పనులు శరవేగంగా పూర్తి చేయాలి
నేలకొండపల్లి: ఆస్పత్రి అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. నేలకొండపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, చెరువుమాధారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం తనిఖీ చేసిన ఆమె అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అలాగే, చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అవసరమైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని సీనియర్ రెసిడెంట్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్‌గౌడ్, తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, పీఆర్ ఏఈ ప్రసాద్, వైద్యాధికారులు మంగళ, శ్రావణ్‌కుమార్, సర్పంచ్‌లు వెంకటలక్ష్మి, అమరగాని ఎల్లయ్య పాల్గొన్నారు. కాగా, నేలకొండపల్లిలో వీధి కుక్కల బెడద, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై వివిధ పార్టీల నాయకులు బట్టపోతుల ప్రకాశం, పసుమర్తి శ్రీనివాస్ తదితరులు అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నాయకులు మద్దినేని మహేష్, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
●ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని బుధవారం అదనపు కలెక్టర్ శ్రీజ తనిఖీ చేశారు. సదరమ్ విభాగం కోసం నిర్మించిన భవనాన్ని పరిశీలించిన ఆమె త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే, ట్రామా కేర్, క్రిటికల్ కేర్ బ్లాక్‌కు అనుసంధానిస్తూ నిర్మించే కనెక్షన్ కారిడార్ నిర్మాణాన్ని పరిశీలించారు. మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ


