ఖమ్మంగాంధీచౌక్: ఏసుక్రీస్తు శ్రమ విలువకు గుర్తుగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకల్లో భాగంగా శుక్రవారం ఖమ్మంలో సిలువ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆర్‌సీఎం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ తెలిపారు. ఖమ్మంలోని బిషప్ హౌస్‌లో గురువారం జరిగిన మత పెద్దల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిలువ యాత్ర వైరారోడ్డులోని ముజుకోని నార్త్ ప్యారస్ చర్చి వద్ద మొదలవుతుందని తెలిపారు. అలాగే, ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపై క్రైస్తవ సంఘాల ఆధ్వర్యాన ‘రన్ ఫర్ జీసస్’ పేరిట నిర్వహించే శాంతి ర్యాలీ శనివారం సాయంత్రం 6గంటలకు మయూరి సెంటర్‌లో ప్రారంభమవుతుందని వెల్లడించారు.
తీర్పుపై పునఃసమీక్షించాలి
దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపచేయాలని బిషప్ ప్రకాష్ కోరారు. క్రైస్తవ మతంలో ఉన్న దళితులకు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్తింపు అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. దళిత క్రైస్తవుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని తీర్పును పునఃసమీక్షించి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సూరేపల్లి ఐజాక్, విజయ్‌కుమార్, గోవా శౌరయ్య, సురేష్, ఏసురాజు, కొమ్ము ప్రసాద్, ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌సీఎం బిషప్ ప్రకాష్


