భారీగా పోలీసులు.. వాహనాలు
గోళ్లపాడు చానల్‌పై 60అడుగుల
రోడ్డు నిర్మాణానికి చర్యలు
నోటీసులు ఇవ్వకపోవడంపై
స్థానికుల ఆందోళన
నెల క్రితమే కొనుగోలు చేశాం..
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలో రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాల్లో భాగంగా ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఈక్రమంలోనే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రకాశ్‌నగర్, శ్రీనివాసనగర్ మీదుగా ధంసలాపురం వరకు గోళ్లపాడు చానల్‌పై రోడ్డు నిర్మాణ పనులకు గాను మార్కింగ్ ప్రకారం తొలగింపు పనులు చేపట్టారు. ఈమేరకు బుధవారం తెల్లవారుజామునే వందలాది మంది పోలీసులతో ఖమ్మం నగర పాలక సంస్థ, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు చేరుకుని జేసీబీల ద్వారా రావిచెట్టు బజార్‌లో ఆక్రమణల తొలగింపు మొదలుపెట్టారు. అయితే, నోటీసులు, సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక ఇప్పటికిప్పుడు రోడ్డుపై పడేస్తే ఎటు వెళ్లాలని అధికారులను నిలదీశారు. ఈక్రమాన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కార్పొరేటర్ గజ్జల లక్ష్మి భర్త వెంకన్న అధికారులను ప్రశ్నిస్తుండగా ఆయనను సైతం స్టేషన్‌కు తరలించారు.
నోటీసులు ఇవ్వకుండానే..
మార్కెట్ నుండి గోళ్లపాడు చానల్‌పై ధంసలాపురం వరకు రోడ్డు విస్తర్ణణ కోసం అధికారులు గతంలోనే మార్కింగ్ చేశారు. రెండు నెలలుగా ఆక్రమణల తొలగింపు పనులు జరుగుతుండగా, బుధవారం ప్రకాశ్‌నగర్ నుండి రావిచెట్టు బజార్ మీదుగా శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో పనులు చేపట్టారు. ఈక్రమాన నోటీసులు ఇవ్వకుండా తొలగించడంపై స్థానికులు అధికారులను నిలదీశారు. ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారు తాము ఎక్కడ తలదాచుకోవాలంటూ బోరున విలపించారు. కాగా, గోళ్లపాడు చానల్‌పై 66 అడుగుల రోడ్డు నిర్మించేందుకు మార్కింగ్ చేస్తున్నట్లు అధికారులు వారికి వివరించారు. కానీ గతంలో 57 అడుగులకు ఓసారి, మరోసారి 60 అడుగులకు మార్కింగ్ చేశారని స్థానికులు వెల్లడించారు. బుధవారం మాత్రం 66 అడుగుల వెడల్పుతో మార్కింగ్ ఆధారంగా ఎనిమిది ఇళ్లు పూర్తిగా, 60 – 70 ఇళ్ల ప్రహరీలు, గదులు, గోడలను తొలగించారు. ఈక్రమాన ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారి వివరాలను రెవెన్యూ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. వీరికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసే అవకాశముందని వెల్లడించారు.
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
నేను, నా భర్త కూలీ పనులు చేసుకుంటూ దాచుకున్న సొమ్ముతో ఇల్లు కొనుగోలు చేశాం. ఈ ప్రాంతంలో రోడ్డు వస్తుందని చెప్పకుండా రూ.15 లక్షలకు రెండు గదుల ఇంటిని
అంటగట్టారు. ఇప్పుడు ఇల్లు కూల్చివేతతో రోడ్డున పడ్డాం. అధికారులే మమ్ముల్ని ఆదుకోవాలి.
– చాట్ల కోటమ్మ, స్థానికురాలు
భారీగా పోలీసులు.. వాహనాలు
భారీగా పోలీసులు.. వాహనాలు


