ఎకై ్సజ్ ఉద్యోగులకు ఆయుధాలు
జిల్లా ఉద్యోగులకు
అవసరమే...
● స్మగ్లర్లను ఎదుర్కొనేలా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం? ● జిల్లా మీదుగా గంజాయి రవాణా కట్టడికి ఉపయోగం
ఖమ్మంక్రైం: నిజామాబాద్‌లో గంజాయి తరలిస్తున్న వారి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించిన మహిళ ఎకై ్సజ్ కానిస్టేబుల్‌ను స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీస్ శాఖ మాదిరిగానే ఎకై ్సజ్ ఉద్యోగులకు కూడా ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఒడిశా నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా చేసే వారు జిల్లా మీదుగా వెళ్తున్న నేపథ్యాన.. ఇక్కడి ఉద్యోగులకు ఆయుధాలు ఇస్తే స్మగ్లర్ల కట్టడి మరింత పకడ్బందీగా చేయొచ్చనే భావన వ్యక్తమవుతోంది.
ఏపీలో మాదిరిగా..
ఎకై ్సజ్ ఉద్యోగులకు పోలీసుల మాదిరి ఆయుధాలు సాధ్యం అయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది. పోలీసు శాఖలో చేరే వారిలాగే ఎకై ్సజ్ ఉద్యోగులు కూడా శిక్షణ పొందుతారు. కానీ పోలీసులకు అకాడమీలో తొమ్మిది నెలల శిక్షణ ఉంటే ఎకై ్సజ్ ఉద్యోగులకు మూడు నెలలు అకాడమీలో, మరో మూడు నెలలు కేటాయించిన ప్రాంతాల్లో శిక్షణ ఇస్తారు. ఇందులో ఎకై ్సజ్ ఉద్యోగులకు వారం పాటే ఫైరింగ్ శిక్షణ ఉంటుంది. ఈనేపథ్యాన ఉద్యోగులకు ఆయుధాలు ఇవ్వాలంటే మరోమారు ఫైరింగ్‌లో శిక్షణ తప్పనిసరవుతుంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎకై ్సజ్ అకాడమీలో శిక్షణ సమయంలోనే ఉద్యోగులకు ఫైరింగ్‌లో పకడ్బందీ శిక్షణ ఇస్తుంటారు. ఈనేపథ్యాన తెలంగాణలో ఎకై ్సజ్ ఉద్యోగులకు ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయిస్తే.. ఏపీలో మాదిరి ఫైరింగ్ శిక్షణ ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు.
రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతోంది. ఏటా వందలాది కేసలు నమోదవుతుండగా, వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకంటున్నారు. ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉద్యోగులు ఇటీవల విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అయితే, నిజామాబాద్ ఘటనా దృష్ట్యా ఎప్పుడేం జరుగుతోందనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యాన ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు జిల్లా టాస్క్‌ఫోర్స్ ఉద్యోగులకు ఆయుధాలు ఇస్తే ఉపయోగమని భావిస్తుండగా.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది.


