●పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయండి
వైరా: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరాలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూటరీ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాన్ని ఆమె బుధవారం పరిశీలించి ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ గురులింగంతో చర్చించారు. సామగ్రి పంపిణీ, ఆతర్వాత బ్యాలెట్ బాక్సుల భద్రత, లెక్కింపులో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు పాగించాలన్నారు. ఇందుకోసం అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.


