గెలిపించండి.. అభివృద్ధి బాధ్యత నాది | - | Sakshi
Sakshi News home page

గెలిపించండి.. అభివృద్ధి బాధ్యత నాది

Feb 7 2026 10:11 AM | Updated on Feb 7 2026 10:11 AM

గెలిపించండి.. అభివృద్ధి బాధ్యత నాది

గెలిపించండి.. అభివృద్ధి బాధ్యత నాది

● గత పదేళ్లలో కేసీఆర్‌ను నమ్మి మోసపోయాం ● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం ● మంత్రి పొంగులేటి హామీ

● గత పదేళ్లలో కేసీఆర్‌ను నమ్మి మోసపోయాం ● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం ● మంత్రి పొంగులేటి హామీ

ఖమ్మంరూరల్‌ : ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్లలో పేదలకు రేషన్‌ కార్డులు ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా నాటి సీఎం కేసీఆర్‌కు లేదని, ఇప్పుడు కల్లబొల్లి మాటలతో ఆ పార్టీ నాయకులు ఓట్ల కోసం ప్రజల ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. వారి మాటలు నమ్మి పదేళ్లు మోసపోయామని, ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 1, 21, 19, 18, 31, 17, 14, 16 వార్డుల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు తమ స్వలాభం కోసం అడడ్దారులు తొక్కారని, వాటిని కప్పి పుచ్చుకునేందుకు నేడు నాటకమాడుతున్నారని అన్నారు. ఇప్పుడు రంగు, రంగుల కండువాలు వేసుకుని మాయమాటలు చెప్పి ఓట్లు అడిగేందుకు బయలుదేరారని ఎద్దేవా చేశారు. వారి మాటలు నమ్మి గతంలో చేసిన తప్పును పునరావృతం చేయొద్దని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ అందుతున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. గతంలో వరి వేస్తే ఉరి అంటూ రైతులను నట్టేట ముంచిన వారు నేడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగతున్నారని ప్రశ్నించారు. పంటలకు మద్దతు ధర అందించి రైతులను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.

సొంతింటి కల నెరవేరుస్తాం..

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇంది రమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని పొంగులే టి తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రెండో విడతలో పేదలకు ఇళ్లు ఇస్తామని, స్థలాలు లేని అర్హులకు అవి కూడా కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పడిన ఏడాదిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపా రు. కార్యక్రమంలో నాయకులు భైరు హరినాఽథ్‌బాబు, తమ్మినేని నవీన్‌, వెంపటి సురేష్‌, చింతమళ్ల రవీంద్ర, గొడ్డుగొర్ల కృష్ణవేణి, పండూరి అరుణ, మలాది శిరీష, కోటమర్తి సునీత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement