ప్రాధాన్యతా పనులపై దృష్టి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

ప్రాధాన్యతా పనులపై దృష్టి పెట్టండి

Feb 1 2026 3:13 AM | Updated on Feb 1 2026 3:13 AM

ప్రాధాన్యతా పనులపై దృష్టి పెట్టండి

ప్రాధాన్యతా పనులపై దృష్టి పెట్టండి

ఖమ్మం సహకారనగర్‌ : ప్రభుత్వ ప్రాధాన్యతా పనులపై దృష్టి సారించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరె న్స్‌ హాల్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పి. శ్రీజ తో కలిసి శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గంలో మెప్మా కార్యకలాపాలు చేపట్టాలని, ఖమ్మం లేక్‌ వ్యూ క్లబ్‌ పనులు వేగవంతం చేయాలని సూచించారు. జమలాపురం పర్యాటక అభివృద్ధి పనుల్లో చైన్‌ లింక్‌ ఫెన్సింగ్‌ పనులు జరుగుతున్నాయని, ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణంలో వేగం పెంచాలని అన్నారు. తెలంగాణ మోడల్‌ స్కూళ్ల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలని, స్కూళ్ల నమూనా, ఖర్చు వివరా లతో ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. మధిర, సిరిపురం, బనిగండ్లపాడులోని డిగ్రీ, జూనియర్‌ కళాశాల భవనాలను త్వరగా నిర్మించాలని సూచించారు. సమావేశంలో ఎస్డీసీ రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు చైతన్య జైనీ, శ్రీనివాసాచారి, నవీన్‌ బాబు, సుమన్‌ చక్రవర్తి, మంజుల, శ్రీరామ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఫుట్‌పాత్‌లు నడిచేందుకు సౌకర్యంగా ఉండాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: నగరంలో ఆధునిక మౌలిక వసతులతో పాటు ప్రజలు నడిచేందుకు వీలుగా ఫుట్‌పాత్‌లు నిర్మించాలని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను శనివారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యతో కలిసి పరిశీలించారు. ఫుట్‌పాత్‌ ల నిర్మాణంలో నాణ్యత పాటించాలన్నారు. పిల్లలు, వికలాంగులు, వృద్ధులు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచేలా నిర్మించాలన్నారు. నగరంలో తొలిసారిగా గ్రానైట్‌ రాళ్లతో ఫుట్‌పాత్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. లైట్‌ గ్రే రంగు గ్రానైట్‌ రాళ్లు ఆకర్షణీయంగా ఉండడమే కాక వర్షం, ఎండ వంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఏఈ యాకూబ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement