31లోగా పరీక్ష ఫీజు చెల్లించండి
ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2016కు ముందు వార్షిక విధానంలో డిగ్రీ చదివి ఉత్తీర్ణులు కానీ విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బాణోతు రెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు మిగిలిన సబ్జెక్టుల కోసం యూనివర్సిటీ పరీక్షల విభాగం నుండి అనుమతి తీసుకుని ఫీజు చెల్లించాలని సూచించారు.
డీఆర్‌డీఓ సన్యాసయ్య బదిలీ
● పీఆర్ అండ్ ఈఈకి
రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్‌డీఓ) ఆర్.సన్యాసయ్యను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోగా, పీఆర్ అండ్ ఈఈ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, సన్యాసయ్యను బదిలీ చేస్తూ 22వ తేదీతో జారీ అయిన ఉత్తర్వులు బుధవారం బయటకు వచ్చాయి. డీఆర్‌డీఓగా స్థానిక అధికారులకు బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్‌కు సూచించడంతో ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నేటి నుంచి రెండు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు
మధిర: మధిర మండలం మాటూరుపేట శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యాన గురువారం నుంచి మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు జరగనున్నాయి. మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక, పద్య, దృశ్య అంశాల్లో నాటక పోటీలు ఉంటాయని రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ మాజీ చైర్మన్ పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం సుబ్బారావు తెలిపారు. అంతరించిపోతున్న కళలపై ప్రజలకు అవగాహన కల్పించడం, కళాకారులను ప్రోత్సహించేలా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోటీల్లో వివిధ విభాగాల విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేస్తామని తెలిపారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు శిక్షణ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బుధవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాల మేరకు మూడురోజుల పాటు వరంగల్ రీజియన్‌కు చెందిన ప్రొఫెసర్లు శ్రీనివాస్, శశికాంత్ ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనున్నారు. తొలి విడతలో 30మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎంబీబీఎస్ విద్యార్థులకు బోధనలో మెళకువలపై అవగా హన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్, డాక్టర్ రాజేశ్వరరా వు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.
31లోగా పరీక్ష ఫీజు చెల్లించండి


