●ఏకగ్రీవ కౌన్సిలర్‌కు మంత్రి అభినందన
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలో 15వ వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్‌కు చెందిన తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఇక్కడ పోటీలో ఉన్న సీపీఎం అభ్యర్థి విరమించుకోవడంతో మంగతాయి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ఆమె బుధవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో కలవగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తమ్మినేని నవీన్, జూకూరి గోపాల్‌రావు, జొన్నలగడ్డ రవికుమార్, చాట్ల పరశురాం తదితరులు పాల్గొన్నారు.


