సఖినేటిపల్లి: పరమ పావనమైన వశిష్ఠ, సముద్ర సంగమ ప్రాంతంలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. ఆది దేవుని కల్యాణంతో శోభాయమానంగా మారింది.
గోవింద నామస్మరణలు, జై లక్ష్మీనరసింహస్వామి అంటూ వేలాది గొంతులు స్మరించగా, ఆ ప్రాంతం శ్రవణానందకరంగా మారింది.
అంతర్వేది పుణ్యక్షేత్రంలో జగదానందకారకుడు, ఆదిదేవుడు లక్ష్మీ నృసింహుని కల్యాణం బుధవారం అర్ధరాత్రి నయనానందకరంగా సాగింది.
ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు వెల్లువలా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది.


