ఖమ్మంమయూరిసెంటర్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు కొనసాగిస్తున్న యుద్ధాన్ని ప్రపంచ ప్రజలంతా ఖండించాలని విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బుడ్డిగ జమీందార్ పిలుపునిచ్చారు. యుద్ధం ఇంకా కొనసాగితే ప్రపంచం మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఖమ్మం జిల్లా పరిషత్ హాల్‌లో గురువారం నిర్వహించిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆయిల్ వనరులపై ఆధిపత్యం సాధించేందుకే అమెరికా యుద్ధానికి దిగిందని విమర్శించారు. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుండగా, ఇంధనం, ఎరువుల కొరత ఏర్పడి సామాన్యులపై భారం పడుతుందని తెలిపారు. మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయిల్ దాడులు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. జిల్లా నాయకుడు ఆవుల అశోక్ అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో టీపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు, నాయకులు జి.రామయ్య, సీ.వై.పుల్లయ్య, ఆర్.శివలింగం, బందెల వెంకయ్య, సీహెచ్. శిరోమణి, టి.ఝాన్సీ, పి.శోభ, ఎస్.కే. లాల్మియా, మలీదు నాగేశ్వరరావు, శ్రీనివాస్, ఆజాద్, వెంకటేశ్, భరత్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జమీందార్


