ఘనంగా పాఠశాల వజ్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పాఠశాల వజ్రోత్సవాలు

Feb 7 2026 10:11 AM | Updated on Feb 7 2026 10:11 AM

ఘనంగా

ఘనంగా పాఠశాల వజ్రోత్సవాలు

వేంసూరు: వేంసూరు మండలం కందుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల మొదటి బ్యాచ్‌ నుంచి ఇప్పటివరకు గల పూర్వ విద్యార్థులు హాజరై గత స్మృతులను పంచుకున్నారు. నాటి మిత్రులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వవిద్యార్థి, రాజ్య సభ సభ్యుడు బండి పార్థసారధిరెడ్డి మాట్లాడుతూ చదువుతోనే ప్రతిఒక్కరి తలరాత మారుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు.

డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలి

డీఎంహెచ్‌ఓ రామారావు

ఏన్కూరు : మండల కేంద్రంలో డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ధనాలకోట రామారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఫార్మసీ, ల్యాబ్‌ రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడు తూ.. ఎన్‌సీడీ స్కానింగ్‌ పనులను ఈ నెలా ఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. మండలంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఎంపీడీఓ భాగ్యశ్రీ, ఎంపీఓ జీవీఎస్‌ నారాయణతో చర్చించారు. కార్యక్రమంలో వైద్యాధికారి బి.రాములు. డాక్టర్‌ సాయిలాస్య, పీహెచ్‌ఎన్‌ పుణ్యవతి, రమణ పాల్గొన్నారు.

108 వాహనాల తనిఖీ

ఖమ్మంవైద్యవిభాగం : జిల్లాలోని 108, 102(అమ్మ ఒడి), 1962 (పశు సంచార) వాహనాలను తెలంగాణ గ్రీన్‌ హెల్త్‌ సర్వీస్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ కిరణ్‌కిషోర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. వాహనాల పనితీరు, ఉద్యోగుల హాజరు, నెలవారీ కేసుల సంఖ్య తదితర వివరాలను ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. వాహనాలు సమర్థంగా పని చేసేలా చూడాలని, సమాచారం అందిన వెంట ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను సకాలంలో ఆదుకోవాలని సూచించారు. గోల్డెన్‌ హవర్‌ ప్రాముఖ్యతను వివరించి, చురుకై న వేగంతో మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ప్రోగ్రామ్‌ పనితీరు మెరుగ్గా ఉండడంతో జిల్లా మేనేజర్‌, ప్రోగ్రాం మేనేజర్లను అభినందించారు. ఆయన వెంట జిల్లా మేనేజర్‌ అవులూరి దుర్గాప్రసాద్‌, నజీరుద్దీన్‌ తదితరులు ఉన్నారు.

ఘనంగా పాఠశాల వజ్రోత్సవాలు1
1/2

ఘనంగా పాఠశాల వజ్రోత్సవాలు

ఘనంగా పాఠశాల వజ్రోత్సవాలు2
2/2

ఘనంగా పాఠశాల వజ్రోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement