా.. జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకంపై ఖమ్మంలో సమావేశం ముగియగా.. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఈనెల 19వ తేదీ వరకు ఒక్కో నియోజకవర్గంలో రోజుకు రెండేసి సమావేశాలు నిర్వహించి డీసీసీ అధ్యక్షుడి నియామకంపై అభిప్రాయాలు సేకరిస్తారు. ఆపై నివేదిక తయారు చేసి అధిష్టానానికి పంపిస్తారు. వీటన్నింటినీ బేరీజు వేసుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. నివేదికలో మూడు నుంచి నాలుగు పేర్లు ఉంటే మంత్రులు, ఇతర నేతల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేసే అవకాశముంది. అర్హతలే గీటురాయి.. డీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఇతర పదవులకు తగిన అర్హతలను ఆశావహులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. సుదీర్ఘకాలం పాటు పార్టీలో కొనసాగుతూ.. అంకితభావంతో పనిచేసిన వారిని పరిగణనలోకి తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. అంతేకాక పార్టీలో చేసిన కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధిలో పాత్రను పరిశీలకులకు చెప్పగలిగి ఉండాలి. ఈ అర్హతలతో పాటు సామాజిక పరిస్థితుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌లో సంస్థాగత పదవులను మూడేళ్లకోసారి భర్తీ చేయాల్సి ఉన్నా ఈసారి ఆరేళ్ల సమయం పట్టింది.ఆరేళ్ల తర్వాత సంస్థాగత నియామకాలు